
భారతీయ కళా మహోత్సవ్ ప్రారంపోత్సవంలో రాష్ట్రపతి ముర్ము
పాల్గొన్న ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, కళాకారులు
అక్టోబర్ 6 వరకు కొనసాగనున్న భారతీయ కళా మహోత్సవ్
సాక్షి, హైదరాబాద్: దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, ప్రోత్సహించడం అందరి సమష్టి బాధ్యతని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యం, సంగీతం, కళలు, సంప్రదాయ వస్త్రధారణను దేశ వారసత్వంగా అభివరి్ణంచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలు, జాతుల గురించి దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకే ‘భారతీయ కళా మహోత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతీయ కళా మహోత్సవ్ తొలి ఎడిషన్‌ను సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల మధ్య వార ధిగా ఈ ఉత్సవం నిలుస్తుందన్నారు.
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల ప్రదర్శన దేశ ఐక్యతను చాటుతుందన్నారు. మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కె. త్రివిక్రమ్ పటా్నయక్, మణిపూర్, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మేఘాలయ గవర్నర్ సీ.హెచ్. విజయశంకర్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయా రాష్ట్రా ల కళాకారులు, అధికారులు పాల్గొ న్నారు.
ఈ ఉత్సవంలో ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 6 వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల మధ్య సందర్శకులను అనుమతి https://visit.rasht rapatibhavan.gov.in ద్వారా స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ముగిసిన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక రోజు రాష్ట్ర పర్యటన ముగిసింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ, సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, సీత క్క, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేంద్ర, సీపీ సీవీ ఆనంద్ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శామీర్‌పేటలోని నల్సార్ లా వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘కళామహోత్సవ్’ను ప్రారంభించారు. రాత్రి తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.