
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా శశిథరూర్ చేసిన వ్యాఖ్యలతో ఈ మేరకు అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘నేను పార్టీకి అందుబాటులోనే ఉన్నాను. అయితే పార్టీకి నా అవసరం లేకపోతే నాకు కూడా వేరే దారులున్నాయి’అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో థరూర్ చెప్పారు.
అయితే కేవలం అభిప్రాయ భేదాల వల్ల పార్ట మారడాన్ని తాను నమ్మనని చెప్పారు. తనను తాను రాజకీయనాయకుడిగా ఎప్పుడూ అనుకోలేదన్నారు. కాగా, ఇటీవల అమెరికా పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీపై థరూర్ ప్రశంసలు కురిపిచడం, కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ పాలసీలను పొగడడం వంటివి వివాదాస్పదమయ్యాయి. పార్టీ మారే ఉద్దేశంతోనే థరూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. థరూర్ తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు.