Top Stories
ప్రధాన వార్తలు

‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
తాడేపల్లి,సాక్షి: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఓటు వేసిన విషయం తెలిసిందే. మైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. గతంలోనే వక్ఫ్ సవరణ బిల్లుపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టడంతో లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఓటేశారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం’ అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వైఎస్సార్సీపీ పేర్కొంది.కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా, తాజాగా వైఎస్సార్ సీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అందుకే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13,14,25,26లను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చటం వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమే. ఈ నిర్ణయం వక్ఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తోందని వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. YSRCP has filed a petition in the Supreme Court challenging the Waqf Bill, citing serious constitutional violations and failure to address the concerns of the Muslim community.The Bill violates Articles 13, 14, 25, and 26 of the Constitution—provisions that guarantee…— YSR Congress Party (@YSRCParty) April 14, 2025

కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు135వ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ హర్యానా రాష్ట్రం, యమునా నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పాలనని ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజల ఆందోళనతో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్ భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదంప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చింది. ఈ తరుణంలో కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ స్పందించారు.

జగన్ విజన్ బాబు తలకెక్కిందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు అసలు విజనరీ ఎవరో అర్థమై ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ఒకే ఒక్క మంచి పనితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూరదృష్టి, దార్శనికత ఏమిటో తెలిసి వచ్చి ఉంటుంది. బాబు ఇటీవల వెళ్లిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి.. పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేయడం, చూసిన తరువాత కూడా బాబుకు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటన్న ఆత్మవిమర్శ చేసుకోకపోతే దానికి ఆయనే బాధ్యుడు అవుతాడు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణలపై ఇప్పటివరకూ చంద్రబాబు ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక లేదా టీవీ ఛానల్లో రాసిన పచ్చి అబద్దాల వార్తలు మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఉంటారు. ఇంతకాలం తాను చేసిందేమిటన్న స్పృహ ఆయనకు వచ్చి ఉంటే మంచిదే. జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేశారు. స్కూల్స్‌లో బల్లల మొదలు, టాయిలెట్ల వరకు, పిల్లల డ్రెస్ మొదలు, వారు తినే ఆహార పదార్ధాల వరకు జగన్ పర్యవేక్షించేవారు. పిల్లలకు పోషకాహారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.అంతకుముందు చంద్రబాబు 2014 హయాం వరకు పాడైపోయి ఉన్న స్కూళ్లను ఒక విప్లవం మాదిరి జగన్ దశల వారీగా బాగు చేయించారు. ప్రభుత్వ స్కూళ్లు అంటే నరకప్రాయం అన్న అభిప్రాయాన్ని తొలగించి, వాటిని ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చి దిద్దారంటే అతిశయోక్తి కాదు. తాగునీటి సదుపాయంతోపాటు, స్కూల్ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పాఠ్య పుస్తకాలు రెండు భాషల్లో (ఇంగ్లీషు, తెలుగు)నూ చదువుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ స్థాయి ఐబీ కోర్సు, టోఫెల్ వంటి పరీక్షలకు మూడో తరగతి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్దులంతా జగన్ మామ అని పిలుచుకునేవారు.అన్నింటినీ మించి పిల్లలు స్కూళ్లు మానివేయకుండా అమ్మ ఒడి అనే స్కీమ్ ను తెచ్చి విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చేశారు. ఇంత చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుండేది. కానీ, ఎన్నికల నాటికి వాస్తవం తెలుసుకుని విద్యార్ధి ప్రతీ ఒక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు వంటివారు ఎక్కాలు చదివినట్లు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని మరిచారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. జగన్ సంస్కరణలు తీసుకు వస్తే వాటికి వ్యతిరేకంగా టీచర్లను టీడీసీ నేతలు రెచ్చగొట్టారు. మెగా డీఎస్సీ నిర్వహించి స్కూళ్లలో టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రచారం చేశారు.ఇన్ని హామీలు ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా ఉన్న ఐబీ సిలబస్ ఎత్తివేసింది. పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ఉందో, లేదో తెలియదు. టోఫెల్ కోచింగ్ రద్దు చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే మంత్రి అయినా విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా మారే పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే బహుశా ఆయన ఆశ్చర్యపోయి ఉండాలి. గతంలో ఆంగ్ల మీడియంను ఆయనతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యతిరేకించే వారు. చంద్రబాబుకు ఆ పిల్లలలో ఉన్న బలమైన ఆకాంక్ష ఏమిటో అర్థమై ఉండాలి.విద్యార్ధులు వారు చేస్తున్న ప్రయోగాల గురించి ఇంగ్లీష్‌లో వివరిస్తుంటే, బాబు గారు మధ్య, మధ్యలో ఎక్కువ భాగం తెలుగులోనే మాట్లాడారు. ఒక బాలిక ‘‘కలర్‌పుల్ గుడ్ మార్నింగ్’’ అని అన్నప్పుడు అలా ఎందుకు అన్నావు అని ప్రశ్నించి, ఇన్నోవేటివ్‌గా మాట్లాడావు కాబట్టి ఆకర్షించావు అని సీఎం వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన కేవలం ఆ బాలిక మాటలకే కాదు. మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు కూడా ఆకర్షితులై మరో బాలుడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అన్నప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని జవాబు ఇచ్చాడు. దానికి ఏమి చదవాలని అడిగితే ఇంగ్లీష్ అని చెప్పేసరికి చంద్రబాబు అవాక్కై ఉండాలి. కొంతకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో ఒక స్కూల్ ను సందర్శించి ప్రైవేటు స్కూళ్ల మాదిరి సదుపాయాలు ఉన్నాయని ప్రశంసించారు. మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వాస్తవ పరిస్థితి గమనించి ఒకింత ఆశ్చర్యపడిన వీడియోలు గతంలో వచ్చాయి.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చూశారు. అయినా వారిలో అహం దెబ్బతింటుంది కనుక, జగన్ పాలనలో జరిగిన ఈ మార్పులను అంగీకరించడానికి మనసు అంగీకరించదు. అంతేకాక చంద్రబాబుకు ప్రభుత్వ స్కూళ్లపై అంత నమ్మకం ఉన్న మనిషి కాదని అంటారు. కొందరు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఆయన ఆప్త మిత్రుడు. అలాంటి వారిలో ఒకరైన నారాయణ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి. అయినా ఫర్వాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ స్కూళ్లను పాడు చేయకుండా వాటిని జగన్ టైమ్ నాటి ప్రమాణాలతో కొనసాగిస్తే మంచిదే. కాని పలు స్కూళ్లలో పారిశుద్ధ్యం కొరవడిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గతంలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రత్యేక సిబ్బంది లేకపోవడమే. విద్యా రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యథావిధిగా కొనసాగించితే ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలకు న్యాయం చేసినట్లవుతుంది. జగన్ ఫోబియాతో బాధపడుతున్న వారికి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. చంద్రబాబు స్కూల్‌కు రావడం సంతోషంగా ఉందని ఒక బాలిక అంది. ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆ బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట.అంటే ఏదో మర్యాద కోసం అలా మాట్లాడిందే తప్ప ఇంకొకటి కాదేమో అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అదే జగన్ సీఎం హోదాలో వచ్చి ఉంటే తాము సంతోషానికి ఆ బాలికలు వంద కారణాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్కూల్‌కు వచ్చినా, రాకపోయినా పెద్దగా తేడా లేదన్న భావన ఉండవచ్చు. ఎందుకంటే వారేమీ తమ హయాంలో స్కూళ్లను ఇలా మెరుగు పరచలేదు కనుక. జగన్ మంచి చదువే పేద పిల్లలకు ఇచ్చే సంపద అని పలుమార్లు చెప్పేవారు. అదే చంద్రబాబు మాత్రం విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్నారు. తన మనుమడు దేవాన్శ్‌ను మంచి ప్రైవేటు స్కూల్లో చదివిస్తుండవచ్చు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలను కూడా అదే తరహాలో భావించి మంచి విద్య ఇవ్వడానికి యత్నిస్తే పేరు వస్తుంది. ఏది ఏమైనా విద్యకు సంబంధించి జగన్ విజన్ ను చంద్రబాబు అంగీకరించక తప్పదు కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం.. సన్‌రైజర్స్ టీమ్‌కు తప్పిన ముప్పు
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుకుంది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇదే హోటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేస్తోంది. ఈ ప్రమాద సమయంలో ఎస్ఆర్హెచ్ టీమ్ సభ్యులు హోటల్లోనే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లిపోయారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ కు చేరుకుని పొగలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 17న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ టీమ్ సోమవారం సాయంత్రం ముంబైకి బయలు దేరాల్సి ఉంది. కానీ అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాస్త ముందుగానే ఎస్ఆర్హెచ్ టీమ్ చెక్ అవుట్ చేసింది.ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్ టీమ్ కాస్త తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. అయితే ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై మాత్రం రికార్డు విజయాన్ని ఎస్ఆర్హెచ్ అందుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(141) భారీ సెంచరీతో చెలరేగాడు.

2014-19 మధ్య కాలంలో మీరు సంతోషంగా ఉన్నారా.. సంతోషంగా ఉన్నారా?
గుంటూరు,సాక్షి: అంబేద్కర్ జయంతి సభలో సీఎం చంద్రబాబు తడబడ్డారు. 2014-2019లో ప్రజలు ఆనందంగా కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా? , ఉన్నాయా? అని నొక్కి నొక్కి సభ సాక్షిగా అడిగారు చంద్రబాబు. అది తన హయాం అనే విషయం మర్చిపోయిన చంద్రబాబు.. ఆ సమయంలో ఎవ్వరూ సంతోషంగా లేరనే విషయాన్ని ఆయన తన నోటి వెంటే పలికారు.రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. నా చరిత్రలో ఎప్పుడు చూడని రాజకీయం 2014-2019లో చూశానని అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు వద్దకు వచ్చి ఆయన చెవిలో ఏదో గుసగుసలాడారు. అసలు విషయాన్ని ఆయన చెవిలో ఊదారు. వెంటనే తేరుకున్న చంద్రబాబు సారీ సారీ అంటూ తడబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ ఘటనతో బాబు.. తన పరిపాలనలో జనం సంతోషంగా లేరన్న విషయం తనే ఒప్పేసుకున్నట్లయింది. కొన్నిసార్లు మనం చేసిన తప్పుల్ని ఎంత దాచుదామనుకున్నా అది ఏదొక సమయంలో నోరూ జారుతూనే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది అని జనం ఆ నోట ఈ నోట అనేసుకుంటున్నారనుకోండి.

పళ్ల సెట్‌కి గుడ్‌బై చెప్పేయండి..! హాయిగా యథావిధిగా వచ్చేస్తాయట..!
మానవులకు చిన్నతనంలో పాలపళ్లు వచ్చి ఊడిపోతాయి. ఆ తర్వాత వచ్చేవి శాశ్వతంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. లేదంటే అంతే సంగతులు. అయితే తినే ఆహార పదార్ధాల వల్ల లేదా ఇతర అనారోగ్యాల కారణంగా దంతాలు ఊడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కాస్త డబ్బులుంటే కొత్త దంతాలు కట్టించుకోవడం వంటివి చేస్తారు. అయితే ఒరిజనల్ దంతాల మాదిరి అనుభూతిని మాత్రం అందివ్వవు. ఆ సమస్యకు తాజాగా శాస్త్రవేత్తలు చెక్‌పెట్టి ఓ అసాధారణ ఘనతకు శ్రీకారం చుట్టారు. ల్యాబ్‌లో కృత్రిమంగా దంతాలను పెంచి దంత వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఇక ఇన్నాళ్లు చేయించుకున్న ఇంప్లాంట్ ట్రీట్మెంట్లకు గుడ్‌బై చెప్పేయొచ్చని చెబుతున్నారు.లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకుల బృందం ఈ ఆవిష్కరణ చేసింది. దంతాల అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని సమర్థవంతంగా క్రియేట్ చేసి ఒక కణం, మరొక కణం కలిసి దంత కణంగా రూపాంతరం చెందిలే అభివృద్ధి చేశారు. అనేక జాతులు తమ దంతాలను పునరుత్పత్తి చేయగలిగినప్పటికీ..మానవులకు మాత్రం ఆ అవకాశం లేదు. ఇన్నాళ్లు దంతాల సమస్యతో బాధపడుతున్నవారు లేదా దంతాలను కోల్పోయినా.. దంతాలను ఇంప్లాంటు చేయించుకునేవారు. అయితే ఇవి ఒరిజనల్ దంతాల మాదిరి సౌలభ్యాన్ని అందించలేకపోయేవి. ఇప్పుడు ఈ ఆవిష్కరణతో ఆ సమస్యకు చెక్‌పెట్టినట్లయింది. దంతాల సమస్యతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను అందించింది. ఈ బయోమెటీరియల్స్ కణాలు సహజ దంతాల మాదిరిగా విధులను నిర్వర్తించేలా దంతాల ఆకృతిని ఇంజనీర్ చేస్తుంది. పునరుత్పత్తి అయిన ఈ దంత మొత్తం దంతాన్ని అభివృద్ధిచేస్తుందట. దంతాల నష్టంతో బాధపడే లక్షలాదిమందికి ఆ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందట. ఈ మేరకు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ..జీవసంబంధమైన రీతీలోనే దంతం భర్తీ చేయాలన్న లక్ష్యం నెరవేరింది. తాము అభివృద్ధి చేసిన ఈ దంతాలు దవడలో కలిసిపోతాయి, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా బలంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇక్కడ ల్యాబ్‌లో పెంచిన దంతాలను నోటిలో కూడా పెంచడం అనేదానిపై మన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అయితే వైద్యలు మాత్రం పోయిన పంటి స్థానంలో దంత కణాలు మార్పిడి చేసి పెంచుతామని చెబుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమవ్వడానికి సమయం పట్టినా..దంత సంరక్షణలో అత్యాధునిక విధానంగా చెప్పొచ్చని అన్నారు పరిశోధకులు. (చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..)

చైనాలో యాపిల్ ఉత్పత్తికి కారణం ఇదే: టిక్ కుక్
సుంకాల యుద్ధాన్ని ప్రారంభించిన సమయంలో.. అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' యాపిల్ సహా కంపెనీలు తమ ఉత్పత్తులను దేశంలో తయారు చేయాలని కోరుకున్నారు. కానీ నిపుణులు, పరిశ్రమ నాయకులు అమెరికాలో పెద్ద ఎత్తున ఉత్పత్తుల తయారీ సాధ్యం కాదని చెప్పారు.టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ 'టిమ్ కుక్' చైనాను తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ఎందుకు ఎంచుకుంటారనే దానిపై 2024లో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఒక నిమిషం కంటే తక్కువ నిడివి కలిగిన వీడియోలో టిమ్ కుక్.. చైనాలో కార్మికులు తక్కువ ధరకే లభిస్తారు. కార్మిక వ్యయాలు తక్కువగా ఉండటం వల్లనే.. దిగ్గజ కంపెనీలన్నీ చైనాలో ఉత్పత్తులు చేయడానికి ఆసక్తి చూపుతాయి. అంతే కాకుండా నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య కూడా చైనాలో చాల ఎక్కువగా ఉందని చెప్పారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..అమెరికాలో ఉన్న టూలింగ్ ఇంజనీర్లను మొత్తం సమావేశపరిచిన.. ఒక గది నిండదు. అదే చైనాలో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు ఒక పెద్ద ఫుట్‌బాల్ గ్రౌండ్ నిండేంతకంటే ఎక్కువ ఉన్నారని టిమ్ కుక్ వివరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నారు.Tim Cook breaks down why Apple builds in China and why the U.S. isn’t ready to replace it yet.pic.twitter.com/OiEpyIEZlN— Nigel D'Souza (@Nigel__DSouza) April 11, 2025

అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ!
మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి రాకపోతే సహించేదే లేదని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తమకిచ్చే గౌరవం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి, పార్టీలో ఉండి పార్టీని కాపాడుకున్న తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని ఆయన చెప్పుకొచ్చారు.వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లంటే..!వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకి మంత్రి పదవులు ఇస్తారా అని ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే చేసినవే అంటూ విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒకానిక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ చుక్కెదురు కావడంతో తిరికి సొంత గూటికే చేరిన రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ప్రేమ్ సాగర్ వ్యాఖ్యానించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్ లో మరింత అలజడి రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ప్రతిపక్షాల పార్టీలు కౌంటర్లు వేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయ్యింది. మంత్రి పదవుల పంచాయితీ మొదటికొచ్చిందా?తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు పూర్తయినప్పటికీ తమకు పదవి కావాలంటే తమకు కావాలంటూ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాస్త సస్సెన్స్ నెలకింది. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు.తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకని జానారెడ్డి అన్నట్లు వార్తలు రావడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎందుకు పదవులు ఉండకూడదని ప్రశ్నించారు. తమ శక్తి సామర్థ్యాలను బట్టే మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గిచూపుతోందని, ఇక్కడ కొంతమంది తమ పలుకుబడితో ఆ పదవిని రాకుండా అడ్డుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా పదవి ఇవ్వకపోతే అమీతుమీ తేల్చుకుంటాననే సంకేతాలు పంపడంతో అధిష్టానానికి మళ్లీ పదవుల పంచాయితీ తలనొప్పి షురూ అయ్యింది. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పంచాయితీ మళ్లీ మొదటికి రావడంతో అధిష్టానం మరోసారి చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు.

అంబేద్కర్ జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పరిపాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎప్పుడూ పని చేస్తాం. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు.

ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్' విలన్
రణ్‌దీప్ హుడా (Randeep Hooda).. సినిమా అంటే ఎంత పిచ్చో మాటల్లో చెప్పలేదు. చేతల్లో చూపించాడు. సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు. తన శరీరాన్ని నచ్చినట్లుగా మార్చేస్తాడు. సర్‌బిజత్ సినిమా కోసం నెల రోజుల్లోనే 18 కిలోలు తగ్గిపోయాడు. గతేడాది వచ్చిన స్వతంత్ర వీర్ సావర్కర్ కోసం ఏకంగా 30 కిలోలకు పైనే తగ్గిపోయాడు. ఇందుకోసం తిండిమానేసి కడుపు కాల్చుకున్నాడు. జాట్ మూవీతో ఫుల్ క్రేజ్ఈ సినిమా కోసం పైసాపైసా కూడబెట్టి కొన్న రెండు,మూడు ప్లాట్లను అమ్మేశాడు. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నష్టాల్ని మిగిల్చింది. తాజాగా ఇతడు జాట్ సినిమాతో పలకరించాడు. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ సినిమాలో సన్నీడియోల్ హీరోగా, రణ్‌దీప్ విలన్‌గా నటించారు. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. కలెక్షన్స్ మాట పక్కనపెడితే విలన్‌గా రణ్‌దీప్‌కు మాత్రం మరింత గుర్తింపు తీసుకొచ్చింది.ఆ సినిమాకు నేను హీరో..తాజాగా అతడు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని తల్చుకుని బాధపడ్డాడు. రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ.. ఆలియా భట్ (Alia Bhatt)తో కలిసి నేను హైవే సినిమా చేశాను. కానీ ప్రమోషన్స్‌లో నా స్థానంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఉన్నాడు. రణ్‌బీర్- ఆలియా ప్రమోషన్స్ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే ఆయనకు నా సినిమాతో ఏం పని? హైవేలో నేను హీరో. మరి ప్రమోషన్స్‌లో తనెందుకు ఉన్నాడో అర్థం కాలేదు. సరే, పోనీ.. కనీసం ప్రమోషన్స్‌కు నన్నైనా పిలవాలి కదా.. పిలవలేదు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో నాకు సపోర్ట్‌గా నిలబడి ప్రమోషన్స్‌కు పిలిచుంటే అది నా కెరీర్‌కు సాయపడేదేమో!లవ్ జర్నీ..బహుశా.. హైవే ప్రమోషన్స్ అప్పుడే రణ్‌బీర్, ఆలియా ప్రేమలో పడ్డారేమో! నా సినిమా వల్ల వారిద్దరి మనసులు దగ్గరయ్యాయంటే అది నాకు సంతోషమే! కానీ నన్ను పట్టించుకుంటే బాగుండేదనిపించింది. అయితే వారి ప్రమోషన్స్‌తో సినిమాకు పెద్దగా హైప్ రాకపోవడంతో రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు నన్ను ప్రమోషన్స్‌కు పిలిచారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత
హిట్ హీరో.. ఫ్లాపుల డైరెక్టర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లో లేఆప్స్?
షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్‌గా, సాంప్రదాయంగా
కాకరేపుతున్న కామెంట్స్.. ఈటల వార్నింగ్!
ఆరేళ్లుగా వెండితెరకు దూరం.. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న నటాషా!
రోహిత్ శర్మ మాస్టర్ మైండ్.. డగౌట్ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్‌మ్యాన్
తమిళ పొన్నులా జాన్వీ కపూర్.. వజ్రాల హారంతో అనసూయ
కొత్త క్యాంపెయిన్ ప్రారంభించిన భీమ్
ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి?.. సలహా కోరిన అమితాబ్ బచ్చన్
గోవుల మృతిపై చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన కౌంటర్
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
తిరుమలలో మరో అపచారం
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
పెద్ది ఫైట్
వారెవ్వా కరుణ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీశాడు
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అంతరిక్షం నుంచి అందాల భారతం
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
సాక్షి కార్టూన్ 13-04-2025
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
జగన్ విజన్ బాబు తలకెక్కిందా?
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
అక్టోబరులో ఆన్ డ్యూటీ
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్‌కు బ్రేక్!
ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
బీఆర్ఎస్ సభకు అనుమతి
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్?
బేబీ.. ఇలా అయితే కష్టమే!
భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
హిట్ హీరో.. ఫ్లాపుల డైరెక్టర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లో లేఆప్స్?
షిర్డీని దర్శించుకున్న నీతా అంబానీ : సింపుల్‌గా, సాంప్రదాయంగా
కాకరేపుతున్న కామెంట్స్.. ఈటల వార్నింగ్!
ఆరేళ్లుగా వెండితెరకు దూరం.. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న నటాషా!
రోహిత్ శర్మ మాస్టర్ మైండ్.. డగౌట్ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్‌మ్యాన్
తమిళ పొన్నులా జాన్వీ కపూర్.. వజ్రాల హారంతో అనసూయ
కొత్త క్యాంపెయిన్ ప్రారంభించిన భీమ్
ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి?.. సలహా కోరిన అమితాబ్ బచ్చన్
గోవుల మృతిపై చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన కౌంటర్
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
తిరుమలలో మరో అపచారం
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
పెద్ది ఫైట్
వారెవ్వా కరుణ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీశాడు
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అంతరిక్షం నుంచి అందాల భారతం
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
సాక్షి కార్టూన్ 13-04-2025
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
జగన్ విజన్ బాబు తలకెక్కిందా?
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
అక్టోబరులో ఆన్ డ్యూటీ
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్‌కు బ్రేక్!
ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
బీఆర్ఎస్ సభకు అనుమతి
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్?
బేబీ.. ఇలా అయితే కష్టమే!
భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
సినిమా

చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara Movie). శ్రీలీల హీరోయిన్. కొత్త దర్శకుడు భాను భోగవరపు తీస్తున్నాడు. లెక్క ప్రకారం మేలో రిలీజ్ అనుకున్నారు కానీ ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తొలి పాట రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)'తూ మేరా లవర్' అంటూ సాగే ఈ పాటని దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాయిస్ తో కంపోజ్ చేయడం విశేషం. 'ఇడియట్'లోని ఫేమస్ స్టెప్పులు మళ్లీ రవితేజనే వేసి ఆకట్టుకున్నాడు. శ్రీలీల(Sreeleela) కూడా గత చిత్రాలతో పోలిస్తే హాట్ గా ఉంది. భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది.అయితే అతియాశెట్టి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు.సునీల్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'ఇటీవల తాతగా మారడం నాకు వర్ణించలేని అనుభూతి. ఇది ప్రపంచం ఇచ్చే స్వచ్ఛమైన ఆనందం. నేను దశాబ్దాలుగా వ్యాపారాలు నడుపుతున్నా. సినిమాలు చేస్తున్నా. నా జీవితంలో అర్ధవంతమైన పనిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా. ఈ విషయంలో నేను గర్వపడుతున్నా. కానీ నేను నా మనవరాలిని పట్టుకున్నప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు నా మనస్సు మంగుళూరులోని నా చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చింది. చెప్పులు లేకుండా పరిగెత్తడం, బహిరంగ మైదానంలో ఆడుకోవడం, ప్రేమ తప్ప మరేమీ లేకుండా చేసిన తాజా భోజనం తినడం నిజమైన ఆనందాన్ని ఇచ్చిందని' రాసుకొచ్చారు. నా కుమార్తె అతియా శెట్టి తల్లి కావడం చూస్తుంటే తన మనసుకు చాలా ప్రశాంతంగా ఉందని ఒక తండ్రిగా గర్వంగా కూడా ఉందని పోస్ట్ చేశారు. కాగా.. అతియా శెట్టికి మార్చి 24న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితేఇంకా పాప పేరును ప్రకటించలేదు.

చిన్న కారులో వచ్చి నివాళులు.. విజయ్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా!
తమిళ హీరో విజయ్ (Vijay) 'జననాయగన్' మూవీతో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నాడు. ఓ పక్క ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటూనే అటు రాజకీయ నాయకుడిగానూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు. నేడు (ఏప్రిల్ 14) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు.సింపుల్‌గా..ఎటువంటి ఆడంబరం లేకుండా చిన్న కారులో నుంచి దిగి రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నాడు. కారు దగ్గరే చెప్పులు వదిలేసి చేతిలో పూలతో నడుచుకుంటూ వెళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని పూలతో అలంకరించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మందీమార్బలం లేకుండా, ఎటువంటి హడావుడి చేయకుండా తన పనేదో తను చేసుకుపోయిన విజయ్ వ్యవహార తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా హీరో అంత సింపుల్‌గా ఎవరూ ఉండరని కామెంట్లు చేస్తున్నారు.సినిమావిజయ్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా ద గోట్ (The Greatest of All Time)సినిమాలో నటించాడు. ప్రస్తుతం జననాయగన్ మూవీ చేస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. శృతి హాసన్ అతిథి పాత్రలో కనిపించనుంది. ఇది భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. భగవంత్ కేసరిలో శ్రీలీల పోషించిన పాత్రను తమిళంలో మమిత బైజు చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. Exclusive Hd Video Is Here🔥#TheGreatestOfAllTime#JanaNayagan @actorvijay pic.twitter.com/sZnR8VZSQW— Mᴜʜɪʟツ𝕏 (@MuhilThalaiva) April 14, 2025 చదవండి: ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్' విలన్

నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం
సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్. అందుకే పలువురు నెటిజన్లు.. హీరోహీరోయిన్లపై అప్పుడప్పుడు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని సదరు నటీనటులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చేస్తుంటారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఇప్పుడు ఓ కుర్రాడికి అలానే కౌంటర్ ఇచ్చింది.ఏం జరిగిందంటే?నిధి అగర్వాల్ గురించి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దీనికి స్పందించిన ఓ నెటిజన్ ఈమెని శ్రీలల(Sreeleela) పోలుస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి ఏం చేసింది? ఎన్ని మూవీస్ చేసింది? అని అన్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఈ ట్వీట్ పై స్వయంగా స్పందించిన నిధి అగర్వాల్.. సదరు నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. 'ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది. తమిళంలో మూడు మూవీస్ చేసింది. హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)కి సంతకం చేసింది. మంచి స్క్రిప్ట్ లు అనుకున్న వాటికే సంతకం చేస్తున్నా. అందుకు టైమ్ తీసుకుంటున్నాను. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పయి ఉండొచ్చు. కానీ మంచి సినిమాలు చేయాలనేది నా అభిప్రాయం. వరసగా సినిమాలు చేయాలనే తొందరేం లేదు. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. కాబట్టి బ్రదర్.. నా గురించి నువ్వేం బాధపడకు' అని చెప్పుకొచ్చింది.నిధి అగర్వాల్ బాగానే కౌంటర్ చేసింది. కానీ సదరు నెటిజన్ అన్నదాంట్లోనూ కాస్త నిజముంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తప్పితే నిధి అగర్వాల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీ లేదు. పవన్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్(The Raja Saab Movie) చేసింది గానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అటు శ్రీలీల కూడా సినిమాలైతే చేస్తోంది గానీ దాదాపు ఫ్లాప్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం
క్రీడలు

IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గత మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గైక్వాడ్ గైర్హాజరీలో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్ మొత్తంలో ధోనినే సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.సీఎస్కే యాజమాన్యం తాజాగా రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ముంబై చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేను జట్టులోకి తీసుకుంది. రుతురాజ్ ప్రత్యామ్నాం కోసం సీఎస్కే మేనేజ్మెంట్ మాత్రేతో పాటు పృథ్వీ షా (ముంబై), ఉర్విల్ పటేల్ (గుజరాత్), సల్మాన్ నిజర్ (కేరళ) పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి మాత్రేకే ఓటు వేసింది. మాత్రేను సీఎస్కే 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. మాత్రే ఈ సీజన్ మెగా వేలంలో పోటీపడినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. మాత్రేపై సీఎస్కే మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా ఎందుకో మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. గతేడాది సీఎస్కే మాత్రేను ట్రయల్స్‌కు కూడా పిలిపించుకుంది.మాత్రేను వీలైనంత త్వరగా జట్టులో చేరాలని సీఎస్కే మేనేజ్మెంట్ కబురు పెట్టినట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ కోసం సీఎస్కే ప్రస్తుతం లక్నోలో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 20న సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి రావచ్చు.కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేకు ముంబై క్రికెటింగ్ సర్కిల్స్‌లో మంచి గుర్తింపు ఉంది. మాత్రే ముంబై తరఫున అతి తక్కువ మ్యాచ్‌లు ఆడినా టాలెంటెడ్ ఆటగాడిగా పేరు గడించాడు. మాత్రే 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 504 పరుగులు చేశాడు. 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. గతేడాది అక్టోబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మాత్రే అతి తక్కువ కాలంలోనే టీమిండియా మెటీరియల్‌గా ముద్ర వేసుకున్నాడు.

DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో అత్యంత అరుదైన హ్యాట్రిక్ రనౌట్స్ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.లీగ్ ఆరంభ సీజన్లో (2008) ఓ సారి ఒకే ఓవర్లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.నిన్నటి మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మొహిత్ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.నేటికి అది రికార్డే2008 సీజన్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ మ్యాచ్‌లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు.

కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. 19వ ఓవర్ చివరి మూడు బంతులకు ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. కీలకమైన మూడు వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇలాంటి విజయాలు. కరుణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో మ్యాచ్ చేయి దాటిపోతున్నట్లు అనిపించింది. అయినా మేము గెలుపుపై ఆశలు వదులు కోలేదు. పోటీలో ఉండేందుకు ఒకరినొకరం ఉత్తేజపరచుకున్నాము. ఒకర్రెండు వికెట్లు ఆటను మాకు అనుకూలంగా మారుస్తాయని తెలుసు. గతంలో నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.కర్ణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌండరీల పరిధి 60 మీటర్లలోపు ఉన్నప్పుడు బంతిని టాస్ వేయాలంటే చాలా సాహసం కావాలి. కర్ణ్ శర్మ అలా చేసి సక్సెస్ సాధించాడు. అందరం తలో చేయి వేసి మా అవకాశాలను నిలుపుకోగలిగాము. బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పందిస్తూ.. ఆటగాళ్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. వీలైనన్ని బంతులు ఎదుర్కొంటేనే అది జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మంచు తీవ్ర ప్రభావం చూపింది. కొత్త బంతితో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి విజయాలు జట్టు గతిని మారుస్తాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ.. కరుణ్ పోరాటం వృధా.. సీజన్లో తొలి ఓటమి
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ నాలుగు వరుస విజయాల తర్వాత తొలి ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ గెలవాల్సి ఉండింది. అయితే 19వ ఓవర్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది. సింగిల్స్ తీసినా గెలిచే మ్యాచ్‌లో ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు డబుల్స్ కోసం ప్రయత్నించి రనౌటయ్యారు. 19వ ఓవర్లో హై డ్రామా నడిచింది. నాలుగో బంతికి రనౌట్ కాకముందు అశుతోష్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించాడు. అయితే అతను లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆతర్వాతి బంతికి కుల్దీప్ కూడా అనవసరమైన రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. చివరి బంతికి మోహిత్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. సాంట్నర్ డైరెక్ట్ హిట్‌తో అతన్ని కూడా రనౌట్ చేశాడు. దీంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే పరాజయంపాలైంది. ముంబై నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి పటిష్ట పునాది వేశాడు. ఓ దశలో (11.3 ఓవర్లలో 135/2) ఢిల్లీ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే కరుణ్ ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 10.1 ఓవర్లలో 119 పరుగులు జోడించారు. 119 పరుగుల వద్ద పోరెల్, 135 పరుగుల వద్ద (11.4వ ఓవర్) కరుణ్ నాయర్ వికెట్ వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పతనం మొదలైంది. కేఎల్ రాహుల్‌ను (15) కర్ణ్ శర్మ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు (క్యాచ్ అండ్ బౌల్డ్). ఆ తర్వాత అక్షర్ పటేల్‌ను (9) బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్‌ను (1) కర్ణ్ శర్మ ఔట్ చేశారు. తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17), కుల్దీప్ (1), మోహిత్ శర్మ (0) రనౌట్ కాగా.. మరో హిట్టర్ విప్రాజ్ నిగమ్‌ను (14) సాంట్నర్ స్టంపౌట్ చేశాడు. అంతకుముందు ముంబై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓటమి పట్ల విచారం వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని బాధ పడ్డాడు. మిడిలార్డర్లో కొన్ని చెత్త షాట్లు కొంపముంచాయని అన్నాడు. మంచు కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపాడు. కుల్దీప్, కరుణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
బిజినెస్

త్వరలో వాహనదారులకు ఊరట కలిగించే పాలసీ
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై అధిక టోల్ ఛార్జీల నుంచి లక్షలాది మంది వాహనదారులకు ఉపశమనం కలిగించే కొత్త టోల్ పాలసీ త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. రెండున్నర లేన్లుగా ఉన్న ఇరుకైన జాతీయ రహదారులపై యూజర్ ఫీజు రద్దు, కార్ల అపరిమిత ప్రయాణానికి రూ .3,000 వార్షిక పాస్.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ చేసిన ఈ రెండు ప్రతిపాదనలు ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి.ఈ ప్రతిపాదనలకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే వీటి వల్ల ఖజానా కొంతమేర నష్టం కలుగనున్న నేపథ్యంలో వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగ పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. వార్షిక పాసులవల్ల టోల్ ఆదాయానికి కొంతమేర గండి పడనున్నప్పటికీ, ఇరుకైన రహదారులపై యూజర్ ఫీజు వసూలును నిలిపివేయడం వల్ల మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని భావిస్తున్నారు.ప్రైవేటు వాహనాలకు వార్షిక, జీవితకాల పాస్ ఆప్షన్‌ను అందించే ప్రణాళిక గురించి రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెప్పారు. దీనిపట్ల వాహన యజమానులలో విశేష స్పందన ఉన్న నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ దీనిపై ఎక్కువ దృష్టి పెట్టింది. 2024-25లో మొత్తం టోల్ ఆదాయం రూ.61,000 కోట్లలో ప్రైవేటు కార్ల వాటా 20-21 శాతంగా ఉంది. 79-80% రుసుములో ఎక్కువ భాగం వాణిజ్య , భారీ వాహనాల నుండి వస్తోంది.

విజేతలుండని యుద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇతర దేశాల సహకారం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్నేయాసియాలో పర్యటనలో భాగంగా సోమవారం వియత్నాం వెళ్లిన ఆయన వాణిజ్య, సుంకాల యుద్ధంలో విజేతలుండరని వ్యాఖ్యానించారు.ప్రపంచంలోనే భారీగా ఎగుమతులు చేస్తున్న దేశాల సరసన ఉన్న చైనాకు ట్రంప్ సుంకాల ప్రభావం అధికంగా ఉంటుంది. తాజాగా ట్రంప్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయించినప్పటికీ, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాపై సుంకాలు తీవ్ర పరిణామాలను చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్ చైనాపై 145% సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చైనా కూడా వెనక్కి తగ్గకుండా యూఎస్‌పై 125 శాతం సుంకాలు ప్రకటించింది.సూపర్ పవర్‌గా చైనాఈ నేపథ్యంలో ఆగ్నేయాసియాలోని వియత్నాంలో షీ జిన్‌పింగ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. వియత్నాంపై కూడా యూఎస్ అధిక సుంకాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ‘ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రపంచంపై అమలు చేస్తున్న విధానానికి విరుద్ధంగా బాధ్యతాయుతమైన సూపర్ పవర్‌గా చైనా అవతరిస్తుంది’ అని సింగపూర్‌కు చెందిన ఐఎస్ఈఏఎస్-యూసోఫ్ ఇషాక్ ఇన్స్టిట్యూట్ విజిటింగ్ ఫెలో గుయెన్ ఖాక్ గియాంగ్ అన్నారు.వాణిజ్య విధానాలు కాపాడుకోవాలి..ఎగుమతులపై అమెరికా వాణిజ్య విధానాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాల సహకారాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. వియత్నాం, చైనా అధికారిక మీడియాలో సంయుక్తంగా ప్రచురితమైన సంపాదకీయంలో షీ జిన్‌పింగ్ ‘వాణిజ్య యుద్ధం లేదా సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు’ అని రాశారు. ఇరు దేశాలు బహుళ వాణిజ్య వ్యవస్థను, స్థిరమైన ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలుసులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు వియత్నాంలోనే జిన్‌పింగ్ ఉండనున్నారు.ఇదీ చదవండి: మా దగ్గర ఉంది.. మీకు ఇస్తామండి..ఎలా తప్పించుకోవాలి..జిన్‌పింగ్ పర్యటనను టారిఫ్‌ల ప్రకటన కంటే ముందుగానే ప్లాన్ చేసినప్పటికీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా మధ్య సుంకాల పోరు కారణంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. జిన్‌పింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా పర్యటన ట్రంప్ నుంచి చైనా ఎలా తప్పించుకోగలుగుతుందనే అంశంపైనే సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013లో జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వియత్నాంలో కేవలం రెండుసార్లు మాత్రమే పర్యటించారు. 2023 డిసెంబర్లో చివరిసారిగా సందర్శించిన ఆయన వియత్నాంకు వెళ్లడం ఇది మూడోసారి.

రూ.1,000 కోట్లు టార్గెట్.. హైదరాబాద్‌లో తయారీ కేంద్రం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ఉత్పత్తుల సంస్థ ‘మివి’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) రూ.1,000 ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించడం, కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యూహాల అమలు ద్వారా దీన్ని సాధించనున్నట్టు మివి సహ వ్యవస్థాపకులు మిధుల దేవభక్తుని, విశ్వనాథ్ కందుల ప్రకటించారు.ఈ సంస్థ 2024–25లో రూ.300 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 1,500 మందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికల గురించి ఓ వార్తా సంస్థతో సహ వ్యవస్థాకులు వివరాలు పంచుకున్నారు. ఐవోటీ డివైజ్‌లు, స్మార్ట్ వేరబుల్స్, స్మార్ట్ సీసీటీవీ కెమెరాలు, స్పీకర్లలోని ప్రవేశించనున్నట్టు చెప్పారు. అలాగే, ప్రస్తుత ఆడియో, మొబైల్ యాక్సెసరీల కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. ఇయర్ బడ్స్‌ను విడుదల చేయడం ద్వారా తొలుత ఇయర్ఫోన్లలోకి ప్రవేశించనున్నట్టు మిధుల ప్రకటించారు.ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘మివి ఏఐ’ని కంపెనీ ఇటీవలే ఆవిష్కరించడం గమనార్హం. తన ఉత్పత్తులకు ఏఐ టెక్నాలజీని జోడించడం ద్వారా కస్టమర్లకు మెరుగైన అనుభవం ఇచ్చే లక్ష్యంతో ఉంది. ఈ ఏఐ ప్లాట్‌ఫామ్ సాయంతో తమ ఆదాయాలను రెట్టింపు చేసుకోనున్నట్టు కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రజల నుంచి నిధులు (ఐపీవో) సమీకరించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంలో కార్యకలాపాలు...హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న తయారీ కేంద్రం జూన్ నాటికి కార్యకలాపాలు మొదలు పెడుతుందని మివి ప్రమోటర్లు ప్రకటించారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ సదుపాయం ద్వారా విడిభాగాల తయారీపై దృష్టి సారిస్తామని, అంతర్జాతీయ బ్రాండ్లతో భాగస్వామ్యాలను కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. యూఎస్, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలోకి విస్తరించనున్నట్టు చెప్పారు.

మా దగ్గర ఉంది.. మీకు ఇస్తామండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన వద్ద ఉన్న మిగులును కేంద్రానికి బదిలీ చేయడం పరిపాటిగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వానికి భారీగానే ఆర్బీఐ డివిడెండ్ రూపంలో ముట్టజెప్పిందని ఆర్థికవేత్తలు తెలుపుతున్నారు. గడిచిన ఏడాదిలో ఆర్బీఐ కేంద్రానికి ఇచ్చిన మొత్తం ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది రికార్డు చెల్లింపులతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలోనూ అంతకుమించి సుమారు రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు ఆర్బీఐకి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మార్గాలేమిటో తెలుసుకుందాం. లిక్విడిటీ ఆపరేషన్స్పెద్ద ఎత్తున లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా వచ్చే వడ్డీ రిజర్వ్ బ్యాంక్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్) కింద రెపో ఆపరేషన్ల ద్వారా బ్యాంకులకు నిధులు ఇస్తుంది. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను తాకట్టు పెట్టి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటాయి. ఆర్బీఐ ఈ రుణాలపై వడ్డీని సంపాదిస్తుంది. ఎల్ఏఎఫ్ మాదిరిగానే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) ద్వారా బ్యాంకులు ఆర్బీఐ నుంచి కొంచెం అధిక వడ్డీ రేటుతో అదనపు నిధులను పొందడానికి అనుమతిస్తుంది. లిక్విడిటీ నిర్వహణ కోసం ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయిస్తుంది. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) అంటారు. లిక్విడిటీ నియంత్రణ దీని ప్రాథమిక లక్ష్యం అయితే, ఈ లావాదేవీలు వడ్డీని సమకూరుస్తాయి.ఇదీ చదవండి: కళను దొంగలిస్తున్న ఏఐమితిమీరిన నగదు బదిలీతో నష్టాలేంటి..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ప్రభుత్వానికి మిగులు బదిలీ అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది.మిగులు బదిలీ కోసం ఆర్బీఐ తన ఆకస్మిక నిల్వలను(కంటింజెన్సీ రిజర్వులు) వాడుకునే ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక సంక్షోభాలకు సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.ప్రతిసారి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి మిగులు బదిలీ చేస్తుంటే కేంద్రం డిమాండ్‌కు ఆర్బీఐ ప్రభావితమవుతుందనే భావన కలుగుతుంది. ఇది దాని స్వయంప్రతిపత్తి, విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.మిగులు బదిలీలు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని అందించినప్పటికీ అవి స్థిరమైన ఆదాయ-ఉత్పాదక చర్యలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరుత్సాహపరుస్తాయి. ఇది దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లకు దారితీస్తుంది.ప్రభుత్వ వ్యయానికి అధికంగా నిధులు సమకూర్చడానికి నగదు బదిలీలను ఉపయోగిస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తుంది.
ఫ్యామిలీ

సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'.. ఆ వ్యాధులను నయం చేస్తుందట..!
ఉరుకుల పరుగుల జీవనంలో ఉల్లాసం కావాలి. వారంలో ఒక్కరోజైనా, ఒక్క పూటైనా ఒత్తిడి నుంచి విముక్తి కావాలి. అందుకే నగరవాసులు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలాల్లో ఇప్పుడు, ఆఫ్రికన్ డ్రమ్ అయిన జెంబే ఒకటిగా నిలిచింది. మ్యూజిక్ థెరపీలో భాగంగా దీనిని నగరవాసులు ఆస్వాదించడం పెరుగుతోంది. చక్కని సంగీతం వినడం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే సంగీత వాయిద్యాన్ని పలికించడం కూడా అంతకు మించిన ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని జెంబే (Djembe) నిరూపిస్తోంది. ఇప్పటికే ముంబై వంటి నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా మాల్స్‌లో సర్వసాధారణంగా జెంబే సంగీత కార్యక్రమం ఇప్పుడిప్పుడే హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ప్రాచుర్యం పెంచుకుంటోంది. డ్రమ్ మారో డ్రమ్.. సంగీత పరికరమైన డ్రమ్ – దాని అంతర్గత లయ స్వభావం కారణంగా – దానిని పలికించే వారికి ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గిటార్ లేదా హార్మోనికాతో పోలిస్తే సరళమైన సంగీత వాయిద్యం డ్రమ్స్. దీనిని పలికించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సైకోథెరపిస్ట్ నీతా మాట్లాడుతూ, ‘డ్రమ్ శిక్షణ స్ట్రోక్ పేషెంట్లకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపయుక్తం. నడక, చేయి నియంత్రణ ద్వారా వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారి కదలికల్లో ఖచ్చితత్వం, వేగం, సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది’ అంటున్నారు. ‘ఇది మెదడులో డోపమైన్ (Dopamine) స్థాయిలను పెంచుతుంది. అయితే అధికంగా డ్రమ్మింగ్ మీద ఆధారపడితే మాత్రం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు’ అని కూడా నీతా చెబుతున్నారు. ఒంటరిగా డ్రమ్మింగ్ (Drumming) చేయడం ఏకాగ్రతను పెంచుతుంది, లోతైన శ్వాస ద్వారా మెరుగైన ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సమన్వయ శక్తిని పెంచుతుంది. ప్రస్తుతంలో జీవించడం (మైండ్ ఫుల్ నెస్) సాధనలో సహాయపడుతుంది. స్నేహితులు లేదా ఇతరులతో కలిసి ప్లే చేయడం ఉత్తమ మార్గం. ఇందులో పాల్గొనేవారు అతని/ఆమె సౌలభ్యం, నైపుణ్యం ప్రకారం వాయిద్యాన్ని పలకిస్తారు కాబట్టి ఇది బంధాలను బలపరుస్తుంది, సహనాన్ని అలవరుస్తుంది. అపరిచితులను ఒకచోట చేర్చడం ద్వారా నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడే వ్యక్తులకు ఆ ఫీలింగ్ పోయేలా చేస్తుంది. ఆఫ్రికాలో సందేశాలు పంపే సంగీతం.. జెంబే పశ్చిమ ఆఫ్రికాలో, ముఖ్యంగా మాలి, గినియా ఐవరీ కోస్ట్ ప్రాంత మూలాలను కలిగి ఉంది. వివాహాలు, దీక్షా ఆచారాల వంటి ఉత్సవ సందర్భాల్లో ఈ డ్రమ్ వాయించడం సంప్రదాయం. వీటి ధ్వని మైళ్ల దూరం వినబడుతుందట. అందుకని, సుదూర ప్రాంతాల్లో ముఖ్యమైన సందేశాలను చేరవేయడానికి కూడా ఉపయోగిస్తారట. కాలక్రమేణా, జెంబే ఆఫ్రికా ను దాటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రాచుర్యం పొందిన వాయిద్యాల్లో జెంబే ఒకటి. గోబ్లెట్ ఆకారపు ఈ డ్రమ్ ఆఫ్రికాలోని డిజాలా/లెంకె చెట్టుకు చెందిన సింగిల్ పీస్ హార్డ్ వుడ్‌తో తయారవుతుంది. పైభాగం.. అంటే డ్రమ్‌హెడ్ గొర్రె/జంతు చర్మంతో రూపొందుతుంది. పెర్కుషన్ వాయిద్యం.. ఆరోగ్యమార్గం.. ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన జెంబే ఒక పెర్కుషన్ వాయిద్యం. జాజ్, తబలా మృదంగం పెర్కుషన్ రంగంలో బాగా తెలిసిన ఎంపికలు అయితే, జెంబే నన్ను ఆకర్షించింది. అప్పటికే దీనిలో రాణిస్తున్న ఓ దక్షిణాఫ్రికా స్నేహితుడి ప్రోద్బలంతో దీన్ని సాధన చేశాను. సంగీతంలో పీహెచ్డీ చేశాను. మన శరీరంలోని ఏడు చక్రాల ప్రాముఖ్యతను నేను గుర్తించాను. హైదరాబాద్ నగరంలో తొలిసారి జెంబే ద్వారా మ్యూజికల్ థెరపీని పరిచయం చేశాను. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడి నిర్వహణలోనూ ఉపకరిస్తుంది. లయ ఆనందం ద్వారా ప్రజలను కనెక్ట్ చేసే అద్భుతమైన వాయిద్యం జెంబే. అన్ని వయసుల వారికీ సంగీతం తాలూకు మ్యాజిక్‌ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొంతకాలంగా నగరంలోని పాఠశాలలు కళాశాలల్లో ప్రదర్శనలు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం. – సాయి కుమార్, ది జెంబే సర్కిల్ వ్యవస్థాపకుడు ఎవరికి నప్పదు.. అంటే.. పెద్దపెద్ద శబ్దాలకు వ్యతిరేకంగా స్పందించే స్వభావం కలిగినవారు.. అలాగే.. భుజం కీళ్లు, మోచేతులు లేదా మణికట్టుకు గాయాలు, లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి ఈ జెంబే నప్పదు. అలాగే కార్డియో యాక్టివిటీని తక్కువగా మాత్రమే చేయాలని వైద్య సలహా పొందిన వారు కూడా దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది. చదవండి: అక్కడ న్యూ ఇయర్‌కి శుభాకాంక్షలు చెప్పుకోరు..! ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వుతారు

సత్యాన్వేషణ
నీలోని ఆత్మ చైతన్యమే సత్యం. నేను వ్యక్తిని అనే భావన పూర్తిగా నీ మనస్సు కల్పితం. నీకు కనిపించే వ్యక్తులు, పాత్రలు, బంధాలు, సమాజం మొదలైనవన్నీ మనస్సు కల్పనలేగాని సత్యాలు కావు. భార్య, పిల్లలు, ఉద్యోగం, లక్ష్యాలు, అన్వేషణ మొదలైనవన్నీ నిజాలని నమ్ముతూ వాటిలో చిక్కుకొనిపోయి ఒక దుఃఖ ప్రపంచంలోకి వెళ్ళి పోతున్నాం. ఇవన్నీ అసత్యాలు కదా అని వీటిని వదిలేయటం కూడా పరిష్కారం కాదు. సత్యాన్ని తెలుసుకునే మార్గం, అనందాన్ని పొందే మార్గం ఉంది. నీనుండి విడివడలేనంత దగ్గరగా ఉంది. ప్రశాంతత, అనందం అనేవి నీ ఆత్మలోనే ఉన్నాయి. అవి దైవత్వ పరిమళాలు. ఇది బయటి ప్రపంచంలో కనిపించే ప్రశాంతత కాదు. అది అంతం లేనిది నీ అంతర్గత ప్రశాంతత. అది విషయ సంబంధమే కాదు. కాలానికి, స్థలానికి అతీతమైనది. ఆ నిగూఢమైన ప్రశాంతతే నీ ఆత్మ, నీ నిజతత్వం. నేను వ్యక్తిని అనే భావన పుట్టుకతో నీలో లేదు. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల, సమాజం వల్ల క్రమంగా నేను అనే భావనలో చిక్కుకుని కాలంతో కలిసిపోయాం. నీ నిజస్థితి దివ్యచైతన్య స్థితి. అద్వైతస్థితి. మాయవల్ల ఆ చైతన్యం నుండి విడివడి నేను శరీరాన్ని, మనస్సును అనే పరిమితిలో చిక్కుకుని పోయావు. నీ కలలో నీవు చిక్కుకు పోయావు. అసలు చైతన్యం అనేది ఒక వ్యక్తికి, ఒక రూపానికి పరిమితమైనదే కాదు. అది అనంతం, నిర్గుణం. అది దేనికీ అంటదు. కేవలం సాక్షితత్వమే ఉంటుంది. నేను అనే భావన క్రమంగా బలపడి ఇష్టాయిష్టాలతో, నమ్మకాలతో, కోరికలతో బందీ ఐపోతాము. నిజానికి అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. నేను సాక్షీ చైతన్యాన్ని అనే సత్యాన్ని తెలుసుకున్నపుడే ఈ దుఃఖ ప్రపంచం నుండి బయటపడగలవు.నీ మనస్సుకు కూడా మూలం ఆత్మనే. ఈ విషయ ప్రపంచం, ఈ భిన్నత్వం అంతా కూడా ఆత్మ నుంచి ఉద్భవించినవే. కానీ వీటిని ‘నేను’ అనుకుని ఒక పరిమితి కల్పించుకుని, విశ్వ చైతన్యం నుండి వేరుపడిపోయాము, నమ్మకాలను సృష్టించుకున్నాం. వ్యక్తి అనేవాడు కూడా దైవత్వ వ్యక్తీకరణే. విశ్వ చైతన్యంలో భాగమే. మాయవల్లనే నేను వేరు అనే భావన కల్పించుకొని, భద్రతను సృష్టించుకుని, అభద్రతను కూడా సృష్టించుకుని దుఃఖంలో ఉన్నాము. ఈ నాటకమంతా నీ సృష్టే. ఇందులోని పాత్రలన్నీ పరస్పర సంబంధమైనవే. సృష్టికర్త సృజనాత్మక వ్యక్తీకరణే ఈ నాటకం. ఆ రచయిత నీవే. అత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీవే ఆ దివ్యచైతన్యమని, సృష్టికర్తవని తెలుస్తుంది. వీటన్నింటికీ ఒక సాక్షిగా ఉంటావు, వేటికీ అంటకుండా.కలలో ఉన్నప్పుడు నీవు కలలో ఉన్నట్టు తెలియదు. కలలో గెంతుతాము, అరుస్తాము, భయపడతాము... ఇది కల అని తెలియగానే కల మాయమైపోతుంది. ఇప్పటి మన జీవితమంతా ఈ కలలాంటిదే. సత్యాన్ని తెలుసుకున్నపుడే ఈ కలలనుండి బయటపడతావు. ఎల్లప్పుడూ నీ నిజతత్వాన్ని తెలుసుకునే దిశగానే ప్రయాణించు. ఈ జీవితం నాటకమైనప్పటికీ ఇందులో జీవించడం అవసరం. శరీరం, మనస్సులకు సాక్షిగా ఉంటూ జీవించు. నీలోని ఆత్మచైతన్యం బలపడినప్పుడే ఈ కలల నుండి బయటపడతావు. మనస్సుకు స్వతహాగా బలం ఉండదు. అది నీ ఆత్మశక్తిని లాక్కుని జీవిస్తుంది. నీవు సాక్షిగా గమనించినప్పుడు అది బలహీనమైపోతుంది. నీలోని నమ్మకాలకు, కోరికలకు, సంవేదనలకు అన్నింటికీ సాక్షిగా ఉంటూపో! వేటితోనూ అంటకు.– స్వామి మైత్రేయ ఆధ్యాత్మిక బోధకులు

నీ భావికి విధాతవు నీవే..
వ్యక్తి ఆస్థిత్వాన్నీ, గుర్తింపును నిర్వచించేవాటిలో మొదటిది అతనికి తనపై తనకున్న అవగాహన. వర్తమానంలో తానే స్థితిలో ఉన్నాడు, భవిష్యత్తులో తాను చేరాలనుకునే ఉన్నత స్థానం ఏమిటి అన్నది స్థిరంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆవిధంగా తనను తాను ముందుగా అంచనా వేసుకోవడం ప్రతివారికీ అవసరం. స్వీయ పరిశీలన చేసుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం వ్యక్తి పురోగతి సాధించడంలో తీసుకోవవలసిన అత్యంత సమంజసమైన విధి.విద్యలోనూ, విషయగ్రాహ్యతలోనూ అంతగా రాణించే శక్తిలేని మనిషి, తాను ఎంత దృఢమైన రీతిలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని భావించినా, సాధారణ పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే, అతనికున్న మానసిక బలం, శారీరిక బలం కార్యసాధనకు సహకరించాలి కదా..!! అయితే, ఇది దుస్సాధ్యమైన విషయంగా పరిగణించ వలసిన పనిలేదు. మనం అనుకున్నదానికంటే, మన అవగాహన గుర్తించినదానికంటే, ఎంతో అధికమైన శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. కృతనిశ్చయంతో ‘‘నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలను’’ అని భావించి, ఉద్యమిస్తే, ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమైన విషయమేమీ కాదు. అంతే కాదు.. అదే కృషిని త్రికరణశుద్ధిగా కొనసాగిస్తే, ఉన్నతస్థానంలో నిలకడను సాధించి నిలబడ గలగడమూ కష్టమైన పనేమీ కాదు.స్వీయనియంత్రణ అనుకున్నప్పుడు ప్రతివ్యక్తీ తాను రోజుకు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం లేదుకదా..!! ఉన్నతలక్ష్యాలను నిర్దేశించుకున్నవ్యక్తి ఎటువంటి దురలవాట్లకూ బానిసకాకుండా ఉండడమూ స్వీయనియంత్రణలో అంతర్భాగమే..!!భరతజాతి ముద్దుబిడ్డల్లో ఒకరై ప్రకాశించిన రామకృష్ణ పరమహంస వ్యక్తిత్వవికాసానికి సంబంధించిన అంశాల్లో అందరికీ ప్రయోజనకరంగా భాసించేలా ప్రభోధించిన అద్భుతమైన వాక్యం ‘‘ముందుగా నిన్ను నీవు తెలుసుకో’’. భవిష్యత్తు బంగరుబాటకావాలంటే, ఎవరైనా సరే, ముందుగా తనలో ఉన్న లోపాలమీద, బలహీనతలమీద, చేసే తప్పులమీద దృష్టి పెట్టాలి. ఆ తప్పులను లేదా లోపాలను సరిదిద్దుకునే క్రమాన్ని గుర్తెరిగి, అత్యంత శీఘ్రంగా వాటిని తొలగించుకుని, అప్పుడు భావి కార్యాచరణకు నడుం బిగించాలి. తనను తాను సరిచేసుకుని ముందుకు సాగే విధానంలో సాధకుడు సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు యివ్వకూడదు. ప్రతిమనిషీ తన లక్ష్యాన్ని సాధించడానికి కొందరినుంచి స్ఫూర్తిని పొందుతూ ముందుకు సాగుతాడు. తనకు స్ఫూర్తిదాతయైన వ్యక్తి ఆధ్యాత్మికంగా శక్తిమంతుడు కావచ్చు, లేదా ఒక జనహితం కోసం కృషి చేసే నాయకుడో, సమాజ సేవకుడో లేక క్రీడాకారుడో కావచ్చు. అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్న వారో, తమ చేతల ద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి నుంచైనా స్ఫూర్తిని పొందవచ్చు. తాను పొందిన అమేయమైన స్ఫూర్తిని, అమలుపరచడంలో ఎడతెగని ఆర్తిని కనబరచి, త్రికరణశుద్ధిగా కృషి చేస్తే, భవిత సాధకునికి తప్పనిసరిగా దీప్తివంతమవుతుంది.తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతివ్యక్తీ స్వీయ క్రమశిక్షణ పాటించడం అత్యంత అవసరం. ఆత్మనియతితో తమపై తాము విధించుకుని అమలుపరచే జీవన విధానమే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి. జీవితంలో లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది ఓటమి పాలవ్వడం లేదా ఆశించిన గమ్యాన్ని అందుకోకపోవడానికి కారణం స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. జనించినప్పుడు జీవులందరూ ఒకేరకమైన రీతిలో జనించినా, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే అసాధారణమైన విజయాలను సాధించడానికి, తాము అనుకున్న ఎత్తుకు ఎదగడానికి కారణం వారు నిత్యమూ పాటించే స్వీయ నియంత్రణ లేక క్రమశిక్షణ అని చెప్పవచ్చు.– వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి

చాట్ జీపీటీ సాయంతో కేసు గెలిచాడు..!
సినిమాల్లో మాదిరి పంచ్ డైలాగ్స్తోనూ, నవ్వులు కురిపించే వాదనలతో కాదు. కేవలం, పదే పది నిమిషాల్లో సూటిగా సుత్తిలేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా, అసలు లానే చదవకుండా వాదించాడు ఈ లాయర్. ఆ లాయర్ పేరే ‘చాట్ జీపీటీ’. తాజాగా ఓ కుర్రాడు ఈ టెక్నాలజీ సాయంతోనే కోర్టులో తన కేసు గెలిచాడు. కేసు వాదనలు పట్టుమని పది నిమిషాల్లోనే పూర్తయిపోయాయి. వాయిదాల లాయర్ల మాదిరిగా కాకుండా, చాట్ జీపీటీ ఫటాఫట్ కేసు ముగించేసింది. కజక్స్తాన్లోని అల్మాటీ నగరానికి చెందిన కెంజెబెక్ ఇస్మాయిలోవ్ తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, బేస్‌లైన్ క్రాస్ చేసి, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించాడు. ఈ అపరాధానికి ప్రభుత్వం అతనికి పదకొండు డాలర్లు (అంటే రూ.940) జరిమానా విధించింది. పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడూ కోర్టుకు వెళ్లని ఇస్మాయిలోవ్కి కోర్టు పద్ధతులు తెలియవు. తన కేసును వాదించడానికి లాయర్ల సాయం తీసుకోకుండా, చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. అది అతనికి కోర్టులో సవాలు చేయమని సలహా ఇవ్వడమే కాదు, కేసు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసింది. పది నిమిషాల విచారణలో, జడ్జి అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ స్పీచ్ సింథసిస్ ఫీచర్ ద్వారా అతను సమాధానాలు ఇచ్చాడు. చాట్ జీపీటీ వాదన ఎంతో సమర్థంగా ఉండటంతో జడ్జి జరిమానాను రద్దు చేశారు. (చదవండి:
ఫొటోలు


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ (ఫోటోలు)


సింహాచలం : దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా? (ఫొటోలు)


హైదరాబాద్ : జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)


వెళ్లొస్తాం.. లింగమయ్యా ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


వైట్ డ్రెస్ లో ప్రణీత సుభాష్ అందాల మెరుపులు (ఫోటోలు)


హైదరాబాద్ లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో వడగండ్ల వాన బీభత్సం (ఫొటోలు)


రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


సోమాజిగూడ జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన ఇన్ఫ్లూయెన్సర్స్ (ఫొటోలు)


ఫిలిం ఫైనాన్షియర్ బంగారు బాబు కుమారుడి వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు (ఫోటోలు)
అంతర్జాతీయం

అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్ వాహనాలను చార్జ్ చేయడానికి సమానమైన విద్యుత్ కావాలని అంచనా. ఆన్లైన్ డేటాను రెప్పపాటులో ప్రాసెస్ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్లైన్లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్ రంగంలో ఇప్పటికే నంబర్‌వన్‌గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి... ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం. హువాయీ, టెన్సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్ టెక్నాలజీలో బీవైడీ టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్ పనిలో పడింది.ఇలా పని చేస్తుంది జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్ ద్వీపంలో ఝింగ్‌హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్‌హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే. అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్‌హువో రియాక్టర్లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.అత్యధిక ‘క్యూ వాల్యూ’ అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్ విద్యుత్ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం పేర్కొంది. మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్నాడ్ బేర్‌ట్రెండ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్

Jesus Nut: టెక్ సీఈవో ఫ్యామిలీ ప్రాణం తీసిన ‘జీసెస్ నట్’ కథ!
వాషింగ్టన్: జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ (agustin escobar) కుటుంబం మరణానికి ‘జీసెస్ నట్’ (jesus nut) కారణమైందని నిపుణులు భావిస్తున్నారు.గత గురువారం ఆగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, మెర్సి కాంప్రూబి మాంటాల్, వారి ముగ్గురు పిల్లలు (వయస్సు 4, 5, 11), పైలట్‌తో సహా సైట్ సీయింగ్ కోసం బయల్దేరారు. ఇందుకోసం బెల్ 206 అనే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను వినియోగించారు.అయితే, సీఈవో కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాల్ స్ట్రీట్ హెలిపోర్ట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. మన్‌హట్టన్ వినువీధిలో .. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దిశగా వెళ్లింది. ఆ సమయంలో గిరిగిరా తిరుగుతూ న్యూయార్క్ నగరంలోని ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ (miracle on the hudson) నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. పక్షి ఢీకొట్టడం వల్లే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని అందరూ భావించారు. హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగే సమయంలో స్థానికులు వీడియోలు తీశారు. ఆ వీడియోల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఘోరం జరిగే సమయంలో పక్షుల జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. పలు ఆధారాలు, ఏవియేషన్ రంగ నిపుణులు, ప్రమాదానికి ముందు జరిగిన నిర్లక్ష్యం ఆధారంగా బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ‘జీసెస్ నట్’ కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏంటి ‘జీసెస్ నట్’ జీసెస్ నట్ అనేది హెలికాప్టర్ మెయిన్ రోటర్ మాస్ట్‌పై(mast) అమర్చబడి ఉంటుంది. అంటే ఇది హెలికాప్టర్ రెక్కలు..హెలికాప్టర్ ఇంజిన్‌కు జాయింట్ చేసి ఉంటుంది. ఈ భాగం వద్ద జీసెస్ నట్ ఉంటుంది. అది ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా, ఊడినా హెలికాప్టర్ మొత్తం అదుపు తప్పుతుంది. ఆ నట్టు ఊడి పోతే హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడేయడం పైలెట్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని ఈ జీసెస్ నట్ ఊడిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్న న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్ఏఏ (fedaral viation Administration) విచారణను వేగవంతం చేసింది.‘జీసెస్ నట్’ అంటే ఏమిటి?.. చరిత్ర ఏం చెబుతోందిజీసెస్ నట్ అనే పదం వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైనికుల నోట తొలిసారి ఈ పదం వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1930, 1940లలో యుద్ధ సమయంలో అమెరికా నేవి ప్రత్యర్థుల్ని మట్టికరింపించేందుకు చిన్న ఎయిర్ క్ట్రాప్ట్లను భారీ సంఖ్యలో డిజైన్ చేయించింది. కాన్సాలిడేటెడ్ మోడల్ 28లో పీబీవై కాటలినా అనే ఎయిర్ క్ట్రాప్ట్లో తొలిసారి ఈ నట్టును వినియోగంలోకి తెచ్చారు. పైన చెప్పుకున్నట్లుగా ఈ నట్టు ఎయిర్ క్ట్రాప్ట్ రెక్కలకు, ఇంజిన్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. అయితే వియత్నంతో జరిగే యుద్ధంలో ఈ ఎయిర్ క్ట్రాఫ్ట్లో సైనికులు ప్రయాణిస్తుండగా ఎదైనా ప్రమాదం జరిగితే ఆ నట్టు బిగించిన రూటర్ మాస్ట్ ఊడిపోతే .. జీసెస్‌ను ప్రార్థించడం తప్ప ఏం చేయలేం అని అమెరికా సైనికులు అనేవారంటూ వీకీపీడియా సమాచారం చెబుతోంది.ప్రయాణానికి ముందే అంతేకాదు, ఈ తరహా జీసెస్ నట్ ఉన్న ఎయిర్క్రాప్ట్లలో ప్రయాణించే ముందు నట్టు సరిగ్గా ఉందా? లేదా? అని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాల్సి ఉంది. లేదంటే ప్రాణాలు గాల్లోనే కలిసి పోవడం ఖాయం. తాజాగా ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ నదిలో చోటు చేసుకున్న సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం హెలికాప్టర్ ప్రమాదం ఈ జీసెస్ నట్ పనితీరుపై దృష్టిసారించకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

సూడాన్‌లో మారణహోమం.. వందలాది మంది మృతి
కర్టోమ్: ఆఫ్రికా దేశం సూడాన్ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పౌరుల శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, సూడాన్‌లో మారణహోమం జరిగింది.వివరాల ప్రకారం.. పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్‌లో గత రెండు రోజులుగా పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దాడులు జరుపుతున్నాయి. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. జామ్జామ్‌లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. #Sudan 🇸🇩: a desperate situation is unfolding in #Darfur as the #RSF has overrun the Zamzam IDP camp near #ElFasher, leaving hundreds killed and forcing thousands to flee towards the besieged city.The city of El-Fasher is on the brink after a year of brutal siege. pic.twitter.com/NReidyJklJ— Thomas van Linge (@ThomasVLinge) April 12, 2025 ఇక, శనివారం అబూషాక్ శిబిరంపై దాడులు జరిపారు. ఇందులో 14 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ శిబిరంపై జరిగిన దాడిలో 40 మందికి పైగా మృతి చెందారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి బలగాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల సందర్భంగా భయంతో పౌరులు పరుగులు తీశారు. బతుకు జీవుడా అంటూ ప్రాణలు అరచేతిలో పట్టుకున్నారు. మరోవైపు.. దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు.. కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, 2023 ఏప్రిల్‌లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. Scenes of Mourning: Funeral Held for Victims of Zamzam Camp MassacreHeartbreaking scenes unfolded in Darfur as residents gathered to bury the martyrs of Zamzam displacement camp, following the brutal attack carried out by the UAE-backed Rapid Support Militia.The funeral… pic.twitter.com/gvd6sNQUEV— Sudanese Echo (@SudaneseEcho) April 12, 2025
జాతీయం

బూట్లలో 6.7 కేజీల బంగారం
ముంబై: రూ.6.3 కోట్ల విలువైన 6.7 కేజీల బంగారాన్ని బూట్లలో దాచి తరలిస్తున్న ప్రయాణికుడిని ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అరెస్టు చేసింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. శనివారం బ్యాంకాక్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడిని సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అడ్డుకున్నారు. పరిశీలించగా అతను ధరించిన బూట్లలో రూ.6.3 కోట్ల విలువైన 6.7 కిలోల బంగారు కడ్డీలు బయటపడ్డాయి. విచారణలో స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. అతన్ని కూడా డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు.

విద్యార్థులూ, జై శ్రీరామ్ అనండి
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి మరోసారి వివాదాస్పదమయ్యారు. మదురైలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన గవర్నర్.. ‘జై శ్రీరామ్’ నినాదం చేయాలంటూ విద్యార్థులను ఆదేశించారు. కంబ రామాయణం రాసిన ప్రాచీన కవిని సన్మానించే కార్యక్రమంలో భాగంగా ‘ఈ రోజున శ్రీరాముని భక్తుడైన వ్యక్తికి నివాళులు అర్పిద్దాం. నేను ‘జై శ్రీరామ్’ అంటాను. మీరూ చెప్పండి’ అంటూ విద్యార్థులకు సూచించారు. దీనిపై అధికార డీఎంకే, కాంగ్రెస్ గవర్నర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. డీఎంకే ఆయనను ఆరెస్సెస్ అధికార ప్రతినిధిగా అభివరి్ణంచింది. గవర్నర్ మత నాయకుడిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అసన్ మౌలానా విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ప్రచార మాస్టర్‌గా మారారని ఆరోపించారు.

భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
బెంగళూరు: భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. విడాకుల సంఖ్య కొంతకాలంగా క్రమంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రెండు దశాబ్దాలుగా 25–29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతోంది’’ అని నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ సమాచారాన్ని ఉటంకించారు. సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్పర్సన్ అయిన ఆమె ‘కుటుంబం: భారతీయ సమాజానికి పునాది’ పేరిట బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ‘పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులొస్తున్నాయి. విద్య, సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతం్రత్యాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికీ ఎనలేని సేవ చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. 40 శాతం పెళ్లిళ్లు విచ్చిన్నం కుటుంబ తగాదాల కేసులు పెరిగిపోతుండటం పట్ల జస్టిస్ నాగరత్న ఆవేనద వెలిబుచ్చారు. అందుకు మహిళలే కారణమన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. సమాజ ధోరణి మారకపోవడం వంటివే అందుకు ప్రధానంగా కారణమని అభిప్రాయపడ్డారు. ‘‘సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు మారనప్పుడే వైవాహిక వివాదాలు తలెత్తుతాయి. గత పదేళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం దాకా విచ్చిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్‌ఫాస్ట్ సరిగా చేయలేదనో, ఫంక్షన్‌కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు.ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలూ సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. ‘‘భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులూ ఒంటిచేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలూ మంచి వాతావరణంలో పెరుగుతారు’’ అంటూ హితవు పలికారు.

రెండ్రోజులు ఢిల్లీలో సీఎస్ మకాం
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎలా స్పందించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గత విచారణలో భాగంగా కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.అలాగే ఆ భూములను సందర్శించి ఈ నెల 16లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తోపాటు మరో 10 మంది అధికారులతో కలిసి శనివారం ఢిల్లీ చేరుకున్న సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు ఐదు గంటలపాటు అధికారులతో సమాలోచనలు చేశారు.సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా మరికొందరు న్యాయవాదులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలేమిటి? క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? ప్రభుత్వం నివేదిక సమర్పించాక న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది? వంటి విషయాలపై న్యాయవాదుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.
ఎన్ఆర్ఐ

అబుదాబిలో ఘనంగా ఉగాది వేడుకలు..
సనాతనం, సత్సంబంధం, సంఘటితం, సహకారం, సత్సంగం వంటి పంచ ప్రామాణికాలతో ప్రారంభించబడిన యు.ఏ.ఈ లోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్వ్యర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నారుప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ష సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆద్యంతం చక్కటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాజధాని అబుదాబిలో కన్నుల పండుగగా జరిగింది. దీపారాధన, విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారిచే పంచాంగ పఠనం, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల, సంగీత గురువులు రాగ మయూరి, ఇందిరా కొప్పర్తి గార్లు తమ శిష్య బృందంతో సంగీత, నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస మూర్తి గారు లాస్య వల్లరి, శివ తాండవ స్తోత్రం, ప్రముఖ తెలుగు కవులు ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి ఆర్ధ్వర్యంలో, శ్రీలక్ష్మి చావలి, వెంపటి సతీష్‌ల కవి సమ్మేళనం, భగవద్గీత, అన్నమాచర్య, రామదాసు కీర్తనలు, సుభాషితాలు, సాహిత్య కార్యక్రమాలతో గాయత్రీ కుటుంబానికి సంబంధించిన చిన్నారులు, పెద్దలు తమ అద్భుతమైన ప్రతిభతో పూర్తి తెలుగింటి సంప్రదాయాన్ని కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ రసజ్ఞులను సమ్మోహితులను చేశారు .ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి ఉషా బాల కౌతా గారు అందర్నీ ఆకట్టుకున్నారు. ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గాయత్రీ కుటుంబం ప్రధాన ఉద్దేశ్యాల గురించి వివరిస్తూ.. స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కుటుంబం అండదండగా నిలుస్తోంది. వారికి విద్య, వైద్య , వివాహం వంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకూ గాయత్రి కుటుంబ సభ్యులు సుమారు కోటిన్నర రూపాయల వరకు సహాయం అందించారని, భవిష్యత్తులో బ్రాహ్మణ సంక్షేమానికి మరింత సహకారం అందిస్తామని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు గాయత్రీ కుటుంబం సమైక్యతను అభినందిస్తూ..ఈ సమూహం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే "ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశ సంస్కృతిని గౌరవిస్తూనే బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. బ్రాహ్మణులు ధర్మ జీవనం, ధర్మ పరిరక్షణ వదిలిపెట్టవద్దని, ఎల్లప్పుడూ జ్ఞానార్జన చేస్తూ.. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నారు. పట్టుదల, దీక్ష, తపస్సు, సహనం, నియమ నిష్ఠలతో నిత్యం గాయత్రీదేవిని ఆరాధించి, బ్రాహ్మణత్వాన్ని పొందాలి అని పిలుపునిచ్చారుఈ మొత్తం కార్యక్రమానికి సంపంగి గ్రూపు పూర్తి సహకారాన్ని అందించినందుకు నిర్వాహకులు ఆ గ్రూపు పెద్దలను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి, తిరుమల శ్రీవారి తీర్ధ ప్రసాదాలతో పాటు, అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గాయత్రీ కార్యకారిణీ బృందం రాయసం శ్రీనివాసరావు, మోహన్ ముసునూరి, గడియారం శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ, వంశీ చాళ్లురి, రమేష్ సమర్ధవంతంగా నిర్వహించింది. (చదవండి: Ugadi 2025: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు..)

Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్‌సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్‌లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
క్రైమ్

క్షుద్ర పూజలు: దడపుట్టించిన నల్లకోడి, ఈకలు, జాకెట్టు
బాపట్ల: మార్టూరులో ఆదివారం ఉదయం క్షుద్ర పూజల ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నేతాజీ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లను గమనించిన స్థానికులు విలేకరులకు సమాచారం అందించారు. అక్కడ పరిశీలించిన విలేకరులకు ప్రత్యేకంగా కుంకుమ చల్లి దానిపై మహిళకు చెందిన జాకెట్టును పెట్టి ముగ్గు వేసి అందులో నిమ్మకాయలు, సమీపంలో మల్లెపూలు ఉంచి పూజలు చేసినట్లు కనిపించింది. దీని పక్కనే చిన్న సైజు నల్లకోడి పిల్లను కాల్చి దహనం చేసినట్లుగా చిన్నచిన్న ఎముకలతోపాటు కోడి ఈకలు కనిపించటం గమనార్హం. క్షుద్ర పూజలు చేసినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లను చూసి స్థానికులు భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో నలుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఓ కుటుంబానికి చెందిన ఫొటోను కుంకుమలో ఉంచి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు ఆ సంఘటనను ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. నేతాజీ కాలనీకి సమీపంలో జరుగుతున్న ఈ క్షుద్ర పూజల ప్రయత్నాలను అధికారులు అడ్డుకొనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్‌గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్‌బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. నోరు విప్పని పెద్ద కుమార్తె..సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేయడం, తల్లి ఫోన్‌కు వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్‌ను కట్ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతిఅన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్‌టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.

చనిపోయే ముందు మేము గుర్తుకు రాలేదా అమ్మ..!
కరీంనగర్: అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లయి ఎనిమిదేళ్లయినా అత్తింటివారి వేధింపులు ఆగలేదు. నాలుగేళ్లపాటు భర్త, అత్తామామ, బావ, మరిది వేధింపులు తట్టుకుంది. ఆర్నెళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ అయినా తీరు మారలేదు. చివరకు ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. ఫలితంగా ఆమె కుమారుడు (6), కూతురు (ఆర్నెళ్లు) తల్లిలేనివారయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై తహాసీనొదీ్దన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘనతో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. నాలుగేళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది. కూలీ పనులకు వెళ్లే మల్లేశ్‌కు అదనపు కట్నంపై ఆశపుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. దీనికి మల్లేశ్ తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, సోదరులు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో మేఘన భరించలేకపోయింది. విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు.ఆరు నెలల క్రితం పాప జననం..ఆర్నెళ్ల క్రితం మేఘన పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయి. భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు 10 రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే యశ్వంత్‌రావ్‌పేటకు వస్తానని, వచ్చాక పుట్టింటికి తీసుకొస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కదా బిడ్డా.. అంతలోనే ఇలా అయ్యిందా అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు మృతికి అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడే కారణమని రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు..వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

భర్తను హత్య చేసేందుకు 20 లక్షల సుపారీ..!
ఖమ్మంఅర్బన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేయించేందుకు ఐదుగురు కలిసి ప్రణాళిక రచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్‌గా రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) సీఐ భానుప్రకాష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండలం సువర్ణపూరానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాముతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి దంపతుల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. ఖమ్మంరూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్‌ను సంప్రదించి హత్య విషయమై వివరించాడు. వెంకట్ తన స్నేహితుడు, రౌడీషి టర్ అయిన పగడాల విజయ్‌కుమార్ అలియాస్ చంటిని పరిచయం చేశాడు. హత్యకు రూ.20 లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్తను కిడ్నాప్ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి రూ.1,50,000 నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. కాగా, సదరు వ్యక్తి ఏప్రిల్ 11న ఖమ్మంఅర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సువర్ణాపురానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ కొండూరి రామాంజనేయులు, దంతాల వెంకటనారాయణ (కారుడ్రైవర్, బారుగూడెం, ఖమ్మంరూరల్), పగాడాల విజయ్‌కుమార్ (చంటి – బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), వేముల కృష్ణ (బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), బుర్రి విజయ్ (డెకరేషన్ వర్కర్, బృందావన్‌కాలనీ పువ్వాడఅజయ్‌నగర్, ఖమ్మం) ఆదివారం నగర శివారులోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కత్తులు, ఒక ఎయిర్ గన్, రూ.90,000 నగదు, 5 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాష్ వివరించారు.
వీడియోలు


Vizag: మరో 24 గంటల్లో భార్య డెలివరీ... భార్యను హతమార్చిన భర్త


తన పాలనపై తానే విమర్శలు చేసుకున్న చంద్రబాబు


గోశాల గోవుల ఘటనపై బాబు వ్యాఖ్యలు భూమన కరుణాకర్ ఛాలెంజ్


హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆందోళన


చంద్రబాబుది ధృతరాష్ట్రుడి పాలన: గొల్లబాబు రావు


మంత్రివర్గంలో నాకు చోటు కల్పించాలి: ప్రేమ్ సాగర్ రావు


అద్భుతమైన లేజర్ వెపన్ ను అందుబాటులోకి తెచ్చిన DRDO


తాడేపల్లి YSRCP కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి


హైదరాబాద్ లోని పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం


కాకాణి అక్రమ కేసులపై గురుమూర్తి సీరియస్