
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏకధాటిగా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. శ్రీరామ్‌సాగర్, నిజాం సాగర్, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుంది. హిమాయత్‌సాగర్ జలాశయం పూర్తిగా నిండిపోయింది. గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఏ క్షణమైనా గండిపేట జలాశయం గేట్లు తెరిచే అవకాశం ఉంది.
హుస్సేన్ సాగర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.45 మీటర్లు కాగా, పూర్తి సామర్థ్యం 515 మీటర్లు. లోతట్టు ప్రాంతాల ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది.
చదవండి: హైదరాబాద్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కోణం.. ఇదంతా అందుకేనా?
జంట జలాశయాల నిండు కుండలా మారాయి. గండిపేట, హిమాయత్ సాగర్‌కు వరద ప్రవాహం భారీగా చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్‌పల్లి, షాద్‌నగర్, షాబాద్ నుంచి వరద భారీగా చేరుతుంది.