
కోవై యువతికి, నెదర్లాండ్ యువకుడితో పెళ్లి
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి. మనసులు కలవడానికి భాషా, సంస్కృతులు అడ్డంకులు కాబోవని చాటింది. తాను ఇష్టపడిని పరదేశీయుడిని పెద్దల అనుమతితో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. వీరి ప్రేమపెళ్లిని అందరూ మెచ్చుకుంటూ, శుభాకాంక్షలు చెబుతున్నారు.
సేలం : కోవైకు చెందిన మహిళ నెదర్లాండ్ దేశానికి చెందిన తన ప్రియుడిని కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకుంది. కోవై జిల్లా పెరియ నాయకన్ పాలయానికి చెందిన ప్రమీలా.. నెదర్లాండ్ ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. అక్కడ ఒక టీవీ ఛానల్‌లో పని చేస్తున్న స్టీన్‌హీస్ అనే యువకుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
కొన్ని రోజులకు అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. ఆ మేరకు ఇరు కుటుంబీకుల సమ్మతితో ప్రమీలాకు, నెదర్లాండ్ యువకుడికి కోవైలో తమిళ సాంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది.
நெதர்லாந்து நாட்டு இளைஞரை காதலித்து தமிழ் பாரம்பரியப்படி தாலி கட்டி கரம் பிடித்த தமிழ் பெண்..#Coimbatore | #Netherland | #marriage | #TamilCulture pic.twitter.com/QPzEn6aPCY
— Polimer News (@polimernews) January 20, 2025
video credit To Polimer News
చదవండి: పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ!