విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Published Sun, May 5 2024 2:40 AM

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఏటూరునాగారం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అధికారులకు హెచ్చరించారు. మండల పరిధిలోని చెల్పాకలో రొయ్యూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్పయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా మొదటగా హాజరు పట్టికను పరిశీలించి ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సంతకాలు లేకపోవడంతో మెడికల్‌ ఆఫీసర్‌ సుమలతను ప్రశ్నించారు. ఫార్మాసిస్ట్‌ ఈ రోజు టీకాల సరఫరాకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి వెళ్లారని బదులిచ్చారు. అలాగే ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రీనివాస్‌ గురించి అడగగా ఈ రోజు సెలవుల్లో ఉన్నారని వివరించారు. అలాగే ఆయుర్వేదిక్‌ డాక్టర్‌, ఫార్మసిస్టులు గైర్హాజర్‌ కావడంతో వారికి మోమోలు జారీ చేశామన్నారు. అలాగే కుక్క, పాము కాటు వ్యాక్సిన్ల గురించి ఆరా తీయగా 35 నిల్వ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా వడదెబ్బపై గ్రామాల్లోని ప్రజలకు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ద్వారా అవగాహన కల్పించాలని సిబ్బందిని సూచించారు.

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

Advertisement
 

తప్పక చదవండి

Advertisement