Telangana crime News: ఆత్మహత్యకు యత్నించి.. చివరికి..

ఆత్మహత్యకు యత్నించి.. చివరికి..

Aug 27 2023 1:12 AM | Updated on Aug 27 2023 1:16 PM

- - Sakshi

పెద్దపల్లి: స్థానిక తిలక్‌నగర్‌లో నివాసముంటూ జీడీకే–1వ గనిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు తాటికొండ సంజీవ్‌(30) ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. ఈనెల 23న సంజీవ్‌ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు.

ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. సంజీవ్‌కు ఆరునెలల కిత్రం ములుగుకు చెందిన అమ్మాయితో వివాహం కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. మృతుడి తల్లి విజయ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ సుగుణాకర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement