
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. మంటలు భారీగా చెలరేగడంతో 13 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపులోనికి తీసుకువచ్చాయి.
ఈ ఘటన గ్వాలియర్‌లోని బహోదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో విజయ్ అలియాస్ బంటీ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు దీనిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.
అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే విజయ్, అతని కూతుళ్లు అన్షిక అలియాస్ మినీ (15), యాషిక అలియాస్ జీసస్ (14) సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగిన భవనంలో కింది అంతస్తులో ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉంది. దీంతో వారు ఇంటిలో నుంచి బయటకు రాలేకపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపుచేసింది. ఈ భవనపు కింది భాగంలో డ్రై ఫ్రూట్స్ దుకాణం, రెండవ అంతస్తులో ఒక గొడౌన్ ఉంది.