
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. దీంతో లక్నో మ్యాచ్‌కు రోహిత్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్ సందర్బంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.
అదేవిధంగా గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే జట్టులోకి రానున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ స్ధానంలో రాజ్ అంగద్ బావా తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఈ సీజన్‌లో రోహిత్ శర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్
విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుత్తూర్
లక్నో సూపర్ జెయింట్స్
ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్) ఆయూష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్
చదవండి: ద్రవిడ్ సెంచరీలు చేస్తే.. రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిని: నితీష్ రాణా