ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా పోరాడుతున్న వైఎస్సార్ సీపీ అంతిమంగా ఎంపీల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తుండటం అధికార టీడీపీలో కలకలం రేపుతోంది. హోదా కోసం వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామాలకూ వెనుకాడక పోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా చర్చోపచర్చలు సాగిస్తున్నారు.