రేపు ప్రత్యేక గ్రామ సభలు | tomorrow special grama sabhas | Sakshi
Sakshi News home page

రేపు ప్రత్యేక గ్రామ సభలు

Published Tue, Jan 24 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

tomorrow special grama sabhas

కర్నూలు(అర్బన్‌): గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, పౌరుల అవసరాలపై చర్చించి నిర్దిష్టమైన అభిప్రాయాల సేకరణలో భాగంగా ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కే ఆనంద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రామ సభలను నిర్వహించి పౌరుల అవసరాలను గుర్తించాలని, తీర్మానాలు, ఫొటోలను తీయించి నివేదికలను అందించాలని సూచించారు. జిల్లాలోని డివిజనల్‌ పంచాయతీ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement