బాహుబలి గని! | - | Sakshi
Sakshi News home page

బాహుబలి గని!

Published Sun, Jul 23 2023 12:32 AM | Last Updated on Sun, Jul 23 2023 12:17 PM

- - Sakshi

కరీంనగర్‌: రాబోయే రోజుల్లో వంద మిలి యన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా యాజ మాన్యం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రసుత్తం 78 మిలియన్‌ టన్నుల లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, రాబోయే రో జుల్లో మరో 22మిలియన్‌ టన్నులు పెంచేందు కు నిర్ణయించింది.

దీనిలో భాగంగా ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే మరో భా రీ ఓపెన్‌కాస్ట్‌ ఏర్పాటుకు వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగు గనులు కలిపి రామగుండం కోల్‌మైన్‌ పేరుతో కొత్త ఓసీపీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 633.45మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ ప్రాజెక్టు రెండేళ్లలో ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఆర్జీ–3ఏరియాకు అనుబంధంగా..

సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–3 ఏరియాకు అనుబంధంగా రామగుండం కోల్‌మైన్‌ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. భవిష్యత్‌లో అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టును కలుపుకుని ఆర్జీ–2 ఏరియాలోని వకీల్‌పల్లి గని, ఆర్జీ–3 ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌–1, 2, మూసివేసిన జీడీకే–10 గనిని కలుపుకుని మెగా ప్రా జెక్టు ఏర్పాటుకు సిద్ధమైంది.

ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ఆర్జీ–2, 3 జీఎంలతో ఎ ప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరుపుతున్నారు. రెండు ఏరియాల అధికారులతో కోఆర్డినేషన్‌ చేసుకుంటూ ప్రాజెక్టు పనులు సిద్ధం చేసేందుకు ప్రత్యేక అధికారిని యాజమాన్యం నియమించింది.

పెరుగనున్న బొగ్గు ఉత్పత్తి

రామగుండం కోల్‌మైన్‌ ప్రాజెక్టు ఏర్పాటుతో ఏ టా 10మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం విడివిడిగా ఉత్పత్తి కొనసాగిస్తున్నప్పటికీ కాలానుగుణంగా అన్ని గనులను ఒకే ఓసీపీ కిందకు తీసుకరానున్నారు. నూతన మెగా ఓసీపీ మూలంగా వకీల్‌పల్లి గనిని మరో రెండేళ్లలో మూసివేయనున్నారు. ఇప్పటికే మూ సివేసిన జీడీకే–10గనితో పాటు నాలుగు గనులను ఒకే ప్రాజెక్టు పరిధిలోకి తీసుకరానున్నారు.

దీనివల్ల సరిహద్దు సమస్య లేకుండా ఉండనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓసీపీ–2 ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, భూసేకరణ, ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్‌ మార్పు తదితర పనుల మూలంగా ఉత్పత్తి వెనకపడింది. ఇదే ప్రాజెక్టు పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్‌ ప్రాజెక్టు గని కూడా ఇందులో అంతర్భాగంగా కొనసాగించనున్నారు.

రెమిడేషన్‌ ప్లాన్‌లో వకీల్‌పల్లి, ఓసీపీ–1

పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఉత్పత్తి తీసిన వకీల్‌పల్లిగని, ఓసీపీ–1 ప్రాజెక్టు ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ కోసం రెమిడేషన్‌ ప్లా న్‌ చేయాల్సింది ఉంది. ఈ మేరకు రెండు గనుల అధికారులు సమీప గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇవి పూర్తయితే రెండు గనులకు సంబందించిన ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ వస్తుంది. క్లియరెన్స్‌ రాగానే రామగుండం కోల్‌మైన్‌ ఓసీపీ కోసం యాజమాన్యం ఎన్విరాన్‌మెంట్‌ విభాగానికి దరఖాస్తు చేసుకోనుంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈఏడాది నవంబర్‌లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశాలున్నాయి. 2024 నాటికి నాలుగు గనుల సరిహద్దు కలిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రాజెక్టు ప్రొఫైల్‌ వివరాలు.. ప్రాజెక్టు పేరు: రామగుండం కోల్‌మైన్‌, విస్తరణ: 3445హెక్టార్లు, బొగ్గు నిల్వలు: 633.45మిలియన్‌ టన్నులు, ఏటా బొగ్గు ఉత్పత్తి: 14మిలియన్‌ టన్నులు(భూగర్భగనితో కలిపి), ఓవర్‌బర్డెన్‌: 2,846 మిలియన్‌ క్యూబిక్‌మీటర్లు, ప్రాజెక్టు జీవిత కాలం: సుమారు 30ఏళ్లు, అటవీభూమి: 719హెక్టార్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement