
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 7) వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ముందు ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్ అందింది. తొలి నాలుగు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. పునరాగామనానికి సిద్దమయ్యాడు.
ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులోకి చేరిన బుమ్రా, సోమవారం ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ధ్రువీకరించాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆడే అవకాశముందని జయవర్ధనే తెలిపాడు.
ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్‌మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. దీంతో రేపటి మ్యాచ్‌లో అతడు ఆడటం ఖాయమైంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. దీంతో ఆర్సీబీతో మ్యాచ్ ముంబైకి కీలకం కానుంది.