చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ వ్యాఖ‍్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీని జనం పరిగెత్తించేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. తెలుగుదేశం శకం ఇక ముగిసిందని, వచ్చేది రాజన్న రాజ్యమేనని ఆయన అన్నారు. కొద్దిరోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మంచి సంక్షేమ ప్రభుత్వం రాబోతుందని బొత్స అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కుట్రలు ఆపకుంటే ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు.