
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంబేదర్క్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక, ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం.. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.
మూడు గ్రూపుల విభజన, రిజర్వేషన్లు ఇలా..
గ్రూప్-ఏలో ఉన్న వారికి ఒక్క శాతం రిజర్వేషన్
గ్రూప్-బీలో ఉన్న వారికి 9 శాతం రిజర్వేషన్
గ్రూప్-సీలో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు.
