కోటలో పాగా వేసేదెవరో..! | Sakshi
Sakshi News home page

కోటలో పాగా వేసేదెవరో..!

Published Sun, May 5 2024 8:30 AM

కోటలో

5 సార్లు ఇండిపెండెంట్లకు పట్టం

రామచంద్రపురం నియోజకవర్గం

మొత్తం ఓటర్లు : 2,03,207

పురుషులు : 1,00,684

మహిళలు : 1,02,524

థర్డ్‌ జెండర్‌ : 1

రామచంద్రపురం: రాజరాజ నరేంద్రుని పాలన, రాజా కాకర్లపూడి రాజవంశీయులు, చాళుక్య రాజుల శాసనం నాటి నుంచి నేటి వరకు సంచలన రాజకీయాల వేదిక రామచంద్రపురం నియోజకవర్గం. పంచారామాల్లో ఒకటిగా, అష్టాదశ పీఠాల్లో ఒకటిగాను చాళుక్య రాజుల కాలం నాటి ద్రాక్షారామ భీమేశ్వరాలయం ఒక ప్రసిద్ధి. దీంతో పాటుగా గోదావరి జిల్లాల కూల్‌డ్రింక్‌ ఆర్టోస్‌ కూడా రామచంద్రపురానికి ఒక ప్రత్యేకత ఉంది. 1947 స్వాతంత్య్రానంతరం 1955లో రామచంద్రపురం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడింది. ఇప్పటివరకు 17 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎంఎస్‌ సంజీవయ్య ఎన్‌ఎస్‌జే పార్టీ నుంచి పోటీ చేయగా 1970లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రామచంద్రపురం నియోజకవర్గం ఇండిపెండెంట్లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు అయిదుగురు ఇండిపెండెంట్లుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు కీలక నేతలు వైఎస్సార్‌ సీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తు రాజ్యాంగబద్ధమైన మూడు పదవులు నిర్వహించారు. ఈ నియోజకవర్గానికి చెందిన తోట తిమూర్తులు ఎమ్మెల్సీగా మండపేటకు ఇన్‌చార్జ్‌గా ఉంటూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన రాజ్యసభ సభ సభ్యుడు పిల్లి సుభాష్‌ఛంద్రబోస్‌ తనయుడు పిల్లి సూర్యప్రకాష్‌ రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేస్తుండగా 2019లో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా ఉన్న చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేయటం విశేషం.

2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రామచంద్రపురం అర్బన్‌తో పాటు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పఽథకాల ద్వారా లబ్ధి పొందిన వారు

నియోజకవర్గ భౌగోళిక స్వరూపం

మున్సిపాలిటీ – రామచంద్రపురం

మండలాలు : రామచంద్రపురం, కె.గంగవరం

కాజులూరు

మండలం మొత్తం పాఠశాలలు

కె.గంగవరం 76

రామచంద్రపురం రూరల్‌, అర్బన్‌ 86

కాజులూరు 79

మండలం నాడు–నేడు ద్వారా

ఆధునీకరించిన పాఠశాలలు

కె.గంగవరం 49

రామచంద్రపురం రూరల్‌, అర్బన్‌ 65

కాజులూరు 72

మండలం నాడు–నేడు ద్వారా

చేసిన మొత్తం ఖర్చు

కె.గంగవరం రూ.14.20 కోట్లు

రామచంద్రపురం రూరల్‌, అర్బన్‌ రూ.10.32 కోట్లు

కాజులూరు రూ.11.76 కోట్లు

మండలం మొత్తం ఉపాధ్యాయులు

కె.గంగవరం 265

రామచంద్రపురం రూరల్‌ అర్బన్‌ 364

కాజులూరు 278

మండలం మొత్తం విద్యార్థులు

కె.గంగవరం 5642

రామచంద్రపురం రూరల్‌, అర్బన్‌ 7995

కాజులూరు 7768

మండలం 2018–19లో విద్యార్థులు

కె.గంగవరం 4353

రామచంద్రపురం రూరల్‌, అర్బన్‌ 6680

కాజులూరు 6428

మండలం పెరిగిన విద్యార్థులు

కె.గంగవరం 1289

రామచంద్రపురం రూరల్‌, అర్బన్‌ 1315

కాజులూరు 1340

కోటలో పాగా వేసేదెవరో..!
1/3

కోటలో పాగా వేసేదెవరో..!

కోటలో పాగా వేసేదెవరో..!
2/3

కోటలో పాగా వేసేదెవరో..!

కోటలో పాగా వేసేదెవరో..!
3/3

కోటలో పాగా వేసేదెవరో..!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement