సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అత్యవసరంగా ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం వస్తే.. సమయానికి స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్ అయిపోతే... పవర్ బ్యాంక్‌లో కూడా పవర్ అయిపోతే... చార్జింగ్కు ఎలాంటి అవకాశం లేకపోతే...ఎలాంటి కమ్యూనికేషన్‌కు ఆస్కారం లేని ఎడారి లాంటి ప్రాంతంలో చిక్కుకుపోతే!. ఇక నుంచి అలాంటి తిప్పలను తప్పించేందుకు బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచంలోని పలు సంస్థలు ఇప్పటికీ తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాయి.