ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవపట్టించిందని ఆరోపించారు. శుక్రవారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.