Top Stories
ప్రధాన వార్తలు

పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
తాడేపల్లి : క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ‘పోప్ మృతి చాలా బాధాకరం. కాథలిక్ చర్చి సమాజానికి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం ప్రపంచ వ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది. పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. Saddened by the passing of Pope Francis. A transformative and influential head of the Catholic Church — the first Pope from the Latin Americas. A true humanitarian and global voice for peace and compassion. His humility and humanity touched the world.May his soul rest in eternal…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2025 కాగా క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది.

ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్ రిట్ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్ గవాయ్(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.

MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హిట్‌మ్యాన్.. ఐపీఎల్లో 20 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్, విరాట్ కోహ్లి తలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచి భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాళ్లుగా ఉన్నారు.విరాట్ నిన్ననే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి రోహిత్ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్ విరాట్‌ను వెనక్కు నెట్టి హోల్ అండ్ సోల్‌గా భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (ఐపీఎల్) గెలుచుకున్న ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ (20) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్‌లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు (టాప్-5)25- ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్‌లు)22- క్రిస్ గేల్ (142 మ్యాచ్‌లు)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్‌లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శిఖర్ ధవన్‌కు వెనక్కు నెట్టాడు. ఈ జాబితాలో విరాట్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్-5)8326 - విరాట్ కోహ్లీ6786 - రోహిత్ శర్మ*6769 - శిఖర్ ధావన్6565 - డేవిడ్ వార్నర్5528 - సురేష్ రైనామ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
వాటికన్ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్ ఫ్రాన్సిస్.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. సోమవారం బ్రౌన్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్‌కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్‌రూమ్‌లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. పట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్సీలో జాబ్ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూకి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్‌గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్నెస్ కోచ్‌గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్ కూడాసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది.

Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది.

మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మందు బాబులకు అలర్ట్. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసి వేయనున్నారు.ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈనెల 25వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను తప్పకుండా అంటించాలి. ఈ నియమాన్ని అతిక్రమించిన వాహనాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ వెల్లడించింది.నిబంధనలు పాటించకపోతే మోటారు వాహన చట్టం కింద రూ. 5000 జరిమానా విధిస్తారు. ఈ స్టిక్కర్లు 2012-13లో ప్రవేశపెట్టబడిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP)లో భాగంగా తీసుకొచ్చారు. ఆ తరువాత 2019 నాటికి అన్ని వాహనాలను ఈ స్టిక్కర్లు తప్పనిసరి అంటూ ఢిల్లీ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లను అతికించని వాహనదారులు జరిమానా చెల్లించడం మాత్రమే కాకుండా.. పొల్యూషన్ సర్టిఫికెట్ (PUCC) కూడా పొందలేరు. నిబంధనల ప్రకారం, డీజిల్ వాహనాలకు నారింజ రంగు స్టిక్కర్లు, పెట్రోల్ & సీఎన్జీ వాహనాలకు లేత నీలం రంగు స్టిక్కర్లు.. మిగిలిన అన్ని వాహనాలకు బూడిద రంగు స్టిక్కర్లు తప్పనిసరిగా అతికించాలి.

బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు. .. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది. 👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్ ప్రాథమిక లక్షణం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది. 👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు. ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు. విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్.. అక్కడే ఎందుకు?.. డైరెక్టర్‌కు ఆసక్తికర ప్రశ్న
పరమశివుడే నాతో ‘ఓదెల 2’ కథ రాయించాడు: సంపత్ నంది
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్
ఇలాంటి ఇల్లు కొంటే తలనొప్పే..
ఐదేసిన మెహిది హసన్.. అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించిన జింబాబ్వే
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
Stock market: వరుసగా ఐదో సెషన్లోనూ లాభాలే..
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఊరూపేరు లేని 'ఉర్సా'
రిక్కీ అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
మూతపడిన జిందాల్ స్టీల్స్
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
మెగా డీఎస్సీలో మెలిక!
మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్‌కు చోటు
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
కోత కోసి.. పూత పూసి..
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ దంపతులు
భార్య మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అక్కడ ఫొటో చూసి భర్త..
CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
‘ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
మరాఠీ బ్యూటీతో లవ్‌లో పడిపోయిన 'రామ్'.. !
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
హార్దిక్‌తో ఇలాగే ఉంటది!.. పాపం ఆకాశ్ అంబానీ.. భయపడిపోయాడు!
భారీ విశ్వంభర
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్‌లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట.. ఎఫ్ఐఆర్ కొట్టివేత
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
అనారోగ్యంతో ఉన్న భార్యను పురుషులు వదిలేస్తారు.. లైక్ కొట్టిన 'సమంత'
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
సైన్యంలోనే కాదు ఇక్కడా హీరోనే.. అక్కపై హీరోయిన్ ప్రశంసలు
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్.. అక్కడే ఎందుకు?.. డైరెక్టర్‌కు ఆసక్తికర ప్రశ్న
పరమశివుడే నాతో ‘ఓదెల 2’ కథ రాయించాడు: సంపత్ నంది
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్
ఇలాంటి ఇల్లు కొంటే తలనొప్పే..
ఐదేసిన మెహిది హసన్.. అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించిన జింబాబ్వే
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
Stock market: వరుసగా ఐదో సెషన్లోనూ లాభాలే..
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఊరూపేరు లేని 'ఉర్సా'
రిక్కీ అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
మూతపడిన జిందాల్ స్టీల్స్
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
మెగా డీఎస్సీలో మెలిక!
మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్‌కు చోటు
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
కోత కోసి.. పూత పూసి..
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ దంపతులు
భార్య మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అక్కడ ఫొటో చూసి భర్త..
CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
‘ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
మరాఠీ బ్యూటీతో లవ్‌లో పడిపోయిన 'రామ్'.. !
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
హార్దిక్‌తో ఇలాగే ఉంటది!.. పాపం ఆకాశ్ అంబానీ.. భయపడిపోయాడు!
భారీ విశ్వంభర
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్‌లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట.. ఎఫ్ఐఆర్ కొట్టివేత
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
అనారోగ్యంతో ఉన్న భార్యను పురుషులు వదిలేస్తారు.. లైక్ కొట్టిన 'సమంత'
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
సైన్యంలోనే కాదు ఇక్కడా హీరోనే.. అక్కపై హీరోయిన్ ప్రశంసలు
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
సినిమా

బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) సింగింగ్ షో ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతుంది. బాలు గారి మరణానంతరం ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, సింగర్ సునీత జడ్జీలుగా ఉన్నారు. సింగింగ్ రియాల్టీ షోలలో ముందంజలో ఉన్న ‘పాడుతా తీయగా’పై గాయని ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో న్యాయంగా జరగడం లేదని, టాలెంట్ ఉన్నవాళ్లను కాకుండా నచ్చిన వాళ్లను విజేతలుగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తాజాగా య్యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేస్తూ..కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి సీట్లలో కూర్చొని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు.‘మ్యూజిక్ ఫిల్డ్ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ల పేర్లును ప్రస్తావించాను కాబట్టి నాకు ఎలాగో అవకాశాలు రావు. కానీ మీఅందరికి నిజం తెలియాలని ధైర్యంతో ఈ వీడియో చేశాను. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నన్ను జడ్జీలు(కీరవాణి, చంద్రబోస్, సునీత) మెంటల్‌గా హింసించి, అన్యాయంగా ఎలిమేట్ చేశారు.ముందుగా సునీత(Sunitha) గురించి చెబుతా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను స్టేజ్ మీదకు రాగానే ఆమె ముఖం అదోలా పెట్టేవారు. నా ఫ్యాన్స్ కూడా నన్ను అడిగారు. ఆమెతో మీకేమైనా గొడవ జరిగిందా అని మెసేజ్ చేశారు. కానీ నేను అది నమ్మలేదు. కానీ అంతరామమయం పాడే ముందు నేను గమనించాను. ఆమెకు నేనంటే నచ్చదు. అందుకే తప్పు లేకున్నా నెగెటివ్ కామెంట్స్ చేసేవారు. ఓ సారి మైక్ ఆన్‌లో లేదని అనుకొని ‘ఈ అమ్మాయికి హైపిచ్ రాదు కానీ మ్యానేజ్ చేస్తుంది చూడు’ అని కీరవాణికి చెప్పారు. నాకు ఏడుపు వచ్చింది. కానీ తట్టుకొని అంతరామమయం పాడాను. చాలా మంది మెచ్చుకున్నారు. కానీ ఆమె మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. కానీ మిగతావారు పాడినప్పుడు మాత్రం తప్పులు జరిగితే సైగలు చేసేవారు.ఇక చంద్రబోస్(chandrabose) గారు.. లిరిక్స్ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి. మొదటి రెండు ఎపిసోడ్స్ నన్ను మెచ్చుకున్నారు. లిరిక్స్‌లో తప్పులు దొరకపోవడంతో నన్ను మరోలా వేధించారు.కీరవాణి.. ఆయన నుంచి నెగెటివ్ కామెంట్స్ రాలేదు. కానీ సెట్లో ఎలా మాట్లాడతారో చెబుతాను. మెలోడీ పాడిన వారికి ఎక్కువ మార్కులు ఇస్తానని చెబుతారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితే మంచి మార్కులు వేస్తారు. డబ్బుల కోసం నేను వెడ్డింగ్ షోస్ చేయాల్సి వచ్చిందని గతంలో చెప్పాను. ఈ పాయింట్‌పై కీరవాణి మాట్లాడుతూ.. ‘వెడ్డింగ్ షోస్ చేసేవాళ్లు నా దృష్టిలో సింగర్సే కాదు. వాళ్లంటే నాకు అసహ్యం’ అని అన్నారు. అది చాలా హర్టింగ్గా అనిపించింది. అలాగే పాడుతా తీయగాలో ఐదో ఫ్రైజ్ సాధించినవాళ్లను నా దగ్గరకు వచ్చి చాకిరీ చేసేవాళ్ల గ్రూప్‌లో చేర్చుకుంటానని చెప్పారు. చాకిరీ అనే పదం వాడినందుకు నాకు బాధగా అనిపించింది. జడ్జీలు వివక్ష చూపడం, నన్ను చీడ పురుగులా చూడడం, నా బాడీ మీద జోకులు చేయడం..నన్ను మెంటల్‌గా ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి.పొడ్రక్షన్ వాళ్లు కూడా మమ్మల్ని అవమానించారు. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్ చేయాలి అన్నట్లుగా చెప్పారు. చాలా సార్లు తిట్టారు. బాడీ షేమింగ్ చేశారు. ‘ఇలాంటి బాడీకి ఇంకేం ఇవ్వగలను’ అని కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. వీళ్ల మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి కాదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చిందో పాడుతా తీయగా ఇలా మారిపోయింది. డ్యాన్సులు చేయమని, కుల్లు జోకులు చేయమని చెప్పారు.ఇక నా ఎలిమినేషన్ రోజు ఏం జరిగిందో చెబుతాను. ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది. లిరిక్స్ మరిచిపోయినా చంద్రబోస్ గారు కామెంట్స్‌లో అది చెప్పలేదు. ఇంకో అబ్బాయి కీరవాణి పాట పాడితే స్కోర్ ఎక్కువ వేశారు. ఎలిమేషన్ రౌండ్లో జరిగింది ఇది. ఎలిమినేషన్ జరిగినప్పుడు కీరవాణి, చంద్రబోస్ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. సునీత మాత్రం అక్కడే నవ్వుతూ కూర్చున్నారు. ఎలిమేట్ అయ్యాక.. నేను ఎమోషనల్ అయ్యాను. మా అమ్మ సునీత దగ్గరకు వచ్చి ‘ఎందుకు ఇంత అన్యాయం చేశారు’ అని అడిగితే..‘నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో’అని సీరియస్‌గా అన్నారు. నేను చాలా షోస్ చేశాను కానీ ఏ జడ్జి కూడా ఇలా మాట్లాడలేదు.నేను ఈ కెరీయర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాకే ఈ వీడియో చేశాను. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటపెట్టాను. నాకు ఎలాగో అవకాశం రాదు. మీ అందరికి చెప్పేది ఒక్కటే ఇలాంటి ఫేక్ షోస్ చూడడం మానేయండి. నాలాగే చాలా మంది సఫర్ అయ్యారు. జడ్జిలు ఆ సీటులో కూర్చొని అన్యాయం చేసి సరస్వతి దేవిని అవమానించకండి. చిత్రమ్మ, మనోగారు, శైలజగారు ఉంటే చాలా బాగుంటుంది. మాలాంటి జీవితాలతో ఆడుకోకండి. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా కీరవాణి, చంద్రబోస్, సునీతతో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్లదే బాధ్యత’ అని సింగర్ ప్రవస్తి పేర్కొంది.

మమ్మల్నే కాదు, మా అమ్మను కూడా.. చాలా డిస్టర్బ్ అయ్యా: విష్ణుప్రియ
'ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సమానంగా చూడరు' ఇది చాలామంది ఇళ్లలో ఉండేదే. తన ఇంట్లో కూడా ఇదే వివక్ష చూపించారంటోంది బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ (Vishnupriyaa bhimeneni). తాజాగా ఆమె సోషల్ మీడియాలో తను బాధపడ్డ క్షణాలను గుర్తు చేసుకుంది. నేను ఎప్పుడూ నా సంతోషకర క్షణాలనే మీతో పంచుకున్నాను కానీ నేను బాధపడ్డ విషయాల గురించి మీకెప్పుడూ చెప్పలేదు. అందుకే నేను డిస్టర్బ్ అయిన ఓ సందర్భాన్ని ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. వ్యత్యాసం చూపించేవారుచిన్నప్పుడు మేము మా నానమ్మవాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం. అక్కడ నన్ను, మా చెల్లిని ఒక రకంగా.. మా బావ, తమ్ముడిని మాత్రం మరోరకంగా చూసేవారు. వాళ్లకు ఎక్కువ పాకెట్‌మనీ, ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేవారు. మా పరిస్థితి మాత్రం అలా ఉండేది కాదు. ఇంకా చెప్పాలంటే పొలాల దగ్గరకు వెళ్లినా సరే సాయంత్రం ఆరింటిలోపు ఇంటికొచ్చేయాలి. అబ్బాయిలకైతే మాత్రం వాళ్లకు నచ్చినంత సేపు బయట తిరగొచ్చు. ఎండలో కూడా ఆడుకోవచ్చు.మమ్మల్ని కన్నందుకు అమ్మపై కోపంమేము ఎండలో అడుగు కూడా బయటపెట్టడకూడదు. మా అమ్మ వరుసగా ఇద్దరు ఆడపిల్లల్ని కన్నందుకు అత్తమామలు తీవ్ర నిరాశచెందారట. ఈ విషయం అమ్మ చెప్పింది. ఇలాంటి అసమానతలపై హోంటౌన్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఆ సిరీస్‌కు చాలా కనెక్ట్ అయ్యాను అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ ఆహాలో ప్రసారం అవుతోంది.బిగ్‌బాస్ షోలో మెరిసిన విష్ణువిష్ణుప్రియ విషయానికి వస్తే.. ఆమె తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొంది. ఈ షోలో గేమ్‌పై ఫోకస్ పెట్టడానికి బదులు పిక్నిక్కు వచ్చినట్లుగా ఎంజాయ్ చేసేది. కాకపోతే తను మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడటం.. అమాయకత్వంతో అభిమానులను ఆకర్షించింది. అలా ఆ సీజన్లో ఫైనల్స్‌కు అడుగుదూరంలో ఆగిపోయింది. ఫినాలేకు ముందు వారమే ఎలిమినేట్ అయిపోయింది.చదవండి: నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ

మరాఠీ బ్యూటీతో లవ్‌లో పడిపోయిన 'రామ్'.. !
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని (36) పెళ్లి గురించి ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చాయి. తెలుగు పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉండటం వల్లే ఆయనపై ఇలాంటి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ హీరోయిన్‌తో రామ్ ప్రేమలో పడిపోయాడని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా వారు షేర్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరూ బాగా దగ్గరయిపోయారని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashri Borse)తో రామ్ పోతినేని ప్రేమలో పడిపోయాడని తెలుస్తోంది. సుమారు రెండు నెలల క్రితం కూడా వారు ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఇండస్ట్రీలో వైరల్ అయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్ వచ్చింది. తాజాగా ఓ హోటల్ గది నుంచి రామ్, భాగ్యశ్రీ వేర్వేరుగా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే, అవి ఒకే గది నుంచి తీసినవని కొందరు గుర్తించారు. ఒకేచోట ఇద్దరూ కలిసే ఉన్నారని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇప్పటికే ఇదీ రూట్లో విజయ్ దేవరకొండ, రష్మిక ఎలాగూ ఉన్నారని, ఇప్పుడు మరో కొత్త జంట వచ్చేసిందని అంటున్నారు. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. వారిద్దరిలో ఎవరైనా రియాక్ట్ అయ్యే వరకు ఈ ప్రచారాన్ని ఆపడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు.మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ 25 ఏళ్ల బ్యూటీ ఇప్పుడు రామ్ పోతినేనితో ఒక సినిమా(RAPO22) చేస్తుంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని సమాచారం. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంలోనూ భాగ్యశ్రీ నటిస్తుంది.

ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
బాక్సాఫీస్ వద్ద ఓదెల2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాలతో రష్ ఉంది. ఓటీటీలో కూడా కోర్టు, ఛావా సినిమాలు వేసవికాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే, ఏప్రిల్ చివరి వారంలో కూడా థియేటర్స్‌తో పాటు ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్గా అనిపించే పలు చిత్రాలు వస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఎల్2: ఎంపురాన్ (లూసిఫర్2), విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర శూరన్ చిత్రాలు ఓటీటీలోకి ప్రధానంగా రానున్నాయి. అదే విధంగా థియేటర్స్‌లో కూడా క్రైమ్ కామెడీ సినిమా సారంగపాణి జాతకం, ప్రేమలు మూవీ హీరో నటించిన జింఖానా చిత్రం విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మి నటించిన గ్రౌండ్ జీరో చిత్రం కూడా ఈ వారంలోనే రిలీజ్ కానుంది. మొత్తం 20 సినిమాలు ఉన్నప్పటికీ 10 సినిమాలే ప్రధానంగా చూడొచ్చని చెప్పవచ్చు.థియేటర్స్‌లోకి వచ్చే సినిమాలు🎥 సారంగపాణి జాతకం- ఏప్రిల్ 25🎥 చౌర్య పాఠం- ఏప్రిల్ 25🎥 జింఖానా- ఏప్రిల్ 25🎥 గ్రౌండ్ జీరో- ఏప్రిల్ 25🎥 శివ శంభో- ఏప్రిల్ 25🎥 సూర్యాపేట జంక్షన్- ఏప్రిల్ 25నెట్‌ఫ్లిక్స్🎥 బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 23🎥 ఏ ట్రాజడీ ఫోర్టోల్డ్ ఫ్లైట్ 3054 (ఇంగ్లీష్)- ఏప్రిల్ 23🎥 యు: సీజన్5 (ఇంగ్లీష్) -ఏప్రిల్ 24🎥 డిటెక్టివ్ కోనాన్ (యానిమేషన్)- ఏప్రిల్ 25🎥 హ్యావోక్ (ఇంగ్లీష్) -ఏప్రిల్ 25🎥 జువెల్ తీఫ్ (హిందీ/సినిమా)- ఏప్రిల్ 25జియో హాట్‌స్టార్🎥 ది రిహార్సల్స్ సీజన్1 (ఇంగ్లీష్)- ఏప్రిల్21🎥 యాండోర్ సీజన్2 (ఇంగ్లీష్) -ఏప్రిల్ 23🎥 ఎల్2: ఎంపురాన్ (తెలుగు)- ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్🎥 వీర ధీర శూరన్ (తెలుగు)- ఏప్రిల్ 24🎥 క్రేజీ (హిందీ/సినిమా)- ఏప్రిల్ 25🎥 సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (హిందీ/సినిమా)- ఏప్రిల్ 25జీ5🎥 అయ్యన మానే (మూవీ/ కన్నడ) ఏప్రిల్ 25సోనీలివ్🎥 షిర్డీ వాలే సాయిబాబా (మూవీ/హిందీ) ఏప్రిల్ 21
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

హార్దిక్‌తో ఇలాగే ఉంటది!.. పాపం ఆకాశ్ అంబానీ.. భయపడిపోయాడు!
తొలుత అంపైర్ క్యామ్.. తర్వాత స్పైడర్ క్యామ్.. ఇప్పుడు ‘చంపక్’.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో చేరిన కొత్త మెంబర్ పేరిది. ఐపీఎల్-2025 సీజన్ సందర్భంగా ఓ రోబో కుక్కను నిర్వాహకులు ప్రవేశపెట్టారు.ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 13న ఈ రోబో కుక్కను.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డానీ మోరిసన్ పరిచయం చేశాడు. తమ జట్టులోని కొత్త మెంబర్ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.𝗛𝗼𝗹𝗱 𝗼𝗻! 𝗪𝗲'𝘃𝗲 𝗮 𝗻𝗲𝘄 𝗜𝗣𝗟 𝗳𝗮𝗺𝗶𝗹𝘆 𝗺𝗲𝗺𝗯𝗲𝗿 𝗶𝗻 𝘁𝗼𝘄𝗻 👀It can walk, run, jump, and bring you a 'heart(y)' smile 🐩❤️And...A whole new vision 🎥Meet the newest member of the #TATAIPL Broadcast family 👏 - By @jigsactin P.S: Can you help us in… pic.twitter.com/jlPS928MwV— IndianPremierLeague (@IPL) April 13, 2025 ఇక వాంఖడేలో ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్మధ్య ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా దీనికి ‘చంపక్’గా నామకరణం చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోబో కుక్కను రిమోట్‌తో ఆపరేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో చెన్నైపై విజయానంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ‘చంపక్’ను కలిశాడు.ఆ సమయంలో ముంబై జట్టు యజమాని ఆకాశ్ అంబానీ హార్దిక్ పక్కనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆకాశ్‌ను ఆటపట్టించేందుకు రోబో కుక్కను అతడి మీదకు ఉరికించాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయి ఆకాశ్ అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేయగా.. హార్దిక్ గట్టిగా నవ్వేశాడు.pic.twitter.com/InWH5eY2hC— Epic Comments Telugu (@epicmntstelugu) April 21, 2025 అనంతరం చంపక్‌తో ఆకాశ్‌కు షేక్‌హ్యాండ్ ఇప్పించిన హార్దిక్.. ఆ తర్వాత అతడి ముందు రోబో డాగ్ సాగిలాపడేలా రిమోట్‌తో ఆపరేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే ‘చంపక్’ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ కలిశారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ధోని సేన ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32) అరంగేట్రంలోనే మెరుపులు మెరిపించగా.. రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివం దూబే (50) అర్ధ శతకాలు సాధించారు.ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు కూల్చగా.. అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 15.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్లలో రియాన్ రికెల్టన్ (24) ఓ మోస్తరుగా ఆడగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దంచికొట్టారు. రోహిత్ 45 బంతుల్లో 76.. సూర్య 30 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచి ముంబై విజయాన్ని ఖరారు చేశారు. ఈ సీజన్లో ముంబై ఇప్పటికి ఎనిమిదింట నాలుగు గెలిచి పట్టికలో ఆరో స్థానంలో ఉండగా.. చెన్నై ఎనిమిది మ్యాచ్‌లకు గానూ రెండే గెలిచి ఆఖరున పదో స్థానంలో కొనసాగుతోంది.

PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం తమ ఆటగాళ్లకు (జేమ్స్ విన్స్, హసన్ అలీ) హెయిర్ డ్రైయర్లు, హెయిర్ ట్రిమ్మర్ లాంటి వస్తువులను బహుమతులుగా (అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ) ఇచ్చి విమర్శలపాలైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు కనీస విలువ చేసే బహుమతులైనా ఇవ్వాలేరా అంటూ నెటిజన్లు సదరు ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడ్డారు.ఈ నేపథ్యంలో లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన తమ ఆటగాడు షాహీన్ అఫ్రిదికి ఓ ఖరీదైన వస్తువును బహుమతిగా ఇచ్చి ట్రోలింగ్ నుంచి తప్పించుకుంది. అఫ్రిది తన ప్రదర్శనలతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖలందర్స్‌ను విజేతగా నిలపడంతో యాజమాన్యం అతనికి 24 క్యారెట్ల బంగారు పూత పూసిన ఐఫోన్ 16 ప్రోను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని ఖలందర్స్ యాజమాన్యం ఓ వీడియో ద్వారా సోషల్‌మీడియాలో షేర్ చేసింది.The iPhone has landed 📱😉Our Captain Qalandar receives a gift he’s worthy of 💛🤴🏽 A custom 24K Gold-plated IPhone 16 Pro, made just for Lahore Qalandars’ main man, Shaheen! pic.twitter.com/PYigEiJvRR— Lahore Qalandars (@lahoreqalandars) April 20, 2025ఖలందర్స్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్న అఫ్రిది క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్‌పై వరుసగా 2-6, 3-35 ప్రదర్శనలు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా ఖలందర్స్ ఆయా జట్లపై 79, 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ చేతిలో ఓటమి అనంతరం ఖలందర్స్ క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్‌పై విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (డిఫెండింగ్ ఛాంప్ ఇస్లామాబాద్ యునైటెడ్ టాప్ ప్లేస్‌లో ఉంది) కొనసాగుతుంది. ఖలందర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్లాన్ సుల్తాన్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 22న జరుగనుంది.

నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అదరగొట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడు శైలికి భిన్నంగా సంయమనంతో ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అద్భుత అర్ధ శతకంతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 73 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి 135 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) మాత్రం వేగంగా ఆడాడు.ఈ కేరళ బ్యాటర్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 61 పరుగులు సాధించాడు. ఇక ఆఖర్లో జితేశ్ శర్మ సిక్స్‌తో ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నాకెందుకు?.. ఈ అవార్డుకు అతడే అర్హుడు‘‘మాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. రెండు పాయింట్లు కూడా ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించే క్రమంలో ఎంతో ఉపయోగపడతాయి. సొంత మైదానం వెలుపలా మేము అద్భుతంగా ఆడుతున్నాం.ఈ విషయం ఇక్కడ మరోసారి నిరూపితమైంది. అయితే, ఈరోజు దేవ్ ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైంది. అతడు భిన్న రీతిలో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. నాకు అభిప్రాయం ప్రకారం ఈ అవార్డుకు అతడే అర్హుడు.కానీ నాకెందుకు ఇచ్చారో తెలియడం లేదు’’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘నేను క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా పర్లేదు.. ఆ తర్వాత వేగం పెంచి.. ఆఖరిదాకా క్రీజులో ఉండాలనేదే మా వ్యూహం.మాకు మంచి జట్టు లభించిందిఈ సీజన్లో మాకు మంచి జట్టు లభించింది. వేలంలో మా వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. డేవిడ్, టిమ్, పాటిదార్.. అందరూ తమ పాత్రలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక రొమారియో షెఫర్డ్, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఉండటం మాకు సానుకూలాంశం’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా మూడు రోజుల క్రితం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని ఓడించింది. అందుకు బదులుగా పంజాబ్ సొంత మైదానం ముల్లన్‌పూర్‌లో ఆర్సీబీ ఆదివారం నాటి మ్యాచ్‌లో శ్రేయస్ సేనపై ప్రతీకారం తీర్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదింట ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. పంజాబ్ కూడా ఎనిమిదింట ఐదు విజయాలు సాధించినా రన్‌రేటు పరంగా వెనుకబడి నాలుగో స్థానంలో ఉంది.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ👉టాస్: ఆర్సీబీ.. మొదట బౌలింగ్👉పంజాబ్ స్కోరు: 157/6 (20)👉ఆర్సీబీ స్కోరు: 159/3 (18.5)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించిన ఆర్సీబీ.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోSmacking them with ease 🤌Virat Kohli is in the mood to finish this early 🔥Updates ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB | @imVkohli pic.twitter.com/iuT58bJY2A— IndianPremierLeague (@IPL) April 20, 2025

రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభం నుంచి పేలవ ఫామ్‌తో సతమతమైన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా ‘వింటేజ్ హిట్‌మ్యాన్’ను గుర్తు చేస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు.రోహిత్ ధనాధన్చెన్నై విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 45 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి.. సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్)తో కలిసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు.ఇక చెన్నైతో మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ అంటూ అభిమానులు ఇచ్చిన బిరుదును రోహిత్ శర్మ మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం ఇందుకు నిదర్శనం.This man & his pull shots >>>>#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSKpic.twitter.com/hwnlKRNvO0— Mumbai Indians (@mipaltan) April 20, 2025 ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది.ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు (అంతర్జాతీయ, లీగ్ క్రికెట్లో కలిపి) బాదిన క్రికెటర్లు👉రోహిత్ శర్మ- ఇండియాలో- 361 సిక్సర్లు👉క్రిస్ గేల్- వెస్టిండీస్‌లో- 357 సిక్సర్లు👉విరాట్ కోహ్లి- ఇండియాలో- 325 సిక్సర్లు👉మహేంద్ర సింగ్ ధోని- ఇండియాలో- 286 సిక్సర్లు👉కీరన్ పొలార్డ్- వెస్టిండీస్‌లో- 276 సిక్సర్లు👉సంజూ శాంసన్- ఇండియాలో- 274 సిక్సర్లు👉నికోలస్ పూరన్- వెస్టిండీస్‌లో- 271 సిక్సర్లు.ఇక ఓవరాల్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున టెస్టుల్లో 88, వన్డేల్లో 344, టీ20లలో 205 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్లో 264 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 292 సిక్సర్లు బాదాడు.సీఎస్కే 176.. ఆలౌట్ముంబై- చెన్నై మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో ఆదివారం జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరులో ఆతిథ్య ముంబై పైచేయి సాధించింది. టాస్ గెలిచి చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన హార్దిక్ సేన.. ధోని బృందాన్ని 176 పరుగులకు కట్టడి చేసింది.అనంతరం కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానాని (8 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి)కి దూసుకువచ్చింది. మరోవైపు.. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది ఆరో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA #SKY special in Wankhede!#SuryaKumarYadav hits the winning runs for #MI & the Revenge is completed!Next up on #IPLRevengeWeek 👉 #KKRvGT | MON, 21 APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/8rw3ZDwA5w— Star Sports (@StarSportsIndia) April 20, 2025
బిజినెస్

కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..
ఏటీఎం గురించి తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. అదెందుకు తెలియదు మాకు తెలుసు అనే చాలామంది చెబుతారు. అయితే గోల్డ్ ఏటీఎం గురించి తెలుసా? అని అడిగితే.. అడిగిన వాళ్లనే అనుమానంగా చూస్తారు. బహుశా మీ అనుమానం కరెక్టే కావచ్చు, కానీ అలాంటి ఏటీఎం కూడా ఒకటి వచ్చేసింది. దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ కథనం చదివేయాల్సిందే..చైనాలోని షాంఘైలో బంగారాన్ని కరిగించి, దానికి తగిన డబ్బును అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసే ఏటీఎం మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గోల్డ్ వేస్తే.. దాని బరువును, నాణ్యతను బట్టి.. ఆ రోజు మార్కెట్ విలువను బట్టి వినియోగదారుడి బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేస్తుంది. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఈ మెషిన్ బంగారాన్ని 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తుంది తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం.. మారిన ఏటీఎం ఛార్జీలువీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ బంగారాన్ని ఏటీఎం మెషిన్లో వేసిన తరువాత, ఆ రోజు ధరలను లెక్కగట్టి, బంగారంకు విలువకు తగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే ప్రపంచంలోని మొట్ట మొదటి గోల్డ్ ఏటీఎం మెషిన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. టెక్నాలజీకి ఫిదా అయిపోతున్నారు.This gold ATM in China melts your gold and transfers the money to your bank accountpic.twitter.com/vCmS09eRYG— Learn Something (@cooltechtipz) April 20, 2025

ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 21) గరిష్టంగా రూ. 770 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 21) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల అనుగుణంగానే ఈ ఛార్జీలను పెంచడం జరిగిందని స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2025 మే 1నుంచి అమలులోకి వస్తాయి.మే 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఈ ఛార్జ్ రూ. 21గా ఉండేది. ఈ ఛార్జీలు నెలవారీ ఫ్రీ విత్‌డ్రా లిమిట్ పూర్తయిన తరువాత మాత్రమే వర్తిస్తుంది. ఛార్జీల పెరుగుదల విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే.. కస్టమర్లకు మెయిల్స్ ద్వారా పంపింది.ఏటీఎంలలో నిర్వహించే ఆర్ధిక లావాదేవీలకు, ఆర్థికేతర లావాదేవీళ్లకులకు & కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లలో అయినా లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన మెషీన్లలో అయినా.. ఫ్రీ ఏటీఎం లావాదేవీల లిమిట్ దాటితే.. ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటికోసం వరుసగా రూ. 8.50, రూ. 10 ఛార్జీలు వసూలు చేయనున్నారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది.

లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 575.09 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో 79,128.30 వద్ద, నిఫ్టీ 143.15 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 23,994.80 వద్ద కొనసాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో సంభవ్ మీడియా, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, జెనిత్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో-నేషనల్ వంటి కంపెనీలు చేరాయి. ఆక్‌మె ఫిన్‌ట్రేడ్ ఇండియా, ఆర్వీ లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, జైప్రకాష్ అసోసియేట్స్, బినాని ఇండస్ట్రీస్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).
ఫ్యామిలీ

Mukesh Ambani Birthday ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!
భారతీయ వ్యాపార దిగ్గజం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industties) చైర్మన్‌గా, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరుగా ఎదిగారు. ఏప్రిల్ 19న 68వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ కోసం నీతా అంబానీ (Nita Ambani) గ్రాండ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడిగా మారింది.ముఖేష్ అంబానీ బర్త్‌డే (Ambani birthday) వేడుకలను అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా నిర్వహించింది. అంబానీ అప్డేట్ అనే అభిమానుల పేజీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో రంగోలి రంగులు ,పువ్వులతో తీర్చిదిద్దిన అంబానీ జంట ఫోటోల ప్రత్యేకమైన రంగోలి హైలైట్‌గా నిలిచాయి. నీతా అంబానీ నారింజ రంగు చీరలో అందంగా కనిపించారు. వేడుకల్లో భాగంగా ముఖేష్, నీతా అంబానీ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda) ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్దా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలయన్స్ బాస్‌కి చక్కటి పుట్టినరోజు సందేశాన్ని పంచుకున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, అంబానీ ఎంత "ది డౌన్ టు ఎర్త్" ఉంటారంటూ ప్రశంసించింది. కొన్ని దశాబ్దాలుగా అంబానీ కుటుంబ వేడుకల్లో వీణా మెహిందీ ఉండాల్సిందే. 0 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహంలో ముఖేష్ అంబానీ సోదరి దీప్తి సల్గావ్కర్ మొదలు 2024లో, అనంత్-రాధికల గ్రాండ్ వెడ్డింగ్ వేడుకదాకా అందర్నీ మెహందీడిజైన్స్‌తో అలంకరించింది. కాగా ముఖేష్ అంబానీ దివంగత ధీరూభాయ్ అంబానీ ,కోకిలాబెన్ అంబానీ దంపతుల పెద్ద కుమారుడు. 1957, ఏప్రిల్ 19, యెమెన్‌లో జన్మించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, సోదరులు ముఖేష్,అనిల్ అంబానీ మధ్య వైరం కారణంగా కుటుంబ సామ్రాజ్యం చీలిపోయింది. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖేష్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వివిధ రంగాలకు విస్తరించారు. ఆయిల్ నుంచి జియో ద్వారా టెలికాం సేవలు, రిలయన్స్ రిటైల్ రంగ సేవలతో విప్లవాత్మక మార్పులతో ఆసియా బిలియనీర్‌గా ఎదిగారు. ముఖేష్ సంతానం ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ కూడా కుటుంబ వ్యాపారంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ నాటికి ముఖేష్ అంబానీ ఆస్తి విలువ. దాదాపు రూ. 7.1 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 15 ధనవంతుల్లో ఒకరుగా అంబానీ ఉన్నారు.

బెండకాయ వడలు,జిగురు లేకుండా, క్రిస్పీగా ఫ్రై ట్రై చేశారా?
బెండకాయలు(lady Finger) తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉంచుతుంది. గుండెను ఫిట్‌గా ఉంచుతుంది. అంతేనా బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు చెబుతున్నారు. బెండలోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకుంటాయట. బెండకాయతో చేసుకునే వంటకాలను ఇపుడు చూద్దామా! బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటే, కొద్దిగా నిమ్మరసం వేసి ఆ జిగురుని పోగొట్టొచ్చు. అభిరుచిని బట్టి వెనిగర్ కూడా వాడుకోవచ్చు. అలాగే వాడిపోయిన బెండకాయలను తిరిగి తాజాగా మార్చడానికి, ఐస్ క్యూబ్స్ వేసిన చల్లటి నీటిలో వాటిని 10 నిమిషాల పాటు ఉంచాలి. వంట చేసేటప్పుడు బెండకాయలనుమరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, అలా చేస్తే అవి బాగా మెత్తగా అయిపోతాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!బెండకాయ ఫ్రైలేత బెండకాయ శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తో శుభ్రం చేసి, పొడిగా తుడుచుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా గుండ్రంగా కోసి పక్కన పెట్టుకోవాలి. కోసే తడి లేకుండా ఉండాలి.బాండ్లీ పెట్టుకొని ఆవాలు చిటపటలాడించి, శనగపప్పు మినపప్పు , ఎండుమిర్చి, ఎండు ఎర్ర మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి సన్న మంట మీద వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక తరిగిన బెండకాయ ముక్కలు వేసి, పాన్ మీద మూతపెట్టకుండా తక్కువ మంట మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దిగా కొబ్బరిపొడి (ఆప్షనల్) తగినంత ఉప్పు, కారం, పసుపు చల్లి మరికొంచెం వేగనిచ్చిదింపేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలోగానీ, సాంబారు, రసంతో కానీ నంజుకొని తినవచ్చు. చపాతీ లేదా సాదా పరాఠాతో కూడా లాగించొచ్చు. బెండకాయ వడలుకావలసినవి: బెండకాయలు– 5 (మీడియం సైజ్, చిన్నగా తరగాలి), శనగపప్పు– ఒక కప్పు (15 నిమిషాలు నీళ్లల్లో నానబెట్టుకోవాలి), దాల్చినచెక్క– 2 (చిన్న ముక్కలు), వెల్లుల్లి– 5, జీలకర్ర– అర టీ స్పూన్, ఎండుమిర్చి– 4, ఉల్లిపాయ– 1 (చిన్నగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి), ఉప్పు– తగినంత, నూనె– సరిపడాతయారీ: ముందుగా మిక్సీ బౌల్లో దాల్చినచెక్క ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే నానబెట్టిన శనగపప్పు వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలిపి, దానిలో శనగపప్పు మిశ్రమం వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి, వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

నా అందానికి కారణం ఆ అలవాటే : రుహానీ శర్మ బ్యూటీ సీక్రెట్
అనుష్కా శర్మ చెల్లెలు, విరాట్ కోహ్లీ మరదలు అయిన రుహానీ శర్మ చేసినవే తక్కువ సినిమాలు అయితే, అందులో హిట్ అయిన వి రెండు మాత్రమే! కాని, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. ఫ్యాషన్‌లో తను చూపే చూజీనెస్ మిగతా వారికంటే తనని భిన్నంగా చూపిస్తోంది. అలా తను ఎంచుకున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి. రోజూ ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు నా సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం మర్చిపోను. ఇప్పుడు ఆ అలవాటే నన్ను ఎల్లప్పుడూ అందంగా కనిపించేలా చేస్తోంది.– రుహానీ శర్మచేతి గాజులు ఘల్లుమన్నవే..ఒకప్పటిలాగా నిత్యం చేతికి గాజులు వేసుకోకపోవచ్చు. కాని, స్పెషల్ అకేషన్ ఏదైనా మట్టిగాజులపైనా మనసు పారేసుకుంటున్నారు నేటి మగువలందరూ చేతికి నిండుగా మట్టి గాజులు వేసుకుంటే వచ్చే అందమే వేరు. పైగా గాజుల్ని శుభసూచకంగా, సౌభాగ్యానికి గుర్తుగా భావిస్తారు. వీటిని ధరించడం వలన అందంతో పాటు, ఆరోగ్యమూ చేకూరుతుందనే నమ్మకమూ ఉంది. బంగారు గాజులు ఎన్ని వేసినా వాటి మధ్యలో ఓ నాలుగు మట్టిగాజులు చేరితేనే అందం. కిందటి రోజుల్లో మట్టిగాజులు అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో సాదాగా దొరికేవి. కాని, ఇప్పుడు పేస్టల్ కలర్స్‌తో పాటు దాదాపు అన్నీ రంగుల్లోనూ, వివిధ రకాల డిజైన్స్‌లోనూ లభిస్తున్నాయి. వీటిని అటు అరడజను, ఇటు అరడజనులా కాకుండా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ తగ్గట్టు, కేవలం ఒక్క చేతికే నిండుగా ధరించి కూడా స్టయిలింగ్ చేసుకోవచ్చు నటి రుహానీ శర్మలా. -దీపిక కొండి

వేలంలో కోట్ల రూపాయలు పలికిన టాప్ పెయింటింగ్స్
ఆర్ట్ ఒక జీవితావసరం. ఎవరికి?! అద్దం అవసరం ఎవరికైతే ఉంటుందో, వారందరికీ. జీవితానికి అద్దం పట్టే ఆర్ట్ జీవితంలానే ఉంటుంది తప్ప.. ప్రతిబింబంలానో, అనుసృజనలానో ఉండదు. నడిచిపోయిన కాలానికి నిలకడైన రూపం ఆర్ట్. అందుకే ఆర్టిస్టులకు అంత గౌరవం, ఆర్ట్ అంత అమూల్యం. ప్రపంచ ప్రసిద్ధ చెందిన ‘ఆక్షన్’ సంస్థలు ఏడాది పొడవునా ఈ చిత్ర పటాలను వేలానికి ఉంచుతూనే ఉంటారు. అలా ఇప్పటి వరకు అంతర్జాతీయ వేలం పాటల్లో అత్యధిక ధరను దక్కించుకున్న తొలి ఐదు భారతీయ తైలవర్ణ చిత్రాల విశేషాలు మీ కోసం.తయ్యబ్ మెహతా, ఎం.ఎఫ్. హుస్సేన్ ఇంచుమించుగా ఒక ఈడు వాళ్లు. హుస్సేన్ తర్వాత పదేళ్లకు జన్మించిన తయ్యబ్... హుస్సేన్ కన్నా రెండేళ్లు ముందుగా ‘సెలవు’ తీసుకున్నారు. కానీ, మానవాళికి తమ కుంచె వేళ్లకు ఆనవాళ్లుగా వాళ్లు వదిలివెళ్లిన తైలవర్ణ చిత్రాలు కాలాలకు అతీతమైనవి! తయ్యబ్ దాదాపు 70 ఏళ్ల క్రితం గీసిన ‘ట్రస్‌డ్ బుల్’ పెయింటింగ్ తాజా వేలంలో రూ.61.8 కోట్ల ధర పలికింది. ఏప్రిల్ మొదటి వారంలో ముంబైలోని ‘శాఫ్రాన్ఆర్ట్’ గ్లోబల్ సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆన్లైన్ వేలంలో ‘ట్రస్‌డ్ బుల్’ రెండవ అత్యంత ఖరీదైన భారతీయ పెయిటింగ్‌గా చరిత్రలో నిలిచింది. మొదటిది ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ‘గ్రామ్ యాత్ర’. న్యూయార్క్‌లో ఈ ఏడాది మార్చి మూడవ వారంలో జరిగిన ‘క్రిస్టీస్’ వేలంలో హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ రూ.118 కోట్లు పలికింది. అమృతతో తయ్యబ్ సమస్థానంహుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ తర్వాత తయ్యబ్ ‘ట్రస్‌డ్ బుల్’ చిత్రం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఏడాదిన్నర క్రితమే 2003 సెప్టెంబరులో అదే ‘శాఫ్రాన్ఆర్ట్’ సంస్థ నిర్వహించిన వేలంలో అదే మొత్తానికి (రు.61.8 కోట్లు) అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ విక్రయం అయింది కనుక తయ్యబ్‌ది అమృతాతో సమస్థానం అని చెప్పటం కూడా గౌరవంగానే ఉంటుంది. అమృత ఎం.ఎఫ్. హుస్సేన్ కంటే కూడా వయసులో రెండేళ్లు, తయ్యబ్ కంటే పన్నెండేళ్లు పెద్దవారు. హుస్సేన్ 95 ఏళ్లు, తయ్యబ్ 83 ఏళ్లు జీవిస్తే, అమృతా 28 ఏళ్లకే కన్నుమూశారు!ఎందుకింత ‘అమూల్యం’?!పైకి వర్ణాలే. వెలుగు నీడలే. లోపల అవి ఉద్వేగాలు. లోలోతుల్లో హృదయ తరంగాలు. ఎం.ఎఫ్. హుస్సేన్ తన ‘గ్రామ్ యాత్ర’లో గ్రామీణ భారత వైవిధ్య చిత్రాలను లిఖించారు. అది లేఖనం కాదు. ఊపిరి పోయటమే! వంట చెయ్యటం, పిల్లల్ని చూసుకోవటం, గూడుబండిలో ప్రయాణం చెయ్యటం వంటి రోజువారీ గ్రామీణ దృశ్యాలో స్త్రీలను చిత్రించటానికి హుస్సేన్ శక్తిమంతమైన మట్టి రంగులను ఉపయోగించారు. తయ్యబ్ మెహ్తా ‘ట్రస్‌డ్ బుల్’ (కట్టిపడేసిన ఎద్దు) విభజనానంతర కాలంలో ప్రత్యక్షంగా ఆయన చూసిన ఒక భయానక సంఘటనకు ప్రతీకాత్మక చిత్రీకరణ. ‘‘ఆ సమయంలో నేను మొహమ్మద్ అలీ రోడ్డులో (బొంబాయి) నివసిస్తున్నాను. నిరుపేద ముస్లింలు ఉండే ప్రదేశం అది. నేనుండే పైగది కిటికీలోంచి వీధిలో ఒక యువకుడి వధించటం నేను కళ్లారా చూశాను. జన సమూహం అతడిని కొట్టి చంపింది. అతని తలను రాళ్లతో పగలగొట్టింది. బొంబాయిలోని ఒక వధ్యశాలకు ఎద్దులను తీసుకెళే దృశ్యం అప్పుడు నా మదిలో కదలాడింది. వాళ్లు ఆ జంతువును వధించే ముందు తాళ్లతో కాళ్లు కట్టేస్తారు. కొద్దిగానైనా కదలకుండా చేసేస్తారు. ఆ స్థితిలో ఉన్న ఎద్దును నేను ఆనాటి దేశకాల స్థితిని ప్రతిఫలించేలా ట్రస్‌డ్ బుల్గా చిత్రించాను..’’ అని ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో చెప్పారు తయ్యబ్ మెహ్తా. హుస్సేన్, అమృతా, తయ్యబ్‌ల చిత్రాల తర్వాత ఇప్పటి వరకు ప్రపంచ వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ తైలవర్ణ చిత్రాలుగా నిలిచినవి ఎస్.హెచ్.రజా ‘జెస్టేషన్’, వి.ఎస్. గైతోండే ‘అన్టైటిల్డ్’. 2023 సెప్టెంబరులో ముంబైలోని పండోల్ సంస్థ వేలంలో రజా ‘జెస్టేషన్’ రూ.51.7 కోట్లకు, అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన శాఫ్రాన్ఆర్ట్ వేలంలో గైతోండే ‘అన్టైటిల్డ్’ రూ. 47.5 కోట్లకు అమ్ముడయ్యాయి. రజా 94 ఏళ్ల వయసులో, గైతోండే 77 ఏళ్ల వయసులో తమ అమూల్యమైన చిత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ థీమ్ కూడా హుస్సేన్ వేసిన ‘గ్రామ్ యాత్ర’ వంటిదే. అయితే ఆ చిత్రాన్ని ఆమె హుస్సేన్ కంటే ముందే వేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ను గీస్తే, దేశానికి స్వాతంత్య్రం రావటానికి పదేళ్ల ముందే అమృతా ‘ది స్టోరీ టెల్లర్’ను గీశారు. రోజువారీ పనులలో నిమగ్నమై ఉన్న గ్రామీణ మహిళల సమూహాన్ని అందులో చిత్రీకరించారు అమృత. ఈస్ట్ అండ్ వెస్ట్ సంస్కృతుల కలయిక ఆమె రంగుల వాడుక. ఎస్.హెచ్. రజా ‘జెస్టేషన్’ వృత్తం కేంద్రబిందువుగా త్రిభుజాలు, చతురస్రాలు, వికర్ణ రేఖలతో కూడి ఉంటుంది. ఐదు దశాబ్దాలు ఫ్రాన్స్‌లో జీవించిన తర్వాత ఆయన తన మాతృభూమికి తిరిగి రావటాన్ని ఆ చిత్రం సూచిస్తుంది. సూక్ష్మార్థంలో – మనిషి తన చరమాంకంలో తిరిగి బిడ్డగా మారి తల్లి కడుపులోకి నిక్షిప్తం కావాలని కాంక్షించటం అందులో కనిపిస్తుంది. ఇక వి.ఎస్. గైతోండే తన ‘అన్టైటిల్డ్’ పెయింటింగ్‌తో కళాత్మక తాత్వికునిగా ప్రసిద్ధి చెందారు. ‘అన్టైటిల్డ్’ శూన్యానికి ఏకవర్ణ ఆకృతిని ఇవ్వటం అంటారు ఆర్ట్ గురించి తెలిసినవాళ్లు. వీక్షకులు ఈ చిత్రంలోని అదృశ్యాన్ని అనుభూతి చెందుతారని కూడా అంటారు. ఎందుకీ చిత్రాలు ఇంత అమూల్యమైనవి అనుకున్నాం కదా. అది చిత్రం విలువ మాత్రమే కాదు, అంతకుమించి, చిత్రానికి రసాస్వాదకులు ఇచ్చే మర్యాద కూడా! ఆ రెండూ కలసి చిత్రం ఖరీదును తరతరాలకూ పెంచుకుంటూ పోతూనే ఉంటాయి.∙సాక్షి, స్పెషల్ డెస్క్
ఫొటోలు
అంతర్జాతీయం

ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికాలో 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ చట్టం కింద నిర్బంధానికి గురైన వెనిజులా పౌరులకు భారీ ఊరట లభించింది. వారిని బలవంతంగా వెనక్కి పంపించకుండా అమెరికా సుప్రీంకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది.కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఉత్తర టెక్సాస్‌లో 261 మంది వెనిజులా పౌరులను ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798 కింద నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. ఈ 261 మందిని ట్రంప్ ప్రభుత్వం ఎల్‌సాల్వెడార్ దేశంలో భూలోక నరకంగా పరిగణించే ఓ జైలుకు తరలించింది. తర్వాత వారందరినీ వెనిజులాకు పంపించాలని నిర్ణయించింది. దీంతో బాధితులకు మద్దతుగా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులను ఆశ్రయించారు. 261 మందిని వారి స్వదేశానికి తరలించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ కింది కోర్టు మార్చి 15న ఆదేశాలిచ్చింది.అయితే, వారిని వెనక్కి పంపించడానికి 1798 నాటి వార్‌టైమ్ చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెలువరించింది. కానీ, డిపోర్టేషన్‌ను సవాలు చేసే అవకాశం వారికి ఇవ్వాలని స్పష్టంచేసింది. దాంతో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం డిపోర్టేషన్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. వెనిజులా పౌరులకు ఇది అతిపెద్ద విజయమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.వెనిజులా వాసులు ప్రస్తుతానికి ఎల్ సాల్వెడార్ జైలులోనే ఉండనున్నారు. 216 మందిలో 137 మందిపై ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798ను తొలగించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులను అక్రమ వలసదార్లను గుర్తించి, అరెస్ట్ చేసి డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి బయటకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. The US Supreme Court just blocked President Trump from Deporting illegals under the Alien Enemies Act.Thomas & Alito dissented.They did this while we weren't looking and they did this before the 5th or the 4th circuit could dismiss the appeals.Barack Obama deported 3… pic.twitter.com/aTJvfUhsSJ— Matthew Zimmerman 🇺🇸 (@MattZimmerman26) April 19, 2025

జూలైలో మెగా సునామీ?
సునామీ. మూడక్షరాలే అయినా, అది సృష్టించే విధ్వంసం ఎంతటిదో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 2004లో విరుచుకుపడ్డ సునామీ బీభత్సాన్ని ప్రపంచం ఎన్నిటికీ మర్చిపోలేదు. అనంతరం 2011లో భారీ సునామీ జపాన్ మొదలుకుని పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే? అది కూడా 2011, 2004ల్లో కంటే ప్రళయభీకర స్థాయిలో వస్తే? అదే జరగవచ్చట. అది కూడా ఎప్పుడో కాదు, వచ్చే జూలైలోనే! దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కనీ వినీ ఎరగని విధంగా ఉంటుందట. ఈ మేరకు జపాన్‌కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్టు ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం ఇప్పుడు చాలామందిని తీవ్రంగా కలవరపెడుతోంది. 2011 సునామీతో పాటు ఆమె గతంలో చెప్పినవెన్నో అక్షరాలా జరగడమే ఇందుకు కారణం. ఆ జాబితాలో 2020 నుంచి రెండేళ్లకు పైగా ప్రపంచానికి నిద్ర కూడా లేకుండా చేసిన కరోనా కూడా ఉంది! ఏమిటీ మాంగా? మాంగా అంటే జపాన్‌కే ప్రత్యేకమైన నవలలు, కార్టూన్లు. 70 ఏళ్ల తత్సుకీ ఈ కళలో ఆరితేరారు. పైగా ఇలస్ట్రేటర్‌గా కూడా ఆమెకు చాలా పేరుంది. అంతకుమించి భవిష్యద్రష్టగా కూడా తత్సుకీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. 1980ల నుంచీ ఆమె భవిష్యత్తు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా మరణాన్ని కూడా ముందే చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘నేను చూసిన భవిష్యత్తు (ద ఫ్యూచర్ దట్ ఐ సా)’పేరిట 1999లో ఆమె రాసిన మాంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు.సమీప భవిష్యత్తులో వచి్చపడనున్న ఎన్నెన్నో ప్రాకృతిక విపత్తులను గురించి అందులో తత్సుకీ ముందే పేర్కొన్నారు. ముఖ్యంగా 2011 మార్చి 11న ఏకంగా 9.1 తీవ్రతతో జపాన్ను కుదిపేసిన భయానక భూకంపం, దాని ఫలితంగా వచి్చపడ్డ భీకర సునామీ ధాటికి ఏకంగా 20 వేల మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతం గురించైతే తత్సుకీ అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. ‘2011లో భారీ ఉత్పాతం వచ్చి పడనుంది’అంటూ ఓ అధ్యాయమే రాశారు. అంతేకాదు, ‘2020లో అంతుపట్టని కొత్త రకం వైరస్ వ్యాప్తి పరాకాష్టకు చేరుతుంది’అంటూ మరోచోట కరోనా గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రాకాసి బుడగలువచ్చే జూలైలో మెగా సునామీ రాబోతోందన్న తత్సుకీ, అది జపాన్ చరిత్రలోనే కనీవినీ ఎరగనంత తీవ్రమైనదని కూడా రాశారు. దాని ధాటికి జపాన్, తైవాన్, ఇండొనేసియా, ఉత్తర మరియానా దీవులు అతలాకుతలమైపోతాయని హెచ్చరించారు. ఆ దేశాలను అనుసంధానించే వజ్రాకృతితో కూడిన జోన్ నిండా ‘రాక్షస బుడగలు (రాకాసి అలలు) పడగలెత్తుతాయి’, ‘దక్షిణ జపాన్ సముద్రం మరిగిపోతుంది’అంటూ రాబోయే సునామీ తీవ్రతను వర్ణి0చారు. అంతేకాదు, దాని తీవ్రత 2011 నాటి సునామీ కంటే కనీసం మూడు రెట్లకు పై చిలుకేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజులుగా ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ఈ జోస్యం ఏ మేరకు నిజమవుతుందన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గత 20 ఏళ్లలో తత్సుకీ చెప్పినవన్నీ జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదని వాదించే వారు కొందరు. సునామీ వంటి ప్రాకృతిక విపత్తుల విషయంలో శాస్త్రీయ అంచనాలను నమ్ముకోవాలే తప్ప ఇలాంటి జోస్యాలను కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. చూడబోతే మాంగా పేరిట తత్సుకీ ఏకంగా ప్రపంచం పాలిట మరణశాసనమే రాసినట్టు కని్పస్తోందంటూ ఇంకొందరు వాపోతున్నారు. తన రాతలపై ఇంత దుమారం రేగుతున్నా 70 ఏళ్ల తత్సుకీ మాత్రం వాటిపై మౌనం వీడటం లేదు. గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’అంటూ కీర్తిస్తున్నారు. అంధురాలైన బాబా వంగా కూడా ఇలాగే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. కొసమెరుపు కరోనాకు సంబంధించి మనందరినీ మరింత వణికించేలా మరో జోస్యం కూడా చెప్పారు తత్సుకీ! అదేమిటో తెలుసా? మరో అయిదేళ్లలో అంటే 2030లో అది మరింత తీవ్రతతో వచ్చి పడుతుందట.– సాక్షి, నేషనల్ డెస్క్

సియాచిన్, గల్వాన్‌లకు సైతం మొబైల్ కనెక్టివిటీ
శ్రీనగర్: ప్రపంచంలోనే అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులున్న సియాచిన్, గల్వాన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లు ఇప్పుడిక తమ ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చు. లద్దాఖ్ ప్రాంత మంతటా హై స్పీడ్ మొబైల్ కనెక్టివిటీని ఆర్మీ అందుబాటులోకి తేవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మారుమూల ప్రాంతాల వారికి సాధికారత కలి్పంచడం దిశగా పరివర్తనాత్మక ముందడుగుగా ఆర్మీ పేర్కొంది. సరిహద్దులకు అత్యంత సమీపంలోని పోస్టులున్న తూర్పు లద్దాఖ్, పశ్చిమ లద్దాఖ్‌లతోపాటు సియాచిన్ హిమానీనదం వరకు 4జీ, 5జీ మొబైల్ కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దక్షేత్రం సియాచిన్‌లో 5జీ మొబైల్ టవర్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశామని ప్రకటించింది. ‘అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల్లో 18వేల అడుగుల ఎత్తులోని సరిహద్దు పోస్టుల్లో పనిచేస్తున్న సైనికులకు ఈ సౌకర్యంతో మనోధైర్యం పెరుగుతుంది. తమ కుటుంబాలు, ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది’అని అధికారులు తెలిపారు. ఇందుకోసం కేవలం లద్దాఖ్, కార్గిల్ జిల్లాల్లోనే నాలుగు ముఖ్యమైన టవర్లు ఏర్పాటు చేశామని, ఇందులో ఆరీ్మకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. బలగాలతోపాటు సరిహద్దు పోస్టులకు సమీప గ్రామాల వారు మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది వారికెంతో ఉపయోగపడుతుందన్నారు.

త్వరలో 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ల మూసివేత
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తొలగించిన ట్రంప్ సర్కార్ త్వరలో విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాల సిబ్బందిపైనా తొలగింపు వేటు వేయనుందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత మంత్రిత్వశాఖకు సంబంధించిన డాక్యుమెంట్లలో ఆయా వివరాలు ఉన్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధానంగా యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువ రాయబారకార్యాలయాలు, కాన్సులేట్లను శాశ్వతంగా మూసేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ కార్యాలయాలకు తాళాలు పడే అవకాశముంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ వ్యయ నియంత్రణ ప్రతిపాదనల్లో భాగంగా ప్రభు త్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తోందని తెలుస్తోంది. సోమాలియా, ఇరాన్ దేశాల్లోనూ అమెరికా తన ప్రాధాన్యాన్ని తగ్గించుకోనుంది.
జాతీయం

రిక్కీ అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రాష్ట్రంలో, అందులోనూ బెంగళూరు పరిసరాల్లో గత 48 గంటల్లో అనూహ్యమైన నేర సంఘటనలు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ టీవీ చానెళ్లలో చాలా సమయాన్ని ఆక్రమించాయి. దీంతో బెంగళూరు హాట్ హాట్ చర్చల్లో భాగమైంది. సినిమా స్టైల్లో మాఫియా డాన్ కొడుకుపై తుపాకులతో హత్యాయత్నం, ఆ గొడవ సద్దుమణగకముందే ఏకంగా రిటైర్డు డీజీపీ ఇంట్లోనే హత్యకు గురికావడం, అందులోనూ ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అరెస్టు చేయడం హాలీవుడ్ క్రైం స్టోరీలను మించిపోయింది. రిక్కీ కేసులో ఎవరు సూత్రధారి? మాజీ మాఫియా డాన్, దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై మీద గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరపడం సంచలనం కలిగిస్తోంది. రిక్కీని మట్టుబెట్టాలని ఫైరింగ్ చేయగా, తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. సిలికాన్ సిటీతో పాటు చుట్టుపక్కల జరుగుతున్న రియల్ ఎస్టేట్ గొడవలు, మాఫియా పోరాటాలు ఈ సంఘటనతో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మొదట రియల్ ఎస్టేట్ నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని అందరూ భావించినప్పటికీ సమయం గడిచేకొద్దీ ముత్తప్ప రై రెండవ భార్య అనురాధపై అనుమానాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాల కథనం. ముత్తప్పరై ఇద్దరు కుమారులు, రెండవ భార్య అనురాధ పేరున తన ఆస్తులు వీలునామా రాశారు. అనురాధకు ఓ మోస్తరుగా బంగారు ఆభరణాలు, ఒక కారు, పెద్ద మొత్తంలో నగదు, హెచ్డీ కోటలో ఉన్న ఆస్తి, బెంగళూరు సహకార నగరలో ఉన్న ఒక భవంతి రాసిచ్చారు. అయితే ఆస్తిలో తనకు ఇంకా భాగం రావాలని ఆమె కోర్టుకు వెళ్లింది. రిక్కీ, అతని అన్న రాకీతో ఆమెకు గొడవలు కూడా జరిగాయి. అయితే తరువాత రిక్కీ సోదరులు రాజీ చేసుకున్నారు. వారు పరస్పరం హత్యలకు కుట్రలు చేసినట్లు కూడా వార్తలున్నాయి. ఇప్పుడీ హత్యాయత్నంతో అది బహిర్గతమైంది. రిక్కిరై సెక్యూరిటీ ఏమైంది రిక్కీ రై మీద హత్యాయత్నం తరువాత అందరిలో అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల వారసుడు, విస్తృతంగా శత్రువులను కలిగిన రిక్కీ రై అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు? పటిష్టమైన ప్రైవేటు భద్రత ఏమైంది? అనే సందేహాలున్నాయి. రిక్కీ రై సొంతంగా వీవీఐపీకి ఉన్నంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు. గన్లు పట్టుకుని చుట్టూ బాడీగార్డులు ఉంటారు. బాడీ గార్డులు షార్ప్ షూటర్స్ అయి ఉంటారు. రిక్కిరై పై కాల్పులు జరిపిన సమయంలో కారులో ఒకరే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మిగతా ఇద్దరు ఎందుకు లేరనేది సందేహాస్పదమైంది. కాల్పుల వెనుక బయటి శత్రుల కన్నా లోపలి శత్రువులే ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిక్కీకి డిప్యూటీ సీఎం పరామర్శ రిక్కీ రై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడు ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా పోలీసులు అరెస్టు చేస్తారని రిక్కీకి భరోసా ఇచ్చారు.రిటైర్డు డీజీపీ విషాదాంతం యశ్వంతపుర: రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని సొంత భవనంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఈ ఘోరం వెలుగుచూసింది. తానే హత్య చేసినట్లు భార్య పల్లవి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఆమె పోలీసులకు కాల్ చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో ఉన్న పల్లవితో పాటు ఆమె కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. వీరి కుటుంబంలో స్పర్థల గురించి చుట్టుపక్కలవారితో పాటు కొందరు విశ్రాంత పోలీసు అధికారులకు కూడా తెలుసని సమాచారం. తనకు ప్రాణభయం ఉందని ఓంప్రకాశ్ స్నేహితులకు చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్యతో ఆయన సహచర రిటైర్డు ఐపీఎస్‌లు విచారానికి లోనయ్యారు.

అందంగా లేదని చిత్రహింసలు
రాయచూరురూరల్(కర్ణాటక): ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగు పెట్టిన నవ వధువుకు కొద్ది రోజుల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. అందంగా లేవని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. గదగ్ బేటిగేరిలోని శరణ బసవేశ్వర కాలనీకి చెందిన అమరేష్‌కు బళ్లారికి చెందిన పూజాతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్త అమరేష్ యాదగరి జిల్లా శహపురలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఇతర ప్రాంతానికి బదలీ చేశారు. కొద్ది రోజలు పాటు బేటిగేరిలోనే ఉండాలని, అనంతరం బదిలీ అయిన ప్రాంతానికి తీసుకెళ్తాని భర్త చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం ఆమెకు అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి. అందంగా లేవని, వంటలు సరిగా చేయడం లేదని అత్త శశికళ, బావ వీరన గౌడలు సూటిపోటిమాటలతో మనస్సు నొచ్చుకునేలా వ్యవహరించేవారు. ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పగా కొద్ది రోజులు సర్దుకొని వెళ్లాలని సూచించారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో పూజా ఈనెల 15న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. అత్త శశికళ, బావ వీరన గౌడ వేధించినట్లు అందులో ఉండటంతో వారిని పోలీసుల అరెస్ట్ చేశారు.

విశ్రాంత డీజీపీ దారుణ హత్య
యశవంతపుర: కర్ణాటకలో సంచలనం చోటుచేసుకుంది. విశ్రాంత డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆదివారం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలోని నివాసంలో ఆయన కత్తి పోట్లకు గురయ్యారు. శనివారం రాత్రి ఘటన జరగ్గా ఆదివారం ఉదయం బయటపడింది. ప్రకాశ్ భార్య పల్లవి ఈ విషయం బంధువులకు తెలపగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూడగా మూడంతస్తుల నివాసం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఆయన శరీరంపై అనేక కత్తి గాట్లున్నాయి. కత్తితో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన ఆయన భార్య పల్లవితోపాటు కుమార్తెను పోలీసులు ప్రశి్నస్తున్నారు. విషయం తెల్సిన సీనియర్ పోలీసు అధికారులు ఆయన నివాసానికి తరలివచ్చారు. ఓం ప్రకాశ్ దంపతుల మధ్య కొంతకాలంగా ఆర్థిక సంబంధమైన గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. తనకు దగ్గరి వారి నుంచే ప్రాణహాని ఉన్నట్లు ప్రకాశ్ ఇటీవల కొందరు సన్నిహితులతో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు ప్రకాశ్‌కు సన్నిహితులైన కుటుంబసభ్యులే కారణమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రకాశ్ బిహార్‌లోని చంపారన్ వాసి. అక్కడే జియాలజీలో పీజీ చేశారు. 1981లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. బళ్లారిలో ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్లో పూర్తికాలం కర్ణాటకలో పనిచేశారు. భత్కల్ మత కలహాల నివారణ సహా పలు ముఖ్య ఆపరేషన్లలో పాల్గొన్నారు.

జంధ్యం ఉంటే నో ఎగ్జామ్
బెంగళూరు: కర్ణాటకలో జంధ్యం వివాదం చర్చనీయాంశంగా మారింది. జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను పరీక్షకు అధికారులు అనుమతించడం లేదు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో జంధ్యం ధరిస్తే ‘నో ఎగ్జామ్’ అంటున్నారు. ఇటీవల శివమొగ్గ పట్టణంలో ఓ బ్రాహ్మణ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడం వివాదంగా మారింది. తాజాగా బీదర్, గదగ్, ధార్వాడ్‌లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.జంధ్యం తొలగిస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ అధికారులు తేల్చిచెప్పారని విద్యార్థులు ఆరోపించారు. గదగ్, ధార్వాడ్‌లో అధికారులు ఇద్దరు విద్యార్థుల జంధ్యాలను కత్తిరించి, చెత్తబుట్టలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తాను చాలా కలత చెందానని, పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్లిపోయానని ధార్వాడ్ విద్యార్థి చెప్పాడు. బీదర్ జిల్లాలో జంధ్యం తొలగించిన ఘటనపై బాధిత విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
ఎన్ఆర్ఐ

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
క్రైమ్

Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది.

చిన్నారిని ఛిదిమేసిన కారు
గోదావరిఖని(రామగుండం): రెండోకాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆమె మొదటి సంతానం మూడేళ్ల బాలున్ని కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌లో శివరాజ్‌కుమార్(3) ఆదివారం కారు ఢీకొని మృతిచెందాడు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గంగానగర్‌కు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల శివరాజ్‌కుమార్ ఉండగా, సంధ్య రెండో కాన్పుకోసం తల్లిగారింటికి గంగానగర్ వచ్చింది. పాప జన్మించి మూడు నెలలు అయ్యింది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్‌కుమార్ ఆడుకుంటూ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్ పైకి రాగా, మంచిర్యాల్ నుంచి గంగానగర్‌కు వెళ్తున్న కార్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శివరాజ్‌కుమార్ మెడపై భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు అందరితో ఆడుకుంటూ క్షణాల్లో మాయమైన కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
దుండిగల్(హైదరాబాద్): ఓఆర్ఆర్పై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్ (36), నళినికంఠ బిస్వాల్ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్ మంచిరేవులలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్ నుంచి పటాన్చెరు వైపు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతో పాటు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్.. షాద్‌నగర్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ఆ«ధారంగా పని చేసే ఈ యాప్స్ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ అ«దీనంలోనే ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాణాలు బలి.. సీరియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్‌కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్‌కు అలవాటుపడిన పవన్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్ సైతం అమ్మేశాడు. బెట్టింగ్ విషయంలో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. ఈ గేమింగ్ యాప్స్‌లో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు. లింకుల ద్వారానే యాప్స్ చలామణి.. ఈ యాప్స్‌ను నిర్వాహకులు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్స్‌లో హోస్ట్ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్‌గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్‌థెమ్ పని చేస్తుంది. రోజుకు విత్‌డ్రా రూ.500.. ఈ బెట్టింగ్, గేమింగ్‌లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్‌కు సంబంధించిన వర్చువల్ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్‌లో వెచి్చంచడానికి పరిమితులు ఉండవు. విత్‌డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్‌లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్ జీపీఎస్ యాప్స్‌ను ఇన్‌స్టల్ చేసుకుంటున్నారు.