నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతున్న తాగుబోతు డ్రైవర్ల ఆగడాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్కీ నవీన్ మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు. టెక్కీ ర్యాష్ డ్రైవింగ్‌తో ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కారు ఆటోను కొంతదూరం అలానే ముందుకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ రఫిక్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో టెక్కీ ప్రాణాలతో బయటపడ్డాడు