openion
-
5 ట్రిలియన్లు ఎన్నడు?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మధ్య ఒక ఇంగ్లిష్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ భారతదేశ ప్రగతి ఎంతో ఉజ్వలమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో మన పాత్ర అద్భుతం అని సమాధానం చెప్పారు. 2024 కల్లా భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా బలోపేతమవుతుందని, చాలా బలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య ఫెడరల్ వ్యవస్థ ఆదర్శవంతంగా సాగుతోందని కితాబు ఇచ్చారు. వ్యవసాయంలోనూ, కార్మిక రంగంలోనూ తీసుకువచ్చిన సంస్కరణలు గతంలో ఎన్నడూ లేనంత ప్రభావాన్ని చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరోనా వంటి కష్టకాలంలో, విపత్తుల్లో పేదవాడికి ప్రభుత్వం అందించిన చేయూత అద్భుతమైనదని,ఆత్మతృప్తిని వ్యక్తం చేశారు.ఉత్పత్తి, తయారీ రంగంలో ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగలిగిన మార్కెట్ కేంద్రంగా సమీప భవిష్యత్తులో భారత్ నిలుస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు.సంస్కరణల పరంపర నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంటుందని సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా, దానికి తగ్గట్టుగా రాష్ట్రాలు స్పందించక పోతే, ఆశించిన అభివృద్ధి జరగదని తెలిపారు.పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించడం కీలకమని సూచించారు. చేయాలనుకున్న మేలు,చిట్ట చివరి మైలు వరకూ చేరుకునే డెలివరీ వ్యవస్థ మనల్ని కాపాడిందని,ఈ యంత్రాంగాన్ని అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే నిర్మించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లిందని తమ పాలన పట్ల అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు.లక్షలాది మంది ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేయగలిగామనే ఆత్మతృప్తి తనకు ఎంతో ఉత్సహాన్ని,శక్తిని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది తమ ప్రభుత్వం మాత్రమే చేసిన చారిత్రక చర్య అని తెలిపారు.ఇలా,ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన భావాలను, అనుభవాలను,ఆలోచనలను, ఆశయాలను,సంకల్పాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ ఇంకా సంధించాల్సిన చాలా ప్రశ్నలు సంధించలేదని చెప్పాలి. ప్రధాని చెప్పిన జవాబుల్లోనూ ఇంకా విస్తృతి వుంటే బాగుండేది. ప్రధానమంత్రి చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలను సమీక్ష చేసుకుంటే,కొన్ని వాస్తవానికి దగ్గరగానూ,కొన్ని దూరంగానూ ఉన్నాయి.సుమారు 139కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ, మరణాల సంఖ్యను అదుపులో ఉంచడంలోనూ, పరీక్షలు జరపడంలోనూ మంచి ఫలితాలే వచ్చాయి. ముందుజాగ్రత్త చర్యలు, హెచ్చరికలు చేపట్టకుండా, ఉన్నపళంగా లాక్ డౌన్ విధించడం వల్ల ఎన్నో అనర్ధాలు సంభవించాయి. ముఖ్యంగా వలసకార్మికులు పడిన కష్టాలు,పోగొట్టుకున్న ప్రాణాలు, కోల్పోయిన ఉపాధి వర్ణనాతీతం. లాక్ డౌన్ వల్ల ఆరోగ్యపరంగా కొంత రక్షణ పొందాం. సమాంతరంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంత ఘోరమైన ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదు.గతంలో ఆర్ధిక మాంద్యం వచ్చిన దశ కంటే, నేటి దశ చాలా ఘోరమైనదిగా విశ్లేషకులు భావించారు. అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుంచీ కొంత ప్రగతి నమోదవుతూ వచ్చింది.ఆ సమయంలో నిర్మాణం,ఉత్పత్తి రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆర్ధిక లావాదేవీలు చాలా మందకొడిగా సాగాయి. డిమాండ్-సప్లై మధ్య ఉన్న బంధం ఆరోగ్యకరంగా సాగలేదు. కరోనా ప్రభావంతో మిగిలిన దేశాల్లో వచ్చిన ఆర్ధిక కష్టాల ప్రభావం మన దేశంపైనా పడింది. దెబ్బతిన్న దేశాల్లో అమెరికా,చైనా వంటి పెద్ద దేశాలు సైతం ఉన్నాయి. అమెరికా బాగా దెబ్బతింది. చైనాకు -భారత్ కు మధ్య ఉన్న వాణిజ్య, వ్యాపార బంధాలు చాలా వరకూ తెగిపోయాయి. ఈ ప్రభావం మన ఉత్పత్తి రంగం, తద్వారా మన ఆర్ధిక రంగంపై పడింది.ఫార్మా మొదలు అనేక తయారీల్లో మనం చైనాపైనే ఆధారపడ్డాం.అదే విధంగా "మేక్ ఇన్ ఇండియా" ను ఆచరణలో ఆశించిన స్థాయిలో సాధించలేదు. కాబట్టి, ఈ పరిణామాల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. అంతటి గడ్డు పరిస్థితుల్లోనూ మన దేశాన్ని కాపాడింది వ్యవసాయ రంగం. అది ఎంతో కొంత పచ్చగా ఉండడం వల్ల, కొంత ఆర్ధిక రక్షణ జరిగింది. యత్ర నార్యంతు పూజ్యతే... అన్నట్లుగా, ఎక్కడైతే వ్యవసాయ రంగం బాగుంటుందో, ఆ క్షేత్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ రంగంపై పాలకులకు ఇంకా శ్రద్ధాభక్తులు పెరగాలి. వ్యవసాయం కోసం ఉపయోగించుకోకుండా ఉన్న భూమి ఇంకా చాలా ఉంది. దాన్ని గుర్తించి,వ్యవసాయాన్ని విస్తరించాలి.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు మళ్ళీ ఆందోళనకు దిగారు. సార్వత్రిక ఎన్నికల వేళయ్యింది. చర్చలు జరిపి శుభం కార్డు వెయ్యాలి.ఆహార రక్షణపై (ఫుడ్ సెక్యూరిటీ) పైనా దృష్టి పెట్టాలి.స్వామినాథన్ వంటి నిపుణులు చేసిన సూచనలు ఆచరణలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన జి ఎస్ టి బకాయిలపై కేంద్రం చెప్పేవి మాటల గారడీ మాత్రమేనని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణాల వసతి కల్పించినా, వాడుకునే పరిస్థితి రాష్ట్రాలకు ఏమాత్రం ఉందన్నది సందేహమే. థామస్ రాబర్ట్ మాల్థస్ అనే ఆర్ధిక పండితుడు ఎప్పుడో 200ఏళ్ళ క్రితం చెప్పిన మాటలను దేశాధినేతలు పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.జనాభా పెరుగుదల సంఖ్య ఆధారంగా, ప్రతి 25సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని,వాటికి అనుగుణంగా మనం సిద్ధమై ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్ధిక మాంద్యాలు, కరోనా వైరస్ వంటి ముప్పులు, అనారోగ్యాలు ఎన్నో వస్తూ వుంటాయని,వీటిని గుర్తెరిగి, మనం నడచుకోవాలని ఆయన సూచించాడు.ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోవడం వల్ల, ఆర్ధికంగా,మౌలికంగా సంసిద్ధమై ఉండక పోవడం వల్ల, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కుదేలైపోతున్నాం. మాల్థస్ మహనీయుడి మాటలు ఇప్పటికీ ప్రత్యక్షర, ప్రత్యక్ష సత్యాలుగా నిలుస్తున్నాయి. భారతదేశాన్ని పునర్నిర్మించాలనే సత్ సంకల్పం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండడం ఎంతో అభినందనీయం,పూజనీయం. ఈ 2024కల్లా 5ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను నిర్మించాలన్నది ప్రధాని పెట్టుకున్న మహదాశయం. ప్రపంచ ఆర్ధిక పరిణామాలను గమనిస్తే,2024కల్లా 3 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థకు భారత్ చేరుకుంటే? అది గొప్ప ప్రగతి సందర్భమని ఆర్ధిక శాస్త్రవేత్తలు గతంలో అభిప్రాయపడ్డారు. నేడు దానిని సాధించాం. ప్రధాని సంకల్పిస్తున్నట్లుగా 5ట్రిలియన్ల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇంకా సమయం పడుతుంది.ప్రస్తుతం 3.7 ట్రిలియన్స్ స్థితిలో వున్నాం. 5 ట్రిలియన్స్ కు చేరుకోవాలంటే? మరో నాలుగైదేళ్లు పడుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రచయిత : మా శర్మ -
సేఫ్ సెకండ్ ఒపీనియన్ ప్లీజ్!
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుని, ఆయన సూచించిన చికిత్స సక్రమమైన మార్గంలోనే వెళ్తుందా లేదా అని తెలుసుకోడానికి సెకండ్ ఒపీనియన్ కోసం చాలామంది మొగ్గుచూపుతుంటారు. తమ చికిత్స సక్రమమైన మార్గంలోనే సాగుతుందని మరో డాక్టర్ కూడా భరోసా ఇస్తే... బాధితులకు అదో ధీమా. నిజానికి మొదటి డాక్టర్ మీద సందేహం కంటే... ఈ భరోసా కోసం, ఈ ధీమా కోసమే చాలావరకు సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తుంటారు. ఒకరికి ఇద్దరు డాక్టర్లు ఒకేమాట చెబితే మనసుకెంతో ఊరట. కానీ ఒక్కోసారి సెకండ్ ఒపీనియన్ మరీ తేడాగా ఉంటే... మరోసారి మనం సందర్శించిన మొదటి డాక్టర్‌తోనూ ఒక మాట మాట్లాడటం ఎంతో అవసరం. అదెందుకో చూద్దాం. ఓ కేస్ స్టడీ: వైద్య విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఓ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయనకు కడుపులో ట్యూమర్స్ వంటివి ఉన్నాయనీ, ఆపరేషన్‌తో తొలగించాల్సిన అవసరముందని డాక్టర్ చెప్పారు. మరో ఒకరిద్దరు డాక్టర్ల దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వారూ శస్త్రచికిత్స తప్పదని చెప్పడంతో... బాధితుడు సర్జరీ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఇచ్చే పోస్ట్ ఆపరేటివ్ మందుల్లో ఒకదాని గురించి డాక్టర్ ఓ మాట చెప్పారు. ‘‘ఈ మందు మీకు కాస్త ఇబ్బందిని తెచ్చిపెట్టవచ్చు. అందరికీ అలా జరగాలని లేదు. ఒకవేళ మీ విషయంలో ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి. నేను మందు మారుస్తాను’’ అని చెప్పారు డాక్టర్. ఎప్పటిలాగే సెకండ్ ఒపీనియన్లో భాగంగా ఆ పేషెంట్ ఆ మందు గురించి మరో డాక్టర్‌ను అడిగారు. ‘‘ఆ... అదంత ముఖ్యమైన మందు కాదులే’’ అని ఆ డాక్టర్ చెప్పడంతో బాధితుడు ఆ మందు తీసుకోలేదు. బాధితుడికి ఆర్నెల్లలోనే కడుపులో ట్యూమర్ మరోసారి పెరిగింది. సమస్య ఎందుకు పునరావృతమైందో తెలియక డాక్టర్ తలపట్టుకున్నారు. ఈ ఆర్నెల్ల కాలంలో బాధితుడి దగ్గర్నుంచి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయత్నంలో తాను మొదట ఇచ్చిన మందుల్లో ఒకదాన్ని బాధితుడు వాడలేదని తెలియవచ్చింది. దాంతో డాక్టర్ కాస్తంత ఆగ్రహం చూపాల్సివచ్చింది. ‘‘నిజానికి అదో కీమో తరహా మందు. కీమో అన్న మాట వినగానే తమకు క్యాన్సరేనేమో అని పేషెంట్ అపోహ పడవచ్చు. కానీ కాన్సర్ కానటువంటి కొన్ని రకాల (నాన్ క్యాన్సరస్) ట్యూమర్లు మళ్లీ మళ్లీ రాకుండా కీమోలాంటి చికిత్సనే అందించే ఓరల్ ట్యాబ్లెట్లను డాక్టర్లు ఇస్తుంటారు. ట్యూమర్ తొలగింపులో... దాన్ని పూర్తిగా తొలగించడానికి వీలుకాని ప్రదేశంలో సూక్షా్మతిసూక్ష్మమైన భాగం కొంత మిగిలిపోతే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇచ్చిన మందు అది. మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పుకాదు. కానీ ఆ తర్వాత మళ్లీ నాతో మాట్లాడితే... నేను మరింత వివరించేవాణ్ణి. ఇప్పుడు మరోసారి సర్జరీ చేయాల్సి వస్తోంది. అది కూడా గతంలో కంటే పెద్ద సర్జరీ. ఖర్చు కూడా దాదాపు రెట్టింపు’’ అంటూ మందలించారు డాక్టర్. ఇదీ మరోమారు జబ్బు రిలాప్స్ (పునరావృతం) అయిన ఓ బాధితుడి వాస్తవ గాధ. ఆందోళన కలిగించే విషయాలు అనవసరం : ఈ కేస్ స్టడీలో డాక్టర్ కావాలనే కొన్ని విషయాలను బాధితలకు విపులంగా చెప్పలేదు. దానికీ కారణం ఉంది. నిజానికి డాక్టర్ ఇచ్చిన మందు వాడేసి ఉంటే... ఆ మిగిలిపోయిన భాగమూ మృతిచెంది... రోగి పూర్తిగా స్వస్థుడయ్యేవాడు. కానీ ఈ మందు కీమో వంటిది అనగానే రోగిలో అనవసరమైన ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంటుంది. దాంతో లేనిపోని ఊహలూ, అనవసరమైన సందేహాలతో మరింతమంది డాక్టర్లను సంప్రదించవచ్చు. దాంతో డబ్బూ, సమయమూ వృథా కావడమే కాదు... అవసరమైన యాంగై్జటీ, కుంగుబాటుకు తావిచ్చినట్టు అవుతుంది. అందుకే రోగి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి అనవసరమైన విషయాలను చెప్పకపోవచ్చు. లేదా ఒకవేళ బాధితులు మంచి విద్యావంతులే అని చెపినప్పటికీ, వారిలో మరిన్ని సందేహాలు చెలరేగే అవకాశాలు ఎక్కువ. నిజానికి ఇలాంటి సందేహాలు విద్యావంతుల్లోనే ఎక్కువ అని డాక్టర్లు అంటుంటారు. సరికొత్త అనర్థాలకు తావిచ్చే గూగుల్ : ఏదైనా విషయాన్ని డాక్టర్లు యథాలాపంగా చెప్పినా సరే... చాలామంది విద్యావంతులు గూగుల్‌ను ఆశ్రయిస్తారు. వైద్యవిజ్ఞానానికి చెందిన చాలా అంశాలు గూగుల్‌లో విపులంగా ఉంటాయి. నిజానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యక్తికీ, వ్యక్తికీ వేరుగా ఉండవచ్చు. కొన్ని అంశాలు వారికి వర్తించకపోవచ్చు. అవి డాక్టర్‌కు తెలుస్తాయి. కానీ గూగుల్‌లో మొత్తం సమాచారమంతా ఉంటుంది. అది తమకు వర్తించదన్న అంశాన్ని గ్రహించలేని పేషెంట్లు... ఆ అనవసర పరిజ్ఞానాన్ని తలకెక్కించుకుని మరింతమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతిని దూరం చేసుకుంటుంటారు. ఫేస్బుక్, యూట్యూబ్‌లలో పనికిరాని పరిజ్ఞానం : దీనికి తోడు ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో మరిన్ని క్లిప్స్ ఉంటాయి. తమ లైక్స్ కోసం లేదా తమ పాపులారిటీని పెంచుకునేందుకు అర్హత లేని నకిలీలు (క్వాక్స్) కూడా ఏమాత్రం శాస్త్రీయతకు తావు లేని అంశాలతో వీడియోలు చేసి పెడుతుంటారు. వీటిని చూసి బాధితులు మరింత అయోమయానికి గురవుతుంటారు. సెకండ్ ఒపీనియన్ బాధితుల హక్కు నిజానికి మరో డాక్టర్ దగ్గర్నుంచి వారి అభిప్రాయం తీసుకోవడం పేషెంట్స్ హక్కు. మరొకరి ఒపీనియన్ తీసుకున్న తర్వాతే చికిత్సకు రమ్మని చాలామంది డాక్టర్లూ సూచిస్తుంటారు. దానికి కారణమూ ఉంది. సెకండ్ ఒపీనియన్ వల్ల పేషెంట్స్‌లో మంచి నమ్మకమూ, తాము తీసుకునే చికిత్స సరైనదే అనే విశ్వాసం పెంపొందుతాయి. అది బాధితులను మరింత వేగంగా కోలుకునేలా చేస్తుంది. చాలా సందర్భాల్లో తొలి డాక్టర్ చెప్పిన విషయాలూ, సెకండ్ ఒపీనియన్ ఇచ్చిన్న డాక్టర్ చెప్పిన అంశాలు నూటికి తొంభై పాళ్లు ఒకేలా ఉంటాయి. కొన్ని అటు ఇటుగా ఉన్నప్పటికీ మొదటి డాక్టర్ చెప్పిన అంశాలను చాలావరకు రెండో డాక్టర్ విభేదించరు. ఒకవేళ విభేదిస్తే కారణాలు చెబుతారు. కానీ తాము తీసుకున్న సెకండ్ ఒపీనియన్ గనక మన డాక్టర్ చెప్పిన విషయాలకు దాదాపుగా పూర్తిగా భిన్నంగా ఉన్నప్పుడు అదే విషయాన్ని మనం చికిత్స తీసుకునే డాక్టర్‌తో ఆ విషయాలపై స్పష్టంగా, నిర్భయంగా, విపులంగా చర్చించవచ్చు. మన సందేహాలనూ, సంశయాలనూ తీర్చడం డాక్టర్ విధి కూడా. అలాంటప్పుడు ఒకసారి మన డాక్టర్‌తోనూ మాట్లాడటం మంచిది. డాక్టర్ షాపింగ్ వద్దు ఓ డాక్టర్‌ను సంప్రదించాక... ఇంకా తమ సందేహాలు తీరలేదనో లేదా మరోసారి డాక్టర్‌ను అడిగితే ఏమనుకుంటారనో ఒకరి తర్వాత మరొకరి దగ్గరకు వెళ్తుంటారు. దీన్నే ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. నిజానికి డాక్టర్ షాపింగ్ అన్నది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని గ్రహించడం మంచిది. డాక్టర్ జి. పార్థసారధి, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
పాత వాసన
హిట్ ‘‘ప్రియాంకా గాంధీని ఇష్టపడటం, ఇష్టపడకపోవడంలో తప్పేమీ లేదు. అది అభిరుచికి సంబంధించినది. వాస్తవాల విషయానికి వస్తే ఆమె ఓట్లు సాధించగలదనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అంటే ఆమె సాధించలేదని నేను చెప్పడం లేదు. ఇంకా ఎవరూ ఒక్క టికెట్టయినా కొని, సినిమా చూడకుండానే సినిమా హిట్ అనడం లాంటివే ఇవన్నీ’’ – సదానంద్ ధూమే కాలమిస్టు లౌకికత్వం ‘‘రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్గారూ, మీరు రాజ్యంగ పరిరక్షకులు. మీరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలాగే లౌకికత్వం అనే మాట వాడటానికి ఎందుకు ఇష్టపడరు? ‘లౌకికత్వమే భారతదేశానికి గొప్ప బలం’ అని మీరు చెప్పితీరాలి.’’ – సుధీంద్ర కులకర్ణి సామాజిక కార్యకర్త పాత వాసన ‘‘రాజ్యాంగ పదవులలో కొనసాగుతున్నప్పటికీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ పాత పార్టీ వాసనలను మర్చిపోయినట్టు లేరు. నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సినవాళ్లు తమ హోదాకు భంగం కలిగేలా ప్రవర్తించడం విచారకరం’’ – అజయ్ కామత్, నేత్ర వైద్యుడు వంశపారంపర్యం ‘‘ప్రియాంకా గాంధీ నియామకం వంశ పారంపర్య పాలనను ముందుకు తీసుకెళ్లడమేనట. ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. మామగారు పరకాల శేషావతారం అనేకసార్లు మంత్రిగా పనిచేశారు, అత్తగారు కాళికాంబ ఎమ్మెల్యేగా చేశారు, భర్త పరకాల ప్రభాకర్ వివిధ పార్టీల నుంచి అనేక సార్లు పోటీ చేసి ఓడిపోయారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారూ.. అద్దాల మేడలో నివసించేవారు ఎదుటివారిపై రాళ్లు విసరకూడదని తెలుసుకుంటే మంచిదండీ’’ – శర్మిష్టా ముఖర్జీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లబ్ధి ‘‘జాతి, మతం పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింస ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంతాన్ని బీజేపీ వాడుకుంటోంది. సోదరుల, ఆత్మీయుల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలను ఆపాలి’’ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత -
మీ మాటేమిటి !
- విద్యత్ చార్జీ పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ – చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు – నేడు విద్యుత్ భవన్లో విన్నపాల స్వీకరణ – చార్జీలు పెంచితే జిల్లాపై ఏటా రూ. 224కోట్ల అదనపు భారం కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2017–18 సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టింది. జనవరి 18న విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నివేదికలు సిద్ధం చేసి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కమిషన్ (ఏపీ ఈఆర్సీ)కి సమర్పించాయి. వీటికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈఆర్సీ అభిప్రాయ సేకరణకు పూనుకుంది. ఇందులో భాగంగా గురువారం కర్నూలు నగరంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ, విన్నపాల స్వీకరణ చేపట్టనుంది. బాదుడు భారం రూ.224కోట్లు : డిస్కంలు ఈఆర్సీకి సమర్పించిన నివేదికల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 3,359కోట్ల ఆదాయాన్ని అర్జించేందుకు సిద్ధపడగా అందులో కర్నూలు జిల్లా ప్రజలపై రూ.224కోట్ల మేరకు భారం పడనుందని అంచనా. ఇందులో కేవలం గృహ వినియోగదారులపైనే రూ.78.11కోట్లకు పైగా భారం పడే అవకాశముంది. ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2017 ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. – ముచ్చటగా మూడోసారి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే మొదటిసారిగా రూ.100కోట్లు భారం మోపింది. 2016లో రెండోసారి రూ.28.37కోట్లు బాదింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారిగా భారీ ఎత్తున చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈఆర్సీ ఆమోదం అనంతరం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇది ఆచరణలోకి వస్తుంది. కొత్త చార్జీల టారీఫ్ కేవలం ఒక్క ఏడాదికి మాత్రమే. కరువు కాటకాలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల వంటి సమస్యలతో అల్లాడుతుండగా విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – నేడు విద్యుత్ భవన్లో అభిప్రాయ సేకరణ: కర్నూలు నగరంలోని విద్యుత్ భవన్ రెండవ అంతస్తులో ఉన్న సమావేశపు హాలులో విద్యుత్ చార్జీలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ భవాని ప్రసాద్, సభ్యులు రఘు, రామ్మోహన్, ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు దొర, టెక్నికల్, ఫైనాన్స్ డైరెర్టర్లు పి. పుల్లారెడ్డి, సయ్యద్ బిలాల్ బాషా, ట్రాన్స్‌కో అధికారులు హాజరు కానున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరక కార్యక్రమం కొనసాగనుంది. -
రేపు ప్రత్యేక గ్రామ సభలు
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, పౌరుల అవసరాలపై చర్చించి నిర్దిష్టమైన అభిప్రాయాల సేకరణలో భాగంగా ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కే ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రామ సభలను నిర్వహించి పౌరుల అవసరాలను గుర్తించాలని, తీర్మానాలు, ఫొటోలను తీయించి నివేదికలను అందించాలని సూచించారు. జిల్లాలోని డివిజనల్ పంచాయతీ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
’భేతాళుడు’కు ఆడియన్స్ స్పందన
-
‘మలిన’ చరితకు ముగింపు
పసిబిడ్డలు మట్టితో ఆడుకుంటున్నట్టు నా మనుషులు మలంతో ఆడుతున్నారు. మలంతోనే పాడుతున్నారు. అదే మలినంలో తింటూ, దానిపక్కనే పడుకొంటూ 4000 సంవ త్సరాల నుంచీ కులం అనే మలాన్ని నెత్తిన మోస్తున్నారు నా జాతి స్త్రీలు. స్వచ్ఛతకీ, కులానికీ మధ్యనున్న అతి సున్నితమైన అంశం నా జాతి జనుల ప్రాణాలు. వేలయేళ్ల మానవ మలాల్లోంచి బయట పడలేకా, అందులో పడి చావలేకా లక్షలాది మంది దళితులు గిజగిజలాడుతున్నారు. ఏదీ దొరక్క ఈ పనిచేస్తున్నారన్నది సర్దిచెప్పుకునే సమా ధానం. అలా అయితే వాళ్లు మాత్రమే ఈ పనినెందుకు చేస్తున్నారు? ఇదెవ్వరూ ఆలోచించరు. ఎవ్వరూ చేయనిది వీళ్ళెందుకు చేస్తున్నారు? అన్నది మాత్రమే శతాబ్దాల నయ వంచనకు సంబంధించిన ప్రశ్న. నువ్వు దళితుడివి కాబట్టి నువ్వీపని చేయాల న్నారు. అంతేకాదు. దళి తుడు మాత్రమే ఈ పని చేయాలన్నారు. అంతేనా దళితుల్లోని కొందరు మాత్రమే ఈ పనిచేయా లన్నారు. అంతేనా దళితు ల్లోని స్త్రీలు ఈ పనిని కచ్చి తంగా చేయాలన్నారు. అలా 4000 ఏళ్లుగా నా జాతి స్త్రీలు, మొత్తంగా దళిత సమాజం ఈ మురికిని మోస్తూనే ఉన్నది. ఇప్పటికి దాదాపు 6 లక్షలకుపైగా ఈ అమానవీయ పనినుంచి విముక్తుల య్యారు. సఫాయి కర్మచారీ ఆందోళన దాదాపు 2లక్షల మందిని ఈ పనినుంచి విముక్తి చేసింది. దేశవ్యాప్తంగా ఇంకా 2లక్షలకు పైబడి మనుషులు ఆత్మగౌరవం ఇసుమం తైనా లేని ఈ పనినే చేస్తున్నారు. వారి విముక్తికే నా ఈ అవార్డు అంకితం అంటున్న రామన్ మెగసెసె అవార్డు గ్రహీత తెలుగు బిడ్డ బెజవాడ విల్సన్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. నాకు ఊహ తెలిసేప్పటికే మానవ మలాన్ని చేతుల్తో ఎత్తి నెత్తినమోసే అమానవీయ పనిని నా తాత ముత్తాతల నుంచి కొన్ని లక్షల మంది దళిత జనులు చేస్తున్నారు. ఇది అమానుషమనీ, మానవ విసర్జితాలను చేతుల్తో ఎత్తివే యడం దుర్మార్గమనీ, మనిషి ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని దెబ్బతీస్తుందనీ, ఇటువంటి వ్యవస్థను సమూలంగా నిర్మూ లించాలనీ అర్థం చేసుకునే సరికి నా పాఠశాల విద్య పూర్త య్యింది. కుప్పంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పదవ తరగతి పూర్తి చేసుకొని కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లోని నా స్వగృహానికి వచ్చినప్పుడు విద్యుద్దీపాలతో మిలమిలా మెరిసిపోయే నా ప్రాంతంలో మానవ మలంలో మునిగితేలుతున్న నా వారి జీవితాలను అతి దగ్గరనుంచి చూసాను. తాగుడుతో జీవితాలు ధ్వంసం అవుతున్నాయని తాగుడు మానమన్నాను. ఈ పనికి సారా తాగక తప్పద న్నారు. నెత్తిన బక్కెట్లో నుంచి ముఖంపైకి కారుతున్న మలాన్ని చేతుల్తో తుడుచుకుంటూ, అది పూర్తిగా కారిపోక ముందే గమ్యాన్ని చేరుకోవాలని పరుగులా నడుస్తున్న వారిని చూసి బోరున ఏడ్చాను. ఇది మానెయ్యమని కాళ్లా వేళ్లా పడ్డాను. ఎవ్వరూ వినలేదు. కిందపడి గిలగిలా కొట్టు కున్నాను. చివరకు ఎలాగో నన్ను ఇంటికి లాక్కొచ్చారు. ఆ రాత్రంతా వేడి నీళ్ళుండే అతి పెద్దట్యాంకు వద్ద ఎత్తై ప్రదే శంలో కూర్చుని ఏడ్చాను. ఏడుస్తూ ఆలోచించాను. అయితే ఈ వేణ్ణీళ్లలో పడి చావడమా? లేకపోతే వీరితో ఈ పనిని మాన్పించడమా? అని తీవ్రంగా ఆలోచించాను. వేడి వేడిగా కిందకి జారిపోతున్న నీళ్లు నన్నంతపని చేయొద్ద న్నాయి. తెలతెలవారుతుండగా చెట్లపైన వాలిన పక్షులూ ఏదో చెప్పుకుంటూ ఎగిరెళ్లిపోతుంటే ఆకాశంవైపు చూశాను. అక్కడే దొరికింది సమాధానం. ఈ ఆకాశానికి చెబితే నా సమస్య తీరుతుంది. ఆకాశం ఎక్కడైనా ఆకాశమే కదా.. నా ప్రజలు ఎక్కడైనా మోసేది మలాన్నే కదా. ఆ కథనే అన్ని చోట్లా వినిపిస్తాను అనుకుని లేచాను. అలా విల్సన్ తన లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఇక విశ్ర మించేందుకు అతనికి తీరిక దొరకలేదు. చివరకు పెళ్లికి కూడా. అప్పుడు కోలార్ లోనూ, ఇప్పుడు ఢిల్లీలోనూ సఫాయి కర్మచారీ ఆందోళన్ ఆఫీసే ఆయన నివాసం. అయితే అంబేడ్కర్ పరిచయ మయ్యాకే కులానికీ, ఈ మలి నానికీ ఉన్న సంబంధం తనకు అర్థం అయ్యిందంటాడు విల్సన్. 1990లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీసంఘం వాళ్ళు చిత్తూరు నుంచి హైద రాబాద్ వరకు అంబేడ్కర్ శత జయంతి ఉత్సవాల సంద ర్భంగా నిర్వహించిన సైకిల్ యాత్ర అంబేడ్కర్‌ని పరి చయం చేసింది. ‘నా జాతి జనుల విముక్తి కేవలం మలం బక్కెట్లను తన్ని తగలెయ్యడంలో లేదనీ, కులం మూలాల్లో ఉందనీ అప్పుడే తెలుసుకున్నాను. కులాన్ని సమూలంగా నిర్మూ లించినప్పుడే దళితులకు గౌరవప్రదమైన జీవితం. సర్వ మానవ సమానత్వం సాధ్యం అవుతుంది. కులం చేసిన గాయం యింకా నా జాతి మదిలో సలుపుతూనే వుంది. అలాగే పురుషాధిపత్యం కూడా. అంబేడ్కర్ తరువాత నాకి ష్టమైన, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్.’ ‘ఆ తరువాత సఫాయి కర్మచారీ ఆందోళన్ని స్థాపిం చాం. మూడు దశాబ్దాలకు పైగా ఇదే పనిచేస్తున్నాం. నేను పెద్దగా చేసిందేమీ లేదు. మనుషుల్ని మనుషులుగా బతకనివ్వమన్నానంతే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి మొదలు కొని ఈ రోజు వరకు 22 రాష్ట్రాల్లో 6000 మంది వాలం టీర్లతో మా సంస్థ పనిచేస్తోంది. ప్రత్యేకించి మహిళా స్కావెంజింగ్ వర్కర్స్ మా సంస్థలో కీలకమైన వాలంటీర్లు. 2014లో సుప్రీంకోర్టు తొలిసారిగా మా పనిని గుర్తించింది. ఈ అమానవీయ పనిని దుర్మార్గమైనదిగా వ్యాఖ్యానిం చింది. ఇందుకు కారకులైన వారిని శిక్షార్హులుగా ప్రకటిం చింది. అటువంటి వారికి జైలు శిక్షని ఖరారు చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పింది. ఇప్పటికి 1,268 మంది సెప్టిక్ ట్యాంక్‌లు క్లీన్ చేస్తూ మరణించారు. వారిలో 36 మందికి మాత్రమే నష్టపరిహారం వచ్చింది. అది కూడా పూర్తిగా కాదు. మ్యాన్‌హోల్స్‌లో పడి మరణిస్తున్నవారు లెక్కేలేదు. ఈ పనిచేసినందుకు జలమండలి ఐదువేల రూపాయలి స్తుంది. కానీ చస్తే ఎవ్వరి బాధ్యతా ఉండదు. నా జీవితం ఉన్నంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ (వ్యాసకర్త: అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి) -
అస్తిత్వ ఉద్యమాలూ, పరిమితులూ
అభిప్రాయం ప్రతి అస్తిత్వ ఉద్యమానికీ ఫలితాలూ, పరిమితులూ వుంటాయని సమాజ చలనం తెలియజేస్తూనే వుంటుంది. ఫలితాలు అంటే, ఆ ఉద్యమం సమాజం దృష్టికి తెచ్చిన కొత్త అంశాలు. పరిమితులు అంటే, ఆ ఉద్యమం లోపలా, బయటా వున్న పరిమితులు. లోపల వున్న పరిమితులు, ఉద్యమాన్ని అంతకు మించి ముందుకు వెళ్ళలేని పరిస్థితిని కల్పిస్తాయి. దాంతో అది బయటి పరిమితి అవుతుంది. సమాజంలో కులాల మధ్యా, మతాల మధ్యా, జాతుల మధ్యా, స్త్రీ, పురుషుల మధ్యా అసమానతలున్నంతవరకూ అస్తిత్వ ఉద్యమాలు పుట్టుకొస్తూనే వుంటాయి. మరి, అన్ని అసమానతలూ అలా వుండగానే (ఇంకా పెరుగుతుండగా) అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఎందుకొస్తున్నట్టు? ఆ ఉద్యమాల లోపల వున్న పరిమితే బయటి పరిమితికి కారణం అన్నాము. ఆ లోపలి పరిమితులేమిటి? ఏ అస్తిత్వవాద లక్ష్యమైనా ఏముంటుంది? తమకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్ళడం. ఇందులో తప్పు పట్టవలసిందేమీ లేదు. తమకు జరుగుతున్న అన్యాయాన్నే గుర్తించలేనివాళ్ళు ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏం గుర్తిస్తారు? అయితే, సమాజంలో అన్ని అసమానతలకూ మించిన అసమానత వున్నది. పేద, ధనికుల మధ్య వున్న తేడా! దీన్ని ఏ అస్తిత్వవాదమూ అంతగా పట్టించుకోదు. పేదలకూ ధనికులకూ మధ్య వున్న తేడా ఆర్థికపరమైనది. అస్తిత్వ ఉద్యమాలకు కారణం సామాజికమైనది. రెండింటినీ కలిపి చూడవచ్చా... అనవచ్చు. కలిసే వున్నప్పుడు కలిపి చూడక తప్పదు. సామాజిక పరమైన అసమానతలు ఆర్థిక పరమైన అసమానతలకూ, ఆర్థిక పరమైన అసమానతలు సామాజిక అసమానతలకూ కారణాలవుతున్నాయి. ఇందుకు స్త్రీ అస్తిత్వవాదం ఒక ఉదాహరణ. స్త్రీ చైతన్యవాదమన్నా, ఫెమినిజమన్నా అదే. చాలా న్యాయమైనది. అంత న్యాయమైన ఉద్యమం కూడా కొంతవరకూ కదిలి కదిలించి ఆగింది. సాహిత్యంలోనూ అది తీసుకొచ్చిన సంచలనం ఆగి, కొంత స్తబ్దతకు గురయింది. ఇంకేం చెయ్యాలో తెలీని కొందరు పురాణ పాత్రలకు స్త్రీవాద పాఠాలు చెబుతున్నారు. అయితే, స్త్రీలపై అన్ని రకాలుగా సాగుతున్న అణచివేతనూ, వివక్షనూ స్త్రీవాదం గట్టిగా ప్రశ్నించింది. పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడంలో కొంత తప్పు ధోరణి కనిపించినా, అస్తిత్వ ఉద్యమాల ప్రారంభంలో వుండే అత్యుత్సాహంగా, ఆవేశంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆ స్త్రీ చైతన్యవాదం స్త్రీలనే కలుపుకోలేక పోయిందని అనక తప్పదు. దళిత కుటుంబాలకు చెందిన స్త్రీలు, ఎగువ మధ్య తరగతికీ, ఆపై వాళ్ళకూ చెందిన స్త్రీవాదంగా దాన్ని భావించారు. సామాజిక పరమైన అసమానతలు ఆర్థిక పరమైన అసమానతకూ, ఆర్థిక పరమైన అసమానత సామాజిక పరమైన అసమానతకూ కారణాలవుతాయంటే ఇదే. స్త్రీ అస్తిత్వవాదం కోరిందేమిటి? తమను మనుషులుగా గుర్తించాలని కాదు. స్త్రీలుగా గుర్తించాలనే. అందువల్ల, సహజంగానే వాళ్లు ఏ వర్గానికి చెందిన స్త్రీలో వాళ్ళ అస్తిత్వవాదంగానే అది వుండిపోయింది. ఒక్క స్త్రీ అస్తిత్వవాదమే కాదు, అన్ని అస్తిత్వవాదాల, లేదా ఉద్యమాల పద్ధతీ అదే. మైనారిటీ అస్తిత్వవాదం, తమను మైనారిటీలుగా గుర్తించాలనే కోరుతుంది. వివిధ కుల సంఘాలన్నీ తమను ఆ కులం వారుగా గుర్తించాలనే కోరుకుంటాయి. ఈ ఆలోచన స్త్రీల గురించి స్త్రీలే రాయాలనీ, ఫలానా కులం గురించి ఆ కులం వారే రాయాలనేంత విపరీత ధోరణికి వెళ్ళడము చూశాం. దాంతో ఏ అస్తిత్వ ఉద్యమానికీ మరొక అస్తిత్వ ఉద్యమం మద్దతు లభించదు. కొన్ని సందర్భాల్లో ఒకదానికి మరొకటి వ్యతిరేకం కూడా! ఒక్కమాటలో చెప్పాలంటే, అస్తిత్వ ఉద్యమాల ఆలోచన తాము కోరుతున్న వాటిని సాధించడం మీద కన్నా, అస్తిత్వాన్ని కాపాడుకోవడం మీదనే ఎక్కువగా వుంటుందనాలి. ఆ పరిమితే ఆ ఉద్యమాలు సాధించినవాటికీ వర్తిస్తుంది. - పి. రామకృష్ణ -
మారని వైఖరికి చిరునామా
అభిప్రాయం కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినాక మోదీని అధికారం లోకి తేవడానికి వందలాది మంది కార్యకర్తలతో ప్రచారం లోకి దిగిన ఆర్ఎస్ఎస్ లౌకిక ప్రజాస్వామిక భావాలను, దళిత మైనారిటీ ఆలోచనలను అణచివేయడానికి చరిత్ర రచ న, విద్యారంగం, సమాచార రంగం మీద ఎంత కరడుగట్టిన భావాల ఒత్తిడిని తెస్తు న్నదో మద్రాసు ఐఐటీ మీద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి తెచ్చిన ఒత్తిడియే నిదర్శనం. ‘భిన్నాభిప్రాయం నేరమా?’ అని మీరు రాసిన సంపా దకీయం (మే 30) పాఠకులను అప్రమత్తం చేస్తుందని ఆశిస్తు న్నాను. అంబేద్కర్-పెరియార్ స్టూడెంట్ సర్కిల్ (ఏపీఏసీ) కరపత్రంపై నిషేధాన్ని, చర్యను ఉద్దేశించిన కుట్ర ఏ ఫాసిస్టు చర్యలకు దారితీస్తుందో ఈ ఏడాది పరి ణామాల నేపథ్యంలో ఎవరైనా ఊహించగలిగేదే. సకా లంలో ప్రజాస్వామ్యశక్తులు స్పందించడానికిదే అదను. మీ సంపాదకీయంలో ‘ఎక్కడైతే మేధస్సు నిర్భ యంగా ఉంటుందో... విజ్ఞానానికి సంకెళ్లు ఉండవో... ఎక్కడైతే ప్రపంచం సంకుచిత కుడ్యాలుగా ముక్కలై పో దో...ఎక్కడైతే హేతువు దారితప్పదో... అలాంటి స్వేచ్ఛా ప్రపంచంలోకి తనను మేల్కొల్పడమ’న్న రవీంద్రుని గీతాన్ని 1978-79 విద్యా సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌లో పోస్టర్‌గా వేసిన ఉదం తం పూర్వాపరాలు గురించి రాయాలనిపించింది. 1976లో అంటే ప్రాథమిక హక్కులు రద్దయిన అత్యయికస్థితి (1975-77) కాలంలో కాకతీయ విశ్వవి ద్యాలయం ఏర్పడింది. అప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్గారు ఏబీవీపీ ఉపాధ్యక్షులుగా ఉన్నా రు. వరంగల్‌కు వచ్చిన జిల్లెళ్లమూడి అమ్మను క్యాం పస్‌లో ఉన్న మహిళా విద్యార్థుల హాస్టల్‌కు తీసుకువెళ్లి విద్యార్థినులతో ఆమెకు పాదాభివందనం చేయించారు ఆ ఆచార్యుల వారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ తొలగి వరంగల్‌లో రాడికల్ విద్యార్థి సంఘం రెండవ మహాస భలు 1978 ఫిబ్రవరిలో జరిగి ‘గ్రామాలకు తరలండి’ పిలుపు ఇచ్చింది. కాకతీయ విశ్వవిద్యాలయం కింద రాడి కల్ విద్యార్థి సంఘం అని సొంతం చేసుకున్నారు. ప్రిన్సి పల్ రూం ముందర ఆర్ఎస్యూ వాళ్లు పోస్టర్ వేశారని, తొలగించకపోతే తామూ పోస్టర్లు వేసి ఆందోళన చేస్తా మని ఏబీవీపీ విద్యార్థులు గుంపుగా వెళ్లి కేయూ క్యాం పస్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ పోస్టర్లో ఏముందో చూడకుండానే ఆ పోస్టర్‌ను చింపే యించాడు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సాయం కళాశాలలో పనిచేస్తూ ఆ సంవత్సరమే ఎంఏ తెలుగులో చేరిన ఎన్.కె. రామా రావును ప్రిన్సిపల్ పిలిచి సంజా యిషీ కోరాడు-ఎన్.కె.రామారావు అప్పటికే విరసం సభ్యుడుగా, కవిగా, గాయకుడుగా సుప్రసిద్ధుడు. క్యాంపస్‌లో సహాధ్యాయి జి.లింగమూర్తి, పులి అంజ య్య, ఎం.గంగాధర్, గోపగాని ఐలయ్యల సాహచర్యం లో ఆర్ఎస్యూలో కూడా తిరుగుతున్నాడు. ప్రిన్సిపా ల్కు తెలిసిన, ప్రిన్సిపాల్ దబాయించి అడగగలిగిన సబార్డినేట్ అతడే గనుక పిలిచాడు. ఇంతలో ఆర్ఎస్ యూ విద్యార్థులు కూడ అధిక సంఖ్యలోనే ప్రిన్సిపాల్ రూంకు చేరుకున్నారు. రవీంద్రుని గీతాన్ని ఎందుకు తొలగించారు అని ప్రశ్నించడానికి. ‘మీరు ఆ పోస్టర్ చూశారా? అది రవీంద్రుని సుప్రసిద్ధగీతం’ అన్నాడు ఎన్కే. చింపబడి తన టేబుల్‌పై (బహుశా పోలీసులకు అప్పగించడానికి) ఉన్న పోస్టర్ ముక్కలను అప్పుడు తీసి చూశాడాయన. అవాక్కయ్యాడు. ఆయన నిజానికి చాలా మంచి వ్యక్తి. లౌకిక ప్రజాస్వామ్యవాది. పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ ప్రొఫెసర్ పి.ఎ.జేమ్స్. కాని ప్రిన్సిపాల్ అధికా రం, ఏబీవీపీ ఒత్తిడి-సమర్థించుకోవాలి-‘కావచ్చు. కాని కింద రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఎందుకు రాశా రు? అది అభ్యంతరకరం’ అన్నాడు. ‘అది గోడపత్రిక సార్. సుప్రసిద్ధమైన సూక్తులు, కవితలు, కొటేషన్స్‌ను ప్రసిద్ధమైన వ్యక్తులవి ఆయా సంస్థలు, పత్రికలు ఉప యోగించుకునే సంప్రదాయం ఉందికదా సార్’ అన్నాడా యన. ‘కాని నా అనుమతి లేకుండా ప్రిన్సిపాల్ ఆఫీసు ముందుగానీ, క్యాంపస్‌లోగానీ ఆర్ఎస్యూ పోస్టర్స్ వేయకూడదు’ అన్నాడు. ‘ఈ ఉత్తర్వులు మాకేనా, ఏబీవీ పీకి కూడా వర్తిస్తాయా?’ అన్నారు విద్యార్థులు. ‘అంద రికీ వర్తిస్తాయి’ అన్నాడు ప్రిన్సిపాల్. ‘ఏబీవీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షులే ప్రొఫెసర్లు, లెక్చరర్స్ ఉన్నారు కదా సార్’ అన్నారు ఒకే గొంతుతో విద్యార్థులు. సరేసరే వెళ్లండన్నా రాయన- ఎమర్జెన్సీ ఎత్తివేసిన ప్రజాస్వామిక వాతావర ణంలో తన గొంతు తనకే ఎబ్బెట్టుగా వినిపించినట్టున్న దతనికి. కాని ఇప్పుడేమో ఏడాదిగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్టుగా ఉన్నది దేశమంతటా. ఈ స్థితిలో ఉన్నత విద్యాలయాలు తమ స్వతంత్ర ప్రతిప త్తిని కాపాడుకొని అవి నిర్వహించవలసిన భావాల సం ఘర్షణను స్వేచ్ఛగా, స్వతంత్రంగా చేపట్టగలవా? అం దుకు ప్రభుత్వాలు, ప్రభుత్వాలను నడుపుతున్న రా జ్యాంగేతర ఫాసిస్టుశక్తులు అనుమతిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్న. (తరువాత పరిణామాలతో మద్రాస్ ఐఐటీ తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.) - వరవరరావు (వ్యాసకర్త, విరసం నేత) మొబైల్: 9676541715