
పంత్- అక్షర్ (Photo Courtesy: BCCI/IPL)
ఐపీఎల్-2025 (IPL)లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)- లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య సోమవారం పోటీ జరుగనుంది. విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇందుకు వేదిక. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది రెండో హోంగ్రౌండ్ అన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఢిల్లీకి గతేడాది సారథ్యం వహించిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్ అయ్యాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో ఫ్రాంఛైజీ కొనుక్కోగా.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే తన పాత జట్టుపై ఈ వికెట్ కీపర్ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు.
పంత్ వర్సెస్ అక్షర్!
మరోవైపు.. పంత్ నిష్క్రమణతో ఖాళీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పోస్టును టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఈ జట్టులో మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కూడా కీలకం కానున్నాడు. అయితే, లక్నోతో మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
గాయాల బెడద
ఇదిలా ఉంటే.. లక్నో జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఆ జట్టు పేసర్ మొహ్సిన్ ఖాన్ సీజన్ మొత్తానికి దూరం కాగా.. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్లుఓకి వచ్చాడు. అయితే, కీలక పేసర్లు మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ కూడా గాయాల బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.
ఇలా స్టార్ పేసర్లంతా గాయపడటం లక్నో తుదిజట్టు కూర్పుపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. మరోవైపు.. ఢిల్లీ రాహుల్ సేవలను కోల్పోయినా జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండటం.. ఆ జట్టుకు సానుకూలాంశంగా పరిణమించింది. అంతేకాదు ప్రపంచస్థాయి పేసర్ మిచెల్ స్టార్క్ కూడా జట్టుతో ఉండటం ఢిల్లీకి కలిసి రానుంది.
లక్నోదే పైచేయి
ఇక లక్నో మిచెల్ మార్ష్‌తో అర్షిన్ కులకర్ణిని ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పంపే సూచనలు ఉన్నాయి. పంత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు నాయకుడిగానూ జట్టును ముందుండి నడిపించనుండగా.. నికోలస్ పూరన్ స్పెషలిస్టు బ్యాటర్‌గా అందుబాటులో ఉన్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆకాశ్ సింగ్ లేదంటే షాబాజ్ అహ్మద్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కాగా ఢిల్లీ- లక్నో జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి ఐదుసార్లు తలపడగా.. ఢిల్లీ రెండుసార్లు, లక్నో మూడుసార్లు గెలిచాయి.
వర్షం ముప్పు?
ఇదిలా ఉంటే.. విశాఖపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములతో ఆకాశం మేఘావృతమైంది. ఇక హైదరాబాద్‌లో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తుండగా.. విశాఖలోనూ వాన పడితే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌పై ప్రభావం పడనుంది.
ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ లక్నో తుదిజట్లు (అంచనా)
ఢిల్లీ
జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, టి.నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: మోహిత్ శర్మ
లక్నో
అర్షిణ్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, రాజ్‌వర్ధన్ హంగ్రేకర్, రవి బిష్ణోయి, షమార్ జోసెఫ్
ఇంపాక్ట్ ప్లేయర్: ఆకాశ్ సింగ్/షాబాజ్ అహ్మద్.
చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!
Captains 👍
Match-day rivals 🆚
Friends through & through 🤝
𝗠. 𝗢. 𝗢. 𝗗 Axar & Rishabh as we gear up for tonight's #DCvLSG clash 👌👌#TATAIPL | @DelhiCapitals | @LucknowIPL | @akshar2026 | @RishabhPant17 pic.twitter.com/mI2RI3WHYF— IndianPremierLeague (@IPL) March 24, 2025