ఉన్నత స్థాయికి ఎదగాలి | Sakshi
Sakshi News home page

ఉన్నత స్థాయికి ఎదగాలి

Published Sun, May 5 2024 1:40 AM

ఉన్నత స్థాయికి ఎదగాలి

గద్వాల అర్బన్‌: జీవితంలో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ అధికార సేవ సంస్ధ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితదేవి అన్నారు. బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో హోమ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాలికల విద్యకు చిన్నపాటి తోడ్పాటు అందిస్తే చాలు ఉన్నతస్థాయిలో రాణిస్తారనేందుకు నిదర్శనమే బాలనందనమన్నారు. బాలసదనంలో, ఇతర సంరక్షణ గృహంలో నివాసం ఉంటున్న పిల్లలు దేనిలో తక్కువ కాదని, తల్లిదండ్రులు, సంరక్షకులు లేరని చింత వద్దన్నారు. ప్రభుత్వం అన్నీ తానే చూసుకుంటుందన్నారు. అదేవిధంగా ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో బాలసదనంలోని చిన్నారులు అనూష (జీపీఏ 8.8), అక్షయ (జీపీఏ 8.7), సునీత (జీపీఏ 6.8) పాయింట్లు సాధించారు. వీరిని జడ్జీ ప్రత్యేకంగా ఆభినందించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ డీడబ్ల్యూఓ సుధారాణి, బాలల సంక్షేమ సమితి మెంబర్స్‌ జయభారతి, శైలజ, డీసీపీఓ నర్సింహ్మ, బాలసదనం సూపరింటెండెంట్‌ సుధారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement