పంటలకు మేలు | Sakshi
Sakshi News home page

పంటలకు మేలు

Published Mon, May 6 2024 7:45 AM

పంటలక

పూడికతీత మట్టి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. సేంద్రియ ఎరువుగా పని చేస్తుంది. ఉపాధిహామీ పథకంలో చెరువుల్లో కూలీలతో పూడికతీత పనులు చేయిస్తున్నారు. చెరువుల నుంచి మట్టిని తీసుకెళ్లి వ్యవసాయ భూముల్లో పోయడంతో ఎరువుల భారం తగ్గుతుంది. రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. పంట భూముల్లో మట్టిని పోయడంతో అంతా చదునుగా మారుతుంది.– కొండ ఆంజనేయులు, రైతు, భూషణరావుపేట

ట్రాక్టర్‌ ఖర్చులు భరించాలి

ఉపాధిహామీ కూలీలు చెరువుల్లోని మట్టిని తీసి ట్రాక్టర్లలో పోస్తున్నారు. ఆ మట్టిని ట్రాక్టర్లలో తీసుకెళ్లడానికి రైతులే ఖర్చు భరించాలని ప్రభుత్వం అంటోంది. రైతు సంక్షేమం ఆలోచించి ట్రాక్టర్‌ ఖర్చులు ప్రభుత్వం చెల్లించాలి. ఆర్థికంగా ఉన్న రైతులు తీసుకెళ్తున్నారు. పేద రైతులకు చెరువుల మట్టి అందని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి.

– ఆకుల నర్సయ్య, రైతు, సిరికొండ

వినియోగించుకోవాలి

జిల్లాలో 118 చెరువుల్లో ఉపాధిహామీ పథకంలో పూడికతీత పనులు చేయిస్తున్నాం. మట్టిని కూలీలతో తవ్వించి ట్రాక్టర్‌లో పోయిస్తాం. కూలీలకు వేసవిలో పని కల్పించినట్లయింది. మట్టిని ఉచితంగానే ఇస్తాంకానీ ట్రాక్టర్‌లో తీసుకెళ్లేందుకు ఖర్చును రైతులే భరించాలి. పూడికతీత మట్టి పంట పొలాలకు మేలు చేస్తాయి. ఆసక్తి ఉన్న రైతులు ట్రాక్టర్‌లో మట్టిని తీసుకెళ్లి వినియోగించుకోవాలి. – సంపత్‌రావు, డీఆర్డీవో, జగిత్యాల

పంటలకు మేలు
1/4

పంటలకు మేలు

పంటలకు మేలు
2/4

పంటలకు మేలు

పంటలకు మేలు
3/4

పంటలకు మేలు

పంటలకు మేలు
4/4

పంటలకు మేలు

Advertisement
 
Advertisement