
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఎండగట్టనున్నారు.
అంకెలగారడీగా మారిన రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలులో మోసం, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.