
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఏప్రిల్ 11న ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన వారణాసిని సందర్శించనున్నారు. ఈ సందర్భంలో ఆయన ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే రూ. 3880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టులలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు పథకాలు ఉన్నాయి.
వీటిలో 130 తాగునీటి ప్రాజెక్టులు, 100 నూతన అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పిండ్రాలో ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి పోలీస్ లైన్స్‌లో ఒక ట్రాన్సిట్ హాస్టల్, రామ్‌నగర్‌లో పోలీస్ బ్యారక్‌లు, నాలుగు గ్రామీణ రహదారులను(Rural roads) ప్రారంభించనున్నారు. శాస్త్రి ఘాట్, సమ్నే ఘాట్‌లను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇదేవిధంగా వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ (వీడీఏ) చేపట్టిన వివిధ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. తరువాత రెండున్నర గంటల పాటు అక్కడే ఉంటారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000 మంది పోలీసులను మోహరించారు. మోదీ రాక సందర్భంగా జరిగే బహిరంగ సభలో 50 వేల మందికి పైగా జనం పాల్గొనే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Mahavir Jayanti: 10 బోధనలు.. ప్రశాంతతకు సోపానాలు