ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంల భద్రతకై రాష్ట్రానికి అదనపు బలగాలు కేటాయించాలని సీఈసీని కోరినట్లు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద మరిన్ని కేంద్ర బలగాలతో భద్రత పెంచాలని విఙ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ సృష్టించిన అరాచకాల గురించి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ సీపీ నేతల బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది.