
ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. ఈ వేడివల్ల కారు లోపలి భాగం కూడా వేడెక్కిపోతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏసీ ఆన్ చేసుకుంటే సమస్య ఉండదు. కానీ పార్కింగ్ చేసినప్పుడు కూడా కారులో ఏసీ ఆన్ చేసి పెట్టడం కుదరదు. కాబట్టి సమ్మర్‌లో కారు చల్లగా ఉండాలంటే పాటించాల్సిన ఐదు టిప్స్ పాటించాలి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
విండో వైజర్లు & సన్‌షేడ్‌లను ఉపయోగించండి
క్వాలిటీ ఉన్న సన్‌షేడ్‌ను ఉపయోగించడం వల్ల.. కారు లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎందుకంటే అవి సూర్యరష్మిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. తద్వారా డ్యాష్‌బోర్డ్, సీట్లు వేడెక్కకుండా ఉంటాయి. నీటిని, చెత్తను కూడా లోపలికి రాకుండా ఇవి కొంత నియంత్రిస్తాయి. అయితే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సన్‌షేడ్ లేదా సన్‌ఫిల్మ్ నిషేధం. దీనిని వాహనదారులు గుర్తుంచుకోవాలి.
నీడలో పార్క్ చేయాలి
కారును ఎండగా ఉన్న ప్రదేశంలో కాకుండా.. నీడగా ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి. చెట్లు, పార్కింగ్ గ్యారేజీలు లేదా పెద్ద భవనాల నీడ తగిలే చోట కారును పార్క్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండా నేరుగా కారుపై పడదు. అప్పుడు కారు లోపలి వాతావరణం వేడెక్కకుండా ఉంటుంది.
విండోస్ ఓపెన్ చేయండి
కారును పార్కింగ్ చేసే సమయంలోనే విండోస్ ఓపెన్ చేయడం మంచిది. ఇలా చేస్తే.. బయట గాలి లోపలకు, లోపలి గాలి బయటకు వస్తుంది. అయితే పార్కింగ్ చేసే ప్రదేశం సురక్షితంగా ఉందని నిర్దారించుకున్నప్పుడు.. విండోస్ ఓపెన్ చేయాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
స్టీరింగ్ వీల్ & సీట్ కవర్లను ఉపయోగించండి
అధిక వేడి కారణంగా.. స్టీరింగ్ వీల్, సీట్లు తొందరగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి స్టీరింగ్ వీల్, సీట్లను కాపాడుకోవడానికి వాటికి సరైన కవర్లను ఉపయోగించాలి. ఇవి సీట్ల మీద, స్టీరింగ్ వీల్ మీద ఎండా పడకుండా చేస్తాయి.
పార్కింగ్ పొజిషన్ ముఖ్యం
కారును ఉపయోగించిన తరువాత ఎలా పడితే అలా పార్కింగ్ చేస్తే.. కారులోని వాతావరణం వేడెక్కుతుంది. కాబట్టి పార్కింగ్ పొజిషన్ కూడా ముఖ్యమన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సూర్య కిరణాలు ఏ వైపు తక్కువగా పడుతున్నాయో గమనించి పార్కింగ్ చేయాలి.
ఎండాకాలం కారును రక్షించుకోవడం చాలా అవసరం. లేకుంటే చాలా తొందరగా పనికిరాకుండా పోతుంది. ఎప్పటికప్పుడు కారును వాష్ చేయడం, టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండటం, ఏసీ వెంట్స్ గమనించడం, లోపల క్యాబిన్‌లో వ్యర్థ పదార్థాలు లేదా తినుబండారాలను నిల్వ చేయకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే.. కారు లైఫ్ టైమ్ కొంత బాగుంటుంది.