ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుతున్నట్లు పైకి హడావుడి చేస్తున్న సీఎం చంద్రబాబు తెరవెనుక రాజీ ప్రయత్నాలు చేయటం నిజమేనని తేలిపోయింది! బీజేపీతో రాజీ కోసం తన సన్నిహితుడైన సుజనా చౌదరిని ఆయన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు పంపారు. ఈ విషయాన్ని సుజనాయే స్వయంగా వెల్లడించడం గమనార్హం.