Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Warn Kutami Govt Favour Police at Papireddypalli1
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్‌ జగన్‌

సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్‌ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్‌ జగన్‌ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి

Congress leader P Chidambaram fell unconscious During CWC Meet Details2
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్‌ నేత చిదంబరం

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నట్లుండి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. వేడి కారణంగా డీహైడ్రేషన్‌తో ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. #WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25— ANI (@ANI) April 8, 2025కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరం 79 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. కేంద్రంలోని బీజేపీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు రామేశ్వరంలో పాంబన్‌ వంతెనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బడ్జెట్‌ వ్యాఖ్యలకూ ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ప్రధాని సహా కేంద్రమంత్రులు 2004-14తో పోలిస్తే.. 2014-24 మధ్య కాలంలో తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని ప్రధాని చెప్పారు. ఫస్టియర్‌ ఎకానమీ విద్యార్థిని అడగండి. ‘ఎకానమీ మ్యాట్రిక్‌’ ఎప్పుడూ గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. జీడీపీ గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. కేంద్ర బడ్జెట్‌ మొత్తం మునుపటి కంటే పెరుగుతుంది. ప్రభుత్వ మొత్తం ఖర్చూలూ అంతే. మీ వయసు కూడా గతేడాది కంటే పెరిగింది. అంకెల పరంగా ఆ సంఖ్య పెద్దగానే కనిపించి ఉండొచ్చు. కానీ, జీడీపీ పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తి పరంగా అది ఎక్కువగా ఉందా?’’ అని ప్రశ్నించారు.

Nicholas Pooran Joins Elite List With Fastest 20003
చ‌రిత్ర సృష్టించిన పూరన్‌.. సెహ్వాగ్ రికార్డు బద్దలు

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ నికోల‌స్ పూర‌న్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పూర‌న్ విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై పూరన్ విరుచుకుపడ్డాడు.అద్భుతమైన అభిమానులను అలరించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 36 బంతుల్లోనే పూర‌న్ 7 ఫోర్లు, 8 సిక్స‌ర్లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో పూరన్ ఐపీఎల్‌లో రెండు వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.త‌ద్వారా ఓ అరుదైన రికార్డును పూర‌న్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 ప‌రుగుల (బంతుల ప‌రంగా) మైలు రాయిని అందుకున్న రెండో ప్లేయ‌ర్‌గా నికోల‌స్ రికార్డుల‌కెక్కాడు. పూర‌న్‌ కేవ‌లం 1198 బంతుల్లోనే ఈ రేర్ ఫీట్‌ను అందుకున్నాడు.ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు భార‌త మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(1211) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్ రికార్డును ఈ కరేబియ‌న్ వీరుడు బ్రేక్ చేశాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాతో పూరన్ సహచరుడు రస్సెల్‌(1120) అగ్రస్ధానంలో ఉన్నాడు.ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆట‌గాళ్లు1120 - ఆండ్రీ రస్సెల్1198 - నికోలస్ పూరన్1211 - వీరేంద్ర సెహ్వాగ్1251 - క్రిస్ గేల్1306 - రిషబ్ పంత్1309 - గ్లెన్ మాక్స్‌వెల్‌ఉత్కంఠ పోరులో ల‌క్నో గెలుపు..ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆఖ‌రి వ‌రకు జ‌రిగిన ఉత్కంఠ‌పోరులో 4 ప‌రుగుల తేడాతో ల‌క్నో విజ‌యం సాధించింది. 239 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 234 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో అజింక్య ర‌హానే(61) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రింకూ సింగ్‌(38), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(45), సునీల్ న‌రైన్‌(30) పోరాడారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాష్ దీప్, శార్ధూల్ ఠాకూర్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అవేష్ ఖాన్‌,బిష్ణోయ్‌, దిగ్వేష్ త‌లా వికెట్ సాధించారు.అంత‌కుముందు బ్యాటింగ్‌కు చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో పూర‌న్‌(87)తో పాటు మార్ష్‌ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు),మార్‌క్ర‌మ్‌(28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్బ‌తమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.చ‌ద‌వండి: Rohit Sharma: రోహిత్ శ‌ర్మకు అరుదైన గౌర‌వం..!

Minimum Security Drought For Ys Jagan Tour In Sri Sathya Sai District4
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్‌ పర్యటనకు కనీస భద్రత కరువు

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్సార్‌సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించి.. ఓదార్చారు.ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్‌ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. ఆ జనం తాకిడితో హెలికాఫ్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.ఈ పరిణామంతో హెలికాఫ్టర్‌ నుంచి దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వపెద్దల ఉద్దేశపూర్వక చర్యలు మరోసారి తేటతెల్లం అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. జగన్‌ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. కనీస భద్రత కల్పించకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్‌ జగన్‌ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

Pawan kalyan Press Meet on Singapore School Son Mark Shankar Incident5
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌, సాక్షి: సింగపూర్‌లో తన చిన్నకొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌(Mark Shankar Pawanovich) ప్రమాదానికి గురి కావడంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) స్పందించారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని.. తన కొడుకుకు గాయాలైన మాట వాస్తవమేనని ధృవీకరించారాయన. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.ఉదయం అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్‌ వచ్చింది. సింగపూర్‌ హైకమిషనర్‌ సమాచారం అందించారు. నా కొడుకు మార్క్‌ శంకర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగింది. మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నా. కానీ, ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు. 30 మంది పిల్లలు సమ్మర్‌ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ పసిబిడ్డ చనిపోయింది. నా కుమారుడు మార్క్‌ శంకర్‌కు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లినట్లు తెలిసింది. ప్రధాని మోదీ ఫోన్‌​ చేసి విషయం తెలుసుకున్నారు. నా పెద్దకొడుకు అకీరా పుట్టినరోజే చిన్నకొడుక్కి ఇలా జరగడం బాధాకరం’’ అని పవన్‌ అన్నారు. సింగపూర్‌లో నా కుమారుడి అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ(PM Modi)కి ధన్యవాదాలు. అలాగే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ సహా అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని పవన్‌ అన్నారు.ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో సింగపూర్‌(Singapore) రివర్‌ వ్యాలీ రోడ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించిన ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్‌ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్‌-అన్నాలెజినోవాలకు కూతురు పోలేనా అంజనా పవనోవా, కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ సంతానం.

India keeps Chinas BYD at red signal amid efforts to attract Tesla investments6
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విదేశీ కంపెనీలు మనదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో చైనీస్ కంపెనీ 'బీవైడీ' ఉంది. తాజాగా ఈ జాబితాలో ఎలాన్ మస్క్ టెస్లా కూడా చేరింది.బీవైడీ కంపెనీ దేశంలో ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామన్నప్పుడు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీ టెస్లాను మాత్రం ఆహ్వానిస్తోంది. ఈ వైఖరికి కారణాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి 'పియూష్ గోయల్' ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో వెల్లడించారు.రెండు దేశాల మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే చైనా పెట్టుబడులను కాదన్నట్లు వెల్లడించారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థకు కూడా ఈ కారణాల చేతనే అనుమతి ఇవ్వలేదని పియూష్ గోయల్ వివరించారు.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?అమెరికా, భారత్ సంబంధాల దృష్ట్యా.. టెస్లాను ఇండియా ఆహ్వానిస్తోంది. త్వరలోనే టెస్లా కంపెనీ భారతదేశంలో తమ కార్లను విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. యూఎస్ కంపెనీ తన అమ్మకాల గురించి వెల్లడించింది.. కానీ స్థానికంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తుందా? లేదా అనేదానికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. టెస్లా ఇండియాలో తన ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే.. భారతదేశం ఆటోమొబైల్ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.టెస్లా మోడల్ వైటెస్లా (Tesla) కంపెనీ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్‌గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది. దీని రేటు రూ. 21 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

Family of victim Saurabh Responds On Muskans baby7
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం

మీరట్: గత నెలలో యూపీలో సంచలన సృష్టించిన భర్త హత్య కేసులో నిందితురాలిగా మీరట్ జైల్లో ఉన్న ముస్కాన్ గర్బవతి అని మెడికల్ రిపోర్ట్ లో రావడంతో పుట్టబోయే బేబీ సంగతి ఏంటనే చర్చ మొదలైంది. భర్తను ప్రియుడితో సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసి ఇప్పుడు జైల్లో ఉన్న ముస్కాన్ గురించి కనీసం ఆమె కుటుంబం కూడా పట్టించుకోవడం లేదు. ముస్కాన్ గర్భం దాల్చింది అన్న తర్వాత ఆమె కుటుంబం నుంచి ఒక్క మాట కూడా రాలేదు. భర్తను హత్య చేసిన తర్వాతే ఆమెను పట్టించుకోవడం మానేసిన కుటుంబ సభ్యులు.. ఈ విషయం గురించి కూడా ఎటువంటి ఆసక్తి చూపలేదు.ఈ విషయంపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు. సౌరబ్ రాజ్ పుత్ సోదరుడు బబ్లూ రాజ్ పుత్ మాట్లాడుతూ.. ‘ ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు.ముస్కాన్ గర్భవతి అని తెలిసినా..ముస్కాన్ గర్భవతి అని తెలిసినప్పటికీ ఆమె కుటుంబ నుంచి ఎవరూ కూడా జైలుకు వచ్చి చూడలేదు. కాకపోతే ఆమె ప్రియుడు సాహిల్ కుటుంబ సభ్యులు మాత్రం సోమవారం జైలుకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్లారు. సాహిల్ నాన‍్నమ్మ జైలుకు వచ్చి మనవడితో మాట్లాడి వెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముస్కాన్‌, సాహిల్‌లు ఇద్దరూ మీరట్‌ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్‌ ఇవ్వమని డిమాండ్‌ చేసినా జైలు రూల్స్‌ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్‌ రూమ్‌లే కేటాయించారు అధికారులు. ముస్కాన్‌ గర్భం దాల్చిన విషయాన్ని సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు. ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. కాగా, సౌరభ్‌ రాజ్‌పుత్‌, ముస్కాన్‌లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్‌(25)తో ముస్కాన్‌ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్‌.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్‌ చేసింది.

Upasana Konidela: Everyone Involved in Klin Kaara Raising8
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన

ఉపాసన కొణిదెల (Upasana Konidela).. రామ్‌చరణ్‌ సతీమణిగా ఇంటిని చక్కదిద్దడమే కాకుండా అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ) వైస్‌ చైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లయిన కొత్తలోనే రామ్‌చరణ్‌, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తను నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేస్తాడు. నేనేదైనా చేయాలనుకుంటే అందుకు సహకరిస్తాడు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా నా వెంటే ఉన్నాడు.మా బంధం బలంగా ఉండటానికి అదే కారణంఅలాగే తను కష్టనష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను తనవైపు నిల్చున్నాను. మా బంధం ధృడంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అలాగే మా ఇరు కుటుంబాలు కూడా మా వెన్నంటే ఉన్నాయి. వైవాహిక బంధంలో.. ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించడం తప్పనిసరి. వారానికి ఒకసారైనా డేట్‌ నైట్‌కు వెళ్లమని అమ్మ చెప్తూ ఉండేది. మాకు వీలైనంతవరకు దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. వారంలో ఒకరోజుకాకపోతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ రోజంతా గడుపుతాం. ఆ రోజు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంటాం. మా మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మాట్లాడుకుంటేనే కదా ఏదైనా తెలిసేది, పరిష్కరించుకోగలిగేది. పెళ్లిళ్లు వర్కవుట్‌ కావాలంటే ఇవన్నీ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు రిలేషన్‌ను బలపర్చుకుంటూ ఉండాలి. మావల్ల కాదని వదిలేస్తే కష్టం అని పేర్కొంది.ఉపాసన కచ్చితంగా వాళ్ల మధ్యే పెరగాలికుటుంబ విలువల గురించి మాట్లాడుతూ.. మా అమ్మ నా బెస్ట్‌ఫ్రెండ్‌. నేను మా గ్రాండ్‌ పేరెంట్స్‌ దగ్గరే పెరిగాను. నా కూతురు కూడా నాలాగే నానమ్మ-తాతయ్యల దగ్గర పెరగాలని కోరుకుంటున్నాను. గ్రాండ్‌ పేరెంట్స్‌ చేతుల్లో పెరగడమనేది అందమైన అనుభవం. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. నాకు మాత్రం మా అత్త-మామలతో కలిసి ఉండటమే ఇష్టం. మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండటమే నాకు నచ్చుతుంది.అదే నా ధీమాఅప్పుడే నా కూతురు వారి దగ్గరి నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటుంది. మా అత్త, మామయ్య తనను జాగ్రత్తగా పెంచుతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు తను మంచి చేతుల్లోనే ఉందన్న ధీమా ఉంటుంది. మా అమ్మానాన్న కూడా అంతే ప్రేమ, కేర్‌ చూపిస్తారు. ఇలా నా కుటుంబసభ్యులందరూ క్లీంకార ఎదుగుదలలో భాగమవుతున్నారు అని ఉపాసన చెప్పుకొచ్చింది.చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్‌ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్‌

American company sacks 700 In Donation Scam9
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!

ఢిల్లీ: అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా((తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా)) పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిట‌బుల్ డొనేష‌న్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. విరాళాలిచ్చిన‌ట్లు ప‌త్రాలు సృష్టించి...దానికి స‌మాన‌మైన నిధులను కంపెనీ నుంచి కాజేశరని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

RK Roja Reacts On Pawan Kalyan Son Singapore Incident10
గెట్‌ వెల్‌ సూన్‌ చిన్నబాబు‌.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన

తిరుపతి, సాక్షి: పవన్‌ కల్యాణ్‌ తనయుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడంపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అంటున్నారు.ఈరోజు పవన్‌కల్యాణ్‌గారి చిన్నబాబు మార్క్‌ శంకర్‌(Mark Shankar) ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలచివేసింది.ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్‌ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్‌ చేశారు. ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్‌ వ్యాలీ రోడ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించి ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్‌ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తనయుడు మార్క్‌ శంకర్‌ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఘటన అంతలా హైలైట్‌ అయ్యింది. పవన్‌-అన్నాలెజినోవాల చిన్న కొడుకే మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌(mark shankar pawanovich). ఈ ప్రమాదంలో ఆ చిన్నారి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని.. పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యకరంగానే ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement