
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు లాంటి బాధ్యత లేని వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలేనిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సైకో ఇజంతోనే ఆనాడు ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు లాక్కున్నారని తెలిపారు.
'చంద్రబాబు అనేక మోసాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వని వ్యక్తులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు. చంద్రబాబు ప్రచార సభల్లో పదకొండు మంది చనిపోయినా పవన్ కల్యాణ్‌కి కనపడటంలేదా?' అని ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు.
చదవండి: (పెనుకొండ టీడీపీలో ముసలం)