పాకిస్థాన్ తీరు వల్లే ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తీరు వల్లే ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. పాకిస్థాన్తో చర్చలను స్వాగతిస్తున్నామని, అయితే ఉగ్రవాదంపై చర్చ మాత్రమే ఎజెండాగా ఉండాలని సుష్మా చెప్పారు. గతంలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ సమావేశమైనపుడు ఉగ్రవాదంపై చర్చలు జరపాలని నిర్ణయించారని వెల్లడించారు. ఈ సమావేశం తర్వాత పాకిస్థాన్ 91 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని సుష్మా చెప్పారు.
నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్లు నిర్ణయించిన శాంతిచర్చల ఎజెండాకు తాము కట్టుబడి ఉన్నామని సుష్మా చెప్పారు. అప్పట్లో అనుకున్న ఎజెండాలో అసలు కాశ్మీర్ అంశం లేదని.. పాక్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని తెలిపారు. అంతేగాక ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు ముందు.. కాశ్మీర్కు చెందిన వేర్పాటువాద నేతలతో చర్చలకు పాక్ సిద్ధపడటాన్ని సుష్మా అభ్యంతరం వ్యక్తం చేశారు.