‘సెస్‌’లో ఆన్‌లైన్‌ చెల్లింపుల పునరుద్ధరణ | Sakshi
Sakshi News home page

‘సెస్‌’లో ఆన్‌లైన్‌ చెల్లింపుల పునరుద్ధరణ

Published Mon, May 6 2024 7:05 AM

‘సెస్

సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) పరిధిలో ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించే విధానాన్ని పునరుద్ధరించారు. విద్యుత్‌ వినియోగదారులు గతంలో పేటీఎం ద్వారా బిల్లులు చెల్లించేవారు. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం పేటీఎం వ్యాలెట్‌ను రద్దు చేయడంతో ఆన్‌లైన్‌ చెల్లింపులు రెండు నెలలుగా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. పలువురు ఎన్పీడీసీఎల్‌కు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించినా ‘సెస్‌’ కు జమకాలేదు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘సెస్‌’ బిల్లు.. బేబుకు చిల్లు’శీర్షికన ‘సాక్షి’లో ఏప్రిల్‌ 21న కథనం ప్రచురి తమైంది. దీనిపై స్పందించిన ‘సెస్‌’ పాలకవర్గం, అధికారులు పేటీఎం స్థానంలో కొత్త యూపీఐని అందుబాటులోకి తెచ్చారు. దీంతో ‘సెస్‌’ పరిధి లోని వినియోగదారులు నేరుగా విద్యుత్‌ బిల్లులను చెల్లిస్తున్నారు. వినియోగదారులు www.tgcessltd. com ఓపెన్‌ చేసి కరెంట్‌ బిల్లుపై ఉన్న యూఎస్‌సీ నంబరును ఎంటర్‌ చేసి బిల్లులు చెల్లించే అవకాశం లభించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 1.35 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులు కరెంట్‌ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కలిగింది.

బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులు

‘సెస్‌’లో ఆన్‌లైన్‌ చెల్లింపుల పునరుద్ధరణ
1/2

‘సెస్‌’లో ఆన్‌లైన్‌ చెల్లింపుల పునరుద్ధరణ

‘సెస్‌’లో ఆన్‌లైన్‌ చెల్లింపుల పునరుద్ధరణ
2/2

‘సెస్‌’లో ఆన్‌లైన్‌ చెల్లింపుల పునరుద్ధరణ

Advertisement
 
Advertisement