
హిట్
‘‘ప్రియాంకా గాంధీని ఇష్టపడటం, ఇష్టపడకపోవడంలో తప్పేమీ లేదు. అది అభిరుచికి సంబంధించినది. వాస్తవాల విషయానికి వస్తే ఆమె ఓట్లు సాధించగలదనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అంటే ఆమె సాధించలేదని నేను చెప్పడం లేదు. ఇంకా ఎవరూ ఒక్క టికెట్టయినా కొని, సినిమా చూడకుండానే సినిమా హిట్ అనడం లాంటివే ఇవన్నీ’’ – సదానంద్ ధూమే కాలమిస్టు
లౌకికత్వం
‘‘రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌గారూ, మీరు రాజ్యంగ పరిరక్షకులు. మీరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలాగే లౌకికత్వం అనే మాట వాడటానికి ఎందుకు ఇష్టపడరు? ‘లౌకికత్వమే భారతదేశానికి గొప్ప బలం’ అని మీరు చెప్పితీరాలి.’’ – సుధీంద్ర కులకర్ణి సామాజిక కార్యకర్త
పాత వాసన
‘‘రాజ్యాంగ పదవులలో కొనసాగుతున్నప్పటికీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ పాత పార్టీ వాసనలను మర్చిపోయినట్టు లేరు. నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సినవాళ్లు తమ హోదాకు భంగం కలిగేలా ప్రవర్తించడం విచారకరం’’ – అజయ్ కామత్, నేత్ర వైద్యుడు
వంశపారంపర్యం
‘‘ప్రియాంకా గాంధీ నియామకం వంశ పారంపర్య పాలనను ముందుకు తీసుకెళ్లడమేనట. ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. మామగారు పరకాల శేషావతారం అనేకసార్లు మంత్రిగా పనిచేశారు, అత్తగారు కాళికాంబ ఎమ్మెల్యేగా చేశారు, భర్త పరకాల ప్రభాకర్ వివిధ పార్టీల నుంచి అనేక సార్లు పోటీ చేసి ఓడిపోయారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారూ.. అద్దాల మేడలో నివసించేవారు ఎదుటివారిపై రాళ్లు విసరకూడదని తెలుసుకుంటే మంచిదండీ’’ – శర్మిష్టా ముఖర్జీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
లబ్ధి
‘‘జాతి, మతం పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింస ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంతాన్ని బీజేపీ వాడుకుంటోంది. సోదరుల, ఆత్మీయుల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలను ఆపాలి’’ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత
Comments
Please login to add a commentAdd a comment