
న్యూఢిల్లీ: నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను(Eid celebrations) అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. వివిధ మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ, వేడుకలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ మొదలైన గుణాల స్ఫూర్తిని పెంపొందించాలి. మీరు చేసే అన్ని మంచి ప్రయత్నాలలో విజయం దక్కాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్’ అని రాశారు. పవిత్ర రంజాన్ మాసం(holy month of Ramadan) ముగిసిన అనంతరం ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో సోమవారం ఈద్ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ సమాజంలో సద్భావన, సామాజిక సామరస్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తెలియజేసింది. ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకాశంలో ఈద్-ఉల్-ఫితర్ చంద్రుడు కనిపించాడు. దీనితో పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. అనంతరం నేడు (సోమవారం) దేశవ్యాప్తంగా ఈద్ జరుపుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Eid al-Fitr: ఢిల్లీ నుంచి ముంబై వరకూ.. అంతటా ఈద్ సందడి