
అకాల వర్షం.. ఆగమాగం
నల్లగొండ, గుర్రంపోడు, పెద్దవూర: జిల్లా కేంద్రంతోపాటు గుర్రంపోడు, పెద్దవూర తదితర మండలాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కుసింది. నల్లగొండ పట్టణంలో గంటపాటు ఈదురు గాలులు వీచడంతో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి పట్టణమంతా అంధకారమైంది. రామగిరి, గడియారం ప్రాంతం, పానగల్ రోడ్డు, వన్‌టౌన్, టూటౌన్ ప్రాంతాల్లో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. గుర్రంపోడు మండలంలో చామలేడు, కొప్పోలు, పిట్టలగూడెం, కోయగూరవానిబావి గ్రామాల్లో వడగండ్ల వానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి వరద నీట కొట్టుకుపోయింది. ఆమలూరులో మేకలను కాస్తున్న కాపరి మేకల రాములు(60)పై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బ్రాహ్మణగూడెం గ్రామంలో మేడ చంద్రయ్య ఇంటి రేకుల పైకప్పు లేచిపోయింది. పిట్టలగూడెంలో కేసాని అనంతరెడ్డి సొరకాయ పందిరి సాగు దెబ్బతిన 50 టన్నుల పంటకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. అలాగే పెద్దవూర మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షంతో తమ ధాన్యం తడిసిందని చాలా మంది కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు టార్పాలిన్‌లు పంపిణీ చేయకపోవడంతోనే ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు.
ఫ నల్లగొండ, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో గాలివాన బీభత్సం
ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఫ నష్టం వాటిల్లిందని రైతుల ఆవేదన

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం