Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Comments On Chandrababu Ruling1
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్‌: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్‌బుక్‌ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్‌బుక్‌ పాలన జరుగుతోంది’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్‌సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్‌పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్‌సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్‌ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్‌ టాపిక్స్‌ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్‌మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్‌, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Chandrababu Government New Way For Debts2
అప్పుల కోసం చంద్రబాబు సర్కార్‌ కొత్త మార్గం!

సాక్షి, విజయవాడ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు. అప్పులు చేయడంతో సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో అప్పుల కోసం చంద్రబాబు సర్కార్‌ కొత్త మార్గం ఎంచుకుంది. ఏపీ ఎండీసీ ద్వారా 9 వేల కోట్లు బాండ్లు జారీ చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగ విరుద్ధమని విమర్శలొస్తున్నా వెనక్కి తగ్గని ప్రభుత్వం.. 436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు ఇచ్చేసింది. క్వారీ లీజు హోల్డ్‌ హక్కులు ఏపీ ఎండీసీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మైనింగ్ హక్కులు కూడా ఏపీఎండీసీకి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని చూపించి ఏపీఎండీసీ బాండ్లు జారీ చేయనుంది. రాష్ట్ర ఖజానాను తాకట్టుపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి వెసులుబాటు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారాయన.సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ తేల్చేసిన సంగతి తెలిసిందే. ఒక వైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్‌ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం.. పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేసిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Bharath Bhushan was tragically killed by terrorists in Pahalgam3
టూరిస్టులతో టెర్రరిస్ట్‌.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్‌ చేస్తారా?’

సాక్షి,బెంగళూరు: ‘నాబిడ్డకు ఇంకా మూడేళ్లే నన్ను వదిలేయండి ప్లీజ్‌ అని ప్రాధేయపడినా కనికరించలేదు. ఉగ్రవాది మనసు కరగలేదు. భార్య ముందే తలపై తుపాకీ ఎక్కుపెట్టి మెషిన్‌ గన్నుతో కాల్పులు జరిపాడు. జమ్మూకశ్మీర్‌లోని మిని స్విట్జర్లాండ్‌ పహల్గాంను వీక్షించేందుకు వచ్చిన సామాన్యుల్ని పొట్టన పెట్టుకున్నారు. వారిలో భరత్‌ భూషణ్‌(35)ఒకరు.వేసవి సెలవులు కావడంతో భరత్‌ భూషణ్‌ తన భార్య డాక్టర్‌ సుజాత భూషణ్‌, మూడేళ్ల కొడుకుతో కలిసి పహల్గాంకు వచ్చారు. అప్పటి వరకు వందల సంఖ్యలో పర్యాటకలతో కళకళలాడుతున్న పహల్గాంలో సైనిక దుస్తులు ధరించిన ముష్కరులు పర్యాటకులపై విరుచుకు పడ్డారు. ఐడీకార్డులను చెక్‌ చేసి మరి కాల్చి చంపారు.అలా ముష్కరుల తూటాలకు భరత్‌ భూషణ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు బాధితుడి భార్య డాక్టర్‌ సుజాత భూషణ్‌ కన్నీరు మున్నీగా విలపిస్తున్నారు. కుమారుడి భవిష్యత్‌ గురించి ప్రాధేయపడ్డ ఉగ్రవాదులు కనికరించకుండా ప్రాణాలు తీశారని గుండెలవిసేలా రోధిస్తున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.మృతదేహానికి సీఎం సీఎం సిద్ధరామయ్య నివాళిపహల్గాంలో ఉగ్రవాదుల తూటాలకు బలైన భరత్‌ భూషణ్‌ మృతదేహాం ఆయన స్వస్తలం బెంగళూరుకు చేరుకుంది. భరత్‌ భూషణ్‌ మృతదేహానికి నివాళులర్పించేందుకు సీఎం సిద్ధరామయ్య భరత్‌ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తన భర్త భరత్‌ భూషణ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిగిన తీరు,దారుణానికి ముందు పహల్గాం ఎలా ఉందో తెలిపారు.పహల్గాంలో కాల్పుల మోత‘వేసవి సెలవులు కావడంతో ఏప్రిల్ 18న మేం పహల్గాంకు వెళ్లాం. అదే రోజు మేం బైసరీన్‌ వ్యాలీ వరకు గుర్రాల మీద వెళ్లాం. అక్కడికి చేరాక గుడారాలు వేసుకున్నాం. అనంతరం కశ్మీరీ వేషధారణలతో నా భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి సెల్ఫీలు దిగాం. పచ్చిక బయళ్లు,పైన్‌ చెట్లతో విశాలంగా విశాలవంతమైన ఆ ప్రాంతాన్ని కలియతిరుగుతున్నాం. పలువురు పర్యాటకు గుడారాలు వేసుకొని సందడి చేస్తున్నారు.ఐడీకార్డులు అడిగిసరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా బుల్లెట్‌ శబ్ధం వినిపించింది. అడవి జంతువుల నుంచి సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు ఫైరింగ్‌ చేశారేమోనని అనుకున్నాం. కానీ ఆ శబ్ధం అంతటితో ఆగలేదు. కొనసాగుతూనే ఉంది. అప్పుడే ఘటన జరిగిన (ఏప్రిల్‌22) రోజు మధ్యాహ్నం 2.30 తర్వాత ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. టూరిస్టులను వారి ఐడీకార్డులను అడుగుతున్నారు. అనంతరం కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తున్నారు.మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్‌ చేస్తారా?బైసరీన్‌ గురించి మీకు తెలుసు కదా.పెద్ద మైదానం. ఎటు చూసినా ఓపెన్ స్పేస్. ఆ సమయంలో నేను, నాభర్త, నాకుమారుడికి (మూడేళ్లు) ఏ దిక్కు చూసినా తప్పించుకునే మార్గం కనిపించలేదు. వెంటనే అక్కడే ఉన్న ఓ కశ్మీర్‌ టెంట్ వెనక దాక్కున్నాం. మా ముందే ఓ ఉగ్రవాది ఓ టెంట్ లోపలికి వెళ్లాడు. టెంట్‌లోపల ఉన్న టూరిస్టులను బయటకు లాక్కొచ్చాడు. అతనితో ఏదో మాట్లాడాడు. అనంతరం, బాధితుడి తలపైకి గురి పెట్టి కాల్చి చంపాడు. అలా వరుసగా బాధితుల్ని కాల్చుతూ వస్తున్నాడు. మాముందే ఓ టూరిస్టుతో టెర్రరిస్టు మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్‌ చేస్తారా? అని అంటూ కాల్పులకు తెగబడ్డాడు.ఇదంతా చూస్తూ మేం భయంతో మేం దాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడే మా దగ్గరికి ఓ టెర్రరిస్టు వచ్చాడు. అప్పటికే నాభర్త ఆ టెర్రరిస్టును నా బిడ్డకు ఇంకా మూడేళ్లే దయచేసి నన్ను వదిలేయండి’అని వేడుకున్నాడు. కానీ ఉగ్రవాది కనికరించలేదు’ అని అన్నటి పర్యంతరమయ్యారు.

If Arjun Tendulkar Trains Under Yuvraj Will Become Next Gayle: Yograj Singh4
‘అలా చేస్తే అర్జున్‌ టెండుల్కర్‌ మరో క్రిస్‌గేల్‌ అవుతాడు’

తండ్రి దిగ్గజ క్రికెటర్‌.. అంతర్జాతీయ స్థాయిలో వంద శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు.. భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్న లెజెండ్‌.. కానీ ఆయన కుమారుడు మాత్రం క్రికెటర్‌గా తనకంటూ ‍ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు.ఆ తండ్రి స్పెషలిస్టు బ్యాటర్‌.. అయితే, కుమారుడు మాత్రం ఆల్‌రౌండర్‌. ఇప్పటికే ఆ తండ్రీకుమారులు ఎవరో అర్థమైపోయి ఉంటుంది...! అవును సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar)- అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar) గురించే ఈ పరిచయ వ్యాఖ్యాలు. సచిన్‌ తనయుడిగా మాత్రమే లోకానికి సుపరిచితమైన అర్జున్‌.. మేటి క్రికెటర్‌గా ఎదగాలంటే ఒక్కటే మార్గం ఉందంటున్నాడు యోగ్‌రాజ్‌ సింగ్‌.రాసి పెట్టుకోండి..‘‘అర్జున్‌ బౌలింగ్‌పై తక్కువగా బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి. సచిన్‌, యువరాజ్‌ సింగ్‌ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదైతే రాసి పెట్టుకోండి.. ఒకవేళ యువీ గనుక సచిన్‌ కుమారుడిని తన వద్దకు రప్పించుకుని.. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తే.. అర్జున్‌ మరో క్రిస్‌ గేల్‌ అవుతాడు.ఫాస్ట్‌ బౌలర్‌గా ఉన్న అర్జున్‌ ఒకవేళ తీవ్రంగా గాయపడితే కెరీర్‌కు ప్రమాదం. ముందుగా చెప్పినట్లు అర్జున్‌ ఒక్కసారి యువరాజ్‌ దగ్గర శిక్షణ తీసుకుంటే మాత్రం అతడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు’’ అని యోగ్‌రాజ్‌ సింగ్‌ క్రిక్‌నెక్ట్స్ తో పేర్కొన్నాడు. కాగా అర్జున్‌ ఒకప్పుడు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్లు యోగ్‌రాజ్‌ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కాగా 25 ఏళ్ల అర్జున్‌ టెండుల్కర్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ అయిన అతడు.. ఎడమచేతి వాటం బ్యాటర్‌. దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ఆడుతున్న ఈ ముంబై కుర్రాడు.. 2024-25 సీజన్‌లో పూర్తిగా నిరాశపరిచాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో రెండు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 40 పరుగులు చేశాడు. అదే విధంగా మూడు మ్యాచ్‌లలో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. ఇక రంజీ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 51 పరుగులు చేసిన అర్జున్‌.. బౌలర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడి పదహారు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం.ఇక దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 2024-25 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 21 పరుగులు చేసిన అర్జున్‌.. ఒక వికెట్‌ తీశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ జట్టుతో ఉన్నాడు. మెగా వేలం-2025లో అర్జున్‌ను ముంబై రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్‌ ఎవరో తెలుసా?

India Takes Big Steps Against Pak After Terror Attack5
ఇక భారత్‌ విడిచి వెళ్లాల్సిందే.. పాక్‌ పౌరులకు హెచ్చరిక

న్యూఢిల్లీ : భారత్‌లోని పాక్‌ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్‌ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడిని భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్‌ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్‌ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా గురువారం పాక్‌ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్‌ రద్దు చేసింది. వాటిలో వైద్య వీసాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీలకు వీసా సేవలను నిలిపివేసింది.కొద్ది సేపటిక్రితం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులకు చెల్లుబాటయ్యే అన్నీ వీసాలను ఏప్రిల్ 27 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్నీ వైద్య వీసాలు ఏప్రిల్ 29 మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. సవరించిన సమయపాలన ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని పాకిస్తానీలు వారి వీసాల గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలని పేర్కొంది.

Pahalgam Incident: Pak Counter Action On Indian Decisions6
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్‌

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్‌ విధిస్తున్న దౌత్యపరమైన ఆంక్షలకు పాకిస్తాన్‌ అల్లలాడిపోతోంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు దిగింది. పాక్‌ గగనతలం నుంచి వెళ్లే భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గురువారం పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాక్‌ విషయంలో భారత్‌ అనుసరిస్తున్న తీరుపై సమీక్ష ఈ భేటీలో సమీక్ష జరిపారు. పాక్‌ పౌరుల వీసా రద్దు చేయడం, దేశం విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలను పాక్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే.. కౌంటర్‌ చర్యలను ప్రకటించింది. భారత్‌లో జరిపే అన్ని వర్తకవ్యాపారాలను(మధ్యవర్తి దేశం ద్వారా జరిపే వ్యాపారలావాదేవీలను సైతం) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ సిబ్బందిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ పౌరులకు జారీ చేసే వీసాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడం కిందకే వస్తుందని పేర్కొంది. మరోవైపు సైన్యం సెలవులను రద్దు చేసిన పాక్‌ ప్రభుత్వం.. భారత్‌ గనుక యుద్ధానికి దిగితే ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భద్రతా కమిటీ భేటీలో కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పహల్గాం దాడిని ఖండించిన పాక్‌.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ‘‘భారత్‌లో జమ్ము కశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని’’ పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఓ లోకల్‌ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ‍వ్యాఖ్యానించారు.

World's 10 Most Powerful Armies, India in 4th Place7
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..

అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్(GFP Index) విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసేంది గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత, సాంకేతిక, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణకొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్.. నాల్గో స్థానాన్ని నిలబెట్టుకుంది. యూఎస్ఏ (పవర్‌ ఇండెక్స్ 0.0744)2,127,500 మంది సైనిక శక్తితో యూఎస్ఏ అగ్రస్థానంలో నిలిచింది. 13, 043 విమానాలు, 4, 640 యుద్ధ ట్యాంకుర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి.రష్యా (పవర్‌ ఇండెక్స్0.0788)అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రియెన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది.చైనా (పవర్‌ ఇండెక్స్ 0.0788)పవర్ ఇండెక్స్ పాయింట్లలో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా.. అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. చైనా సైనిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతని చూపెడు\తోంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కల్గిన దేశంగా చైనా ఉంది. చైనా 3,170,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలను కల్గి ఉంది.భారత్‌ ‍ (పవర్ ఇండెక్స్ పాయింట్లు 0.1184)ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటిగా ఉన్న భారత్,.. నాల్గో స్థానంలో ఉంది. 5,137,550 మంది సైన్యం, 2,229 యుద్ధ విమానాలు, 4, 201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ నాల్గో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కల్గిన భారత్.. ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దక్షిణకొరియా (పవర్‌ ఇండెక్స్ 0.1656)పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణాకొరియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 3,820,000 సైనిక సిబ్బంది, 1, 592 యుద్ధ విమానాలు, 2, 236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణకొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కల్గిన రక్షణ రంగంలో దక్షిణకొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సాన్నిహిత్య సంబంధాలు కూడా దక్షిణకొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తోంది,. ప్రధానంగా సరిహద్దుల్లో ఉత్తరకొరియాతో ఉన్న వైరంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులను దక్షిణకొరియా ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతోంది.యూకే (పవర్‌ ఇండెక్స్ 0.1785)పవర్ ఇండెక్స్ స్కోరులో యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ఆరోస్థానంలో ఉంది. 1,108,860 మంది సైనిక సిబ్బందితో పాటు 631 ఎయిర్ క్రాఫ్ట్ లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కల్గి ఉంది. పవర్ ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. నాటో సభ్యత్వం కల్గిన దేశాల్లో యూకే కీలక పాత్ర పోషిస్తోంది.ఫ్రాన్స్ (పవర్‌ ఇండెక్స్ 0.1878)అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ది ఏడో స్థానం. 376,000 మంది సైనికి శక్తి, 976 ఎయిర్ క్రాఫ్ట్ లు, 215 యుద్ధ ట్యాంకర్లను ఫ్రాన్స్ కల్గి ఉంది. నాటోతో పాటు, యూరోపియేన్ భద్రత విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తోంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కల్గి ఉంది. అధునాతమైన అణ్వాయుధాలను కల్గిన దేశంగా ఫ్రాన్స్ ఉంది.జపాన్ (పవర్‌ ఇండెక్స్ 0.1839)సైనిక శక్తిలో జపాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. 328,150 సైనిక శక్తి, 1, 443 ఎయిర్ క్రాఫ్ట్ లు, 521 యుద్ధ ట్యాంకర్లను జపాన్ కల్గి ఉంది. మిలటరీ విభాగంలో సాంకేతికపరంగా అడ్వాన్స్ డ్ గా ఉ‍న్న దేశం జపాన్. త్యున్నత సైనిక శిక్షణ కల్గిన దేశంగా జపాన్ కొనసాగుతోంది. ప్రధానంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది.టర్కీ (పవర్‌ ఇండెక్స్ 0.1902)టర్కీది తొమ్మిదో స్థానం. 883,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కల్గి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాల్లో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోంది. ఎయిర్ ఫోర్స్, మిలటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది.ఇటలీ (పవర్‌ ఇండెక్స్ 0.2164)అత్యంత బలమైన సైనిక శక్తి కల్గిన దేశాల టాప్ 10 జాబితాలో ఇటలీది పదో స్థానం. 280,000 సైనిక శక్తిని ఇటలీ కల్గి ఉంది. 729 ఎయిర్ క్రాఫ్ట్ లు, 200 యుద్ధ ట్యాంక్లరు ఇటలీ కల్గి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తూ ఉంది.పవర్‌ ఇండెక్స్‌ లెక్క ఇలా..పవర్‌ ఇండెక్స్‌ స్కోరును లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్‌ ఉండి, అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే, ఆ దేశం మొత్తం స్కోరులో వెనకంజలో ఉంటుంది. ఇక్కడ సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా లెక్కించి ఒక అంచనా వేస్తారు. పవర్‌ ఇండెక్స్‌ స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్ధం. .

After Vincy Aloshious another actor accuses Shine Tom Chacko8
దసరా విలన్‌పై మరో నటి ఆరోపణలు.. సెట్‌లో చాలా అసభ్యంగా!

దసరా విలన్ షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఇటీవల ఆయనపై నటి విన్సీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారని చాకో ఉంటున్న హోటల్‌పై రైడ్ చేశారు. ‍అయితే పోలీసులకు రాకముందే హోటల్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా రోజుకో వివాదంతో టామ్ చాకో పేరు మాలీవుడ్‌లో హాట్ ‍టాపిక్‌గా మారింది. విన్సీ ఆరోపణలపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై విచారణ ‍కొనసాగుతున్న వేళ.. మరో నటి టామ్ చాకోపై విమర్శలు చేసింది. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళ నటి అపర్ణా జాన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ చాకో ప్రవర్తించిన తీరుపై మాట్లాడింది. విన్సీ అలోషియస్ చేసిన ఆరోపణలు వందశాతం నిజమేనని మద్దతుగా నిలిచింది. షైన్ టామ్ చాకో సినిమా సెట్స్‌లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చింది. సెట్‌లో మహిళకు మానసిక క్షోభ కలిగించేలా షైన్ ప్రవర్తించాడని పేర్కొంది. అతను మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తెల్లటి పొడి రాలుతుండేదని.. అది మాదకద్రవ్యమో? కాదో తనకు తెలియదని అపర్ణ చెప్పింది. అతని మాటలన్నీ డబుల్ మీనింగ్‌ అర్థం వచ్చేలా ఉంటాయని తెలిపింది.(ఇది చదవండి: దసరా నటుడు అరెస్ట్‌)కాగా.. ఇటీవల నటి విన్సీ ఆరోపణల తర్వాత చాకోను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. విన్సీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, అతనిపై డ్రగ్ ఆరోపణలు రావడంతో చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టామ్ చాకో చివరిసారిగా అజిత్ కుమార్‌ నటించిన గుడ్ బ్యాడ్‌ ‍అగ్లీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. తెలుగులో దసరా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Modi Pays Tribute To Pahalgam Victims In Bihar Public Meeting9
‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’

పాట్నా: జమ్మూకశ్మీర్‌ పహల్గాం (Pahalgam terror attack) ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఉగ్రవాదులకు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులు సప్తసముద్రాల అవతల దాక్కున్నా సరే వెతికి మరి మట్టిలో కలిపేస్తాం. 140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాదుల్నే కాదు వారిని పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుంది’ అని హెచ్చరించారు. ప్రధాని మోదీ గురువారం బీహార్‌లో (Bihar)పర్యటించారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా బీహార్‌ రాష్ట్రం మధుబని నగరంలో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలను బలోపేతం చేసేందుకు వీలుగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.13,480 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సభలో మాట్లాడానికి ముందు పహల్గాం బాధితులకు రెండు నిమిషాల కళ్లు మూసుకుని శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు.#WATCH | On Pahalgam terror attack, PM Modi says, "Today, on the soil of Bihar, I say to the whole world, India will identify, trace and punish every terrorist and their backers. We will pursue them to the ends of the Earth. India's spirit will never be broken by terrorism.… pic.twitter.com/8SPHOAJIi2— ANI (@ANI) April 24, 2025 ‘పహల్గాం ఉగ్ర దాడిలో అమాయకులు చనిపోయారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం. టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్తాం. ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం, ఆగ్రహం ఉన్నాయి. ఈ దాడి కేవలం అమాయక పర్యాటకులపై మాత్రమే కాదు. భారత దేశ ఆత్మపై దాడి జరిగింది. దాడి చేసిన ఉగ్రవాదులు, దానికి కుట్ర పన్నిన వారికి మనం విధించే శిక్ష వారి ఊహకి కూడా అందదు. జమ్మూకశ్మీర్‌లోనే కాదు దేశంలో ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకు సమయం ఆసన్నమైంది.140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుందన్నారు. సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరేఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నేను ప్రపంచం మొత్తానికి హామీ ఇస్తున్నా. భారత్‌ ప్రతి ఉగ్రవాదిని, వారికి వెనక ఎవరు ఉన్నా సరే వారిని గుర్తిస్తుంది. శిక్షిస్తుంది. ఉగ్రవాదులు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే వెంబడించి మరి మట్టిలో కలిపేస్తాం. ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు. ఉగ్రవాదానికి తప్పక శిక్ష పడుతుంది. న్యాయం జరిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంకల్పంలో మొత్తం దేశం దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉన్నారు. ఈ సమయంలో మనతో పాటు నిలిచిన ప్రపంచ దేశాల ప్రజలకు, వారి నాయకులకు నా కృతజ్ఞతలు’అని అన్నారు.

Pakistani High Commission in Delhi celebrating With Cake10
పాకిస్తాన్‌ అధికారుల ఓవరాక్షన్‌.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్‌ సంబరాలు?

సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్‌ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్‌ హైకమిషన్‌ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్‌ కట్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్‌ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌లోకి అక్కడ పనిచేసే ఓ కేక్‌ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్‌ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్‌ ప్రతినిధులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.This footage shows someone delivering a cake to the Pakistani High Commission in Delhi.What Pakistan’s high commission is celebrating?? TERRORISTS! pic.twitter.com/3lGnIRPcnz— BALA (@erbmjha) April 24, 2025మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్‌ హైకమిషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. #WATCH | During the BJP protest against Pakistan following the Pahalgam terror attack, BJP MLA Satish Upadhyay says, "There is anger in the hearts of people of India. Pakistan could not tolerate how Kashmir joined the mainstream...Yesterday, the Modi government conducted a… pic.twitter.com/Dk61hNA5VM— ANI (@ANI) April 24, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తానీ పౌరులు వెంటనే భారత్‌ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. వారంతా అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.VIDEO | Amritsar, Punjab: Pakistani national reach Attari-Wagah border to return to their country after India suspended the SAARC visa exemption scheme (SVES) asking Pakistani citizens in India under SVES visa to leave the country within 48 hours. The decision was taken the… pic.twitter.com/0CVYTaJcBU— Press Trust of India (@PTI_News) April 24, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement