
పోషణ పక్షం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
నల్లగొండ : పోషణ పక్షం– 2025 అమలులో భాగంగా ఈనెల 11న దేవరకొండలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి అవసరమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పోషణ పక్షం– 2025పై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్షంలో భాగంగా పిల్లలు, గర్భిణుల బరువు తీయడం, వారి సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. దేవరకొండ డివిజన్‌లో మహిళలు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అవగాహన కల్పించేందుకుగాను ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఏపీడీ శారద, ఉపవైద్యాధికారి వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా పార సరఫరాల ఇన్‌చార్జి అధికారి రాజేష్ పాల్గొన్నారు.