30 కిలోల గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

30 కిలోల గంజాయి స్వాధీనం

Published Mon, May 6 2024 5:00 AM

30 కిలోల గంజాయి స్వాధీనం

రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేసేందుకు సిద్ధమైన ఒక వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అరైస్టెన వ్యక్తి బీహార్‌కు చెందిన అజయ్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే పోలీసు డీఎస్పీ నిరంజన్‌ పాఢి ఆదేశాల మేరకు జీఆర్పీ ఐఐసీ బిజయ్‌ కుమార్‌ బెక్‌ నేతృత్వంలో శనివారం రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ ఫారం 1లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక బ్యాగుతో ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. దీంతో బ్యాగులో 30 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా. కొరాపుట్‌ నుంచి బిహార్‌కు అక్రమంగా ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

14 కిలోల గంజాయి పట్టివేత..

మల్కన్‌గిరి: సత్తిగూడ కూడలి వద్ద ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎకై ్సజ్‌ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బస్సు కోసం ఇద్దరు వ్యక్తులు వేచి ఉండటం చూశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అందులో గంజాయి లభ్యమైంది. ఇద్దరినీ విచారించారు. బీహార్‌కు తరలించేందుకు 14 కేజీల గంజాయిని కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. బీహార్‌కు చేందిన దేవ్‌రామ్‌, అతూల్‌ అలంపై కేసు నమోద్‌ చేశారు. సోమవారం కోర్టుకు తరలిస్తామని మల్కన్‌గిరి ఎకై ్సజ్‌ ఇన్స్‌పెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ బాల తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.2.30 వేలు ఉంటుందన్నారు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement