Tips In Telugu
-
కొత్తిమీర తాజాగా, పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా: ఈ టిప్స్ పాటించండి!
వంట చేసేటపుడు కొన్ని చిట్కాలు పాటించడమో, లేదా కొన్ని ఇంగ్రీడియంట్స్ అదనంగా కలపడమో తప్పని సరి. లేదంటే ఎంత కష్టపడి చేసిన వంట అయినా రుచిని కోల్పోతుంది. అలాగే ముఖ్యమైన పోషకాలను కోల్పోతాం. లేదా ఒక్కోసారి అసలు టేస్టే లేకుండా పోతుంది. అందుకే ఈ టిప్స్ ఒకసారి చూడండి. ♦ పకోడీలు మెత్తబడకుండా ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పావు కేజీ శనగపిండిలో గుప్పెడు మొక్కజొన్న పిండి కలపాలి. ♦ పూరీలు నూనె తక్కువ పీల్చుకుని, పొంగి కరకరలాడాలంటే పూరీలు వత్తేటప్పుడు బియ్యప్పిండి చల్లుకోవాలి. ♦ కూరగాయలను తొక్క తీసి, తరిగిన తర్వాత నీటిలో శుభ్రం చేస్తే అందులోని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లను నష్టపోతాం. కాబట్టి తొక్క తీయడమైనా, తరగడమైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే తరిగిన వెంటనే వండాలి. పై నియమాన్ని వంకాయలకు పాటించడం కష్టం. ఎందుకంటే తరిగిన వెంటనే నీటిలో వేయకపోతే వంకాయ ముక్కలు నల్లబడడంతోపాటు చేదుగా మారతాయి. కాబట్టి ముందుగా వంకాయలను ఉప్పు నీటిలో కడిగి ఆ తర్వాత తరిగి మళ్లీ నీటిలో వేయాలి. ♦ యాపిల్‌ను కట్ చేసి, ఆ ముక్కలను ప్లేట్లో అమర్చి సర్వ్ చేసే లోపే ముక్కలు రంగు మారుతుంటాయి. కాబట్టి కట్ చేసిన వెంటనే ఆ ముక్కల మీద నిమ్మరసం చల్లితే ముక్కలు తాజాగా ఉంటాయి. చాకును నిమ్మరసంలో ముంచి కట్ చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ♦ కొత్తిమీరను పలుచని క్లాత్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. -
జుట్టు బాగా రాలుతుందా.. అయితే ఇలా చేయండి!
'ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు.' ఇలా చేయండి.. జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే... ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టును కడిగితే సిల్కీగా అవుతుంది. తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. ఇవి చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..? -
వింటర్లో మేకప్ వేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తే..
చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. ఈ సమస్యను పోగొట్టుకునేందుకు చాలామంది మాయిశ్చరైజింగ్ క్రీములు, మేకప్ ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే బయట దొరికే ఉత్పత్తుల్లో చాలా వరకు ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుకే చలికాలం సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఇంట్లోనే దొరికే వస్తువులతో వింటర్ స్కిన్ కేర్‌ను ఫాలో అవ్వొచ్చు. అదెలా అంటే.. ►తేనె, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మానికి మేలైన ప్యాక్. చర్మం చక్కగా శుభ్రపడుతుంది. మృదువుగా అవుతుంది.సహజసిద్ధమైన వెన్న, నూనె, గ్లిజరిన్‌లను చలికాలంలో మాయిశ్చరైజర్లుగా ఉపయోగించడం మంచిది. ► శనగపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు సమపాళ్లలో తీసుకుని, ఛాయపసుపు కొమ్ములు గుప్పెడు, గంధ కచూరాలు గుప్పెడు, ఎండబెట్టిన గులాబీ రెక్కలు కొన్ని కలిపి గ్రైండ్ చేసి పొడి చెయ్యాలి. ఈ పొడిని కొద్దికొద్దిగా తీసుకుని పెరుగులో కాని, మజ్జిగలోకాని, పాలలో గాని కలిపి, సబ్బుకి మారుగా ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి స్నానం చేస్తే ఒళ్లు పేలిపోకుండా ఉండడమే కాకుండా చర్మం నునుపు తేలి సువాసన వెదజల్లుతుంది. ► గుడ్డు పచ్చ సొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాల పొడి కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. మృదువుగా మర్దనా చేసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ► కలబంద (అలొవెరా) రసం శరీరానికి పట్టించి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం మృదుత్వం కోల్పోదు. ► ఒక చెంచా తేనెను పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. చర్మం ఆరోగ్యకరమైన నిగారింపును సంతరించుకుంటుంది. -
బాణలిలో ఫ్రై చేస్తున్నారా? ఇలా చేస్తే అడుగు అంటుకోదు
వంటింటి చిట్కాలు ►గ్లాసు నీళ్లల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను ముక్కలు చేసి వేయాలి. దీనిలో బోరిక్ యాసిడ్ రెండు టీస్పూన్లు వేసి మూడు గంటలపాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని సింక్‌లో పోస్తే బొద్దింకలు రావు. ► నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని ఐస్‌క్యూబ్ ట్రేలో పోసి రాత్రంతా రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఉదయం ఈ ఐస్‌క్యూబ్‌ను తీసి దుర్వాసన వస్తోన్న సింక్‌లో వేస్తే దుర్వాసన పోతుంది. ► పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతుంటాం. చాలాసార్లు అవి పొంగి స్టవ్ మొత్తం అవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాల గిన్నె మీద ఓ చెక్క చెంచాను ఉంచండి. ► పప్పు త్వరగా ఉడకాలన్నా మరింత రుచిగా ఉండాలన్నా అందులో ఒక టీస్పూన్ నువ్వులనూనె వేయాలి. ► వెల్లుల్లి, ఉల్లిపొట్టు అంత సులభంగా రాదు. దీనికోసం వేడి నీళ్లలో వీటిని కాసేపు వేసి ఆ తర్వాత పొట్టు తీయండి. ఇలా చేస్తే పొట్టు సులువుగా వస్తుంది. ► టొమాటో చుట్టూ చిన్నగా గాటు పెట్టి మరుగుతున్న నీటిలో వేయాలి. నిమిషం తరువాత తీసేసి ఐస్‌వాటర్‌లో వేయాలి. నిమిషం తరువాత టొమాటోను పట్టుకుని లాగితే తొక్క సులభంగా వచ్చేస్తుంది. ► మనం దోసెలు వేసేటప్పుడు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. వంకాయలతో ముందుగా పెనం పై వంకాయ ముక్కతో రుద్దండి. ► బాణలిలో కొద్దిగా నీళ్లుపోసి అవిరైపోయేవరకు వేడిచేయాలి. బాణలిలో ఒక్క నీటిచుక్క కూడా లేనప్పుడు నూనె వేసి ఫ్రైచేస్తే ఏ పదార్థమైనా బాణలికి అంటుకోదు. -
పప్పులతో ఫేస్‌ప్యాక్.. ముఖం బంగారంలా వెలిగిపోతుంది
బ్యూటీ టిప్స్ ►ఎర్ర పప్పు మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. ఎర్రపప్పులోని పోషకాలు,విటమిన్లు చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి. ఈ ఎర్రపప్పుతో ఫేస్‌ప్యాక్ వల్ల మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. ►కప్పు ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. ► మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. ► రెండుగంటలు నానిన నాలుగు టీస్పూన్ల పొట్టు పెసరపప్పుని పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్ పీల్ పొడి, టీస్పూను గంధం పొడి వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరవాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది. హెయిర్ టిప్స్ ► టీస్పూను అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లి రసం, మూడు టీస్పూన్ల కొబ్బరి నూనెవేసి అన్నిటినీ చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసి మర్దన చేయాలి. మరుసటిరోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పలుచబడిన మాడు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతుంది. -
జుట్టు బాగా రాలుతుందా? ఉసిరి, క్యారెట్‌తో ఇలా చేస్తే..
ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఉసిరి ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరిలో జుట్టుకు బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధికమొత్తంలో విటమిన్ ఇ , విటమిన్ ఉ, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి కేశాలను బలంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి.ఇందుకోసం ఏం చేయాలంటే..ఉసిరికాయను ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి. ముక్కలు ఆరిన తరువాత పొడిచేసుకోవాలి. ఇప్పుడు ఉసిరి పొడి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని దానిలో నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా చేసుకుని స్కాల్ప్‌పై అఫ్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకుని రెండు గంటల పాటు ఉంచుకుని ఆ తరువాత షాంపు, చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది. క్యారెట్ క్యారెట్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడమేగాక, వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. క్యారెట్ జ్యూస్ తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. అందువల్ల 100 మిల్లీ లీటర్ల క్యారెట్ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, నల్లగా పెరుగుతాయి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కల్తీలేని స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ కేశాలను ధృడంగా ఉంచడంలో సాయపడుతుంది. వెంట్రుకలు తెగిపోకుండా కుదుళ్ల నుంచి బలంగా ఉంచుతుంది. కొబ్బరినూనెతో తలమీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ల నుంచి కేశాలు పెరుగుతాయి. అంతేకాకుండా 15–20 నిమిషాలపాటు కొబ్బరినూనెతో స్కాల్ప్ మర్దన చేసి ఒక గంటపాటు లేదా ఒక రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆతరువాత షాంపుతో వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన డైట్ పాటించడంతో పాటు యోగా, ధ్యానం, వర్కౌట్ చేయాలి. -
పిల్లలను బాధ్యతతో పెంచుతున్నారా? అతి గారాబమా?
చాలామంది తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలను తమ పిల్లలు అనుభవించ కూడదనే ఉద్దేశ్యంతో వారిని అతి గారం చేస్తుంటారు. తమకు ఉన్నా లేకున్నా, వారికి కావలసిన అన్ని వసతులూ, సౌకర్యాలూ సమకూర్చుతూ, వారికి కష్టం అనేది తెలియకుండా పెంచుతుంటారు. అయితే అది చాలా తప్పు. వారికి బాల్యం నుంచి బాధ్యతలు తెలియజేయాలి. అలాగని వారి నెత్తిమీద బాధ్యతల బరువు వెయ్యడం కాదు... వారి బాధ్యత వారికి తెలిసేలా చేయడమే బాధ్యతతో కూడిన పెంపకం. పంచుకోవడం అన్నది పిల్లలకి తప్పనిసరిగా నేర్పాల్సిన వాటిలో ఒకటి. దానివల్ల ఇతరులతో స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ఒకరి అవసరం మరొకరికి తెలుస్తుంది. కొంతమంది పిల్లలు స్కూలు నుండి రాగానే, పుస్తకాల సంచీ అక్కడే ఏ సోఫాలోనో పారేసి, విడిచిన బట్టలని, చెప్పులని ఒకపక్కకి వదిలేస్తారు. అటువంటప్పుడు వారికి ఆ వస్తువుల విలువ, అవసరం తెలియజేస్తూ, క్రమపద్ధతిలో భద్రపరచుకునేట్లు వారికి అలవాటు చేయాలి. అంతేకాదు, వారు అడిగినవన్నీ వెంటనే తెచ్చి ఇవ్వకుండా మంచి మాటలతో బుజ్జగించి దారికి తేవాలి. ఎదిరించి మాట్లాడుతుంటే... పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడే పిల్లలని చూస్తుంటాం. మొదట తల్లిదండ్రులు తమ పెద్దలని గౌరవిస్తే, అదే బాటలో పిల్లలూ నడుచుకుంటారు. గురువులు, పెద్దలు, వృద్ధులను తల్లిదండ్రులు గౌరవిస్తే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. షాపింగ్ షాపింగ్‌కి వెళ్ళినపుడు, పిల్లలని తమతో తీసుకెళుతుంటారు. అక్కడ వారికి సెల్‌ఫోన్ చేతికిచ్చి ఒకచోట కూర్చోబెట్టి తాము షాపింగ్ చేసుకుంటారు. అలా కాక తమ పిల్లలని కూడా తమతో ఉంచుకుంటే ఒక వస్తువు కొనేటప్పుడు తమ తల్లిదండ్రులు ఆ వస్తువు నాణ్యతని ఎలా పరీక్షిస్తున్నారో, ఎలా ఎంచుకుంటున్నారో అన్న విషయాలు తెలుసుకోవటంతో పాటు అక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి, తమకు ఏమి కావాలి, ఏవి ఉపయోగం అన్నది గ్రహించుకోగల్గుతారు. కలిసి భోజనం చేయడం వారానికి ఒక్కరోజు అయినా అందరూ కలిసి భోజనం చేయాలి. అలా చేయటం వల్ల బయటకు వెళ్ళి, ఇతరులతో కలిసి భోజనం చేయాల్సొచ్చినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలకు తినిపించాల్సిన అవసరం ఉండదు. మంచి మాటలతో సహజంగా పిల్లలు అల్లరి బాగా చేస్తుంటారు. ఆ అల్లరి మోతాదు మించి΄ోతుంటుంది. వస్తువులు పాడవటం, విరగటం, పగిలి పోవటం కూడా జరుగుతుంటుంది. ఆ సమయంలో ఎంత కోపం వచ్చినా, ఆ పాడయిన వస్తువు గురించే మాట్లాడాలి కాని పిల్లవాడి మనస్తత్వం గురించి మాట్లాడకూడదు. ఆ వస్తువు భద్రత గురించి చెప్పాలి. మరొకసారి ఆ తప్పు చేయకుండా ఉండేలా చేయాలి. పాకెట్ మనీ సాధారణంగా పిల్లలు కొంచెం ఎదిగాక, వారికి వారి ఖర్చుల నిమిత్తం కొంత సొమ్ము ఇస్తుంటారు. వారు ఎలా ఖర్చు పెట్టుకున్నా పట్టించుకోరు. ఇది సరి కాదు. వారు ఆ డబ్బును ఎందుకు... ఎలా ఖర్చు చేస్తున్నారో పద్దు రాయమనాలి. వాటిని చెక్ చేసి, అందులో అనవసర ఖర్చులుంటే వాటిని ఎత్తి చూపాలి. దీనివల్ల పిల్లలకి మనీ మేనేజ్మెంట్ అలవడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ ఉదయం లేచే సమయం, భోజన సమయం, చదువుకునే సమయం, ఆటలాడే సమయం, పడుకునే సమయం.. ఇలా అన్నింటికీ ఒక టైం టేబుల్ తయారు చేయాలి. ఇది ఎంతో అవసరం. చదువు చదువు అని పోరాటం కాదు, ఎలా చదువుకోవాలో, చదువు ప్రాముఖ్యత ఏమిటో తెలియపరిస్తే వారు చదువుని కష్టపడి కాకుండా, ఇష్టపడి చదువతారు. థాంక్స్.. సారీ..! ఎదుటి వారికి ఇబ్బంది కలిగించినపుడు సారీ చెప్పటం, ఎవరి దగ్గరైనా ఏ వస్తువునైనా, లేదా సహాయాన్నైనా పొందితే,కృతజ్ఞత చెప్పటం అలవరచాలి. బాల్యం నుంచే పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం, ఇరుగు పొరుగుతో, తోటివారితో మర్యాదగా మెలగడం, ఉన్నదానిని కలిసి పంచుకోవడం వంటి వాటిని నేర్పిస్తూ, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. -
ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి
సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మంపై ముడతలను రావడానికి కారణమవుతాయి. కాలుష్యం కూడా చర్మంపై ముడతలకు కారణం అవుతుంది. మరి సహాజసిద్దమైన పద్దతుల్లో చర్మంపై ముడతలను ఎలా నివారించాలి అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. చర్మానికి మృదువైన, తేమను అందించే క్రీమ్‌ను రాసుకోండి రోజుకు కనీసం 15 నిమిషాలు మీ చర్మాన్ని మసాజ్ చేయడం. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి ముడతలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యం నిద్రపై చాలా ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడి చర్మంపై ముడతలకు కారణం అవుతుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ధూమపానం సాధారణ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసి, ముడతలకు దోహదం చేస్తుందట. అధిక నాణ్యత గల యాంటీ రింకిల్ క్రీమ్‌ను ఉపయోగించండి. ఇది ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయి పైతొక్కును ముఖంపై రబ్ చేసి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే యవ్వనంగా మారుతుంది. అలోవెలా జెల్లో యాంటీ ఆక్సిడెంట్స్, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ప్రతిరోజూ దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి. గుడ్డులోని తెల్లసొనను చర్మంపై అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయాలి. గుడ్డు తెల్లసొనలోని అల్బుమిన్ అనే ప్రోటీన్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పండిన అరటిపండును మెత్తగా చేసి 1స్పూన్ తేనే, 1స్పూన్ పెరుగు కలపి చర్మానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీళ్లతో వాష్ చేసుకోవాలి. అరటిపండులోని పోషకాలు కొల్లాజెన్‌ను పెంచుతాయి. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ముడతలను తగ్గిస్తుంది. -
జుట్టు రాలడం, తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ టానిక్ ట్రై చేయండి
బ్యూటీ టిప్స్ ►బీట్రూట్ ఒకటి తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా తరగాలి. రెండు ఉసిరి కాయలను గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి. వీటికి పన్నెండు రెమ్మల కరివేపాకు, గ్లాసు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాల పాటు మీడియం మంట మీద మరిగించాలి. చక్కగా మరిగాక దించేసి చల్లారిన తరువాత ఈ రసాన్ని వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ టానిక్‌ను వారానికి రెండు మూడుసార్లు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. రెండు గంటల తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చే స్తే కుదుళ్లకు పోషకాలు అందుతాయి. రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు ఊడడం తగ్గుతుంది. చివర్లు చిట్లకుండా చక్కగా పెరుగుతాయి. ► మరుగుతున్న రెండు గ్లాసుల నీటిలో మూడు టేబుల్ స్పూన్ల టీ పొడి, పది గులాబీ పువ్వులు వేసి పదినిమిషాల పాటు మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత వడగట్టి ఒక సీసాలో పోయాలి. తలస్నానం చేసిన జుట్టుకు ఈ డికాషన్‌ను పట్టించి, టవల్ చుట్టుకోవాలి. నీటితో కడగకూడదు. ఇది కండీషనర్‌లా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ► చాలామంది జుట్టుకు నూనె రాసుకోవడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు జీవం కోల్పోతుంది. అందుకే తలస్నానానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనెను తలంతా పట్టించాలి. 2 గంటల తర్వాత స్నానం చేస్తే జుట్టు పుట్టుకుచ్చులా మెరుస్తుంది. ► కోడిగుడ్లులోని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. వారానికి ఒకసారి ఎగ్వైట్ను కుదుళ్లకు పట్టించి 20-30 నిమిషాలు పట్టించి, ఆ తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, సిల్కీగా మారుతుంది. ► రెండు టేబుల్ స్పూన్ల మందారం పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి చూర్ణం చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. ► రెండు టేబుల్ స్పూన్ల ఎండిన మందారాల పొడికి కలబంద, ఉసిరి పొడి, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే తెల్లని జుట్టు సమస్య తగ్గుతుంది. జెల్ మెరుపులు టేబుల్ స్పూను పంచదార పొడిలో స్పూను వేడినీళ్లు పోసి కలపాలి. దీన్లో రెండు టీస్పూన్ల పచ్చి పాలు, స్పూను అలోవెరా జెల్ వేసి కలపాలి. శుభ్రంగా కడిగిన ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. పదినిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయాలి. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల చర్మానికి తేమ అంది, మృదువుగా నిగారింపుతో కనిపిస్తుంది. -
లవంగాలు, కర్పూరంతో రూమ్ ఫ్రెష్నర్.. ఇలా చేసుకోండి
వంటింటి చిట్కాలు కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా అన్నం వేసి నానిన బియ్యాన్ని గ్రైండ్ చేస్తే అప్పం మరింత మృదువుగా వస్తుంది. ఎంతో తియ్యగా ఉండే అరటిపండ్లపై ఫ్రూట్‌ఫ్లైస్ వాలుతూ చిరాకు పెడుతుంటాయి. అయితే మార్కెట్ నుంచి అరటిపండ్లు తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకుంటే ఫ్రూట్‌ఫ్లై ఒకటీ వాలదు. అరకప్పు వంటసోడాలో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని అవెన్‌లో లోపలి భాగంలో రాయాలి. హీటింగ్ కాయిల్స్, ఫ్యాన్ బ్లేడ్స్, లైట్స్ మీద రాయకూడదు. కింద, సైడు గోడలకు రాసి రాత్రంతా ఉంచేయాలి. ఉదయాన్నే కాటన్ వస్త్రంతో వంటసోడాని తుడిచేయాలి. సోడా పూర్తిగా పోయిన తరువాత నీటిలో కలిపిన వెనిగర్‌తో మరోసారి తుడవాలి. ఇలా చేస్తే అవెన్‌లో పేరుకుపోయిన మురికి, అవెన్ గోడలకు పడ్డ మచ్చలూ పోయి కొత్త దానిలా మెరుస్తుంది. అంగుళం దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, నాలుగు కర్పూరం బిళ్లలను మెత్తగా దంచి పొడిచేయాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు, కొద్దిగా నూనె వేసి ద్రవంలా మర్చాలి. ఈ ద్రవాన్ని ఖాళీ అయిన దోమల రిపెలర్స్, ఆల్ అవుట్ లాంటి డబ్బాల్లో వేసి ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే రూమ్ అంతా సువాసన వస్తుంది. ఇది సహజసిద్ధమైన రూమ్ ఫ్రెష్నర్గా పనిచేస్తుంది. -
పెదాలకు ఇది రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయి
హార్మోన్ల మార్పులు, విటమిన్ల లోపం, ధూమపానం, హైపర్ పిగ్మేంటేషన్ వంటి పలు కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. ఆ నలుపుదనం తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కొబ్బరి నూనె, తేనెలో పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై స్క్రబ్‌గా ఉపయోగించండి. ఇది పెదవులపై చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా, అందమైన రంగులోకి మారుస్తుంది. రెగ్యులర్‌గా లిప్‌స్టిక్ వాడేవాళ్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. అందుకే లిప్‌స్టిక్‌ను ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. బయటి నుంచి రాగానే ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌తో లిప్‌స్టిక్‌ను తొలగించుకోవాలి. విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి గ్రేట్ రెమెడీగా పనిచేస్తాయి.విటమిన్ ఈ అప్లై చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. గులాబీ నీళ్లను ప్రతిరోజూ పెదాలకు రాసుకోవడం వల్ల లేత గులాబీ రంగులోకి మారతాయి. పెదాలకు లిప్‌బామ్ ఎంచుకునేటప్పుడు ఎస్పీఎఫ్ 30 ఉండేలా చూసుకోవాలి. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల మీ పెదాలు అందంగా మెరుస్తాయి. పెదవులు పగిలి బాధ పెడుతుంటేనేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది. స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి -
క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు.. ఈ ఫేస్‌ప్యాక్ వేసుకోండి
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? దీనికోసం వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ ట్రీట్మెంట్లు, ఫేస్‌క్రీములు కొంటుంటారు. అయితే ఇంట్లోనే దొరికే వస్తువులతో ఫేషియల్ లాంటి గ్లోను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ►మెటిమలు, నల్లమచ్చలు పోవాలంటే... ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. పొడి చర్మం అయితే నిమ్మరసం బదులు కీరదోస రసం కలుపుకోవచ్చు. ► ఇక లేత కొబ్బరితో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం చాలా నిగారింపును సంతరించుకుంటుంది. లేత కొబ్బరి తో వేసుకునే ఫేస్ ప్యాక్ స్కిన్‌టోన్‌ను రెట్టింపు చేస్తుంది. ► కొంచెం నిమ్మరసాన్ని తేనెతో కలిపి ముఖానికి అప్లై చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటిలో కడగాలి. ఇది చర్మంలోని తేమను పెంచడమే కాకుండా, ఈ మాస్క్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. ► ఒక చెంచా తేనెను పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. ►చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంటే... రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖానికి రాయాలి. ఎగ్ ప్యాక్ కూడా ప్రయత్నించవచ్చు. -
ఎంత రుద్దినా ఉల్లి వాసన పోవడం లేదా? ఇలా చేయండి
ఇంటిప్స్: ►రెండు టేబుల్ స్పూన్ల కర్బూజా గుజ్జులో టీస్పూను నిమ్మరసం, టేబుల్ స్పూను శనగ పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలు, ట్యాన్ తొలగి చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. ► కెచప్‌లో కొద్దిగా అయోడిన్ వేసి కలపాలి. అయోడిన్ వేసిన తరువాత కెచప్ రంగు మారితే పాడైపోయినట్టు. అంతేగాక ఇతర రసాయనాలు కలిసిన కల్తీ కెచప్ మాత్రమే ఇలా రంగు మారుతుంది. ► చీజ్ ముక్కను మంట దగ్గర పెట్టినప్పుడు మండితే చీజ్ నకిలీది. ఇలా కాకుండా నిప్పు సెగకు చీజ్ కరిగితే స్వచ్ఛంగా ఉన్నట్టు. ► నిమ్మకాయలను ముప్పైసెకన్ల పాటు మైక్రోవేవ్‌లో పెట్టి, ఆ తరువాత పిండితే రసం బాగా వస్తుంది. ► కేక్ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్‌స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్ పిక్ గుచ్చి, రిఫ్రిజిరేటర్లో పెడితే కేక్ పాడవకుండా తాజాగా ఉంటుంది. ► బ్రెడ్ లేదా బిస్కెట్స్‌ను పాలల్లో ముంచుకుని తినేటప్పుడు...చేతితో కాకుండా... ఫోర్క్‌తో పట్టుకుని ముంచితే పాలల్లో చక్కగా మునిగి మరింత రుచిగా ఉంటాయి. ► బాస్కెట్లో అడుగున కొన్ని పేపర్ ముక్కలు వేసి బంగాళదుంపలు వేయాలి. దుంపలపైన మరికొన్ని పేపర్ ముక్కలు వేసి నిల్వచేస్తే ΄ాడవకుండా తాజాగా ఉంటాయి. ► మిగిలిపోయిన నిమ్మచెక్కలకు ఉప్పు అద్ది ఉంచితే పాడవకుండా తాజాగా ఉంటాయి. ► మిగిలిపోయిన బ్రెడ్ ప్యాకెట్‌ను క్లాత్ బ్యాగ్‌లో ఉంచితే బూజు పట్టకుండా తాజాగా ఉంటుంది. ► ఉల్లిపాయను ముక్కలు తరిగిన తరువాత చేతులు ఉల్లి వాసన వస్తుంటే... కొద్దిగా టూత్ పేస్టుని తీసుకుని దానితో చేతులను రుద్ది కడగాలి. ఇలాచేస్తే ఉల్లిఘాటు వదిలిపోతుంది. ► పేపర్ బ్యాగ్‌కు రంధ్రాలు చేసి లోపల వెల్లుల్లిని పెడితే నెలల పాటు నిల్వ ఉంటుంది. -
కేక్ మిగిలిపోయిందా? ఇలా చేస్తే పాడవకుండా ఉంటుంది
సెలెరీని సిల్వర్ ఫాయిల్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే రెండు మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది. చీమలు ఎక్కువగా ఉన్న చోట దాల్చిన చెక్క పొడిని నీటితో కలిపి స్ప్రే చేయడంతో చీమలు పారిపోతాయి. కాఫీ పౌడర్ లేదా మిరియాల పొడి నీళ్లలో కలిపి ఆ ప్రాంతంలో చల్లినా చీమలు రాకుండా ఉంటాయి. వేపుళ్ళు చేస్తున్నప్పుడు చెంచా వెనిగర్ చేర్చితే కూరగాయలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది. మిగిలిపోయిన పాలను ఐస్‌ట్రేలో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డకట్టిన పాల బిళ్లలను టీ కాఫీలలో వాడుకోవచ్చు. ఒక్కోసారి క్యారట్పైన ఎక్కువగా మట్టిపేరుకుపోతుంటుంది. అటువంటప్పుడు .. స్టీల్ స్క్రబర్‌తో రుద్ది కడిగితే, సులభంగా మట్టి వదులుతుంది. టొమాటోలను పసుపు నీళ్లల్లో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత కడిగి తుడిచిపెట్టుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. కేక్ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్‌స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్ పిక్ గుచ్చి, రిఫ్రిజిరేటర్లో పెడితే కేక్ పాడవకుండా తాజాగా ఉంటుంది. -
కొబ్బరి నూనెలో ఇవి కలిపి ముఖానికి రాసుకుంటే.. ముఖం వెలిగిపోతుంది
సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ ►కొబ్బరినూనె మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. సెలబ్రెటీలు చాలామంది తమ చర్మాన్ని అందంగా... ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొబ్బరినూనెను విరివిగా వాడుతుంటారు. కొబ్బరినూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పొడి చర్మానికి ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరినూనె చర్మానికి సహజసిద్ధమెన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ► టీ స్పూను కొబ్బరినూనెలో అర టీస్పూను పెరుగు, టీస్పూను ఓట్స్ పొడి వేసి మెత్తని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గుండ్రంగా మర్దన చేస్తూ గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖచర్మానికి తేమ అంది ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ► రెండు టీస్పూన్ల కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, టీ స్పూను వంటసోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కు, గడ్డం, నుదురు వంటి బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పట్టించి పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడమేగాక, చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. ఫలితంగా చర్మరంధ్రాల్లో పేరుకున్న అధిక జిడ్డు, దుమ్మూ ధూళీ పోయి చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది. ► ముఖం మీద నల్లమచ్చలు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలపై కొబ్బరినూనెతో క్రమం తప్పకుండా మర్దన చేస్తుంటే .. మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
ఇంట్లోనే దొరికే వస్తువులతో ఫేస్‌ప్యాక్.. ఇన్స్టంట్ గ్లో ఖాయం
బ్యూటీ టిప్స్ ఎండకు తిరిగి రావడం వల్ల కొందరి ముఖం కమిలిపోయినట్లు కనిపిస్తూ నల్లగా మారుతుంది. వెంటనే వారి ముఖం కాంతిమంతంగా మారాలంటే ఒక టీస్పూన్ శనగపిండిలో కొద్దిగా టమాటో రసం, పెరుగు, చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని చన్నీళ్లతో కడుక్కుంటే ఇన్స్టంట్ గ్లో వస్తుంది. జిడ్డు చర్మం, మొటిమలతో బాధ పడేవారు ఓ పాత్రలో 10-12 వేప ఆకులు తీసుకొని, వాటికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని రెండు రోజులకోసారి ప్యాక్‌లా వేసుకుంటే సరి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది. పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. దీన్ని మెత్తగా పేస్ట్‌లా చేసుకొని తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనే కలిపి ప్యాక్‌లా వేసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలిపోయి చర్మం తాజాగా మెరుస్తుంది. అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. సీజనల్ ఫ్రూట్స్‌తో కూడా చక్కగా పేస్ప్యాక్ ట్రై చేయొచ్చు. బొప్పాయి ఇందుకు బెస్ట్ ఆప్షన్. కాస్తంత బొప్పాయి గుజ్జులో రోజ్‌వాటర్ కలిపి రాసుకుంటే చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. -
జుట్టు సౌందర్యానికి మామిడి ఆకులు.. ఈ విషయాలు మీకు తెలుసా?
నోరూరించే మామిడి పళ్లు తినాలంటే వేసవి వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. అయితే మామిడి ఆకులు కోసుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అందుకే వివాహాది శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకుంటూనే ఉన్నాం. ఇంతేనా? జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు కూడా మామిడి ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మామిడి ఆకులలో జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఎ, ఇ, సి విటమిన్లు ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మామిడాకులలో పైన చెప్పుకున్న విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఉపయోగించిన వారికి జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు... తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్‌ను కట్టుకోవడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ తైలాలు జుట్టు సంరక్షణకు ఉపకరిస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా, బలహీనంగా మారకుండా ఉంచుతాయి. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , నిగారింపు వచ్చేలా చేయడంలో సహాయపడతాయి. ఎలా ఉపయోగించాలి? ►తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని కాసిని నీళ్లు చేర్చి మిక్సీలో వేసుకుని లేదా రుబ్బుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్‌ను చివళ్ల నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి. ఆరేదాకా ఉంచి, ఆ తరవాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ►మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తరువాత పేస్ట్ లా చేసుకుని బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతో పాటు నల్లగా మారుతుంది. ►మధుమేహంతో బాధపడేవారు కొన్ని మామిడి ఆకులను శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడకబెట్టి కషాయంలా కాచుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక వడపోసి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. -
రోజూ చప్పట్లు కొట్టడం వల్ల మెమొరి పవర్ పెరుగుతుందా?
ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు, వారు చేసిన పని హర్షణీయంగా... ప్రశంసార్హంగా అనిపించినప్పుడు వారిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతాం.. అయితే అలా చప్పట్లు కొట్టడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటికే ‘క్లాపింగ్ థెరపీ’ అని పేరు. చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూద్దాం... ►సాధారణంగా ఎవరినైనా అభినందిస్తున్నప్పుడు చప్పట్లు కొడతాం. అది ప్రశంసలో ఒక భాగం. కానీ చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ‘లాఫింగ్ థెరపీ’ మాదిరిగానే ‘క్లాపింగ్ థెరపీ’ కూడా ఇప్పుడు ఫేమస్ అయ్యింది. క్లాపింగ్ థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే.. ►మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలు, నరాల చివరలకు కేంద్రం. మీరు వాటిని ఉత్తేజపరిస్తే మీ ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అయితే చప్పట్లు కొట్టడం వల్లే ఆరోగ్యం విషయంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ►చప్పట్లు కొట్టడం ఆందోళనను నియంత్రించడానికి సులభమైన మార్గం. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే మెదడుకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. ఇది నిరాశను పోగొడుతుంది. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి రోజువారి వ్యాయామంలో చప్పట్లు కొట్టడాన్ని కూడా భాగంగా చేసుకోవాలి. ►కరతాళ ధ్వనులు చేయడం వల్ల రక్తపోటు స్ధాయులు నియంత్రణలో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు, చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ►చప్పట్లు కొట్టడం వల్ల తెల్ల కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రుజువైంది. ఫలితంగా కాలానుగుణంగా వచ్చే అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవడంతో పాటు వారి చేతి రాతలో తప్పులు దొర్లకుండా ఉంటాయి. ► చప్పట్లు కొట్టడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఆశిస్తూ చప్పట్లు కొట్టే ముందు అరచేతులకు కొద్దిగా ఆవ నూనె లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. అరచేతుల్ని నిటారుగా ఉంచి.. చేతివేళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచి చప్పట్లు కొట్టాలి. మంచి ఫలితాల కోసం ఉదయం పూట కొట్టడం మంచిదట. లేదంటే ఎవరి వీలును బట్టి వారు ఈ క్లాపింగ్ థెరపీ ని అనుసరించవచ్చు. -
టిప్స్: ఇలా చేస్తే ఎక్కిళ్లు వెంటనే తగ్గిపోతాయి
►కొంతమందికి నిద్రలేవడంతోనే విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. అలాంటి వారు తులసి, పుదీనా, రెండు మిరియపు గింజలు నిమ్మరసం కలిపి కషాయం లాగా చేసుకొని రోజూ ఒక కప్పు కషాయం తీసుకుంటుంటే నెలరోజుల్లో సమస్య తీరిపోతుంది. ఇవి అందుబాటులో లేనపుడు తుమ్ములు వస్తుంటే కొత్తిమీర వాసన చూస్తూ ఉండండి . తుమ్ములు ఆగుతాయి. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. పైన చెప్పిన కషాయం పూర్తి ఉపశమనం ఇస్తుంది. ►వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకొని పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు. ►ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని ఒక కప్పు వేడినీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు, దమ్ము, ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. -
చలికాలంలో ఇలా చేస్తే చర్మం మృదువుగా, నిగనిగలాడుతుంది
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం మన చర్మంపై కూడా కనిపిస్తోంది. మార్పు, వాతావరణం కారణంగా, చర్మం పగుళ్లు మొదలవుతుంది. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి మన పెద్దలు కొన్ని గృహ చిట్కాలను పాటించేవారు. అవేమిటో తెలుసుకుందాం. పూర్వం చలికాలం రాగానే పెద్దవాళ్లు వంటికి వెన్నపూస లేదా నువ్వులనూనెను రాసుకుని ఎండలో కాసేపు నిలబడేవారు. దాంతో చర్మానికి తగిన పోషకాలు అంది తేమను కోల్పోకుండా మృదువుగా ఉండేది. ఇప్పుడు కూడా మనం అలా చేయవచ్చు. వాటితో పాటు మరికొన్ని చిట్కాలు చూద్దాం. చర్మానికి కలబంద: అలోవెరా జెల్ అంటే కలబంద గుజ్జు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎల్లప్పుడూ చర్మానికి మంచి నేస్తం వంటిది. అలోవెరాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలోనూ, గాయాలను నయం చేయడానికీ సహాయపడుతుంది. దీనికోసం చేయవలసిందల్లా రాత్రిపూట కాసింత కలబంద గుజ్జు... అదేనండీ... అలోవెరా జెల్‌తో ముఖానికి, శరీరానికి సున్నితంగా మసాజ్ చేస్తే సరి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరినూనె: తలకే కాదు. ఒంటికి కూడా... కొబ్బరినూనెను కేవలం తలకు మాత్రమే రాసుకునే తైలంగా చూస్తారు చాలామంది. అయితే కొబ్బరి నూనె చర్మానికి కూడా చాలా ప్రయోజనకరమైనది. స్వచ్ఛమైన కొబ్బరినూనెను తీసుకుని ఒంటికి, ముఖానికి సున్నితంగా మసాజ్ చేయాలి. పడుకునే ముందు లేదా స్నానానికి అరగంట ముందు ఇలా చేస్తే చికాకు, అసౌకర్యం లేకుండా ఉంటుంది. అదేవిధంగా రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన నేతిని చర్మానికి రాసుకుంటూ ఉంటే కొద్దిరోజుల్లోనే చర్మం కోమలంగా... మృదువుగా నిగారింపును సంతరించుకుంటుంది. ఆవనూనె: పొడి బారిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా మార్చుకోవడానికి ఆవనూనెను చర్మంపై అప్లై చేయడం సర్వసాధారణం. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మ సమస్యలు ఏవీ రావు. పిల్లలకు రోజూ బేబీ ఆయిల్ లేదా వెన్న, నెయ్యి లేదా నువ్వులనూనెను ఒంటికి రాసి ఎండలో ఆరిన తర్వాత స్నానం చేయిస్తే చర్మం మృదువుగా ఉండడంతో పాటు ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. చలికాలంలో ఇలా చేయడం మంచిది. -
ఈ నూనె రాస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది
సమస్యలు తగ్గించే ఆమ్లా ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడిచేయాలి. నూనె చక్కగా వేడెక్కిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల ఉసిరిపొడి వేసి కలపాలి. సన్నని మంటమీద మరో ఐదు నిమిషాలు మరగనిచ్చి దించేయాలి. నూనె చల్లారాక గాజుసీసాలో వేసి నిల్వచేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి మర్దన చేసుకోవాలి. వారంలో కనీసం నాలుగుసార్లు ఈ నూనెతో మర్దన చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుముఖం పట్టి ఒత్తుగా పెరుగుతుంది. మృదువుగా మార్చే క్రీమ్ టేబుల్ స్పూను పెట్రోలియం జెల్లీలో టేబుల్ స్పూను కొబ్బరి నూనె వేసి, టేబుల్ స్పూను గ్లిజరిన్, ఐదారు చుక్కల నిమ్మరసం వేసి క్రీమ్‌లా మారేంతవరకు బాగా కలపాలి. తరువాత ఈ క్రీమ్‌ను పగిలిన పాదాలకు రాసి మర్దన చేయాలి. రోజుకు రెండుసార్లు ఈ క్రీమ్‌ను అరికాళ్లకు రాస్తే పగుళ్లు తగ్గి పాదాలు కోమలంగా, మృదువుగా మారతాయి. -
భోజనం తర్వాత సోంపు తింటే ఏమవుతుందో తెలుసా?
►రాత్రి పడుకునేముందు గ్లాసు నీళ్లలో టీస్పూను మెంతులు వేసి నానపెట్టాలి. ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలగడంతో΄ాటు, శరీర బరువు అదుపులో ఉంటుంది. రోజూ మెంతుల నీళ్లు తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ►రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ చల్లని పాలను తాగాలి. పాలను బాగా మరిగించి అనంతరం వాటిని చల్లార్చి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అనంతరం వాటిని నిద్రకు ముందు తాగాలి. ఇలా 3 రోజుల పాటు వరుసగా చేస్తే ఎసిడిటీ తగ్గిపోతుంది. ►రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం కాసిని సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. -
డైట్లో అవి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు
అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు. వాకింగ్, డైటింగ్, వ్యాయామం ... ఇలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామంతో పాటు డైట్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేట్టు చూసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు కూరగాయలు చక్కగా సాయం చేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. స్థూలకాయాన్ని నియంత్రణలో ఉంచకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతాయి. శరీరాన్ని డొల్లగా మార్చేస్తాయి. రోజూ తగినంత నిద్ర, నీళ్లు, సరైన డైట్ వల్ల స్థూలకాయం రాకుండా ఉంటుంది. -
ఇంటి గోడలపై మచ్చలు పోవడం లేదా? ఇలా క్లీన్ చేయండి
ఇంటి గోడలపై మరకలు పడితే వదిలించడం కాస్త కష్టమే. కొన్నిసార్లు అయితే వీటిని లగించడానికి ఎంతో కష్టపడాలి, అయిన సరిగ్గా వదలవు, కొన్ని సార్లు గోడు రంగు కూడా ఊడిపోతూ ఉంటుంది.కొన్నిసార్లు ఈ మరకలు పోవాలంటే మళ్లీ పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ మరకలు పడ్డప్పుడల్లా పేయింటింగ్ వేయలేం కదా.ఇది ఖర్చుతో కూడుకున్న పని. అలాంటప్పుడు ఖర్చులేకుండా సింపుల్ చిట్కాతో మరకల్ని పోగొట్టి కొత్త ఇంటిలా మెరిసేలా చేయొచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో ఎలాంటి మొండి మరకల్ని కూడా ఈజీగా పోగొట్టొచ్చు. దీనికోసం ఏం చేయాలంటే.. ►హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను బేకింగ్ సోడాతో 1:1 నిష్పత్తిలో కలపండి. ఈ మిశ్రమాన్ని స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించి గోడలపై అప్లై చేసి కాసేపు అలాగే వదిలేయండి. కాసేపటి తర్వాత తడి గుడ్డతో తుడిస్తే గోడలపై ఎలాంటి మరకల్ని వదిలిస్తుంది. ► బేకింగ్ సోడా స్క్రబ్బింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.పెరాక్సైడ్ బ్లీచింగ్‌లా పనిచేసి మరకల్ని సులభంగా పోగొడుతుంది. ఒకవేళ గోడలపై మరకలు లేకపోయినా ఈ కెమికల్‌ను స్ప్రే చేస్తే దుమ్ము, దూళి కూడా క్షణాల్లో వదలగొడుతుంది. -
మిగిలిపోయిన అన్నం, కూరల్ని మొక్కలకు పడేయండి
అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ►మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి. మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేము. ఈ పుల్లటి మజ్జిగను బకెట్ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. ► మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్‌లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిది. ► ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్‌లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి. చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి. -
టీనేజర్స్‌ని ఇబ్బంది పెట్టే మొటిమల సమస్యకు ఇలా చెక్ పెట్టొచ్చు
మొటిమలు.. చాలామంది టీనేజర్స్‌ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.కాలుష్యం, హార్మోన్లలో మార్పులు,పోషకాహార లోపాలు వంటి కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అయితే సమస్యకు నివారించేందుకు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అవి మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతుంటాయి. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే కంటే మన ఇంట్లోనే దొరికే నేచురల్ ఫేస్‌ప్యాక్‌తో మొటిమలకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా. ►బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. ► జాజికాయ, మిరియాలు, మంచి గంధం..ఈ మూడింటిని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఒక రాయి మీద కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ అరగదీయాలి. అలా అరగదీయగా వచ్చిన మూడు రకాల పేస్టులను ఒక చిన్న కప్పులోకి తీసుకుని ఒకదానితో ఒకటి బాగా కలపాలి. ► ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకుని నిద్రపోవాలి. మరునాడు పొద్దున్నే లేచి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మూడు నుండి ఏడు రోజుల వరకు చేసినట్లయితే ఎలాంటి మొటిమలు అయినా, మొండి మచ్చలయినా సులభంగా తొలగిపోతాయి. ► రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి -
బిర్యానీ వండేటప్పుడు ఈ చిట్కా పాటించండి.. టేస్ట్ బావుంటుంది
వంటింటి చిట్కాలు ► అరకప్పు వంటసోడాలో నీళ్లు పోసి పేస్టులా కలపా. ఈ పేస్టుని అవెన్‌లో లోపలి భాగంలో రాయాలి. హీటింగ్ కాయిల్స్, ఫ్యాన్ బ్లేడ్స్, లైట్స్ మీద రాయకూడదు. కింద, సైడు గోడలకు రాసి రాత్రంతా ఉంచేయాలి. ఉదయాన్నే కాటన్ వస్త్రంతో వంటసోడాని తుడిచేయాలి. సోడా పూర్తిగా పోయిన తరువాత నీటిలో కలిపిన వెనిగర్‌తో మరోసారి తుడవాలి. ఇలా చేస్తే అవెన్‌లో పేరుకుపోయిన మురికి, అవెన్ గోడలకు పడ్డ మచ్చలూ పోయి కొత్త దానిలా మెరుస్తుంది. ► పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి. ► మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి. ► అన్నం మెత్తగా ఉడికినప్పుడు క్యారెట్‌ను అత్యంత సన్నగా తరిగి అన్నంలో కలుపుకోవాలి.అప్పుడు అన్నం మరీ మెత్తగా అనిపించదు. ► పకోడి చేసేప్పుడు చేసేప్పుడు పిండిలో కాస్త నూనే మరియు చిటికెడు వంట సోడ కలిపితే పకోడిలు క్రిస్పీగా వస్తాయి. ► బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం పొడిపొడిగా ఉండటమే కాకుండా రుచిగానూ ఉంటుంది. ► వడియాలు నిల్వ ఉంచే డబ్బాలో కాస్త ఇంగువ ఒక గుడ్డలో కట్టి వేస్తే వాటిని వేయించే సమయంలో మంచి వాసన రుచి ఉంటాయి. ► రసం తీసేసిన నిమ్మకాయలను, సన్నని ముక్కలుగా తరిగి, ఆవిరి మీద ఉడికించి, దానికి కొంచం ఉప్పు కారం, బెల్లం వేసి పోపు వెయ్యండి. నోరూరించే ఇన్స్టంట్ నిమ్మకాయ పచ్చడి రెడీ. -
పార్టీకి వెళుతున్నారా? ఈ ఫేస్‌ప్యాక్‌తో ఇన్స్టంట్ గ్లో
ఇన్స్టంట్ గ్లో ప్యాక్ ఎంత మంచి డ్రెస్, దానికి తగ్గ యాక్సెసరీస్ ధరించినా, ముఖం ప్రకాశవంతంగా ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటుంది. క్షణాల్లో మెరుపులీనేలా కనిపించే ఇన్స్టంట్ గ్లో ప్యాక్‌ను ప్రయత్నించి చక్కగా మెరిసిపోండి. ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, రెండు టేబుల్ స్పూన్ల చల్లటి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేయాలి. ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. -
బట్టలపై మరకలు పడ్డాయా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి
బట్టలపై మరకలు పడ్డప్పుడు డ్రై క్లీనింగ్‌కి ఇద్దామంటే ఆ ధరకు కొత్తదే వస్తుందమే అనిపిస్తుంది. అయితే మరకలను తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటో చూద్దాం. ►మీ దుస్తులు మెరిసేలా చేయాలంటే ఆస్పిరిన్ మాత్రలు బాగా ఉపయోగపడతాయి. ఆస్పిరిన్‌లో ఉండే ఎసిటైల్సాలిసిలిక్ ఆమ్లం బట్టలపై పడిన మరకలను తొలగించేందుకు సాయం చేస్తుంది. ►తెల్లని దుస్తులను నాలుగైదు ఆస్పిరిన్ టాబ్లెట్లు వేసిన నీళ్ల బకెట్లో బాగా నానబెట్టండి. తరవాత బట్టల సబ్బుతో ఉతకడమో లేదా వాషింగ్ మెషీన్లో వేసి మామూలుగా ఉతికి జాడించి ఆరేస్తే సరి! ► రక్తపు మరకలను తొలగించడానికి.. ఆస్పిరిన్‌ను చల్లటి నీటిలో కరిగించి బట్టలను నానబెట్టండి. వేడినీటితో రక్తపు మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. ఇది ప్రోటీన్లు గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఆ తరువాత మరకను తొలగించడం కష్టం అవుతుంది. చేస్తుంది. ► నూనె, గ్రీజు మరకలకు.. ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోయాలి. ఒక ముక్క మీద ఉప్పు వేసి మరకపై రుద్దాలి. ఇది నిమిషాల్లో బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది. ► వక్కపొడి, పాన్ మసాలా మరకలు పెరుగు లేదా మజ్జిగను మరక పడ్డ చోట ఉంచి పది నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో వస్త్రాన్ని కడగాలి. ఇది బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది. ► టీ–కాఫీ మరకలు టీ–కాఫీ మరకలు పడ్డప్పుడు ముందుగా గోరువెచ్చటి నీటిలో ఆ వస్త్రాన్ని పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత లిక్విడ్ డిటర్జెంట్‌లో నానబెట్టాలి. తర్వాత మరక పడ్డ చోట చేతితో రుద్దితే మరకలు తొలగుతాయి. ► టర్కీ టవళ్లు, దుప్పట్ల వంటి వాటిని బట్టలుతికే సోడా కలిపిన నీటిలో నానబెట్టి ఉతికితే త్వరగా శుభ్ర పడతాయి. -
బీట్రూట్ ఫేస్‌ప్యాక్.. ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది
బ్యూటీ టిప్స్ ►బీట్ రూట్ తొక్కలు, కమలా తొక్కలను నీడలో ఆరబెట్టాలి. పెళపెళ విరిగేలా తొక్కలు ఎండిన తరువాత మెత్తగా పొడిచేయాలి. రెండు టేబుల్ స్పూన్ల ఈ పొడిలో రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తరువాత పదిహేను నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. ఈ ప్యాక్‌తో వచ్చే గ్లో ఎక్కువ రోజులు ముఖాన్ని అందంగా ఉంచుతుంది. ► చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో బీట్రూట్ ముందుంటుంది. మొటిమలని తగ్గిస్తుంది. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇందులో పాలు కలిపి చేస్తాం. కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది. ► పాలు, తేనె రెండింటి కలయిక ముఖ సహజ కాంతిని పెంచుతుంది. పాలలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలని కలిగి చర్మంలోని మృతకణాలు, మలినాలను తొలగిస్తుంది. పాలలోని ఎమోలియెంట్, హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. -
ఇలా చేస్తే మీ పాత సోఫాలు కొత్త వాటిలా మెరుస్తాయి
క్లీనింగ్ టిప్స్ ►ఫ్యాబ్రిక్ సోఫాను శుభ్రం చేయడానికి, ఆరు టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. దీనిలో తగినన్ని వేడి నీళ్లు పోస్తూ బాగా కలపండి. దానికి రెండు టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఆ తరువాత, ఈ ద్రావణాన్ని చల్లబరచండి. ► చల్లబడిన తర్వాత దానిని బాగా కలిపితే నురగ వస్తుంది. ఇప్పుడు సోఫాపై భాగంలో గుడ్డ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురుగుతో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తదానిలా మెరిసిపోతుంది. ► వెనిగర్‌లో లిన్సీడ్ ఆయిల్ మిక్స్ చేసి ఓ క్లాత్‌తో తుడిస్తే మీ పాత సోఫాలు కొత్తవాటిలా మెరుస్తాయి. ► వెల్వెట్ సోఫాలపై చాలా దుమ్ము పేరుకుపోతుంది. వాటిని శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్ వాడొచ్చు. లేదా సాఫ్ట్ డిటర్జెంట్ ఉపయోగించి కూడా శుభ్రం చేయొచ్చు. -
బొద్దింకల బెడద తగ్గించే సింపుల్ వంటింటి చిట్కాలు
కిచెన్ టిప్స్ ►మిరియాలు, ముద్దకర్పూరాలను సమపాళల్లో తీసుకుని పొడిచేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా టూత్‌పేస్టు, కొద్దిగా ఫేస్ పౌడర్ వేసి కలపాలి. చివరిగా నాలుగు వెల్లుల్లి గర్భాలను మెత్తగా నూరి అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో రాస్తే బొద్దింకలు లోపలికి రావు. చూద్దామన్నా ఇంట్లో ఎక్కడా కనిపించవు. ► వంటింట్లో వాడే టవల్స్, మసిబట్టలు జిడ్డుపట్టి ఒక పట్టాన వదలవు. వీటిని ఉతకడానికి పెద్దగా శ్రమపడనక్కర్లేదు. వేడినీటిలో కాస్తంత షాంపు కలపాలి. ఈ నీటిలో జిడ్డుపట్టిన టవల్‌ను నానబెట్టాలి. 20 నిమిషాల తరువాత బ్రష్‌తో రుద్దుతూ ఉతికితే జిడ్డు, దుర్వాసన పోయి టవల్ శుభ్రంగా మారుతుంది. వారానికి ఒకసారి కిచెన్ టవల్స్‌ను ఇలా ఉతికితే జిడ్డుగా అనిపించవు. -
సింక్ వద్ద దోమలు, బొద్దింకలు వస్తున్నాయా? ఇలా చేయండి
ఇంటిప్స్ ►గ్లాసు నీళ్లల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను ముక్కలుగా తుంచి వేయాలి. దీనిలో బోరిక్ యాసిడ్ రెండు టీ స్పూన్లు వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని సింక్‌లో పోస్తే బొద్దింకలు రావు. ► నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడవాలి. వీటికి కొద్దిగా నూనె రాసి టిష్యూపేపర్ వేసిన బాక్స్‌లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. ► గ్లాసు నీళ్లలో కొద్దిగా వెనిగర్ వేసి టూత్‌బ్రష్‌లను నానబెట్టాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే టూత్ బ్రష్‌లు శుభ్రపడతాయి. ► నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని ఐస్‌క్యూబ్ ట్రేలో పోసి రాత్రంతా రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. ఉదయం ఈ ఐస్‌క్యూబ్‌ను తీసి దుర్వాసన వస్తోన్న సింక్‌లో వేస్తే దుర్వాసన తొలగిపోతుంది. ► టొమాటో చుట్టూ గాటు పెట్టి మరుగుతున్న నీటిలో వేయాలి. నిమిషం తరువాత తీసేసి ఐస్‌వాటర్‌లో వేయాలి. తరువాత టొమాటోను పట్టుకుని లాగితే తొక్క సులభంగా వచ్చేస్తుంది. -
ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బ్యూటీ టిప్స్ ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్‌ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది. ►రెండు కర్పూరం బిళ్లలు, మూడు కప్పల వేపాకుల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి పేస్టుచేయాలి. ఈ మిశ్రమాన్ని చుండ్రు ఉన్న ప్రాంతంలో రాసి మర్దన చేయాలి. చుండ్రు బాధ క్రమంగా తగ్గిపోతుంది. కర్పూరం పొడిని ఆలివ్ నూనెలో వేసి కలిపి జుట్టుకు పట్టించినా చుండ్రు తగ్గుతుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వారానికి మూడుసార్లు చేస్తే ఉపశమనం త్వరగా వస్తుంది. ► కాలివేళ్ల సందుల్లో గాలి తగలక పాచిపడుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే...కాళ్లను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు టూత్పేస్టుని వేళ్ల సందులో రాయాలి. రోజూ పడుకునేముందు ఇలా చేస్తే కాళ్లు పాయవు. ► ఒక బౌల్లో హాఫ్ కప్ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్‌ని మొహానికి అప్లయ్ చేసి.. 15 మినట్స్ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోండి. -
ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా వేపాకులతో చెక్ పెట్టొచ్చు
వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్యసాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు. ► ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ∙చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒకకప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్దిరోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. ► ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. -
పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు, సింపుల్‌గా ఇంట్లోనే..
పెడిక్యూర్ ఇప్పుడు ఇంట్లోనే.. ►పాదాలను మెరిపించడంలో అరటితొక్కలు చక్కగా పనిచేస్తాయి. ►అరటితొక్కలను పాదాలపైన రుద్దితే మృతకణాలు, దుమ్మూ ధూళీ తొలగిపోతాయి. ► అరటి తొక్కలను ముక్కలుగా తరిగి కొద్దిగా తేనె వేసి పేస్టు చేయాలి. ఈ పేస్టుని పాదాలకు రాయాలి. అరగంట తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారడంతో పాటు, చక్కగా మెరుస్తాయి. ► అరటితొక్కల పేస్టులో కొద్దిగా అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్టుని పాదాలకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ పేస్టు పాదాలకు తేమనందించి కోమలంగా ఉంచుతుంది. ► అరటితొక్కల పేస్టులో కాఫీ పొడి, తేనె వేసి కలిపి స్క్రబర్‌లా పదిహేను నిమిషాలు రుద్దాలి. పాదాలపైన మురికి, మలినాలు పోయి చక్కగా మెరుస్తాయి. -
గుండెపోటు వస్తుందో లేదో ముందే తెలుసుకోండి..ఆ ట్యాబ్లెట్ దగ్గర ఉంచుకోండి
గుండెలో కొవ్వు పేరుకుపోవడం, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం, అధిక బరువు, డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ రెసిస్టన్స్ కారణాల వల్ల సంభవించవచ్చు. పైన పేర్కొన్న కొన్ని కారణాల వల్ల గుండె కండరాల్లో కొవ్వు అధికంగా పేరుకునేటట్లు చేస్తుంది. ఇలా పేరుకుపోయిన కొవ్వు గుండెను బలహీనపరిచి హార్క్ రిస్క్‌ను పెంచుతుంది. ముందే లక్షణాలను గుర్తించడం వల్ల జాగ్రత్తపడొచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చేముందే శరీరం కొన్ని హెచ్చరికలను మనకు పరోక్షంగా పంపుతుంది. కానీ వాటిని మనం సాధారణంగా భావించి పెద్దగా నోటిస్ చేయము. పల్ప్ టేషన్ కొద్ది మెట్లు ఎక్కినా ఆయసం వస్తుంది. కుడి చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బంది,నొప్పి, చెమట పడుతుంది. ఒక వయసు దాటిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇంట్లో "సార్బిట్రేట్ " మాత్రలు( లైఫ్ సేవింగ్ మాత్రలు చాలా తక్కువ ఖరీదు) అందుబాటులో ఉంచుకోవాలి. ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా ఆ మాత్ర ఒకటి నాలుక కింది భాగంలో ఉంచుకోవాలి, మింగకూడదు. డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలి. స్టంట్ వేయించుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ? ►స్టంట్ ప్రక్రియ ముగిశాక, మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి, భవిష్యత్తులో అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం. ► ఆస్పిరిన్,క్లోపిడోగ్రెల్ వంటి యాంటీ ప్లేట్లెట్ మందులతో సహా డాక్టర్ సూచించిన మందులను వాడండి. ► ధూమపానం..అనేక జబ్బులకు కారకం. కాబట్టి మందు, సిగరెట్ వంటివి మానేయడం మంచిది. ► కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. ► ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన బరువు ఉంచుకోవడం ముఖ్యం. ► క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ► దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గిస్తుంది. -నవీన్ రోయ్ ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
కొరియన్ గ్లాసీ స్కిన్ టోన్ కావాలా? సింపుల్‌గా ఈ ప్యాక్ వేసుకోండి
ఫర్ గ్లాస్ స్కిన్.. ఈ చిట్కాలు పాటించండి. ►ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ని స్క్రబ్‌లా మొహానికి రుద్దుకోవాలి .. ఓ 10 మినట్స్ వరకు. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని టవెల్‌తో ఆ తడిని అద్ది.. మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి. ► శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపండి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ఆరాక కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్‌ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది. ► అవిసె గింజలు స్కిన్ టోన్‌ని గ్లాసీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలను ఓ పాత్రలో వేడి చేసి అందులో నీళ్లు కలపాలి. జెల్ ఫార్మట్‌లో వచ్చాక స్టవ్ ఆపేసి వడగట్టాలి. మిగిలిన జెల్‌ను ముఖంపై అప్లై చేస్తే రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది. -
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? వాస్తవమిదే
మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో దీన్ని సాధారణంగా "పాసింగ్ అవుట్" అని సూచిస్తారు.మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి (వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్).వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి. మరి మన చుట్టూ ఎవరైనా మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మూర్ఛ/ఫిట్స్ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరం వీక్ అయిపోవడం, మైకం కమ్మేయడం, "బ్లాకింగ్ అవుట్/వైటింగ్ అవుట్" కూడా అనుభవిస్తారు. అసలు మూర్ఛ రావడానికి గల సాధారణ కారణాలు ఏంటంటే.. భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడి. తీవ్రమైన నొప్పి,విశ్రాంతి లేకపోవడం. లోబీపీ, డీహైడ్రేషన్ మధుమేహం గుండె జబ్బు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (ఎంఫిసెమా) హైపర్వెంటిలేషన్ ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం. ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన ఒత్తిడి కొన్ని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వాళ్లు ఫిట్స్‌తో అల్లాడిపోతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు. ఆ సమయంలో ఫిట్స్‌తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచడం, ఉల్లిపాయ వాసన చూపించడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఫిట్స్ ఆగిపోతాయనుకుంటారు. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్‌ను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. సాధారణంగానే ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి? ►ముందుగా చేయవలసినది భయాందోళనలకు గురికాకూడదు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పాదాలను రబ్ చేస్తుండాలి. దీనివల్ల చర్మం చల్లబడకుండా ఉంటుంది. ► మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా అతని/ఆమె మోకాళ్ల మధ్య తాళం వేసి కూర్చోబెట్టడం లాంటివి చేయాలి. ► ఎవరైనా కిందపడిపోతే అది ఫిట్స్ అని అనుకోకుండా ముందుగా గాయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అప్పటికి ఆ వ్యక్తిలో కదలిక లేకపోతే వారి కాళ్లను గుండె నుంచి సుమారు 12 అంగుళాలు (30CM) పైకి లేపడం వల్ల రక్తప్రవాహం ఆగకుండా ఉంటుంది. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినట్లయితే, వెంటనే CPR చేయండి. ► షేక్ చేయడం, అరవడం: కొన్నిసార్లు గాయం కారణంగా వ్యక్తులు సడెన్ షాక్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆ వ్యక్తుల పేరు తెలిస్తే గట్టిగా వాళ్ల పేరు పిలుస్తూ తట్టండి. శరీరాన్ని షేక్ చేయడం వల్ల స్పృహను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు. - నవీన్ నడిమింటి ఆయుర్వేద నిపుణులు ఫోన్ -9703706660 -
మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి చేసి తింటున్నారా? క్యాన్సర్ వస్తుంది
ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినడం వల్ల నష్టం ఏమిటో తెలుసుకుందాం. ►చాలామంది నాన్ వెజ్ ఫుడ్‌ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి తర్వాత వేడి చేసి తింటూ ఉంటారు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ► చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది. ► గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► మైక్రోవేవ్ ఓవెన్లో కాఫీని మళ్లీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దానికంటే కాఫీని థర్మో-ఫ్లాస్క్‌లో నిల్వ చేయండి. నచ్చినప్పుడు సిప్ చేయండి. ► చికెన్‌ని రోండోసారి ఉడికిస్తే అందులో మాంసకృత్తులు నశిస్తాయి. ► పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నమై జీర్ణసంబంధిత సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చు. ► చేపలను మళ్లీమళ్లీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది. ► ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలని వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు. -
మందులు వేసుకున్నా దగ్గు తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి
హెల్త్ టిప్స్ ►నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి, ఆ తర్వాత మరిగిన తులసి నీటిని కాస్త చల్లార్చి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నాపొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి రిలీఫ్ లభిస్తుంది. ► టీ స్పూన్ తేనెలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ దానిమ్మరసం మూడింటిని బాగా కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి 2 లేదా మూడు సార్లు చేస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ► రెండు, మూడు రోజుల పాటు రెండు మిరియాల గింజలు, మెలమెల్లగా నములుతూ, ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది. ► సీతాఫలం విత్తనాలు, ఆకులు మెత్తగా నూరి పట్టిస్తే, పేలు పోతాయి. ► అరటిపండు, తేనెతో కలిపి తీసుకంటే క్షయవ్యాధిగ్రస్తులకు మంచిది. ► నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. ► వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి, కురుపులపై రాస్తే ఉపశమనం వుంటుంది. ∙వేపాకు రసం, దానికి సమాన భాగంలో పెరుగు జోడించి, కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. మీకు తెలుసా? ►వంట పూర్తయిన తర్వాత అంట్లను కొందరు వంటింటి షింకులోనే అలా ఉంచేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడమో లేకపోతే బయట వేసుకోవడమో చేయండి. సింకులో గిన్నెలు పడి ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది. వాటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ►సాధారణంగా చాలా మంది వంటింట్లోనే చెత్త డబ్బాను పెట్టుకుంటుంటారు. ఒకటి రెండు రోజులు గనుక అది అలాగే ఉండిపోతే సూక్ష్మ జీవులు చేరి కంపు రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ రోజుకారోజు చెత్తను తీసివేయండి. వెసులుబాటు ఉంటే గనుక అసలు దీన్ని వంటింటి బయట వైపు ఏర్పాటు చేసుకోవడం మంచిది. -
జీలకర్రలో కల్తీని నిమిషాల్లో ఇలా గుర్తించండి..
కల్తీని గుర్తిద్దామిలా... ►ఇప్పుడు ఏది చూసినా కల్తీ అవుతోంది. కల్తీ కలిసిన జీలకర్ర తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల జీలకర్రను నాణ్యమైనదో కాదో ఇలా తెలుసుకోండి... ► కొద్దిగా జీలకర్రను తీసుకుని నలిపి చూడాలి. నలిపినప్పటికీ జీలకర్ర అలానే ఉంటే జీలకర్రలో ఏదీ కలవలేదని అర్థం. ► జీలకర్రను నీటిలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. నీరు రంగు మారితే జీలకర్రలో ఏదో కల్తీ జరిగినట్టే. ► జీలకర్ర వాసన లేకపోతే అది స్వచ్ఛమైన జీలకర్ర కాదు. ఇలా చేస్తే దంతాలు ఆరోగ్యంగా.. వేడి నీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. -
ఎక్కువగా చెమటలు పడుతున్నాయా? గుండెపోటు రావొచ్చు!
చెమటలు పట్టడం అనేది చాలా సాధారణ విషయం.. ఎందుకంటే శరీర శ్రమ అతిగా చేయడం వల్ల అందరిలో చెమట పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మరింత సహజం. అయితే కొందరిలో చెమట విచ్చలవిడిగా పడుతూ ఉంటుంది. దీంతోపాటు కొందరిలో అకస్మాత్తుగా చెమటలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా మీకు జరుగుతుంటే మాత్రం మీ ఒంటి మీద మీరు కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సిందే మరి! అకస్మాత్తుగా చెమటలు పట్టడం అనేకరకాల అనారోగ్య సమస్యలకు ముందస్తు సూచనలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని గుండెజబ్బుల లక్షణాలలో ఒకటిగా వైద్యులు భావిస్తారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ముందు తరచు ఆకస్మాత్తుగా చెమటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించడం, వారి సలహా మేరకు హెల్త్చెకప్ చేయించుకోవడం మంచిదని అనుభవజ్ఞుల సలహా. అధిక చెమట ఈ వ్యాధుల లక్షణాలలో ఒకటి... అకస్మాత్తుగా చెమటలు పట్టడం గుండెపోటు మొదటి లక్షణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మహిళలకు రాత్రిపూట ఎక్కువగా చెమట పడడం వల్ల భవిష్యత్‌లో రానున్న తీవ్రసమస్యలకు సంకేతాలు. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కూడా ఎక్కువగా చెమట పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో మధుమేహం పెరగడం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చే చెమటలు రాకుండా ఉండాలంటే... ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించడం. మద్యపానం అలవాటుంటే వెంటనే మానేయడం. ఆకు కూరలు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం. గ్రీన్ టీ తీసుకోవడం ∙రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం. డీప్ ఫ్రైలు, ఇతర నూనె పదార్థాలను తగ్గించడం. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం ∙పద్ధతి ప్రకారం డైట్ తీసుకోవడం అవసరం. -
డిప్రెషన్, ఒత్తిడితో చిత్తవకండి.. ఈ పనులు చేయండి
ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు మొదలు. చేయాల్సిన పనుల చిట్టా చాంతాడంత. దీంతో హడావుడి, ఆందోళన. ఫలితం ఒత్తిడి. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఆందోళనతో చిత్తవుతున్నారు. వీటి వల్ల వచ్చే శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ఇంట్లో మనంతట మనం పాటించగల చిన్న చిట్కాలను చెబుతున్నారు. అవేంటో చూద్దామా..? గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. శరీరంలో ఎక్కడైనా నొప్పులుగా అనిపిస్తే చిన్నగా మసాజ్ చేసుకోవడం, కండరాలన్నీ సాగేలా ఒళ్లు విరుచుకోవడం లాంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బాత్ రూమ్‌లో కూనిరాగాలు తీయడం లేదా ఏదైనా లైట్ మ్యూజిక్‌ని పెట్టుకుని, గోరువెచ్చని నీటితో శరీరం, మనస్సు తేలిక పడేంతవరకు టబ్ బాత్ చేయాలి. అందుకు మంచి సువాసన ఉన్నసహజమైన సబ్బును ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. డ్యాన్స్ నృత్యం చేయడం అనేది ఒత్తిడి నివారిణిలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి సంగీతాన్ని పెట్టుకుని దానికి తగినట్లుగా డ్యాన్స్ చేయవచ్చు. ఎవరైనా ఉన్నప్పుడు చేయడం మొహమాటం అయితే ఎవరూ లేనప్పుడు ఆ పని చేయండి. దీనివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఇష్టమైన వారితో ప్రేమగా... ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడుఇష్టమైన వారితో ప్రేమగా...సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. అందువల్ల శరీరంలో డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్ లు విడుదలవుతాయి. దీంతో మీరు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బబుల్ ర్యాప్‌లను పగలగొట్టడం... బబుల్ ర్యాప్ కవర్లను చూడగానే అంతా వాటిని పగలగొట్టాలని ఉవ్విళ్లూరతారు. అందుకు కారణాలు లేక΄ోలేదు. అలా వాటిని పేల్చడం వల్ల మనలో ఓ రకమైన ఆనందం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. అందువల్లనే మనం వాటిని పేల్చేందుకు ఇష్టపడుతుంటాం. మంచి పుస్తకాలు చదవడం... మంచి పుస్తకాలు, పేపర్లు చదవడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు నచ్చిన పుస్తకం తీసి చదవండి. వెంటనే తగ్గుముఖం పడుతుంది ఆ ఒత్తిడి. అలాగే రోజూ దినపత్రికలను చదవడం కూడా ఒత్తిడి నివారణలో ఒక భాగం. దినపత్రికలు చదవడమనగానే నేరవార్తలు, హత్యావార్తలు కాదు. మనసుకు కాస్తంత ఆహ్లాదం కలిగించే వార్తలు చదవడం మేలు. ఆలయ సందర్శనం... మీ మతాన్ని అనుసరించి మీరు ప్రార్థనామందిరాలను సందర్శించడం మంచిది. రోజూ కాసేపు పూజామందిరంలో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగని దేనినీ అతిగా చేయరాదు. గంటలు గంటలు పూజలు చేస్తూ గడపడం కూడా మంచిది కాదు. క్రమం తప్పకుండా ఆలయానికి లేదా మసీద్‌కు లేదా చర్చికి వెళ్లడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నారు అనుకున్నప్పుడువీటిలో మీకు వీలైనవాటిని పాటించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యం ఒత్తిడి వచ్చాక బాధ పడేకంటే ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఒత్తిడి ఎందువల్ల వస్తుందో తెలుసుకుంటే నివారించుకోవడం సులభం కాబట్టి. ముందుగా మీ పనులను ప్రశాంతగా పూర్తి చేయడం ఆరంభించండి. ధ్యానం... ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం అద్భుతమైన మార్గం అని చాలా అధ్యయనాల్లో తేలింది. శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం రెండు నిమిషాలు కళ్లు మూసుకున్నా సరే అది మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయుల్ని తగ్గిస్తుంది. -
నిమ్మచెక్కలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఏం అవుతుందంటే..
కిచెన్ టిప్స్ : ►నిమ్మచెక్కతో మరకలు ఈజీగా పోతాయి కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దాలి. క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి. ► నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్ లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ► ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి. ► స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు. -
పరగడుపున ఉసిరి తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?
Health Tips: ►ఉసిరి పచ్చడి తీసుకోవడం, తేనెలో నానపెట్టిన ఉసిరిని నిత్యం పద్ధతి ప్రకారం సేవించడం ద్వారా దృష్టిలోపం తగ్గుతుంది. ఉసిరి పొడిని నిత్యం పరకడుపున తేనెతో కలిపి సేవించడం వల్ల వత్తిడి, అలసట తగ్గుతుంది. ►ఎండు ద్రాక్షలు లేదా కిస్మిస్లు వాడడం మంచిది. వీటికి చలువ చేసే గుణం వుంది. గ్లాసుడు నీళ్లలో ఎండు ద్రాక్షలు వేసి, నానపెట్టి, ఆ నీటిని తీసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది. ► గోధుమలు, బియ్యం, పెసలు, రాగులు, సోయాగింజ లు, జొన్నలు అరకిలో వంతున కలిపి, 50 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల జీలకర్ర జోడించి, దోరగా విడివిడిగా వేయించాలి. ఆపై మరపట్టించి రొట్టెలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండితో జావ కూడా చేసుకోవచ్చు. ► నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి, ఆ నీటిని సేవించడం వల్ల మంచి ఫలితం వుంటుంది. పుదీనా ఆకులు, ఉప్పు కలిపి నీటిలో మరిగించి, ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది. -
ఇంటి చిట్కాలతోనే కాంతివంతంగా మెరిసిపోవచ్చు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అందంగా కనిపించాలనే కోరికి ఎవరికి మాత్రం ఉండదు? కానీ అందుకు తగ్గట్లు తగిన శ్రద్ద తీసుకోవాలి. స్కిన్ కేర్ కోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అవగాహన చాలామందికి ఉండదు. చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తూ వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. కానీ సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం. కాంతిమంతమైన ముఖం కోసం.... ►టమాటాను గుండ్రంగా కట్ చేసి ఒక ముక్కను తీసుకుని దానికి పంచదార అద్దాలి. తరువాత ఈ ముక్కను ముఖంపై సున్నితంగా రుద్దాలి. పది నిమిషాల తరువాత సాధారణ నీళ్లతో కడుక్కోవాలి. తరువాత స్పూను శనగ పిండి, అరస్పూను అలోవెర జెల్, రెండు స్పూన్ల టమాటా రసం, అర స్పూను తేనె వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న మృత కణాలు, ట్యాన్ పోయి ముఖం కాంతిమంతమవుతుంది. ► రెండు స్పూన్ల పాలలో, అర స్పూన్ తేనె కలిపి కళ్ల చుట్టు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు వేళ్లతో మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఇలా పడుకునేముందు ప్యాక్ వేసుకొని చల్లటి నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. ► ఒక కప్పు గ్రీన్ టీని బ్రూ చేసి చల్లారనివ్వండి. దీన్ని స్కిన్ టోనర్‌గా ఉపయోగించండి. ఇది స్కిట్‌టోన్‌ని పెంచుతుంది. -
ఇడ్లీ, దోశల పిండి పాడవకుండా ఉండాలంటే.. ఇలా చేయండి
వంటింటి చిట్కాలు: ►ఇడ్లీ, దోశ పిండి త్వరగా పాడు కాకుండా ఉండాలంటే... ఇడ్లీ, దోశ పిండికోసం నానబెట్టే పప్పు, బియ్యం, రవ్వలను కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పువేసి కడగాలి. ఇలా కడిగి రుబ్బిన పిండి నాలుగైదు రోజుల పాటు పులవకుండా ఉంటుంది. ► కోడిగుడ్లు ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గుడ్లను చన్నీళ్లలో వేసినా పెంకు సులభంగా వస్తుంది. ► కిచెన్ షెల్ఫులు,తలుపులు రోజూ శుభ్రం చేస్తున్నా కూడా జిడ్డు పడుతుంటాయి. నెలకొకసారి లీటరు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా, రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో పోసుకుని జిడ్డుగా ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేసి తడి పీల్చుకునే పొడి వస్త్రంతో తుడవాలి. ► మామూలుగా దోసెలు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే, అందుబాటులో వంకాయలు ఉంటే, ముందుగా పెనంపై వంకాయ ముక్కతో రుద్దండి. ► బొంబాయి రవ్వ హల్వా మరింత రుచిగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండిని కలుపుకుకోవాలి. ► కూరల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం లేదా రెండు టీస్పూన్ల నెయ్యి కలిపితే కారం తగ్గుతుంది. ► కలిపిన చపాతీ పిండి మిగిలిపోతే ఆ ముద్దపైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. అప్పుడు సాఫ్ట్‌గా ఉంటాయి. ► పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే.. పెరుగులో కొబ్బరి ముక్కను వేసి చూడండి. -
మోకాళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి
మన పెద్దవాళ్లు వృద్ధాప్యంలో కూడా ఎంతో బలంగా ఉండేవారు.. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా వారిలో కూడా శరీర సమస్యలు వస్తున్నాయి. చాలా మంది వృద్ధుల్లో మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. దీంతో పాటు ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డ యువతలో కూడా ఇవే సమస్యలు వస్తున్నాయి. మోకాళ్లనొప్పుల కారణంగా నడవడానికి చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలకు కూడా దారి తీయొచ్చు. మోకాళ్ల నొప్పులను తట్టుకోలేక చాలామంది పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి నివారణిలను ఆశ్రయిస్తుంటారు. వీటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. అందువల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజ చిట్కాలను తెలుసుకుందాం. ఆర్థరయిటీస్, ఆస్టో ఆర్థరయిటీస్, రుమటాయిడ్ ఆర్థరయిటీస్ వంటి కొన్ని రకాల అనారోగ్య కారణాలతో పాటు సరైన దినచర్యను పాటించకపోవడం, తీసుకునే ఆహారాల్లో తగినన్ని పోషకాలు లేకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని ఆ తర్వాత ఈ సమస్యల నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలను అన్వేషిద్దాం. కలబంద ఆయుర్వేద నిపుణులు కలబందను ఔషధంగా భావిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలారకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నొప్పి ప్రభావిత ప్రాంతంలో ప్రతిరోజు అలోవెరా జెల్‌ను అప్లై చేసి సున్నితంగా మర్ధన చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ల వాపులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. పసుపు పసుపు యాంటీ బాక్టీరియల్‌గా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని అన్నిరకాల వ్యాధులకు వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు పసుపును వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిని వినియోగించే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాల నూనెను వేసి.. ఒక టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అల్లం అల్లం మోకాళ్ల నొప్పుల నివారణకు ఉపయోగించే మందులలో అల్లాన్ని బాగా ఉపయోగిస్తారు. కొన్ని అల్ల ముక్కలను తీసుకుని వాటిని గ్లాసు నీళ్లలో వేసి బాగా మరగబెట్టాలి. మనం తీసుకున్న నీటి పరిమాణం సగానికి తగ్గిందని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ మీదినుంచి దింపి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి తాగాలి. రుచికి తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవచ్చు. కర్పూర తైలం తీవ్ర మోకాళ్ల నొప్పుల కారణంగా బాధపడేవారు కర్పూరం నూనెను కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్నిరకాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా కర్పూరం నూనె తీసుకుని బౌల్లో పోసుకుని గోరువెచ్చగా చేయాలి. ఆ తర్వాత ఈ నూనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తీవ్ర మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చింతగింజల పొడి మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పులు తగ్గాలంటే కాస్తంత చింతగింజల పొడిని వేడినీళ్లలో వేసి బాగా మరగబెట్టి వడకట్టి తాగుతుండాలి. అలాగే దీనిలో పాలు కలపకుండా బెల్లం పొడి వేసి పాయసంలా చేసుకుని కూడా తాగచ్చు. నల్లేరు కాడలతో తయారు చేసిన పచ్చడిని, బెండకాయలను, గోరుచిక్కుడు కాయలను ఆహారంలో విరివిగా ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి సహజ ఉపశమనం లభిస్తుంది. ఏదైనా గాయం వలన కానీ మెడికల్ కండిషన్ వలన కానీ మీరు రోజూ చేసే పనులన్నీ బట్టి కానీ మోకాళ్ళ నొప్పులు సహజంగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అల్లం, పసుపు బాగా పనిచేస్తాయి. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో అల్లం, పసుపు వేసి 15 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించండి. తర్వాత ఈ జ్యూస్ తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే కనక హీట్, కోల్డ్ కంప్రెస్ అంటే కాపడం పెట్టవచ్చు. హీట్ కంప్రెస్‌ని నొప్పి ఎక్కువ ఉంటే మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఇంకా నొప్పి కలుగుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్ళకి వేడినీటి కాపడం బాగా పనిచేస్తుంది. ఆటలు సమయంలో గాయాలైనప్పుడు కోల్డ్ కంప్రెసర్ బాగా తోడ్పడుతుంది. ఎప్సం సాల్ట్‌ని స్నానం చేసే నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఒక గ్లాసు నీళ్లలో వేసుకుని తాగితే మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే చాలా చక్కగా ఈ చిట్కా పనిచేస్తుంది. బరువు నియంత్రణ సాధ్యమైనంత వరకు మన వెయిట్ మానేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ బరువు పెరగడం వల్ల మోకాళ్ల పైన భారం పడి, మోకాళ్ళ నొప్పులు పెరిగే అవకాశం ఉంది. అందుకని బరువుని మేనేజ్ చేసుకుంటూ మోకాళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు. -
జుట్టును కాపాడుకోవడానికి ఈ ప్రొఫెషనల్ డ్రైయర్ ఉండాల్సిందే
నిగారింపుతో ముఖం ఎంతగా మెరిసిపోయినా తల మీద తగినంత జుట్టు లేకపోతే ఆ అందం కళాహీనమే. అందుకే చాలామంది మహిళలు కేశసంరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. వారానికో హెయిర్ మాస్క్, రోజు విడిచి రోజు హెయిర్ మసాజ్‌లు.. ఇలా తమకు తెలిసిన పద్ధతిలో జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చెయ్యడం మంచిదంటారు నిపుణులు. నిజానికి తల స్నానం చేయడంతో పాటు జుట్టును ఆరబెట్టుకోవడమూ కష్టమైన పనే.. బిజీ లైఫ్‌లో! అందుకే ఈ ప్రొఫెషనల్ ఎయిర్ డ్రైయర్ ఇంట్లో ఉండాల్సిందే! చిత్రంలోని ఈ డివైస్.. గిరిజాల జుట్టు.. మందపాటి జుట్టు.. ఇలా అన్ని రకాల జుట్టుకూ ప్రయోజనం కలిగిస్తుంది. ఆన్, ఆఫ్, హై, లో అనే ఆప్షన్స్‌తో దీన్ని వినియోగించడమూ తేలికే! నెగెటివ్ అయానిక్ టెక్నాలజీతో కూడిన ఈ హెయిర్ డ్రైయర్.. భారీ ప్రతికూల అయాన్లను విడుదల చేయడంతో జుట్టులోని తేమను పోగొట్టి.. మృదువుగా మారుస్తుంది. జుట్టును కాపాడుతుంది. ఈ సాధనం చాలా తేలికగా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇది స్టెయిలింగ్ ఫ్లెక్సిబిలిటీతో పాటు.. కంట్రోల్ కోసం 2 విభిన్న స్పీడ్ మోడ్‌లను అందిస్తుంది. అలాగే ఇందులోని రెండు ప్రత్యేకమైన హెడ్స్‌ని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆటోలీకేజ్ సంరక్షణ కోసం సేఫ్టీ ప్లగ్‌తో.. ఈ డ్రైయర్ అప్‌గ్రేడ్ అయ్యింది. దాంతో దీన్ని ఉపయోగించినప్పుడు షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ లీకేజీ జరిగితే.. ఓవర్–హీట్ ప్రొటెక్షన్లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. ధర 35 డాలర్లు. అంటే 2,894 రూపాయలు. -
అలాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఆవాలను తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
వంటలు మరింత రుచిగా రావడం కోసం పోపు పెట్టడం తెలుగువారికి అలవాటు. ఈ పోపులో ఎక్కువగా వినియోగించే వాటిల్లో ఆవాలు ఒకటి. ఆవాలు ఆహార పదార్థాలకు రుచిని ఇవ్వడమే శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం చాలామందికి వీటిని తినడమే తప్ప వీటివల్ల కలిగే లాభాలు ఏంటో తెలియదు. ఆవాలను తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోపులో వేసే దినుసులలో ఎవరైనా సరే ముందుగా చెప్పేది ఆవాలనే. ఈ ఆవాల వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంది. వాటిలో గాయాలు తొందరగా మానడం ముందుగా చెప్పుకోవచ్చు. ఈ గాయాలు తగిలిన చోట ప్రతిరోజు ఆవాల పొడిని అప్లై చేయడం వల్ల తొందర్లోనే మంచి ఫలితాలు పొందుతారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో దంతాల సమస్యలు వస్తున్నాయి. తరచు దంతాల నొప్పితో బాధపడేవారు ఆవాలను నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా దంతాల నొప్పి నుంచి సులభంగా లభిస్తుంది. ఆవాలు శ్వాస కోసం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఆవాల పొడిలో, ఒక టీ స్పూన్ ఆవాలను కలుపుకొని తీసుకోవడం వల్ల సులభంగా శ్వాస కోసం వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవాలు కీళ్ల నొప్పుల నుంచి కూడా ప్రభావంతంగా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కీళ్ల నొప్పుల కారణంగా నడవలేకపోతున్నవారు ఒక టీ స్పూన్ ఆవాలు నూనె ఓ చిన్న గిన్నెలో తీసుకొని అందులోనే ఒక టీ స్పూన్ ఆవాల పొడి, కర్పూరం వేసి పేస్టులా తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆవపిండితో తయారు చేసిన ఆహారాన్ని రోజూ తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. -
వేడి నీళ్లు Vs చన్నీళ్లు.. ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది?
స్నానం వేడినీళ్లతో చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు కాలంతో సంబంధం లేకుండా వేడినీళ్ల స్నానానికి అలవాటు పడితే, మరికొందరేమో చన్నీళ్లకు అలవాటు పడతారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఉత్తేజంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. చల్లటి నీళ్లలతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది? మనం ప్రతిరోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీని కారణంగా పలు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్ల వల్ల హానికారక క్రిములన్నీ తొలగిపోయి ఆరోగ్యం సమకూరుతుందనుకుంటారు. ఈ రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో స్నానమే ఆరోగ్యం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయద్దు. ఒకవేళ మీరు మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం చేసే వ్యవధిని వీలైనంత కుదించండి. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలి. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉన్నవారు... స్నానానికి ముందర చల్లటి నీళ్లు తాగకండి. చన్నీళ్లు గానీ లేదా వేణ్ణీళ్లు గానీ... వాటితో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవడం మంచిది. -
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అలా అస్సలు చేయకండి
కిచెన్ టిప్స్: వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. ఉల్లి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ► ఇతర కూరగాయలు ఉన్న బుట్టలో ఉల్లిపాయలను ఉంచకూడదు. దుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి వాటితో కలిపి ఉల్లిపాయలు ఉంచడం వల్ల త్వరగా మొలకలు వస్తాయి. కూరగాయల్లో ఇథలిన్ ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడానికి దోహదపడుతుంది. ►ఉల్లిపాయలను నిల్వచేసేందుకు పేపర్ బ్యాగ్‌లనే వాడాలి. పేపర్ బ్యాగ్స్‌లో ఉల్లిపాయలు ఉంచడం వల్ల ఉల్లిపాయల్లో ఉత్పన్నమయ్యే తేమను పేపర్ పీల్చుకుంటుంది. తేమ లేకపోతే ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తవు. ►రిఫ్రిజిరేటర్లో ఉల్లిపాయలను నిల్వచేయకూడదు. రిఫ్రిజిరేటర్లోని ఇతర కూరగాయల వల్ల, లోపలి తేమ వాతావరణం ఉల్లి త్వరగా మొలకెత్తేలా చేస్తాయి. ►ప్లాస్టిక్ సంచుల్లో ఉల్లిపాయలను ఎప్పుడూ నిల్వ చేయకూడదు. మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ సంచిలో నుంచి ఉల్లిపాయలు తీయడం మర్చిపోతుంటాము. ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేడికి ఉల్లిపాయలు పాడవుతాయి. -
కొరియన్ స్కిన్ టోన్ మీ సొంతం అవ్వాలంటే బియ్యం నీళ్లు..
కే– బ్యూటీ మానియా ►కొరియన్ గ్లాస్ స్కిన్ సొంత మవ్వాలంటే.. బియ్యం గంజిని ఫేస్‌కి అప్లయ్ చేసుకుని అది కంప్లీట్‌గా డ్రై అయిపోయాక వాష్ చేసుకోవాలి. ఈ రెమిడీని రెగ్యులర్‌గా ఫాలో అయితే యూవీ రేస్‌తో డామేజ్ అయిన స్కిన్‌కి మళ్లీ లైఫ్ వస్తుంది. స్మూత్‌గా.. రికింల్ ఫ్రీగా మారుతుంది! ► స్కిన్ కేర్‌లో క్లెన్సింగ్ చాలా ముఖ్యమైంది. చర్మాన్ని క్లీన్ చేయడం వల్ల మురికి, మలినాలను దూరం చేసి క్లీన్‌గా ఉంచుకోవచ్చు. అందుకోసం ముందుగా కొరియన్ స్త్రీలు డబుల్ క్లెన్సింగ్ని ఫాలో అవుతుంటారు. పాలను సహజ క్లెన్సింగ్‌లా వాడుకోవచ్చు. ► కొరియన్ స్త్రీలు క్రీమ్స్ కంటే షీట్ మాస్క్‌లు ఎక్కువగా వాడతారు. దీనివల్ల చర్మం కాంతివంతంగా, హైడ్రేటెడ్‌గా మారుతుంది. ► టోనర్లు చర్మం పీహెచ్ స్థాయిలని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్ అన్ని చర్మ రకాలకు బెస్ట్ టోనర్‌గా పనిచేస్తుంది. ► ఇక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రతిరోజూ సన్ స్క్రీన్ ధరించడం చాలా ముఖ్యం. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం SPF-20, అంతకన్నా ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ధరించడం చాలా ముఖ్యం. ► అయితే ఎంత స్కిన్ కేర్ పాటించినా నిద్ర కూడా అంతకంటే ఎక్కువే ముఖ్యం. రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. వానకాలంలో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక వనరుగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌తో మర్దనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, గాయాలు తగ్గుతాయి. గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం.. ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానే తాగండి. దీనిని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి. -
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిందా? వీరిలో ముప్పెక్కువ
ఈరోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ఎక్కువగా చూస్తున్నాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అనేక ఆనోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అవేంటో చూద్దాం. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్’ అని అంటారు. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలామందిని వేధిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత విడుదల చేసే పోషకాలలో ఇది కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా ఇది రక్తంలో ఉండిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...? యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే... మద్యం తీసుకునేవారు మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ. శరీరంలో మోతాదుకు మించి యూరిక్ యాసిడ్ ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపులు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ ఇలా చేస్తే కంట్రోల్లో.. లేత సొరకాయ చెక్కు తీసి, చిన్న ముక్కలు చేసి, ఎటువంటి నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి, ఆ గుజ్జును (ఫిల్టర్ చెయ్యకుండా) పరగడుపున తినాలి. రోజూ ఒక చిన్న గ్లాసుడు(100ml) తిని చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపేయండి రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు తినొచ్చు రోజుకు కనీసం 4-5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్ మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించండి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
నల్ల ద్రాక్షతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?
జిడ్డుతత్వం ఉన్న చర్మానికి గ్రేప్స్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే అధికంగా ఉన్న జిడ్డు పోతుంది. పది నల్ల ద్రాక్షపండ్లను పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో టేబుల్ స్పూను ముల్తాని మట్టి, టీస్పూను రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొన్ని నల్ల ద్రాక్షపళ్లను బాగా స్మాష్ చేసిగుజ్జు తీయాలి. దానికి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే ముఖంపై మృత కణాలన్నీ తొలగిపోతాయి. 5 వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతిమంతంగా.. యంగ్లుక్తో కనిపిస్తుంది. ఒక కప్పు ద్రాక్ష పళ్లు తీసుకుని చేతులతో పిసికి గుజ్జులా చేయాలి. వాటిలో రెండు చెంచాల పాలు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు తాలూకు మచ్చలు పోయి చర్మం మృదువుగా మెరుపులీనుతుంటుంది. చిన్న టొమాటో తీసుకుని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు ఆరు ద్రాక్షపండ్లను జోడించి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులు, కళ్లకు అంటకుండా ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. -
పిల్లలు మాట వినకుండా బెట్టు చేస్తున్నారా?ఇలా దారికి తెచ్చుకోండి
ఈకాలం పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం కష్టమే. ఇది చేయకు, అది చేయకు, అలా, ఇలా ఉండకూడదు అని చెబితే అస్సలు వినరు. పెద్దవాళ్లు చెప్పేది తమ మంచికే అన్న స్పృహ ఉండదు వారికి. అయినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తపన పడుతుంటారు తల్లిదండ్రులు. మాట వినకుండా పెంకిగా ప్రవర్తించే పిల్లలను ఇలా మీ దారిలోకి తెచ్చుకోండి. అప్పుడు ఇక పిల్లలతో పాటు మీరూ సంతోషంగా ఉంటారు. ►మాట వినడం లేదని పిల్లలను తిట్టకూడదు. నువ్వు చెడ్డదానివి లేదా చెడ్డవాడివి అని వారిని నిందించకూడదు. నువ్వు పెద్దదానివి లేదా పెద్దవాడివు అవుతున్నావు కదా... అందుకే ఇలా చేస్తే బాగుంటుంది... అని లాలనగా చెప్పాలి. ► కోపంలో మనం అనే కొన్ని రకాల మాటలు పిల్లల మనసుకు గాయం చేసి, వారి మనసును విరిచేస్తాయి. కొన్నిసార్లు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతిస్తాయి. అందుకే వీలైనంత వరకు వారికి ఓపికగా అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ►పిల్లలు ఎంత విసిగించినప్పటికీ పెద్దగా అరవకూడదు. పైన చెప్పుకున్నట్టు సున్నితంగా పదేపదే చెబుతూ బుజ్జగించాలి. ఎంత చెప్పినా వినకుండా ఉంటే ముందు వాళ్ల కోపం తగ్గించాలి. తరువాత పిల్లలు విసుక్కోకుండా జాగ్రత్తగా చెప్పాలి. ► చెప్పేది ఏదైనా ప్రేమగా చెబితే ఎంత మొండి చేసేవారైనా తప్పకుండా వింటారు. నచ్చిన డ్రెస్ వేసుకోనివ్వడం, హోం వర్క్ అయిన తరువాత టీవీ చూడనివ్వడం, డాడీతో కలిసి బయటకు వెళ్లడానికి అనుమతించడం వంటివి. ఇలా పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం కలిగించి, తరువాత వారికి మంచి చెడులు వివరించాలి. ►ప్లీజ్, థ్యాంక్యూ, యూ ఆర్ వెల్కమ్ వంటి మర్యాదలు నేర్పించాలి. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో పిల్లలు అదే నేర్చుకుంటారు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ► పిల్లలు వారికి హాని జరిగే పనులు కొన్నిసార్లు చేస్తుంటారు. వెంటనే కేకలేసి, లెక్చర్ ఇవ్వకూడదు. కాస్త దెబ్బలు తగిలినప్పటికీ... వాళ్లు తేరుకున్నాక, మీ మాటలు వినే మూడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి వివరించాలి. అప్పుడు వారు మరోసారి అటువంటి పనులు చేయరు. -
నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి
కిచెన్ టిప్స్ ►ఒక్కో నిమ్మకాయను అల్యూమినియం ఫాయిల్ల్లో చుట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. ► శాండ్ విచ్ మరీ మెత్తగా కాకుండా చక్కగా రావాలంటే... శాండ్ విచ్లో పెట్టే కూరగాయలు, బ్రెడ్ మయనేజ్, చీజ్ గది ఉష్ణోగ్రతలో ఉండేలా చూసుకోవాలి. ఇంతకు మించి వేడిగా ఉండే తేమ చేరి శాండ్విచ్ మెత్తగా మారిపోతుంది. ► కొన్నిసార్లు పన్నీర్ ముక్కలు ఫ్రై చేసిన తరువాత గట్టిగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు పన్నీర్ ముక్కలు ఫ్రై చేసిన తరువాత చల్లని నీటిలో ఐదు నుంచి పదినిమిషాలు ఉంచాలి. తరువాత కూరలో వేస్తే పన్నీర్ ముక్క మృదువుగా, మెత్తగా ఉంటుంది. ► ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేసి ఉంచితే, వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది. ► కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలిపితే కేకు ఎక్కువకాలం తాజాగా ఉంటుంది. ► బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది. ► పులిహోరలో వేరుశనగగుళ్ళు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించండి. అన్నంలో తాలింపు వేశాక, వేడితగ్గాక, అప్పుడు వేరుశనగగుళ్ళు కలపండి. పులిహోర రుచిగా ఉంటుంది. -
వీకెండ్లో మెరిసిపోండి.. ఇలా చేస్తే జుట్టు తెల్లబడదు
ట్యాన్ తగ్గాలంటే... ► స్పూను కాఫీ పొడిలో స్పూను తేనె, స్పూను బంగాళ దుంప రసం, స్పూను గంధం పొడివేసి చక్కగా కలిపితే డీ ట్యాన్ ప్యాక్ రెడీ. ఈ ప్యాక్‌ను ముఖం, చేతులు, మెడపైన పూతలా వేసి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత తడి బట్టతో తుడిచేసి, నీటితో కడిగేయాలి. ► వారానికి రెండు–మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే నలుపు పోయి, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ప్యాక్ వేసుకునే సమయం లేనప్పుడు..టొమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే ట్యాన్ తగ్గుతుంది. ► నిమ్మరసంలో బంగాళదుంప రసం కలిపి ముఖానికి పెట్టుకున్నా ట్యాన్ పోతుంది ► ఈ ప్యాక్‌లు వేసుకున్నప్పటికీ రాత్రి పడుకునేముందు చేతులు, కాళ్లకు నైట్‌క్రీమ్ రాసుకుంటే ట్యాన్ తొలగి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. హెయిర్ కేర్ యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. ఉసిరి పొడిలో నిమ్మరసం వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి క్యాప్ పెట్టుకోవాలి. గంట తరువాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ ప్యాక్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉండి కురులను దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. త్వరగా తెల్లబడదు. -
ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకుంటే..
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కావున ఉద్యోగస్థులైనా, వ్యాపారస్తులైనా తప్పకుండా ఇల్లు కొనుగోలు లేదా నిర్మించుకోవడం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేసే వారు మాత్రం తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 👉ఇల్లు కొనటం అనేది కేవలం భావోద్వేగానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆర్థిక పరమైన అంశం కూడా. కావున ఇల్లు కొనేటప్పుడు ఎక్కడ కొనుగోలు చేస్తున్నాము, ధర ఎంత ఉంది అనే మరిన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. సొంత ఇల్లు భద్రతాభావం అందిస్తుంది. 👉కొత్త ఇల్లు కొనుగోలు చేయడంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే అది విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందని ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేస్తే, అవసరమైన సౌకర్యాలు లభించకపోగా.. రవాణా & ఇతర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. 👉సాధారణంగా ఇంటికయ్యే ఖర్చులో 10 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ అవసరం. అయితే మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి హోమ్ లోన్ రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో ఇల్లు కొనుగోలు చేయడానికి అన్వేషించాలి. 👉ఇల్లు కొనుగోలు చేస్తే మాత్రం సరిపోదు.. దానికి కట్టుదిట్టమైన రిజిస్ట్రేషన్ వంటివి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు మీరు ఇల్లు కొనుగోలు చేసే డబ్బుతో పాటు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కొంత ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. 👉బిల్డర్లు లేదా ప్రాపర్టీ డీలర్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కొనటానికి ముందే లాయర్‌ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకోబోయే ప్రాపర్టీకి కో-ఓనర్ ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవాలి. అంతే కాకుండా తీసుకోబోయే ప్రాపర్టీ లిటిగేషన్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అన్ని సరిగ్గా ఉన్నాయన్న తరువాతే రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు నిశ్చింతగా కొత్తింట్లో అడుగుపెట్టవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కావలసిన వివరాలు తెలుసుకోకుండా.. ఇల్లు కొంటే భవిష్యత్తులో ఏదైనా సమస్యలు తలెత్తవచ్చు. దీనిని వినియోగదారుడు గుర్తుంచుకోవాలి. -
కిచెన్ టిప్స్: ఇలా చేస్తే వంకాయలు రంగు మారకుండా ఉంటాయి
కిచెన్ టిప్స్ ►వంకాయ ముక్కలను కోసిన వెంటనే ఉప్పు నీటిలో వేయాలి.టేబుల్ స్పూను నిమ్మరసం వేసిన నీటిలో కోసిన వంకాయ ముక్కలపై వేస్తే రంగుమారవు. ►రెండు స్పూన్ల నీటిలో స్పూను పాలు పోసి చక్కగా కలపాలి. ఈ పాల మిశ్రమాన్ని వంకాయ ముక్కలపై చల్లాలి. ముక్కలు చేదుగా మారవు. వంకాయ ముక్కలు లేదా కూరగాయ ముక్కలు వేసే నీటిలో టేబుల్ స్పూను వెనిగర్ వేసి కలపాలి. అప్పుడు కూరగాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ►పండిన అరటిపండు గుజ్జు, కొద్దిగా పెరుగు వేసి చపాతీపిండిని ముద్దగా కలిపితే చపాతీలు మరింత మృదువుగా మెత్తగా, రుచికరంగా ఉంటాయి. ►సమోసా పిండిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపితే సమోసాలు మరింత క్రిస్పీగా కరకరలాడతాయి. వర్షంలోనూ క్లియర్ వ్యూ మిర్రర్ వర్షాకాలంలో కారు అద్దాలు తడిసి ఎదురుగా వస్తోన్న వాహనాలు సరిగా కనపడవు. వైప్స్, గుడ్డతో తుడిచినప్పటికీ ఇంకా మసకమసకగానే కనిపిస్తుంది. ఇలా కాకుండా అద్దం క్లియర్‌గా కనిపించాలంటే.. బంగాళ దుంపను రెండు చెక్కలు చేయాలి. ఒక చెక్కను తడిసిన అద్దంపై రుద్దాలి. అద్దం మీద ఉన్న తడిపోయి క్లియర్‌గా ఉంటుంది. మరోసారి వర్షం నీళ్లు పడినా సులభంగా జారిపోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. -
రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పలుచని కనుబొమ్మలను ఒత్తుగా... నల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించి చూడండి... ఆముదం: జట్టు పెరుగుదలకు దోహదపడే వాటిలో ఆముదం ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దూదిని ఆముదంలో ముంచి పలుచని ఐబ్రోస్ మీద అద్దుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ కనుబొమలకు రాసుకోవాలి. రెండు మూడు వారాల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్ : ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉండే ఆలివ్ నూనెను కనుబొమ్మలకు రాస్తే .. వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. -
ఇంటి చిట్కాలతో బ్లాక్ సర్కిల్స్‌కు చెక్ పెట్టండి
సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం. ►టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ►రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి. ►అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ► ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది. ► ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది. -
ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ!
Blueberry Farming: రోజులు మారుతున్నాయి. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలనే విధానానికి నేటి యువత చెక్ పెడుతున్నారు. వ్యవసాయం మీద ఆసక్తితో విదేశాల్లో ఉద్యోగాలు వదిలి మళ్ళీ మన దేశానికే వస్తున్నారు. ఆధునిక పద్దతులతో, శాస్త్రీయమైన విధానంతో పంటలు పండించి లాభాలను పొందుతున్నారు. ఈ కథనంలో మనం 'బ్లూబెర్రీ' (Blueberry) సాగుతో మంచి ఆదాయం ఎలా పొందాలనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఒకప్పటి నుంచి పండిస్తున్న వరి, రాగి వంటివి మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లు వంటివి కూడా టెక్నాలజీ ఉపయోగించి పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే డ్రాగెన్ వంటి విదేశీ పంటల విషయంలో కూడా నేర్పు ప్రదర్శిస్తున్నారు. ఇక చాలామంది అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అమెరికన్ బ్లూబెర్రీ సాగుచేస్తున్నారు. అనేక పోషక విలువలు కలిగిన బ్లూబెర్రీని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అమెరికన్ సూపర్ ఫుడ్‌గా భావించే ఈ బెర్రీస్ ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్ పొందుతున్నాయి. మన దేశంలో వీటి ఉత్పత్తి చాలా తక్కువ, కావున అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. 10 సంవత్సరాల పాటు పండ్లు.. ప్రస్తుతం మన దేశంలో పండుతున్న విదేశీ పంటల్లో అమెరికన్ బ్లూబెర్రీ ఒకటి. దీని సాగుతో అధిక లాభాలను పొందవచ్చు. బెర్రీస్ సాగులో ఉన్న ఒక బెనిఫిట్ ఏమిటంటే.. దీనిని ఒకసారి నాటితే సుమారు 10 సంవత్సరాల పాటు పండ్లు వస్తూనే ఉంటాయి. బెర్రీస్‌లో అనేక రకాలు ఉన్నాయి. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. అనేక విటమిన్లు, పోషకాలతో నిండిన ఈ పండ్లకు గిరాకీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకుని పండిస్తే తప్పకుండా ఆశించిన లాభాలను పొందవచ్చు. ఈ పంటకు అనువైన కాలం ఏప్రిల్, మే నెలలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు 10 నెలలకే ఉత్పత్తి ఇవ్వడం మొదలు పెడతాయి. కావున ఫిబ్రవరి & మార్చి సమయంలో కోతకు వస్తాయి. జూన్ నెల వరకు దిగుబడి వస్తుంది. ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే.. సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు.. దిగుబడి అయిన తరువాత మొక్కలను కొంత కత్తిరించినట్లయితే.. మళ్ళీ చిగురిస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్పత్తి మరింత ఎక్కువవుతుంది. ఎకరం భూమిలో సుమారు 3000 మొక్కలు నాటవచ్చు. ఒక చెట్టు సుమారు 2 కేజీల వరకు పండ్లు అందిస్తుంది. కేజీ రూ. 1000 విక్రయిస్తే సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పంట పండించాలనుకునే వారు అవగాహన ఉన్న వ్యక్తులను లేదా ఇప్పటికే పంట పండిస్తున్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది. -
వర్షాకాలంలో చర్మం ఆరోగ్యం కోసం ఇలా చేయండి
ఈ కాలం జిడ్డు చర్మం గలవారి సమస్య మరింత పెరుగుతుంటుంది. అలాగే, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. డీ హైడ్రేట్ అయ్యి చర్మం నిస్తేజంగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యలకు విరుగుడుగా.. ► జిడ్డు, మలినాలను తొలగించడానికి క్లెన్సర్‌ను ఉపయోగించాలి. దీనివల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. ► సహజసిద్ధమైన క్లెన్సర్ కావాలనుకుంటే ఇందుకు ఓట్ మీల్, చక్కెర లేదా పండ్ల గుజ్జును వాడుకోవచ్చు. ► చర్మం పొడిగా మారితే బాదం నూనె లేదా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. రోజూ పది గ్లాసుల నీళ్లు తాగాలి. ► ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. తేమ ఉండే చోట ఫంగల్ పౌడర్లు, క్రీములను ఉపయోగించాలి. ► చర్మం తాజాగా ఉండాలంటే మీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లను చేర్చాలి. ► ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. ► వేప, తులసి, పసుపు, కలబంద వంటి వాటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ► వీటిని చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పై పూతలుగా వాడితే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. -
డ్రైఫ్రూట్స్.. ఇలా చేస్తే వర్షాకాలంలో ఫ్రెష్‌గా ఉంటాయి
బ్రెడ్ ప్యాకెట్లో కొన్ని స్లైసులను మాత్రం వాడి మిగిలిన వాటిని ప్యాకెట్లో అలానే ఉంచేస్తుంటాం. అయితే అవి కొన్నిసార్లు రాయిలా గట్టిగా మారతాయి. ఇటువంటప్పుడు బ్రష్‌ను నీటిలో ముంచి స్లైసులపైన రాయాలి. తరువాత కొద్దిగా నీటిని చల్లి, స్లైసులను పదిహేను సెకన్ల పాటు అవెన్‌లో ఉంచితే మెత్తగా తాజాగా మారిపోతాయి. డ్రైఫ్రూట్స్‌ని మార్కెట్ నుంచి తెచ్చిన తరువాత కొద్దిగా ఉప్పువేసి దోరగా వేయించి, గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే వర్షాకాలంలోనూ మెత్తబడకుండా, పాడవకుండా కరకరలాడతాయి. ఒక గుడ్డు తెల్ల సొనలో స్పూను తేనె వేసి చక్కగా కలపౠలి. ఈ మిశ్రమాన్ని ముక్కుమీద, చుట్టూ పూతలా వేసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. -
పెసరపప్పుతో ముఖం కాంతిమంతంగా.. ఈ ప్యాక్ ట్రై చేయండి
పొట్టు ఉన్న పెసర పప్పుని నాలుగు టీస్పూన్లు తీసుకుని రెండు గంటలు నానబెట్టి పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్ పీల్ పొడి, టీస్పూను గంధం పొడి వేసి చక్కగా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరువాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది. -
వంటింటి చిట్కాలు: కిచెన్‌లో నూనె ఒలికిపోతే ఇలా చేయండి
కిచెన్ టిప్స్ కూర అడుగంటినప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్స్‌ను వేసి కరిగేంత వరకు తిప్పాలి. ఇలా చేస్తే పాత్రకు అంటుకున్నది విడిపోయి కూర అడుగంటకుండా ఉంటుంది. కిచెన్‌లో నూనె వొలికిపోతే వెంటనే వొలికిన నూనె మీద గోధుమ పిండి చల్లాలి. ఐదు నిమిషాల తరువాత పేపర్‌తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డులేకుండా శుభ్రం పడుతుంది. వర్షాకాలంలో వాతావరణంలోని తేమను పీల్చుకుని... డోర్లు వేసినప్పుడు, తీసినప్పుడు కిర్రుమని శబ్దాలు చేస్తుంటాయి. డోర్లను పట్టి ఉంచే బోల్టుల వద్ద కొద్దిగా టాల్కం పౌడర్ చల్లడం వల్ల లేదా కొవ్వొత్తిని రుద్దడం వల్ల ఆ శబ్దాలు రాకుండా ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఇలా కడగడం వల్ల పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కలపాలి. ఈ నీటిలో పండ్లు, కూరగాయలను పదిహేను నిమిషాలు ఉంచి, తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. -
వర్షాకాలంలో ఇలా చేస్తే బిస్కెట్లు క్రిస్పీగా ఉంటాయి..
వర్షాకాలంలో కూడా బిస్కెట్లు మెత్తగా అవకుండా కరకరలాడాలంటే ఇలా చేసి చూడండి... ప్లాస్టిక్, అల్యమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. గాలిచొరబడకుండా పెడితే ఎక్కువ రోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యపేపర్లు వేసి తరువాత బిస్కట్లు పెట్టాలి. బిస్కట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. జిప్‌లాక్ పౌచ్‌లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. గాలిచొరబడని డబ్బాలు, జిప్‌లాక్ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్‌ఫ్రైయర్‌లో పదినిమిషాలు వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి. వీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. -
ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!
ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, ధనవంతుడు కావాలని.. బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తరువాత ఇవన్నీ మనవల్ల అయ్యేపని కాదని మధ్యలోనే ఊరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు.. తప్పకుండా ధనవంతులవుతారు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం.. ధనవంతుడు కావాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఒక మంచి సులభమైన మార్గం స్టాక్ మార్కెట్ అనే చెప్పాలి. జీవితంలో డబ్బు పొదుపుచేయడం ఎంత ముఖ్యమో.. వాటిని ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇన్వెస్ట్మెంట్లో నష్టాలు వస్తాయని భావించవచ్చు, కానీ సరైన అవగాహన ఉంటే అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. డైవర్సిఫికేషన్ చాలా అవసరం.. సంపాదించి కూడబెట్టిన డబ్బు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలి. అంటే మీదగ్గరున్న డబ్బు కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా.. గోల్డ్ లేదా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం వంటివాటిలో పెట్టుబడిగా పెట్టాలి. అప్పుడు ఒక రంగంలో నష్టం వచ్చినా.. మరో రంగంలో తప్పకుండా లాభం వస్తుంది. దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు. అప్పులు చేయడం మానుకోవాలి.. సంపాదనకు తగిన ఖర్చులను మాత్రమే పెట్టుకోవాలి. విచ్చలవిడి ఖర్చులు చేస్తూ.. డబ్బు కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తే తరువాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుందనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇదీ చదవండి: నకిలీ మందులకు చెక్.. ఒక్క క్యూఆర్ కోడ్‌తో మెడిసిన్ డీటెయిల్స్! గోల్ చాలా ముఖ్యం.. నువ్వు ధనవంతుడు కావాలంటే ముందుగా తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. ఫైనాన్సియల్ గోల్స్ పెట్టుకోవాలి. మీ ప్రయాణాన్ని గోల్ వైపు సాగిస్తే తప్పకుండా అనుకున్నది సాదిస్తావు. ఇల్లు, కారు ఇతరత్రా ఏమి కొనాలనుకున్న ముందుగా ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి స్మార్ట్ ఇన్వెస్ట్ అవసరం.. ఇన్వెస్ట్ అంటే ఎదో ఒక రంగంలో గుడ్డిగా వెళ్లిపోవడం కాదు.. అలోచించి చాలా స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టాలి. ట్యాక్స్ సేవింగ్స్, ఫండ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. తక్కువ సమయంలో అధిక వడ్డీ వచ్చే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం మరచిపోకూడదు. యువకుడుగా ఉన్నప్పుడే రిస్క్ తీసుకోవాలి.. అప్పుడే సక్సెస్ పరుగెత్తుకుంటూ వస్తుంది. ధనవంతుడు కావాలనే కోరిక ఉంటే సరిపోదు.. దాని కోసం అహర్నిశలు ఆలోచించాలి, ఆ మార్గంలోనే ప్రయాణం కొనసాగించాలి. తెలియని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి, వీలైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎక్కడ, ఎలా పెట్టుబడులు పెడుతున్నావో తెలియకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ఇది ఆడవాళ్లకు మాత్రమే.. బొట్టు తీయకుండా నిద్రపోతున్నారా?
బొట్టుబిళ్ల పెట్టుకునే ప్రదేశంలో కొన్నిసార్లు దురద, దద్దుర్లు, వాపు, మచ్చలు ఏర్పడుతుంటాయి. బొట్టుపెట్టుకునే ప్రదేశంలో చర్మం పొడిబారడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమించేందుకు ఇలా చేయండి చాలు... మాయిశ్చరైజర్ : బొట్టుబిళ్ల తీయకుండా అదేపనిగా ఉంచడం వల్ల చర్మం పొడిబారి దురద వస్తుంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసి మాయిశ్చరైజర్ రాసి మర్దన చేయాలి. ఇది పొడిబారిన చర్మానికి తేమనందించి దురదను తగ్గిస్తుంది. నూనె: రోజూ రెండు నిమిషాల పాటు కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసి మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి తేమ అంది మచ్చపడకుండా ఉంటుంది. జెల్ : అలోవెరా జెల్‌ను రాసి మర్ధన చేయడం వల్ల అక్కడ ఏర్పడే దద్దుర్లు, మొటిమలు పోతాయి. అలోవెరా జెల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మాన్ని దురద, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. గ్లూ తక్కువగా : బొట్టు బిళ్లలను ఎంపిక చేసేటప్పుడు గ్లూ, గమ్ తక్కువగా ఉండే వాటినే ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసేసి మాయిశ్చర్ రాసుకుని పడుకోవాలి. ఉదయం బొట్టు బిళ్ల పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు. -
వాటికి దూరంగా ఉంటాను.. అదే నా బ్యూటీ సీక్రెట్: సాయిపల్లవి
హీరోయిన్ సాయిపల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకుంది. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ స్టైల్‌ని క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే ఇప్పటిదాకా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చిన సాయిపల్లవి అనూహ్యంగా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఈమె చేతిలో కమలహాసన్ నిర్మించనున్న ఓ సినిమా మాత్రమే ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే సాయిపల్లవి మేకప్ లేకపోయినా ఎంతో అందంగా ఉంటుంది. దాని వెనుకున్న బ్యూటీ సీక్రెట్‌ను ఆమె బయటపెట్టింది. ''తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు తీసుకుంటాను. కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి నేను దూరం. వారంలో కనీసం మూడు రోజులు ఎక్సర్సైజ్ చేస్తాను. తగినన్ని మంచినీళ్లు తాగుతాను'' అంటూ తన అందం వెనకున్నరహస్యాన్ని బయటపెట్టింది. -
బ్రేక్‌ఫాస్ట్‌లో రోజూ అరటిపండు తింటున్నారా? అస్సలు అలా చేయకండి
రోజూ ఉదయం అల్పాహారం తప్పనిసరి అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నా కొందరు ఏమాత్రం దీన్ని ఫాలో అవ్వరు. ఖాళీ కడుపుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల గ్యాస్ట్రిక్తో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. కొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉదయం పూట టిఫిన్ చేయరు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలి? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ► బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ► కొందరు ఓ గ్లాసు పాలతోనే, ఓ చిన్న పండుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని ముగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాసేపటికే ఆకలి మొదలై కనిపించినవన్నీ తినేస్తుంటాం. దీని వల్ల అమాంతం బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. ► ఉదయాన్ని ప్రోటీన్లు, మంచి కొవ్వులు కలగలిపిన ఆహారాన్ని తీసుకోవాలి. సోయా, పప్పు గింజలు, పాలు, పనీర్, గుడ్డు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఛాయిస్. ► తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. రాగుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అందుకే ఉదయాన్ని రాగిజావ తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ► పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే రోజూ ఊదయన్నే పాలకూర దోశ తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ► చాలామంది అల్పాహారంలో ఇడ్లీ తీసుకుంటుంటారు. దీంతో పాటు ఒక గ్లాసు పాలు కూడా జత చేసుకుంటే అలసట ఉండదు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. ► ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తినకూడదా? అరటిపండ్లలో పోషక విలువలు ఎంత ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో దాదాపు 25 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపండ్లను తీసుకుంటుంటారు. వీటిని తినడం వల్ల తాత్కాలికంగా బలంగా అనిపించినా కాసేపటికే అలసటగా, ఆకలిగా అనిపించేలా చేస్తుంది. అరటిపండులోని చక్కెర బూస్ట్ కోరికలను ప్రేరేపిస్తుంది.అందుకే అల్పాహారంలో అరటిపండ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకోకుండా సాయంత్రం స్నాక్స్‌గా వీటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయిని చెబుతున్నారు. -
అరటిపండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా? దానిలోని బి12 చర్మానికి..
ఈరోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా మేం ఎందుకు తగ్గాలి అని సెలూన్ షాప్‌లకు క్యూ కడుతున్నారు. వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్లీ ప్రోడక్ట్లను కొంటున్నారు. అయితే ఖర్చు లేకుండానే మన ఇంట్లో దొరికే వస్తువులతో క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూసేద్దాం. బ్యూటీ టిప్స్: అరటి తొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి. ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసుకుని, ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. అరటి పండులో ఉన్న విటమిన్ బి 6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
స్కూల్‌కి వెళ్లనని పిల్లలు మారాం చేస్తున్నారా? ఇలా చేసి చూడండి
ఉదయాన్నే పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించడం పేరెంట్స్‌కు పెద్దపని. ఇంతకంటే వాళ్లను నిద్రలేపడం అతిపెద్ద టాస్క్. ఎంత లేపినా నిద్ర లేవరు. కింద స్కూల్ ఆటోనో, బస్సో వచ్చి హారన్ కొడుతుంటుంది. కానీ వీళ్లు లేవరు. వీళ్లను తొందరగా నిద్ర లేపాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.... సమస్యను అర్థం చేసుకోవాలి.. ముందుగా నిద్ర లేవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో గమనించాలి. రాత్రి సరిగా పడుకున్నారా లేదా... అసలు నిద్రపట్టలేదా... ఇంకేదైనా సమస్య ఉంటే అనునయంగా అడిగి తెలుసుకోవాలి. సరిపోయిందా లేదా? స్కూలుకు వెళ్లే పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. గేమ్స్, ఫోన్లు చూస్తూ సరిగా పడుకోరు. రోజూ ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి వాళ్లు కచ్చితంగా పడుకునేలా చేయాలి. ప్రేమతో లేపాలి ఉదయం ఎంత ఉత్సాహంగా లేస్తే రోజంతా అలానే గడుస్తుంది. అందుకే పిల్లలు త్వరగా లేవకపోయినా ప్రేమగా నిద్రలేపాలి. పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాషలోనే నిద్రలేపాలి. ఇందుకోసం వాళ్లకు నచ్చే మంచి విషయాలు, స్కూలుకు వెళ్లడం ఎంతముఖ్యమో ప్రేమతో చెప్పాలి. ఇష్టమైన ఫుడ్ పిల్లలు ఇష్టంగా తినే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వాలి. అది తినడం కోసం అయినా త్వరగా నిద్ర లేస్తారు. ఈ నాలుగు చిట్కాలు ప్రయత్నిస్తే మీ సమస్య తీరినట్టే. -
దిండు లేకుండా పడుకోలేరా? ఈ సమస్యలు తప్పవు
రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది తలకింద దిండు పెట్టుకొని పడుకుంటారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న దిండు ఫరవాలేదు కానీ, పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది మొదట్లో తెలియదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి ఎదురవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తుంది. కొంతమందికి ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పితో బాధపడతారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తయిన దిండు ఉపయోగిస్తున్నట్లు లెక్క. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్‌లలో దరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. తలలో రక్త ప్రసరణ జరగదు: ఎత్తయిన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అంతేకాదు, తరచు తలనొప్పి వస్తుంది. లావుపాటి దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల మెడనొప్పి ఉండకూడదంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండుని ఉపయోగించాలి లేదంటే మెత్తటి టవల్ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తలకింద పెట్టుకోవడం ఉత్తమం. -
ఎండుకొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి
ఎండుకొబ్బరిని నిల్వ ఉంచిన కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం చూస్తుంటాం. ఇవేవీ రాకుండా, కొబ్బరిచిప్పలను చింతలేకుండా ఇలా నిల్వచేసుకోండి... మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా తుడిచి, ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరినూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో పెట్టి , కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా పెట్టిన కొబ్బరి నెలల పాటు పాడవకుండా ఉంటుంది. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపల, బయటా తుడవాలి. ఇలా తుడిచిన చిప్పలను ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టి, కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేయాలి. ఇలా కూడా ఎక్కువ రోజుల పాటు చిప్పలు తాజాగా ఉంటాయి. -
వర్షాకాలం: పకోడీలు, బజ్జీలు ఇలా చేస్తే క్రిస్పీగా..
పకోడీలు, బజ్జీలు క్రిస్పీగా రావాలంటే... పిండిని కలిపేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి.∙ అరగంట ముందే పిండిని చల్లని నీటితో కలిపి పక్కన పెట్టుకోవాలి. పకోడీలు, బజ్జీలను నూనెలో వేసి డీప్‌ఫ్రై చేసేటప్పుడు పదేపదే తిప్పకూడదు. ఎక్కువగా తిప్పితే మెత్తగా మారతాయి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు మాత్రమే తిప్పుతూ ఫ్రైచేయాలి. పచ్చిమిర్చి, పాలకూర, వంకాయ, అరటికాయ, బంగాళ దుంప వంటివాటితో బజ్జీలు వేసేముందు శుభ్రంగా కడిగి, కాటన్ గుడ్డతో తడిలేకుండా తుడిచి ఫ్యాన్ గాలికింద ఆరబెట్టాలి. తరువాత పిండిలో ముంచితే ముక్కలకు పిండి చక్కగా అంటుకుని బజ్జీలు క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. కిచెన్ టిప్స్ ఊరగాయలను నిల్వచేసుకునే చిన్న జాడీలను పొడిగా ఆరబెట్టిన తరువాత, వేడివేడి నూనెను జాడీలోపల రాయాలి. తరువాత ఊరగాయ పెడితే బూజు పట్టదు. రోజూ మూతతీసి వాడుతున్నప్పటికి పచ్చడి ఎక్కువరోజుల పాటు నిల్వ ఉంటుంది. -
ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయుర్వేదంతో చెక్
అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. చిన్న చిట్కాలతోనే కొన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది. బిళ్లగనేరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది. అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది. నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది. గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది, పెరుగుతుంది. అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది ఎర్రమందారంపూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి -
ఈ డివైస్‌తో శాశ్వతంగా మొటిమలను పోగొట్టుకోవచ్చు..
సాధారణంగా తీసుకుంటున్న ఆహారంతోనో, వయసులో వచ్చే మార్పులతోనో, నెలసరి సమయాల్లోనో.. మొటిమలు రావడం.. అవి పూర్తిగా తగ్గకుండా నల్లటి మచ్చలుగా మిగిలిపోవడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం వంటివి చాలామందిలో కనిపించే సమస్యలే. వాటికి చెక్ పెడుతుంది చిత్రంలోని మినీ మెషిన్.ఈ ఎల్ఈడీ మెడికల్ డివైస్ (యాక్నే లైట్ షాట్).. వాడుతున్న తొలి రోజు నుంచే మెరుగైన ఫలితాలనివ్వడం మొదలుపెడుతుంది. అంటే ట్రీట్మెంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న మాట. ఇది చర్మం మీద ఏర్పడే మొటిమల్ని, మచ్చల్ని, గాయాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీన్ని వినియోగించే సమయంలో చేతులతో అవసరం ఉండదు. పైగా ఈ డివైస్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్‌తో రూపొందిన ఈ మినీ మెషిన్.. మొటిమలు లేదా మచ్చలున్న చోట లైట్ థెరపీతో చర్మాన్ని మెరిపిస్తుంది. ఇది చాలా సురక్షితమైనది. ప్రభావవంతమైనది. వేగవంతమైనది కూడా. ఈ చికిత్సతో 90 శాతం మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ డివైస్‌ని వినియోగించి.. ముఖం మీదున్న రంధ్రాలను 80 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. గాయాలను వాటి తాలుకు మచ్చలను 75 శాతం వరకూ నయం చేసుకోవచ్చు. దీన్ని మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కంటి పరిసరాల్లో వినియోగిస్తున్నప్పుడు.. చిత్రంలోని ప్రత్యేకమైన కళ్లజోడును పెట్టుకోవాలి. బాగుంది కదూ! -
ఆ జ్యూస్ తాగుతాను.. అదే నా అందానికి రహస్యం
'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ చిత్రం బంపర్ హిట్ అయనా ఎందుకో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. దీంతో ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అక్కడ తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణంతో బోలెడంత పబ్లిసిటీ దొరికింది. శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ కోలీవుడ్ కోడూ కూస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఆమె ఏం చెప్పిందంటే..పొద్దున్నే లెమన్ జ్యూస్ తాగుతాను. నా డైట్లో తాజా పండ్లు తప్పకుండా ఉంటాయి. అలాగే తగినన్ని మంచినీళ్లూ తాగుతుంటాను. ట్యాన్ ఫ్రీ స్కిన్ కోసం.. సమయం చిక్కినప్పుడల్లా టొమాటో గుజ్జును చేతులు, కాళ్ల మీద అప్లయ్ చేస్తాను. ఇక ఫేస్‌ప్యాక్ విషయానికి వస్తే పెరుగులో కొంచెం తేనె, కాసింత నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటాను. దీంతో ముఖం నున్నగా.. కాంతిమంతంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చింది. -
ఎక్కువగా నిలబడి పనిచేస్తున్నారా?వెరికోస్ వెయిన్స్ నొప్పి నుంచి ఇలా ఉపశమనం
పాదాల్లోని సిరల్లో అవరోధాలు ఏర్పడి చెడురక్తం నిలిచిపోయి అవి మెలికలు తిరిగి ఉబ్బుతాయి. దీన్నే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువగా నిలబడి పని చేసేవారిలో వెరికోస్ వెయిన్ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికి పరిష్కార మార్గాలు, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. యోగా యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.సిరల నుంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. యోగాసనాల ద్వారా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే వాపు, పుండ్లు పడటం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం శారీరక శ్రమ లేదా వ్యాయామం అనారోగ్య సిరల అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం మీ కాళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంద. అంతేకాకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ సైకిల్ తొక్కడం ఊపిరితిత్తులు లెగ్ లిఫ్ట్‌లు ఇలా చేయడం వల్ల కాళ్ల సిరల్లో ఒత్తిడి తగ్గడంతో పాటు సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.పేరుకుపోయిన టాక్సిన్స్ నుంచి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. వెరికోస్ వెయిన్స్కి చికిత్స చేయడానికి, పలచని యాపిల్ సైడర్ వెనిగర్‌ను వెరికోస్ వెయిన్లపై చర్మానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి. లేదా గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకొని తాగాలి.యాపిల్ సైడర్ వెనిగర్ చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. లెగ్ మసాజ్ నొప్పి ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల వేరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అయితే మసాజ్ చేసేటప్పుడు, నేరుగా సిరలపై నొక్కకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది పెళుసుగా ఉండే కణజాలాలను దెబ్బతీస్తుంది. వెరికోస్ వెయిన్ నొప్పి నుంచి ఉపశమనం తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్దతులు: అశ్వగంధ అశ్వగంధను సాధారణంగా "ఇండియన్ జిన్సెంగ్" లేదా "ఇండియన్ వింటర్ చెర్రీ" అని పిలుస్తారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించే సాంప్రదాయ ఔషధం. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గోటుకోలా గోటు కోలా అనేది ట్రైటెర్పెనిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెంటెల్లా ఆసియాటికా (TTFCA) అనే రసాయనాన్ని కలిగి ఉన్న ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధం. ఈ రసాయనం ముఖ్యంగా అనారోగ్య సిరలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎలాస్టిన్, కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గుగ్గుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన గుగ్గుల్‌ను ఆయుర్వేదంలో ఆర్థరైటిస్,ఊబకాయంతో సహా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.గుగ్గుల్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మొటిమలు వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణం త్రిఫల అనేది ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఫార్ములా. ఇది రక్తాన్ని నిర్వీషికరణ చేయడంలో సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం కండరాలకు బలాన్ని అందిస్తుంది. మంజిష్ఠ మంజిష్ట రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.రక్తప్రవాహంలో అడ్డంకులను కరిగిస్తుంది. అనారోగ్య సిరలు చికిత్సకు ఇది ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి. మంజిష్ఠ యొక్క ఇతర ప్రయోజనాలు మొటిమలు, హైపర్పిగ్మెంటేషన్ను నయం చేయడం. పసుపు పసుపులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, వెరికోస్ వెయిన్స్ చికిత్సలో బాగా పనిచేస్తుంది. ఇది వాపు,నొప్పిని తగ్గిస్తుంది. రక్తం నుంచి హానీకరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. గమనిక: పైన పేర్కొన్ని ఆయుర్వేద మందులను వైద్యునితో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. -నవీన్ నడిమింటి -
ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఇలా చేయండి
ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి ఎక్కువగా దృష్టిపెట్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అసలు ఎందుకిలా అయ్యింది? ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ప్రతిరోజు మనకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెడితే లక్షలకు లక్షలు ఆసుపత్రులకు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో కొన్ని తెలుసుకుందాం.. హెల్త్ టిప్స్ తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్‌లు సమృద్ధిగా ఉండటం వల్ల నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితే ఒంటికి వెంటనే శక్తి వస్తుంది. సోయా బీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. దాంతో మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ని శరీరం బాగా గ్రహిస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పళ్ళు, మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకుంటూ ఉంటే రక్తహీనత నుంచి బయట పడవచ్చు. -
మీకు తెలుసా? ఈ పండ్లు, కూరగాయలు తింటే షుగర్ రాదు
డయాబెటిస్ ఇప్పుడు అందరి నోటా అదే మాట. ఇది రక్తంలో చక్కెరను అనూహ్యంగా పెంచే జీవక్రియ వ్యాధి. ఒక వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉన్నపుడు షుగర్ వ్యాధి అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది డయాబెటిస్ కు గురయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అందరూ పరీక్షలు చేయించుకుంటే ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. షుగర్ వచ్చిందని తేలితే.. ఎక్కడ లేని ఆంక్షలు మొదలవుతాయి. ఏది తినాలన్నా.. షుగర్ పెరుగుతుందంటారు. పండు ముట్టనివ్వరు, భోజనం సరిగా చేయనివ్వరు. ఈ పరిస్థితి అత్యంత ఇబ్బందికరం. షుగర్ వచ్చిన వాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? షుగర్ ఉన్న వాళ్లు పళ్లు తినకూడదంటారు కానీ, చిన్నప్పటినుంచి పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తింటే షుగర్ సమస్య రాదు. షుగర్ ఉన్నవారు కూడా ఒక పద్ధతిలో పిండిపదార్థాలను బాగా తగ్గించి పొద్దున, సాయంత్రం ఖాళీ కడుపున పండ్లు తీసుకోవడం మంచిది. అయితే బాగా తియ్యగా వుండే మామిడి, ద్రాక్ష లాంటివి కాకుండా దోర జామ, కివి, బొప్పాయి లాంటివి మంచిది. ఆకు కూరల్లో ఏముంది? తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు ఏం చేయాలి? షుగర్ వున్న వారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి టైమ్ ప్రకారం భోజనం చేయాలి, అన్నం తగ్గించి జొన్న, సజ్జ, గోధుమ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి టీ, కాఫీ తగ్గించాలి, వాటి కంటే లెమన్ టీ, అల్లం టీ మంచిది. నూనెలో బాగా వేయించిన వడియాలు, అప్పడాలు అసలే వద్దు అలాగే వడలు, పూరీలు, బజ్జీలు, మైదాతో చేసినవి తగ్గించాలి, లేదా ఆపేయాలి 6 important medical items to have at home: 1. First aid box: for home accidents 2. Thermometer: for body temperature 3. Routine meds: e.g. if diabetic 4. BP device: if you're hypertensive 5. Glucometer: if you're diabetic 6. Inhaler & portable nebulizer: if asthmatic Take note. — First Doctor (@FirstDoctor) July 10, 2023 షుగర్ పెరగకుండా ఏం చేయాలి? తిన్నది ఏదైనా అరిగించుకునేలా.. అంటే క్యాలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి నడకతో పాటు వ్యాయామం మంచిది, ఓపిక, శక్తిని బట్టి ఈత, సైక్లింగ్ చేస్తే బెటర్ రాత్రి పూట కనీసం 8 గంటల పాటు కంటి నిండా నిద్ర పోవడం తప్పనిసరి ఒత్తిడికి దూరంగా ఉండండి, కుటుంబంతో సరదాగా గడపండి షుగర్ ఉన్నవాళ్లు తినకూడనివి స్వీట్లు, ఐస్‌క్రీమ్స్, చక్కెర పదార్థాలు అరటి పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. డయాబెటస్ పేషెంట్స్ తినకపోవడమే మంచిది బొప్పాయి పండులో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్లు చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి పండ్లతో పోలిస్తే జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి అవి తీసుకోకపోవడమే మంచిది ప్రాసెడ్ ఫుడ్స్‌కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు వైద్యులు -
పిల్లలు స్కూల్‌కి వెళ్లమని మారాం చేస్తున్నారా? ఇలా చేయండి
స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. పొద్దున లేచి స్కూలుకు వెళ్లాలంటే భయం, బాధతో బడికెళ్లమని మారాం చేస్తుంటారు చిన్నారులు. మరికొంతమంది అయితే మొండికేసి ఏడుపు అస్సలు ఆపరు. ఇలాంటి పిల్లలను నవ్వుకుంటూ స్కూలుకు పంపాలంటే ఈ నాలుగు పాటిస్తే సరి... మానసికంగా సిద్ధం చేయాలి: ముందుగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి తరగతి టీచర్, తోటి విద్యార్థులు, ఇతర స్కూలు సిబ్బందితో మాట్లాడి, వారితో స్నేహంగా మెలగాలి. అప్పుడు అది దగ్గర నుంచి చూసిన పిల్లలు స్కూలు వాతావరణాన్ని కొత్తగా భావించరు. దీంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా నవ్వు తెప్పించే కథలు చెబుతూ ఉండాలి. గట్టిగా అరవకూడదు : పిల్లలు స్కూలుకు వెళ్లను అని మారాం చేసినప్పుడు గట్టిగా తిట్టడం, ఆరవడం, కోప్పడటం చేయకూడదు. ఇలా చేస్తే వాళ్లు మరింత భయపడతారు. ఎందుకు స్కూలుకు వెళ్లనంటున్నారో బుజ్జగిస్తూ కారణాలు తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి వాళ్లను స్కూలుకు వెళ్లడానికి అనుకూలంగా ఆలోచించేలా వివరిస్తూ, వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. అనుకూలంగా మాట్లాడాలి : స్కూలు ప్రారంభంలో పిల్లలను స్కూలో దింపడం, స్కూలు అయిపోయాక తీసుకురావడం చేయాలి. వాళ్లకిష్టమైన టిఫిన్ పెట్టాలి. స్కూలు నుంచి వచ్చాక ‘‘స్కూల్లో ఎలా గడిచింది? ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు? ’’ అని అడగాలి. స్కూల్లో తమ పిల్లలు ఎలా ఉంటున్నారో పిల్లలకు తెలియకుండా టీచర్‌ను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. టీచర్ చెప్పిన సలహాలు సూచనలు పాటించాలి. ప్రోత్సహించాలి: స్కూలుకు వెళ్లేందుకు ఆసక్తి కలిగేలా పిల్లలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుండాలి. స్కూల్లో స్నేహితులను ఏర్పర్చుకోమని చెబుతుండాలి. ఇవన్నీ చేయడానికి తల్లిదండ్రులు కాస్త సహనం పాటిస్తే.. పిల్లలు సంతోషంగా స్కూలుకు వెళ్లి చదువుకుంటారు. -
Interior Designs: వర్షాకాలం.. ఇంటి మేకోవర్ మార్చేయండి ఇలా
మండే ఎండల నుంచి చినుకుల చిత్తడిలోకి వాతావరణం మారిపోయింది. ఇంటి మేకోవర్నూ మర్చాల్సిన సమయం వచ్చింది. సో.. వానాకాలంలో మీ ఇల్లు ఆహ్లాదంగా ఉండేందుకు ఇంటీరియర్ డిజైనర్స్ ఇచ్చే సూచనలు కొన్ని... ► బయట వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి బ్రైట్‌గా ఉండే ఫర్నిషింగ్ ఎంచుకోవాలి. అంటే, దిండ్లు, కర్టెన్లు, రగ్గులు వంటివాటిని ముదరు రంగుల్లో తీసుకుంటే ఇంటి వాతావరణం ఉల్లాసంగా.. ఉత్తేజంగా ఉంటుంది. ► ఈ కాలం వుడెన్ ఫర్నిచర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఏ కొద్దిగా తడిసినా, తేమ చేరుకున్నా సమస్యలు తలెత్తుతాయి. అందుకని వానా కాలం.. ఇంట్లో వీలైనంత వరకు వుడెన్ ఫర్నిచర్‌ను తగ్గిస్తే మంచిది. ► రుతుపవనాలు మనల్ని ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాయి. వేడి వేడి కాఫీ లేదా టీ తాగుతూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఆస్వాదించాలనుకునేవారు.. ఇంట్లో నచ్చిన కార్నర్ ప్లేస్‌ను ఎంచుకొని.. పుస్తకాలను అమర్చుకోవడానికి ఒక షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకోండి. ఈ సీజన్ ఉన్నంత వరకు వేడి వేడి కాఫీ లేదా టీతో అటు బయటి వాతావరణాన్నీ.. ఇటు ఇష్టమైన పుస్తకంలోని అంతకన్నా ఇష్టమైన పంక్తులనూ ఆస్వాదించవచ్చు! ► వెచ్చగా, బ్రైట్‌గా ఉండే లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ఎల్ఈడీ బల్బులు, ఫెయిరీ లైట్లను ఉపయోగించుకోవచ్చు. కాంతి పెరగాలంటే ల్యాంప్ షేడ్స్, ఫ్లోర్ లేదా టేబుల్ ల్యాంప్లనూ ఎంచుకోవచ్చు. ► గోడలకు వాల్ పేపర్ లేదా వాల్ ఆర్ట్‌తో ప్రయోగాలు చేయవచ్చు. దీని వల్ల గ్లూమీగా ఉండే వాతావరణం ఒక్కసారి ఆసక్తిగా మారిపోతుంది. ► తేమ ఎక్కువ ఉండే రోజులు కాబట్టి.. ఒకరకమైన తడి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. సువాసన గల కొవ్వొత్తులను ఉంచాలి. లేదా సిట్రస్, లావెండర్ వంటి సువాసనలతో కూడిన ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్‌లను ఉపయోగించాలి. తాజా వాసన కోసం వార్డ్ రోబ్లలో ఎండిన పువ్వులు లేదా సుగంధ మూలికలతో నింపిన సాషేలను వేలాడదీయాలి. ► సువాసనలు గల కొవ్వొత్తులను లివింగ్ రూమ్.. దాని పక్కనే ఉన్న గదుల మధ్యలో ఉంచినట్లయితే అవి మరింత ఆహ్లాదంగా మార్చేస్తాయి. -
వర్షాకాలమే కదా.. మొక్కలకు నీళ్లు పోయాలా?
వర్షాలు పడుతున్నాయి కదా ఇంక మొక్కలకు నీళ్లు పోయనవసరంలేదని కొంతమంది అనుకుంటారు. కానీ వర్షాల్లో కూడా కొన్నిరకాల మొక్కలకు నీళ్లు పోస్తేనే గార్డెన్ పచ్చగా కళకళలాడుతుంది. అందుకు ఇవే కారణాలు... ♦సాధారణంగా మొక్కలకు వర్షాకాలంలో సహజసిద్ధంగా నీళ్లు అందుతాయి. కానీ, కుండీల్లో ఉన్న మట్టి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచలేకపోతే, మొక్కలు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు తేమను చూసుకుని మొక్కలకు నీళ్లు పోయాలి. ♦కుండీల్లో పెరుగుతోన్న కొన్ని రకాల మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి. దట్టంగా ఉన్న ఆకులు, కొమ్మలు కూడా వెడల్పుగా విస్తరించి చినుకులను అడ్డుకుంటాయి. ♦ వర్షం చినుకులు కొమ్మలపై పడి పక్కకు జారిపోతాయి. దీనివల్ల వేర్లకు సరిగా నీరు అందదు. అందువల్ల గుబురుగా ఉన్న కుండీ మొక్కలకు తప్పని సరిగా నీళ్లుపోయాలి. -
ఈ ఫేస్‌ప్యాక్‌తో వారం రోజుల్లోనే మీ చర్మం మెరిసిపోతుంది
బ్యూటీ టిప్స్ ♦రెండు టేబుల్ స్పూన్ల బియ్యంలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే రోజ్‌వాటర్‌తో పాటు బియ్యాన్ని మెత్తగా రుబ్బాలి. ♦ ఇందులో కుంకుమ పువ్వు రేకులు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, కాసింత కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ వేసి మిశ్రమం క్రీమ్‌లా మారేంత వరకు కలుపుకుని గాజు సీసాలో వేసి నిల్వచేసుకోవాలి. ♦ రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. క్రమం తప్పకుండా వారం రోజుల పాటు ఈ క్రీమ్ రాసుకోవడం వల్ల నల్లమచ్చలు, ట్యాన్ తగ్గి, ముఖ చర్మం కాంతిమంతంగా మారుతుంది. -
నల్ల జామపండ్ల గురించి మీకు తెలసా? వీటిని తినడం వల్ల..
పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ప్రతిరోజూ పండ్లను తినడం వల్ల అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. అలాంటి పండ్లలో జామపండ్లు కూడా ఒకటి. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు జామపండ్లను ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే జామాపండ్లు గురించి అందరికి తెలుసు.. కానీ నల్ల జామకాయల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సాధారణ జామ పండుతో పోలిస్తే ఈ నల్ల జామ పండులో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.. ► నల్ల జామపండ్లు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. శరీరానికి కూడా ఇవి చాలా మంచివి. ► ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటివి ఇందులో అధికంగా ఉంటాయి. ► నల్ల జామపండ్లను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► అంతేకాకుండా వీటిని తరచూ తినడం వల్ల మలబద్దకం, పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. ► రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ నల్ల జామపండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ► నల్ల జామకాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. ► యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో వృద్ధాప్యాన్ని నివారించటంలో నల్ల జామకాయలు సహాయపడతాయి. ► నల్లజామకాయలు తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల జామకాయలు తినాలంటే మాత్రం ఇండియలో దొరకవు. ఈ పండ్లు ఎక్కువగా బ్రెజిల్, సౌత్ అమెరికాలో ఎక్కువగా దొరుకుతాయి. -
ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడ్ తగ్గిందా? ఇదిగో పరిష్కారం!
నేడు ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో మొబైల్ బ్రౌసింగ్ స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎలా క్లియర్ చేయాలి, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి మనం మొబైల్ ఫోన్ ఉపయోగించే సమయంలో అనేక బ్రౌజర్లను ఓపెన్ చేస్తుంటాము. అవన్నీ కూడా బ్యాకెండ్‌లో సేవ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. దీని కారణంగానే మొబైల్ ఫోన్ వేగం మునుపటి కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత తప్పకుండా స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయడం ఎలా? మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తరువాత కుడివైపున మూలలో మరిన్ని అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే మెనూలో హిస్టరీ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత 'క్లియర్ యువర్ బ్రౌసింగ్ డేటా' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, అందులో ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే అప్పటికి సేవ్ అయిన హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. ఫైల్స్ ఎక్కువగా ఉంటే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది, దీని ద్వారా మొబైల్ స్పీడ్ తప్పకుండా పెంచుకోవచ్చు. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) మొబైల్ స్పీడ్ తగ్గింది అనిపించినప్పుడు క్యాచ్ క్రమం తప్పకుండా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్యాచ్ క్లియర్ అనేది కేవలం మొబైల్ ఫోన్‌కి మాత్రమే కాకుండా అప్లికేషన్లకు కూడా వర్తిస్తుంది. దీన్ని కూడా క్లియర్ చేసుకోవడం వల్ల అప్లికేషన్ వేగం పెరుగుతుంది. -
అందంగా కనిపించడానికి రకుల్ ఏం చేస్తుందో తెలుసా?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో దూరమయ్యాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.ఇక ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే రకుల్ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టింది. రోజు విడిచి రోజు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ముఖానికి, మెడకు మసాజ్ చేసుకుంటాను. ముఖం,మెడ మీది ట్యాన్ పోవడానికి వీలైనప్పుడల్లా టొమాటోతో రుద్దుకుంటాను. పెరుగులో పసుపు, శనగపిండి కలిపి దాన్ని ప్యాక్‌లా వేసుకుంటాను. -రకుల్ ప్రీత్ సింగ్ -
నోటి దుర్వాసన.. లైట్ తీసుకోవద్దు, చాలా ప్రమాదం
మీ నోరు బాగుందా? నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందన్నది సామెత. అందులోని నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, మన నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందన్నది వైద్య నిపుణుల మాట. కొందరి నోటి నుంచి చెడు వాసన వస్తుంటుంది. అది వారికి తెలియదు. ఒకవేళ తెలిసినా, అది కేవలం నోటి సమస్య మాత్రమే అనుకుని నోటిని పుక్కిలించి ఉమ్మెయ్యడం, మౌత్వాష్లను వాడటం వంటివి చేస్తారు. కానీ, చెడు శ్వాస అనారోగ్యానికి సంకేతమనే సంగతి మీకు తెలుసా? అవును. అది నిజం. బాగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంటే తప్పకుండా అనుమానించాలి. శరీరంలో నీరు తగ్గినట్లయితే.. ఆకలి వేస్తుందనే తప్పుడు సంకేతాలు ఇస్తుంది మెదడు. ఆ సమయంలో ఆహారానికి బదులు నీళ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. నోరు పొడిబారితే లాలాజలంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణం తగ్గిపోయి నోటినుంచి చెడు వాసన వస్తుంది. అలర్జీలు కూడా కారణమే నోటి శుభ్రత పాటించకపోవడం, అలర్జీల వంటి సమస్యల వల్ల కూడా శ్వాస దుర్వాసన వస్తుంది. ఒకవేళ మీరు నోటిని శుభ్రంగా ఉంచుకుంటూ.. తగినన్ని నీళ్లు తాగే అలవాటు ఉన్నా సరే నోరు చెడు వాసన వస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. టాన్సిల్ స్టోన్స్ వల్ల కూడా నోటి నుంచి చెడు వాసన వస్తుంది. కాబట్టి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వివిధ అనారోగ్య సమస్యలు, చెడు అలవాట్ల వల్ల కూడా నోటినుంచి దుర్వాసన వస్తుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి టూత్ బ్రష్‌ను మార్చడం ముఖ్యం, అలాగే నాలుక స్క్రాపర్, ఫ్లాసర్ కూడా మార్చాలి. ఈ సాధనాలు మీ దంతాలు, చిగుళ్ళు, నాలుకను శుభ్రంగా ఉండేలా చూస్తాయి. పంటినొప్పి, చిగుళ్ళలో వాపు వంటి బాధాకరమైన పరిస్థితులకి దారితీసే అసౌకర్యాలను నివారిస్తాయి. భోజనం చేసిన తర్వాత ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం సహజమైన మౌత్‌వాష్‌గా పని చేస్తుంది, ఇది మీ నోటి పరిశుభ్రతను మరింత మెరుగుపరుస్తుంది. సరైన నోటి పరిశుభ్రత కోసం సాఫ్ట్–బ్రిస్టల్ బ్రష్, టూత్‌పేస్ట్, ఫ్లాస్, టంగ్ క్లీనర్, మౌత్ వాష్ వంటి ముఖ్యమైన ఉత్పత్తులను తప్పకుండా ఉపయోగించాలి. అప్పుడే నోటి ఆరోగ్యం బాగుండి, ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. గుండె జబ్బులను నివారించాలని అనుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందు పళ్లు తోముకోవడం ఎంత ముఖ్యమో రాత్రి భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు పళ్లు తోముకోవడం కూడా అంతే ముఖ్యమని అధ్యయనకారులు సలహా ఇస్తున్నారు. కొన్ని ఆహారాలు మీ చిగుళ్ళను బలంగా ఇంకా దంతాలు ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. చిగుళ్ళు తగినంత బలంగా లేకుంటే, దంతాలు ఊడిపోతాయి. అందువల్ల, చిగుళ్ళను దృఢంగా చేయడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవటం అవసరం. నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు ►దుర్వాసన కేవలం నోటి నుంచే వస్తున్నట్లయితే.. రోజూ ఉదయాన్నే పళ్లు తోమగానే తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఏదైనా ఆహారాన్ని తిన్న తర్వాత నీటితో నోరు పుక్కిలించి ఉమ్మేయాలి. నోటిలో ఆహారం ఎక్కువసేపు ఉన్నట్లయితే బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంది. అది నోటిలో దుర్వాసన కలిగిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని నీటిని తాగుతుండాలి. ►రోజూ ఆపిల్ లేదా క్యారట్లను తినడం ద్వారా కూడా నోటిలో ఉండే మలినాలను తొలగించవచ్చు. కాఫీ ఎక్కువగా తాగినా సరే దుర్వాసన వస్తుంది కాబట్టి కాఫీకి బదులు గ్రీన్ టీ తాగడం మేలు. ఎందుకంటే గ్రీన్ టీ శ్వాసను మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. ► యాలుక్కాయను నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ► దాల్చిన చెక్క, లవంగం కూడా మంచిదే. కిడ్నీలు సరిగా పని చేయకపోతే రక్తంలో ఉండే వ్యర్థాలు, మలినాలు పేరుకుపోతాయి. ఆ ప్రభావం నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్‌పై పడుతుంది. ఫలితంగా తినే ఆహారం రుచిగా అనిపించదు. పైగా ఏదో లోహాన్ని నోటిలో పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అంతేగాక.. చెడు రక్తం వల్ల ఊపిరితిత్తుల్లోకి కూడా చేరుతుంది. దానివల్ల శ్వాస క్రియ సమయంలో రక్తంలో ఉండే మలినాలు మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌లో కలుస్తాయి. ఆ గాలి బయటకు వచ్చినప్పుడు శ్వాస దుర్వాసనతో కూడి ఉంటుంది. కాబట్టి.. ఆ రెండు లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించడం అవసరం. ఎందుకంటే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది! అనారోగ్య కారణాలు కావచ్చు..! -
పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..
కిచెన్ టిప్స్.. ♦ కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే... పలుచటి వస్త్రంలో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ♦ ఉల్లిపాయలు తరగడానికి పది నిమిషాల ముందు నీటిలో వేసి ఉంచితే తరిగేటప్పుడు కళ్లు మండడం, నీరు కారడం ఉండదు. ♦ పండ్లు, కూరగాయలను న్యూస్పేపర్లో చుట్టి ఫ్రిజ్పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ♦ యాపిల్ తరిగిన తర్వాత ప్లేట్లో పెట్టి సర్వ్‌చేసే లోపే ముక్కలు రంగుమారుతుంటాయి. తరిగిన వెంటనే నిమ్మరసం రాస్తే రంగుమారవు. చాకుకు నిమ్మరసం రాసి తరగడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ♦ పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టే ముందు తొడిమలు తీసేయాలి. -
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేస్తే తాజాగా ఉంటుంది
రుచిగా, వేగంగా వంట చేయాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి... ♦కూర ఏదైనా రుచికోసం అల్లం వెల్లుల్లి పేస్టుని వాడుతుంటాం. ఈ పేస్టుని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినప్పటికీ కొన్నిసార్లు రంగు మారి, ఎండిపోయినట్లు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టుని నిల్వచేసేముందు కొద్దిగా నూనె కలిపి పెడితే మరిన్ని రోజులు తాజాగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి పేస్టులను విడివిడిగా నిల్వచేసినా నూనె కలుపుకోవడం మంచిది. ♦ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, మసాలాలు, ఇడ్లీ దోశపిండిలతో రిఫ్రిజిరేటర్ నిండిపోతుంటుంది. దీంతో తలుపు తీసినప్పుడల్లా అదొక రకమైన వాసన వస్తుంటుంది. కాటన్ బాల్‌ను వెనీలా ఎసెన్స్‌లో ముంచి, రిఫ్రిజిరేటర్లో ఒక మూలన ఉంచితే దుర్వాసన పోతుంది. ♦ మిగిలిపోయిన దోశ, ఇడ్లీ్ల పిండి, గారెల పిండి వంటివాటిని రిఫ్రిజిరేటర్లో పెట్టినా, కొన్నిరోజులకే ఎండిపోవడమో, బాగా పులిసిపోవడమో జరుగుతుంది. అందువల్ల మిగిలిపోయిన పిండిలో రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. -
వర్షకాలంలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా? అయితే ఇలా చేయండి
♦ వాతావరణంలో మార్పుల వల్ల లేదా జుట్టు స్వభావం వల్ల ఒకోసారి తలస్నానం చేసినప్పటికీ వెంట్రుకలు వాసన వస్తుంటాయి. కొంతమందిలో వాసనతోపాటు జుట్టు ఊడిపోతుంటుంది. ఈ సమస్య నివారణకు ఇంట్లోనే సులభంగా చేసుకోదగిన ఈ రెండు చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. ♦ అలోవెరా జెల్ లేదా అలోవెరా నూనెను వారానికి ఒకసారి తలకు పట్టించి గంట తరువాత కడిగితే వెంట్రుకల నుంచి వచ్చే వాసన పోతుంది. అలోవెరాలోని విటమిన్ ఎ, సి, ఇ, బీ12 లు జుట్టుకు అంది పెరుగుదలకు దోహద పడతాయి. ♦ శీకా కాయ, ఉసిరిపొడి, కరివేపాకు, మందార పువ్వులను సమపాళ్లల్లో తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వీటన్నింటిని పేస్టు చేయాలి. ఈ పేస్టుని జుట్టుకి పట్టించి అరగంట తరువాత షాంపూతో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల కురుల నుంచి వచ్చే చెడువాసన పోవడంతోపాటు, జుట్టుకూడా పెరుగుతుంది. -
Turmeric: మీకు ఈ సమస్యలు ఉంటే పసుపు అస్సలు వాడొద్దు!
భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బయోటిక్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు పసుపును కూడా మితంగానే వాడాలి. అధ్యయనం ప్రకారం రోజుకు ఒక టీ స్పూన్ పసుపు మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఒకవేళ మీరు దీర్ఘకాలంగా వ్యాధుల బారిన పడితే పసుపును వాడొద్దంటున్నారు నిపుణులు. ♦ పసుపు డయాబెటిక్ ఫేషెంట్స్కు అంత మంచిది కాదు అంటారు. ఎక్కువగా పసుపు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్ పెరుగుతుందట. ♦ పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించి పలు సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు కలగవచ్చు. ♦ ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్లు పసుపును ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత అధికం అవుతుంది. ♦ కామెర్లు ఉన్నవారు పసుపుకు వీలైనంతగా దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. ♦ కొందరు అలర్జీతో బాధపడుతుంటారు. అలాంటి వారు చాలా మితంగా పసుపును వాడాలి. లేదంటే అలర్జీ సమస్య తీవ్రమవుతుంది. ♦ కొందరికి శరీరంలో వేడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు పసుపును ఎక్కువగా తినడం వల్ల మరింత వేడి పెరుగుతుంది. ♦ అధికంగా పసుపు వినియోగించడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? ఈ లక్షణాలు ఉంటే మాత్రం..
కొందరికి ఎంత తిన్నా మళ్లీమళ్లీ ఆకలి వేస్తుంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే ఆరోగ్యపరంగా ఏవో సమస్యలు ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే మనం తినే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేయండం ద్వారా ఆకలి సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు వైద్యులు. ► ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే మీ జీర్ణాశయంలో ఏదో సమస్య ఉన్నట్లే... దీనికి మరో కాఱనం.. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం వల్ల ఆకలి పెరగుతుంది. ► మన శరీరంలో 70శాతం వరకూ నీరు నిండి ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కూడా తిరిగి ఆకలేస్తుందంటే అందుకు శరీరంలో నీరు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా ఉత్తమం. ► బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఒకేసారి భోజనం చేయడం మరికొందరికి అలవాటు. దీనివల్ల ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్న ఫీలింగ్ ఏర్పడి ఎక్కువ తినేస్తారు. ► కొందరికి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది. దీనికి మెడిసిన్స్ కారణం ఉండొచ్చు. మెడిసిన్స్‌లో రాయిడ్స్, ప్రిడ్నోసోన్స్, కార్టికాస్టెరాయిడ్ వంటివి ఆకలిని మరింత పెంచేస్తాయి. ► అతిగా వర్కవుట్స్ చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గిపోయి ఎక్కువగా ఆకలేస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎంత అవసరమో అంతవరకే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ►ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనది ఒత్తిడి. ఈరోజుల్లో చాలావరకు ఒత్తిడితో బాధపడుతున్నవాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఎక్కువ ఆహరం తీసుకోవాలనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ►మనం తినే ఆహారంలో శరీరానికి సరైన పోషకాలు, ప్రోటీన్స్ అందకపోయినా వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. కాబట్టి సరైన డైట్‌ను పాటిస్తూ వేళకు భోజనం, 8గంటల నిద్ర పాటిస్తే మంచిందటున్నారు డైటీషియన్స్ -
కిచెన్ టిప్స్.. గంజినీళ్లు పారేయకుండా ఇలా వాడుకోండి
మార్కెట్లో దొరికే డిష్‌వాష్ బార్లు, లిక్విడ్లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధరకాల చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయం చూద్దాం... ► వెనిగర్‌లో కలిపిన నీటిలో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరి పీచు లేదా స్క్రబ్బర్‌కి బేకింగ్ సోడాని అద్దుకుని తోమితే గిన్నెలు తళతళలాడతాయి. ► గంజినీళ్లలో బేకింగ్ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తోమితే మురికితోపాటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది. ► బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి గిన్నెలు తోమితే జిడ్డు, వాసన వదిలి చక్కగా శుభ్రపడతాయి. -
భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఇది తెలిస్తే అలా చేయరు
మనలో చాలామంది భోజనం విషయంలో సరైన నియమాలు పాటించరు. తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది. కొన్ని కాంబినేషన్స్ శరీరానికి అస్సలు మంచివి కావు.కొంతమంది అన్నంలో అరటిపండు, మామిడి పండును తీసుకుంటారు. ఇలా తినడం వల్ల అసౌకర్యంతో పాటు అనారోగ్యం కూడా తోడవుతుంది. అందుకే కొన్ని కాంబినేషన్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మరికొందరు భోజనం తర్వాత వెంటనే పండ్లను తింటూ ఉంటారు. ఇలా అస్సలు చేయొద్దని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి? అస్సలు తినకూడదని కొన్ని కాంబినేషన్స్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ► సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత పండ్లు తింటూ ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. భోజనం చేశాక కొన్ని పండ్లు అస్సలు తినకూడదట. భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే త్వరగా జీర్ణం కావని చెబుతున్నారు నిపుణులు. భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకుంటే భోజనంతో పాటు ఇతర ఆహారాలతో కలిసి అది రియాక్షన్‌గా ఏర్పడుతుందట. దీని ఫలితంగా ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో పండ్లలోని పోషకాలు సరైన పద్దతిలో శరీరానికి అందవు. అందుకే భోజనం చేసిన కనీసం గంట, రెండు గంటల తర్వాత పండ్లను తీసుకోవాలి. ► భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటుంటారు చాలామంది. కానీ తిన్న వెంటనే అరటిపండ్లు తినడం వల్ల జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మరికొంతమంది నిద్రపోయే ముందు అరటిపండ్లు తింటుంటారు. దీనివల్ల నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందట. కాబట్టి అరటిపండ్లు తినాలనుకునేవారు మధ్యాహ్న సమయంలో తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ► నారింజ, కమల, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తినడానికి గంటముందు, లేదంటే తిన్న గంట తర్వాత పండ్లు తినడం మంచిది. లేదంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గుండెల్లో మంటగా అనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా సిట్రస్ పండ్లను పాలతో కూడా కలిపి తీసుకోరాదు. ► పాలకూర, పనీర్ కాంబినేషన్ చాలా ఎక్కువగా తింటుంటారు. రెస్టారెంట్లలోనూ వెజ్ తినాలనుకుంటే ఎక్కువగా పాలక్ పనీర్ తినేందుకు మొగ్గు చూపుతారు. కానీ ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఈ కాంబినేషన్ వల్ల పాలకూరలోని పోషకాలు నాశనం అవుతాయని అన్నారు. పాలక్ పనీర్‌లో ఎక్కువగా కాల్షియం,ఐరన్ ఉంటాయి. కాల్షియం కారణంగా ఐరన్‌ను శరీరం గ్రహించుకోలేదు. అందుకే పనీర్‌కు బదులుగా బంగాళదుంప, కార్న్ వంటివి తీసుకుంటే సరైన పోషకాలు అందుతాయని అంటున్నారు. ► భోజనం చేసిన వెంటనే కొందరు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల తిన్నది సరిగా అరగదని, దానివల్ల జీర్ణప్రక్రియకకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతారని, అందుకే భోజనానికి, నిద్రకు మధ్య రెండు, మూడు గంటల వ్యత్యాసం ఉండాలని సూచిస్తున్నారు. ► కొందరు తిన్న తర్వాత భోజనం చేస్తుంటారు. ఇలా అస్సలు చేయొద్దని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే అది శరీర ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచుతుందని, ఇది జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. అందుకే తిన్నాక గంటకు పైగానే బ్రేక్ తీసుకొని ఆ తర్వాత స్నానం చేయాలని చెబుతున్నారు. -
కిచెన్ టిప్స్.. ఇలా చేస్తే క్రిములు దరిచేరవు
కిచెన్ టిప్స్ సాల్ట్ డబ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యం వేసి తరువాత సాల్ట్ పోసుకుంటే సాల్ట్‌లోని తేమను బియ్యం పీల్చుకుని సాల్ట్‌ను పొడిగా ఉంచుతుంది. ప్లాస్టిక్ రోల్ అతుక్కుని త్వరగా రాదు. ఇటువంటప్పుడు అరగంటపాటు రోల్‌ని రిఫ్రిజిరేటర్లో పెట్టి తరువాత ఓపెన్ చేస్తే అతుక్కోకుండా సులభంగా వస్తుంది. గాజుకప్పు లేదా గ్లాసులో వేడిపాలు, పాయసం వంటివి పోసే ముందు.. దానిలో ఒక స్టీల్ స్పూను పెట్టి, తరువాత పాలు లేదా పాయసం వేయాలి. ఇలా చేయడం వల్ల గాజు గ్లాసు పగలదు. స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీస్పూను డిష్‌వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ప్లాట్‌ఫాం మీద, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే క్రిములు దరిచేరవు. -
అలాంటి వారు నేరేడు పండ్లు తినకపోవడమే మంచిది!
వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు.ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.తియ్యగా, పుల్లగా పంటికి భలే రుచికరంగా ఉండే ఈ పండ్లు వర్షాకాలంలో విరివిగా దొరుకుతాయి. పండు పోషకాల గని, అనారోగ్యాల నివారిణి కూడా. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి తో అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేరుడుతో భలే ప్రయోజనాలు ► నేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి.నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. ► డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది ► ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి ► మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిది ► నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.. ► నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ► నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ► నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఈ సమస్యలు ఉంటే తినకూడదు నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం. అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ఉంది. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని,వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నేరేడు పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయని, అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయి. -
రాగి బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఈమధ్య యోగా, ఫిట్నెస్, ఆయుర్వేదం వంటివాటిపై అవగాహన పెరిగింది. ప్లాస్టిక్ అతిగా వాడితే మంచిది కాదని, స్టీల్, గాజు, రాగ్రి పాత్రల్లో నీళ్లు తాగేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. రాగిలో శుద్దీకరణ లక్షణాలు ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రాగి చెంబులో నీళ్లు నిలువ చేసి పరగడుపున త్రాగడం వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.రాగి పాత్రలోని నీరు తాగితే కలిగే ప్రయోజనాలే కాదు.. వాటితో వచ్చే ప్రమాదాలను కూడా తెలుసుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. రాగి పాత్రల్లో సరైన పద్దతిలో నీళ్లు తాగితేనే అది శరీరానికి మేలు చేస్తుందని, ప్రతిరోజూ రాగి బాటిల్లో నీళ్లు తాగాలనుకునేవాళ్లు కశ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. రాగినీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: ► రాగిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో హానికరమైన బ్యాక్టీరియా, మంటను సమర్థవంతంగా ఎదుర్కోగలవు. ► రాగి బాటిల్స్‌లో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేస్తుంది. ► హైపర్ టెన్షన్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. రాగి నీళ్లు కొలెస్ట్రాల్‌ని తగ్గించగలదు. ► ఫలితంగా రాగి సీసాలోని నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, అల్సర్లు, అజీర్ణం సమర్ధవంతంగా తగ్గుతాయి. ► కిడ్నీ, కాలేయం పనితీరును మెరుగుపర్చడంలో రాగి సహాయపడుతుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ► ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ రాగినీళ్లను తాగితే రిలీఫ్ కలుగుతుంది. ► రాగి పాత్రలను నిత్యం ఉపయోగించడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. రాగి నీళ్లు తాగుతున్నారా? ఇవి గుర్తుపెట్టుకోండి ♦ రాగి బాటిల్లో ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు నీళ్లను నిల్వ చేయరాదు. ♦ రాత్రి నిల్వ చేసిన నీళ్లను పరగడుపున తాగితే చాలా మంచిది. దీని వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. ♦ నిపుణుల సూచనల ప్రకారం రాగి బాటిల్స్‌ను ఫ్రిడ్జ్‌లో అస్సలు నిల్వ చేయరాదు.దీనివల్ల రాగి ప్రయోజనాలు శరీరానికి ఏమాత్రం అందవు. ♦ రాగి పాత్రలో నీళ్లు తాగితే మంచిది కదా అని రోజంతా అవే నీళ్లు తాగొద్దు. దీనివల్ల కాపర్ టాక్సిసిటీ అయ్యే ప్రమాదం ఉందట. ఫలితంగా వికారం, కడుపునొప్పి వంటివి వచ్చే అవకాశం ఉందట. ♦ రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లను వేటితోనూ మిక్స్ చేయొద్దు. పరగడుపున రాగి నీళ్లు తీసుకునేటప్పుడు కొందరు నిమ్మరసంతో కలిసి తాగేస్తున్నారు. కానీ ఇలా అస్సలు చేయకండి. ఎందుకంటే నిమ్మరసంలోని యాసిడ్ కాపర్‌తో రియాక్ట్ అయి ఎసిడిటీ, వాంతులు వచ్చే అవకాశం ఉంది. -
హీరోయిన్ భూమి ఫడ్నేకర్ బ్యూటీ సీక్రెట్ ఇదేనట
హీరోయిన్ భూమి ఫడ్నేకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. 2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. కెరీర్ ఆరంభం నుంచి రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మెసేజ్‌లతో కూడిన కథాంశాల్ని ఎంచుకుంటోంది. టాయ్ లెట్ ఏక్ ప్రేమకథ, శుభ్ మంగల్ సావ్ ధాన్ ,లస్ట్ స్టోరీస్, బాలా, పతి పత్నీ ఔర్ వో వంటి సినిమలు భూమికి మంచికి పేరు తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే భూమి ఫడ్నేకర్ తరచూ గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. రీసెంట్గా తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టింది. ► రోజూ రాత్రి పడుకునే ముందు మొహానికి విటమిన్ – ఇ అండ్ అర్గాన్ ఆయిల్ రాస్తాను. వీలైనప్పుడల్లా తేనెలో కాసింత పసుపు, కొన్ని పాలు కలిపి ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుంటాను. మా అమ్మ చెప్పిన బ్యూటీ మంత్రం.. బాదం నూనె. అందుకే తరచుగా బాదం నూనెతో మొహానికి, చేతులకు మసాజ్ చేసుకుంటా అంటూ తన బ్యూటీ టిప్స్‌ను షేర్ చేసింది. -
బంగారంతో రోగాలు నయం.. డిప్రెషన్ కూడా దూరమవుతుంది
బంగారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. యుర్వేద మందుల్లో బంగారంను నేరుగా ఉపయోగించకుండా.. బంగారంను భస్మంగా మార్చి స్వర్ణ భస్మంలా వాడుతుంటారు. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. స్వర్ణ భస్మంలో 98శాంతం బంగారు రేణువులను కలిగి ఉన్నందున ఇది ఆయుర్వేదంలో అత్యంత ఖరీదైన ఔషధాలలో ఒకటిగా పేర్కొంటారు. నెయ్యి, తేనె లేదా పాలతో కలిపి స్వర్ణభస్మం పౌడర్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ► స్వర్ణ భస్మం రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంతో పాటు గుండె కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ► కడుపులోని ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి స్వర్ణభస్మం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇది అజీర్ణాన్ని పోగొడుతుంది. ► స్వర్ణభస్మంలో యాంటీ పైరేటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. శతాబ్దాలుగా జ్వరాలకు ఆయుర్వేద చికిత్సలలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ► రక్తాన్ని శుద్దిచేసి బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేసే సామర్థ్యం స్వర్ణభస్మంలో ఉంటుంది. ► లైంగిక ఆరోగ్యాన్ని స్వర్ణభస్మం మెరుగుపరుస్తుంది. ► యాంటీ-స్ట్రెస్, యాంటీ-డిప్రెషన్ వంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమిని తగ్గిస్తుంది. ► స్వర్ణ భాస్మాలో యాంటీ టాక్సిన్, యాంటీమైక్రోబయల్ యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ప్రారంభ దశలో టిబి కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోగలవు. ► రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ► కణితులు లేదా క్యాన్సర్ల పెరుగుదలను ఎదుర్కోవడానికి కూడా పనిచేసే రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను స్వర్ణ భస్మం కలిగి ఉంది. - డాక్టర్ నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు -
షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అనేక అనారోగ్య సమస్యలకు కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం ఇది. అందుకే ఎవరైనా అనారోగ్యానికి గురైతే కొబ్బరిబోండం తాగమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.శరీరంలోని వేడిని తగ్గించి, డీహైడ్రేట్ అయ్యేలా కాపాడుతుంది. ఆరోగ్యపరంగానే కాకుండానే అందం రెట్టింపు అయ్యేందుకు కూడా కొబ్బరిబోండం సహాయపడుతుంది. ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, సీ విటమిన్ వంటి ఎన్నో ఖనిజ లవణాలు కలిగిన కొబ్బరినీళ్లతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయా? షుగుర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా అన్నది ఈ స్టోరీలో తెలుసుకుంది. కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు ► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది. ► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది ► కిడ్నీ సమస్యలలో ఎఫెక్టివ్: కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ► బరువు తగ్గిపోతున్నామని బావించేవాళ్లు ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగాలి. ఇందులోని తక్కువ కొవ్వు శరీరానికి మేలు చేస్తుంది. షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా? ♦ డయాబెటీస్ పేషెంట్స్ కొబ్బరినీళ్తు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయనే అపోహ ఉంటుంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరినీళ్లు తాగడం వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. ♦ ఇది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ముదిరిన కొబ్బరి నీటిని కాకుండా లేత కొబ్బరి నీటిని తాగడం మంచిది. ఎందుకంటే ముదురు కొబ్బరితో పోలిస్తే లేత కొబ్బరిలో చక్కెర శాతం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ♦ అయితే ఈమధ్య కాలంలో ప్యాక్ చేసిన కొబ్బరినీళ్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో ప్రిజర్వేటీస్, చక్కెరలు డయాబెటిస్ పేషెంట్స్‌కి మంచిది కాదని, వాళ్లు మాత్రం సహజంగా దొరికే కొబ్బరినీళ్లు తాగడమే ఉత్తమమని పేర్కొంటున్నారు. -
బంగాళదుంపతో ముఖం మిలమిల.. మచ్చలు పోయి నిగారింపు
బ్యూటీ టిప్స్ ఒక బంగాళదుంపను తీసుకుని తొక్క తీసి,పేస్టులా చేసుకోవాలి. దీన్ని పలుచని వస్త్రంలో వడగట్టి నీటిని తీసేయాలి. ఆ గుజ్జులో 6 టేబుల్ స్పూన్లు పాలు కలపాలి. ఈ మిశ్రమంలో 6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి, ఐస్‌ట్రేలో వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి.. ఫ్రీజ్ అయిన బంగాళదుంపతో ముఖమంతా రుద్దాక, చేతులతో సున్నితంగా మర్దన చేసి, ఆరిన తరువాత కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన దుమ్మూధూళి, మొటిమల తాలూకు మచ్చలు పోయి ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
టేస్టీ టేస్టీగా మ్యాంగో పూరి ఇలా చేసుకోండి..
మ్యాంగో పూరీకి కావాల్సినవి: మామిడి పండ్లు – 2 (కడిగి, తొక్క, టెంక తొలగించి ముక్కలుగా చేసుకుని.. అందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార పొడి వేసుకుని జ్యూస్ చేసుకోవాలి) గోధుమ పిండి – 3 లేదా 4 కప్పులు మైదాపిండి – 3 టేబుల్ స్పూన్లు నూనె – సరిపడా మ్యాంగో పూరీ తయారీ ఇలా.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మ్యాంగో జ్యూస్, గోధుమ పిండి, మైదాపిండి, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను పొంగే విధంగా ఇరువైపులా వేయించుకోవాలి. వీటిపై తేనె వేసుకుని తింటే భలే ఉంటాయి. -
అలోవెరాతో ఇలా చేయండి.. మొటిమలు మటుమాయం
అలోవెరా.. దీనినే కలబంద అంటాం. దీంట్లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ప్రతి ఇంటి బాల్కనీలో ఉండాల్సిన మొక్క ఇది. విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగానే కాదు సౌందర్య పరంగా కూడా కలబంద అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖంపై మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను పోగొట్టడంలో అలొవెరా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కాస్మొటిక్స్‌లో అలొవెరాను ఎక్కువగా వాడుతుంటారు. ► అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. ఎండకు చర్మం మండినా, కందిపోయినట్లు అనిపించినా వెంటనే ఆ ప్రదేశంలో అలోవెరా గుజ్జును రాసేయాలి. ఫలితం క్షణాల్లో కనిపిస్తుంది. ►ఇందులో ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగోడుతుంది. ► స్నానం చేసే ముందు అలోవెరా గుజ్జును చర్మానికి అప్లై చేసుకొని 5నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే సబ్బుతో అవసరం లేకుండానే చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఇతరత్రా క్రిములన్నీ చనిపోయి చర్మం కోమలంగా మారుతుంది. ► అలోవెరాని ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది. స్కిన్ కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ► అలోవెరాలో విటమిన్-సి, ఈ గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వయసు పైబడిన వారు వారానికి మూడుసార్లు క్రమం తప్పకుండా అలోవెరాను రాసుకుంటే వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి. ► మేకప్ రిమూవింగ్ క్రీమ్‌లాగా కూడా అలోవెరా జెల్ చక్కగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అలోవెరా గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కాటన్ బాల్‌తో మేకప్‌ని సులువుగా తొలగించుకోవచ్చు. ► టీనేజర్లను ఎక్కువగా వేధించే సమస్య మొటిమలు. కాలుష్యం కారణంగా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు అలోవెరా జెల్‌ని రాసుకొని పొద్దునే చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. ► కలబందలో పసుపు, తులసి ఆకుల్ని మిక్సీ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. -
భోజనం చేసి మధ్యాహ్నం పూట నిద్రపోతున్నారా? పక్షవాతం వస్తుందట!
శరీరానికి నిద్ర చాలా అవసరం. సాధారణంగా మనిషికి కనీసం 7గంటల పాటు నిద్ర అవసరం. అయితే మనలో చాలామందికి మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపయినా కునుకు తీయాలనుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు నిద్రపోతే పర్వాలేదు గానీ.. గంటల తరబడి నిద్రపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయట. కునుకు తీస్తున్నారా? ఇక అంతే సంగతి ► పగటిపూట తరచుగా నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి ► మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోయే వారిలో కార్డియోవాస్కులర్ వ్యాధి 34 శాతం పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. ► గంటల తరబడి నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుందని, దీనివల్ల ఉదయం పూట అలసటగా ఉంటుందట. ► తరచూ మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ► మరీ ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదట. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట. ► మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు తెలిపారు. ► మధ్యాహ్న నిద్ర వల్ల రాత్రి సమయాల్లో సరిగా నిద్రపోరు. దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఏ సమయంలో నిద్రపోతే మంచిది మధ్యాహ్నం నిద్రపోయేవారిలో చాలామందికి ఏ సమయంలో ఎప్పటినుంచి నిద్రపోతే మంచిది అన్న సందేహం ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల మధ్యలోనే చిన్న కునుకు తీస్తే మంచిదట. అది కూడా 10నుంచి గరిష్టంగా 30నిమిషాల వరకు మధ్యాహ్నం నిద్రపోతే ఆరోగ్యానికి కూడా మంచిదే. -
ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి
చాలామందికి భోజనం చేసే సమయంలో, లేదా ఇతర కారణాల వల్ల ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటాయి. ఇంకొంతమందికి ఒకసారి ఎక్కిళ్లు వచ్చాయి అంటే ఇక ఆ రోజంతా ఉంటాయి. ఎగ శ్వాస వచ్చి కొన్ని సార్లు బాగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంటుంది. ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి? ♦ నీళ్లు కొద్దికొద్దిగా తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ♦ గాలిని బిగబట్టడం వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది ♦ పుల్లటి నీళ్లు నోట్లో పోసుకొని కాస్త పుక్కలించి కొద్ది కొద్దిగా నీళ్లు తాగితే ఎక్కుళ్ళు తగ్గడానికి అవకాశం ఉంది. ♦ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకొని తాగి నోరు పుక్కిలిస్తే కొంత తేడా ఉంటుంది. ♦ నోట్లో కాస్త పంచదార వేసుకొని చప్పరించడం వల్ల కూడా కొంత ఉపశమనం దొరుకుతుంది ♦ నిమ్మరసం గానీ ఏదైనా పుల్లటి పదార్థాన్ని నాలుక మీద పిండి చప్పరించినట్టయితే కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి ♦ చంటిపిల్లలకు చక్కిళ్లు వస్తే పిల్లల్ని బోర్లా పడుకోబెట్టి వీపు మీద మెల్లగా రుద్దితే ఎక్కిళ్లు తగ్గే అవకాశం ఉంటుంది అదే పెద్ద పిల్లలు అయితే గొంతుక కూర్చో బెట్టడం. మోకాళ్లు, ఛాతీ ఆనెలా కూర్చో పెట్టాలి.ఇంకా తగ్గకపోతే సొంటిలో బెల్లం కలిపి చిన్న ఉండలాగా చేసి మింగిస్తే కూడా ఉపశమనం ఉండవచ్చు. ♦ లవంగం బుగ్గన పెట్టుకొని రసాన్ని మింగితే ఎక్కిళ్లు తగ్గుతాయి. ♦ చెరుకు రసం ఐస్ లేకుండా తాగితే ఉపశమనం ఉంటుంది. ♦ గోరువెచ్చటి పాలలో పంచదార కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి ♦ జామ పండ్లు తింటే కూడా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది అయితే కొన్నిసార్లు ఏం చేసినా ఎక్కిళ్లు తగ్గవు. అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. - నవీన్ నడిమింటి -
తలస్నానానికి ముందు ఇలా చేయండి.. జుట్టు రాలడం తగ్గిపోతుంది
జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే పెరుగు మంచి ఫలితాన్నిస్తుంది. ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. జుట్టును చిక్కులేకుండా దువ్వి పెరుగును ఒక్కొక్క స్పూన్ తల మీద వేస్తూ వేళ్లతో మర్దన చేయాలి. తలంతా ప్రతి వెంట్రుక కుదురుకూ పెరుగు పట్టాలన్నమాట. ఓ అరగంట తర్వాత వేడినీటితో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే జుట్టు చిట్లిపోకుండా మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. వేళ్లతో తలంతా మర్దన చేసుకోవడం సాధ్యం కాకపోతే జుట్టు కుదుళ్లకు పెరుగును పట్టించిన తర్వాత గుండ్రటి పళ్లున్న దువ్వెనతో పది నిమిషాల సేపు దువ్వితే సరిపోతుంది. జుట్టు రాలుతుంటే బంగాళాదుంప రసం బాగా పని చేస్తుంది. బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. అరకప్పు రసంలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించాలి. జుట్టుకు పైన రాసి సరిపుచ్చకూడదు. కేశాల మొదళ్లకు పట్టేలా రాసి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. రెండు గంటల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే జుట్టురాలడం తగ్గిపోతుంది. -
నేషనల్ క్రష్ రష్మిక అందం కోసం ఏం చేస్తుందో తెలుసా?
హీరోయిన్ రష్మికా మందన్నా అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్‌గా మారి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ కావడంతో రష్మిక దశ తిరిగింది. ఈ సినిమా సక్సెస్‌తో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారిపోయింది.సౌత్, నార్త్ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. చదవండి: డబుల్ చిన్తో పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేస్తే అందంగా, నాజుగ్గా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న రష్మికకు యూత్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప-2 సినిమాతో పాటు, బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో చేతినిండా అవకాశాలతో బిజీగా గడిపేస్తుంది. కాస్త తీరిక దొరికనప్పుడు మాత్రం స్కిన్‌కేర్, హెయిర్ కేర్ గురించి ప్రత్యేక శ్రద్ద వహిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ. గోరు వెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దనా చేసుకుంటే చాలు. ఏ మాయిశ్చరైజర్, హెయిర్ కండీషనర్ అవసరం లేకుండానే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. వీలు దొరికినప్పుడల్లా నేను ఇదే చేస్తా. ఇది మా అమ్మ, అమ్మమ్మ చెప్పిన చిట్కా! చదవండి: రోజూ హెల్మెట్ వాడుతున్నారా? బాక్టీరియా, క్రిములు.. – రష్మిక మందన్నా -
డబుల్ చిన్తో పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేస్తే అందంగా, నాజుగ్గా..
ముఖం నాజుగ్గా ఉంటే.. ఏ వయసు వారైనా సరే.. అందంగా కనిపిస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా అగుపిస్తారు. సాధారణంగా చాలా మందికి.. వయసు పెరిగే కొద్దీ డబుల్ చిన్ ఏర్పడి.. చెంపల చుట్టూ కొవ్వు పేరుకుని.. రుపురేఖలు మారిపోతాయి. అలాంటి వారికి ఈ ఫేషియల్ స్లిమ్మింగ్ ఎక్సర్సైజర్ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది. ఈ టూల్‌ని పళ్ల మధ్య కరిచిపెట్టుకుని.. నములుతున్నట్లుగా బాగా కదిలించాలి. అలా చేయడం వల్ల ముఖం, మెడ, గెడ్డం వంటి భాగాల్లో పేరుకున్న కొవ్వు పూర్తిగా తగ్గి.. అందమైన షేప్ వస్తుంది. దీనికోసం ఉపయోగించిన ఫుడ్–గ్రేడ్ మెటీరియల్.. హీట్–రెసిస్టెంట్ సిలికాన్ కావడంతో ఎలాంటి హానీ కలుగదు. ఈ స్లిమ్మర్.. ముఖంలో పేరుకున్న కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది. రన్నింగ్, వాకింగ్, జిమ్ వంటివి చేస్తున్న సమయాల్లో కానీ.. ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ కానీ, టీవీ చూస్తూ కానీ ఎప్పుడైనా ఈ టూల్‌ని నోట కరిచి.. ఫేస్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సుమారు నెల పాటు క్రమం తప్పకుండా రోజుకి మూడు నుంచి పది నిమిషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉపయోగించే ముందు 30 సెకన్ల పాటు గోరువెచ్చని నీటిలో వేసి క్లీన్ చేసిన తర్వాతే నోట్లో పెట్టుకోవాలి. ముందుగా దవడలకు ఇరువైపులా పెట్టుకుని.. తర్వాత.. ముందుపళ్ల మధ్య పెట్టుకుని వ్యాయామం చెయ్యాలి. అలా చేయడంతో ముఖంలోని కండరాలు కదిలి.. ఫేస్ ’V’ షేప్‌లోకి మారుతుంది. డబుల్ చిన్ పూర్తిగా తగ్గుతుంది. ఇక ఈ టూల్ వాడటం పూర్తి అయ్యాక.. చల్లటి నీళ్లతో దాన్ని క్లీన్ చేసి దాచిపెట్టుకోవాలి. ఈ ఎక్సర్సైజర్తో ఒక ప్రత్యేకమైన తాడు కూడా లభిస్తుంది. దాన్ని ఉపయోగించి.. జిమ్‌కి వెళ్లే సమయాల్లో ఈ టూల్‌ని మెడలో వేసుకుని వెంట తీసుకెళ్లొచ్చు. -
Kitchen Tips: ఎంత తోమినా జిడ్డు వదలడం లేదా? ఈ చిట్కాలు పాటించండి
మార్కెట్లో దొరికే డిష్‌వాష్ బార్లు, లిక్విడ్లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధరకాల చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా గంజినీళ్లు, బేకింగ్ సోడా, నిమ్మరసాన్ని గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అవేంటో చూద్దాం... వెనిగర్‌లో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరిపీచుతో బేకింగ్ సోడాని అద్దుకుని తోమితే చక్కగా శుభ్రపడతాయి. గంజినీళ్లలో బేకింగ్ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తోమితే మురికితో పాటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది. బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి గిన్నెలు తోమితే జిడ్డు, వాసన వదిలి చక్కగా శుభ్రపడతాయి. -
ఊపిరితిత్తులు సాగే గుణం కోల్పోతే? పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.. అయితే..
పీల్చేటప్పుడు గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. వెళ్లాక ఊపిరితిత్తులు సాగుతాయి. ఊపిరితిత్తులకు ఇలా సాగే గుణం ఉంటుంది. అంతేకాదు... ఈ గుణంతో పాటు అనేకానేక గాలి గదులు ఉండటం వల్ల దేహంలోని అన్ని అవయవాల్లోకెల్లా నీళ్లలో తేలేవి ఊపిరితిత్తులే. కానీ ఒకవేళ ఊపిరితిత్తులు తమకున్న ఈ సాగే గుణాన్ని కోల్పోతే? గాలి లోపలికి ప్రవేశించలేదు. దాంతో మెదడులాంటి కీలక అవయవాలకు ఆక్సిజన్ అందదు. ఊపిరితిత్తులు తమకు ఉన్న సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయేలా చేసే జబ్బే ‘ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్’ (ఐఎల్‌డీ). దీన్నే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ అని కూడా అంటారు. ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఎక్కువ. ఐఎల్‌డీ లేదా లంగ్ ఫైబ్రోసిస్‌పై అవగాహన అవగాహన కల్పించే కథనమిది. ఐఎల్‌డీ / లంగ్ ఫైబ్రోసిస్‌లో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. అవి... 1. పుట్టుకతోనే ఐఎల్‌డి ఉండటం: దీన్ని ఇడియోపథిక్ ఫైబ్రోసిస్ అంటారు. దీనికి నిర్దిష్టమైన కారణం ఉండదు. వంశపారంపర్యంగా వస్తుంది. తీవ్రమైన ఆయాసం, దగ్గుతో ఇది బయటపడుతుంది. మంచి వయసులో ఉన్నప్పుడూ ఆయాసం వస్తుంటుంది. ప్రతి ఒక్కరిలోనూ జీవితంలోని ఏదో ఓ దశలో దగ్గు, ఆయాసం రావడం సహజమే కావడంతో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా జబ్బు ముదిరి గుండె మీద దుష్ప్రభావాలు కలిగాక... బయటపడుతుంది. 2. సెకండరీ ఐఎల్‌డీ : ఇదో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే... సొంత రోగనిరోధక శక్తి తమపైనే దుష్ప్రభావాలు చూపడం వల్ల వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్లీ్కరోడెర్మా, లూపస్, సోరియాసిస్ వంటì చర్మ, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారిలో చివరిదశలో... లంగ్స్‌కు ఉండే సహజమైన సాగే గుణం తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు సెకండరీ ఐఎల్‌డీ అభివృద్ధి చెందిందా అని పరీక్షించుకోవడం అవసరం. ఇడియోపథిక్ ఐఎల్‌డీని నివారించడం సాధ్యం కాదు. కానీ... సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగి, తగిన చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చు. ఇక సెకండరీ ఐఎల్‌డీ విషయానికి వస్తే... సమస్యకు కారణాన్ని గుర్తించడం, లంగ్స్‌కు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించడం, త్వరితంగా వ్యాధి నిర్ధారణతో మంచి ఫలితాలు పొందవచ్చు. చికిత్స : ఐఎల్‌డీని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. అయితే మంచి చికిత్సతో జీవితకాలాన్ని పొడిగించడంతో పాటు, దీని వల్ల కలిగే సమస్యల్ని చాలావరకు తగ్గించవచ్చు. చికిత్సలో ప్రధానంగా స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. స్టెరాయిడ్స్ అనగానే అనేక అపోహలతో బాధితుల్లో చాలామంది చికిత్సను నిరాకరిస్తుంటారు. ఫలితంగా జబ్బు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. స్టెరాయిడ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించేందుకు క్యాల్షియమ్ ట్యాబ్లెట్స్, యాంటాసిడ్స్ కూడా ఇస్తారు. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారాన్ని సూచిస్తారు. ఆక్సిజన్ థెరపీ : ఐఎల్‌డీ చికిత్సలో ఆక్సిజన్ థెరపీనీ ఉపయోగిస్తారు. రక్తంలో ఆక్సిజన్ పాళ్లు పెంచడం ఈ థెరపీ ప్రధాన ఉద్దేశం. ఆక్సిజన్ ఇవ్వడం వల్ల లంగ్స్ మీద శ్రమ తగ్గుతుంది. ఊపిరితిత్తులు మందులకు సక్రమంగా రెస్పాండ్ అవుతాయి. దీనితో మంచి ఫలితాలూ వస్తాయి. ఆక్సిజెన్ థెరపీని రెండు రకాలుగా ఇవ్వవచ్చు. 1. సిలెండర్స్ ద్వారా : సంప్రదాయ ఆక్సిజన్ సిలెండర్స్తో ఇవ్వడం ఒక ప్రక్రియ. ఇందులో ఒకసారి ఆక్సిజన్ ఇవ్వడం మొదలయ్యాక తిరిగి నింపడానికి వ్యవధి అవసరం. దాంతో ప్రస్తుతం దీనికి అంత ఆదరణ లేదు. 2. కాన్సంట్రేషన్ మెషిన్ ద్వారా : మన వాతావరణంలోని ఆక్సిజన్‌నే అందిస్తూ, అవసరమైతే పెంచుకుంటూ, వీలైతే తగ్గించుకుంటూ... ఇలా అవసరమైన మోతాదును ఇవి సరఫరా చేస్తాయి. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కరోనా / కోవిడ్ తర్వాత ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మెషిన్లపై అవగాహన పెరిగిన విషయం తెలిసిందే. ఈ థెరపీని ఆస్తమా రోగుల్లో, సిగరెట్ తాగడం వల్ల వచ్చే సీఓపీడీ రోగుల్లో చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తమా/స్మోకింగ్ అలవాటు ఉండి, ఆక్సీజన్ థెరపీ తీసుకునే బాధితులు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆక్సిజన్ థెరపీని తీసుకోవాలి. లక్షణాలు : మొదట దగ్గు అందునా ప్రధానంగా పొడి దగ్గు వస్తుంటుంది. శరీరం ఏమాత్రం కష్టపడ్డా దగ్గు, ఆయాసం రావడం, అవి తీవ్రం కావడం జరుగుతుంది. ఆయాసం రాత్రి వేళల్లో కంటే పగలే ఎక్కువ. మామూలుగా అలర్జీ లేదా ఆస్తమా వంటి కేసుల్లో ఆయాసం రావడం పగటి కంటే రాత్రుళ్లు ఎక్కువ. కానీ ఇలా రివర్స్‌లో ఉండటమే ఐఎల్‌డీ కేసుల్లో ప్రత్యేకత. కాళ్లలో వాపు, నిద్రలేమి, నీరసం, కడుపులో నొప్పి వస్తాయి. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడంతో పాటు కార్బన్‌డైయాక్సైడ్ మోతాదులు ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతాయి. దాంతో మెదడుపై దుష్ప్రభావాలు పడి, సంబంధిత లక్షణాలు వ్యక్తమవుతాయి. అంటే... బాగా మత్తుగా అనిపించడం, గురక రావడం, బీపీలో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫిట్స్ రావడమూ జరగవచ్చు. పై లక్షణాలు కనిపించిన తర్వాత కూడా చికిత్స తీసుకోకపోతే నాలుగైదేళ్లలో ఊపిరితిత్తుల ఫెయిల్యూర్‌తో రోగి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు. నిర్ధారణ పరీక్షలు : ఎక్స్–రే పరీక్షతో ఐఎల్‌డీని గుర్తించవచ్చు. ఇందులో రెటిక్యులార్ నాడ్యుల్స్ అంటే... చిన్న చిన్న కణుతులు కనిపించినప్పుడు ‘హై రెజల్యూషన్ సీటీ – చెస్ట్’ పరీక్ష ద్వారా జబ్బును నిర్ధారణ చేస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ డిసీజ్, సొరియాసిస్ లాంటి చర్మం, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారికి ప్రతి ఆర్నెల్లకోసారి ఎక్స్–రే పరీక్ష నిర్వహించి, అనుమానం ఉన్నప్పుడు ‘హై–రెజల్యూషన్ సీటీ’తో ఈ జబ్బును కనుగొంటారు. నిర్ధారణ తర్వాత జబ్బు తీవ్రత, దాని దుష్పరిమాణాలను తెలుసుకోవడం కోసం టూ–డీ ఎకో, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) వంటి పరీక్షలు చేస్తారు. ఏబీజీ పరీక్షతో ధమనుల్లో మంచి రక్తంలో ఆక్సిజన్, కార్బన్‌డైయాక్సైడ్ మోతాదులు ఎలా ఉన్నాయో డాక్టర్లు తెలుసుకుంటారు పై పరీక్షలతో పాటు ఆటో ఇమ్యూన్ జబ్బులు తెలుసుకోడానికి చేయించాల్సిన పరీక్షలు అంటే... ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎన్ఏ, ఎల్ఈ సెల్స్, యాంటీ డీఎస్ డీఎన్ఏ, సీఆర్పీ వంటి పరీక్షలు తప్పనిసరి. ప్రైమరీ ఐఎల్‌డీ ఉన్నవారి కంటే... ఆటో ఇమ్యూన్ జబ్బుల వల్ల ఐఎల్‌డీ వచ్చిన వారిలో చికిత్స వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. -డాక్టర్ రమణ ప్రసాద్, సీనియర్ పల్మనాలజిస్ట్ -
ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవను.. నా బ్యూటీ సీక్రెట్ అదే: తాప్సీ
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెరంగేట్రం చేసిన మోడల్ తాప్సీ పన్ను. 2010లో విడుదలైన ఈ మూవీలో గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ ఢిల్లీ అందం.. 2011లో ఆడుకాలంతో కోలీవుడ్‌లో అడుగిడింది. ఇక వరుణ్ ధావన్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఛష్మే బద్దూర్’తో బీ-టౌన్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన తాప్సీ.. థప్పడ్ వంటి వుమెన్ ఓరియంటెడ్ సినిమాతో సత్తా చాటింది. నటిగా రోజురోజుకూ మరింత మెరుగుపడుతున్న ఈ సోగకళ్ల సుందరి తన బ్యూటీ సీక్రెట్‌ను రివీల్ చేసింది. తన ఉంగరాల జుట్టు అందంగా కనిపించడానికి అమ్మే కారణమంటూ మురిసిపోయింది. నిద్ర దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవను. కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోతాను. స్కిన్ కేర్‌లో క్లెన్సింగ్..మాయిశ్చరైజింగ్.. హైడ్రేటింగ్ కంపల్సరీ. అలాగే నా జుట్టు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. తెలుసు కదా.. కర్లీ హెయిర్‌ని మేనేజ్ చేయడం ఎంత కష్టమో! ఆ క్రెడిట్ మా అమ్మదే! నా జుట్టు కోసం కొబ్బరి నూనెలో మందార ఆకులు, ఉసిరి ఎట్సెట్రా ఇన్‌గ్రీడియెంట్స్ వేసి స్పెషల్ ఆయిల్ తయారు చేస్తుంది. ఆ ఆయిల్‌ని రోజూ రాత్రి తలకు పట్టించి తెల్లవారి తలస్నానం చేస్తా! అందుకే కర్లీ హెయిర్ అయినా కాస్త సాఫ్ట్‌గా కనపడుతుంది’’ అని తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది. చదవండి: ఆపకుండా గట్టిగా నవ్వితే చనిపోతారా? దీనిలో నిజమెంతంటే... -
సిబిల్ స్కోర్ సింపుల్‌గా చెక్ చేసుకోవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
CIBIL Score Checking: ఆధునిక కాలంలో సిబిల్ స్కోర్ మీద ప్రజల్లో అవగాహనా బాగా పెరిగింది. ఈ స్కోర్ మీద ఆధారపడి లోన్ ఇంట్రెస్ట్ ఉంటుందని ప్రస్తుతం అందరికి తెలిసింది. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి కృషి చేస్తుంటారు. అయితే సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది క్రెడిట్ హిస్టరీ సమాచారాన్ని మొత్తం సేకరించి వినియోగదారునికి సిబిల్ స్కోర్ రూపంలో తెలియజేస్తుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ స్కోర్ 300 లేదా అంతకంటే తక్కువ ఉంటే దాదాపు లోన్ లభించే అవకాశం ఉండదు, ఒక వేళ లోన్ అందించినా ఎక్కువ వడ్డీ రేటుతో అందించడం జరిగుంతుంది. సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గం సరైన సమయంలో మీరు తీసుకునే లోన్ ఈఎమ్ఐ లేదా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడం. ఇవే మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడతాయి. (ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..) సిబిస్ స్కోర్ చెక్ చేసుకోవడం.. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలనుకునేనారు ముందుకి సిబిల్ అధికారిక వెబ్సైట్ లాగిన్ చేసి 'గెట్ యువర్ సిబిల్ స్కోర్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో పేరు, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పాన్ లేదా ఆధార్ నెంబర్ వంటి ఐడీ ప్రూఫ్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి 'యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇవన్నీ జరిగిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ టైప్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత 'గో టు డాష్‌బోర్డ్' మీద క్లిక్ చేసిన తరువాత 'మైస్కోర్.సిబిల్.కమ్' కు మీ పేజ్ రీ-డైరక్ట్ అవుతుంది. 'మెంబర్ లాగిన్'పై క్లిక్ చేసిన తరువాత సిబిల్ స్కోర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం కష్టం అనుకునే వారు, గూగుల్ పే యాప్ యూజర్స్ అయితే ఆ యాప్‌లో 'చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్దది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఫుడ్ పాయిజన్ అయిందా? శొంఠి పొడి, తేనె కలిపి తాగుతున్నారా? అయితే..
వేసవిలో చాలామందికి ఎదురయే సమస్యలలో ఫుడ్ పాయిజన్ ఒకటి. దీనికి ప్రధాన కారణం పొడి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు ఆహార పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయట తాగే నీరు శుభ్రంగా లేకపోయినా.. సమస్యలు తప్పవు. అసలు ఫుడ్ పాయిజన్ అయిందీ లేనిదీ ఎలా గుర్తించాలో, దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఆహారం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి, విపరీతమైన అలసట. ఎలా నివారించాలి? అవి తినొద్దు ►పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే తినండి, ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది తినకూడదు. ►బాగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ►ఎండలో ఆరుబయట కూర్చుని ఆహారం తినకూడదు. ►ఆహారాన్ని తయారు చేయడానికి శుభ్రమైన నీటిని వాడాలి. ►పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే తినాలి. ►కుళ్ళిన కూరగాయలు, పండ్లు ఉపయోగించవద్దు. ఫుడ్ పాయిజనింగ్ అయితే ఏం చేయాలి? ►ఫుడ్ పాయిజన్ అయినట్లయితే, నీరు ఎక్కువగా తాగాలి. ►మీకు వికారంగా అనిపిస్తున్నందున నీరు తీసుకోవడం తగ్గించవద్దు. ►గంజి, నీరు, పుదీనా టీ, బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి. ►ఓఆర్ఎస్ వినియోగించండి. హోం రెమెడీ ►కప్పు వేడి నీటిలో 2–3 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది. ►గ్లాసు వేడినీటిలో అర చెంచా తాజా అల్లం తురుము లేదా శొంఠి పొడి, తేనె కలిపి తాగాలి. ►కప్పు పెరుగులో చెంచా మెంతులు వేసి తినండి. మెంతులు నమలక్కర్లేదు, మింగేయవచ్చు. ►గ్లాసు వేడినీళ్లలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది. ►చల్లని పాలకు అసిడిటీని తగ్గించే గుణం ఉంది. ఎసిడిటీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నప్పుడు, గ్లాసుడు చల్లని ΄ాలు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. ►నీళ్లలో జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి 2–3 సార్లు తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. ►ఇలాంటివి చేసిన తర్వాత కూడా తగ్గకపోతే.. వైద్యుణ్ణి సంప్రదించి మందులు తీసుకోవాలి. ►చేతులు తరచు సబ్బుతో కడుక్కోవాలి. వంటగదిలో శుభ్రత పాటించాలి. ►ఫుడ్ పాయిజన్ బారిన పడి కోలుకుంటున్న వారికి తగినంత విశ్రాంతి, నిద్ర అవసరం. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: అవాంఛిత సంబంధాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు.. కుటుంబాన్ని కాపాడుకోలేమా? -
ఉద్యోగం పోతుందని భయమా? ఈ టిప్స్ మీకోసమే..!
కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించినప్పటి నుంచి ఉద్యోగులలో భయాలు పెరిగిపోయాయి. ఏ కంపెనీ ఎప్పుడు ఉద్యోగం ఊడగొడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. గూగుల్ వంటి అనేక బడా సంస్థలు సంస్థలు సైతం ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులను కూడా తొలగించింది. అయితే ఉద్యోగులలో ఉన్న భయం పోవాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ తెలుసుకోవాలి. అలాంటి టిప్స్ ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కంపెనీ హిస్టరీ మీరు ఒక సంస్థలో చేరే ముందు ఆ కంపెనీ హిస్టరీ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మీరు చేరే కంపెనీ కొత్తగా ప్రారభించారా? లేక చాలా సంవత్సరాల నుంచి ఉందా? కష్టకాలంలో ఇంతకు ముందు ఎప్పుడైనా ఉద్యోగులను తొలగించిందా అనే మరిన్ని వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. అంతే కాకూండా మీరు ఉద్యోగంలో చేరిన తరువాత మీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఉద్యోగంలో చేరేవారు సీటీసీ, లీవ్స్ పాలసీ, ఇన్సెంటివ్స్ వంటి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నోటీస్ పీరియడ్ ఇక రెండవ విషయం నోటీస్ పీరియడ్. మీ జాబ్ కాంట్రాక్ట్‌లో నోటీస్ పీరియడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని గుర్తుంచుకోవాలి. మాములుగా కింది స్థాయి ఉద్యోగులకు ఒకనెల, పై స్థాయి ఉద్యోగులకు 2 నుంచి 3 నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. నోటీస్ పీరియడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో జాబ్ వెతుక్కోవడానికి సమయం ఉంటుంది. ఇది కూడా ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐఎఫ్ఓ పాలసీ ఉద్యోగులను తొలగించే సమయంలో కంపెనీలు కొన్ని 'లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్' (LIFO) పద్ధతి పాటిస్తుంది. దీని ప్రకారం కంపెనీలు లేటెస్ట్ గా ఉద్యోగంలో చేరిన వారిని కంపెనీ ముందుగా తొలగించే అవకాశం ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఈ పద్ధతి అమలయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కావున ఉద్యోగులకు ఏదైనా సమస్యలు ఉంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో చర్చించాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటుంది. గోల్డెన్ హ్యాండ్‌షేక్ సంస్థల్లో సివిరెన్స్ అగ్రిమెంట్/హ్యాండ్‌షేక్ క్లాజ్ అనేది కాంట్రాక్టులో ఉంటుంది. లేఆప్స్ లేదా టెర్మినేషన్ సమయంలో కంపెనీ ఉద్యోగులకు నగదు బహుమతి, స్టాక్ ఆప్షన్ వంటివి ఇస్తుంటాయి. ఇవన్నీ ఉద్యోగికి ఒక పటిష్టమైన భద్రతను కల్పిస్తాయి. ఇలాంటి ఎక్కువగా ఎక్కవ రోజులు సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!) నాన్ కాంపిటేట్ క్లాజ్ నాన్ కాంపిటేట్ క్లాజ్ అంటే మీరు పనిచేసే కంపెనీ ప్రత్యర్థి కంపెనీలో చేరడంపై పెట్టే పరిమితులు. సంస్థను బట్టి ఇది మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీలు ఇలాంటి వాటిని పూర్తిగా ఎత్తేసే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఆఫర్ లెటర్ తీసుకునే ముందు తప్పకుండా పరిశీలించాలి. కారణం లేకుండా టెర్మినేట్ మీరు పనిచేసే సంస్థలో కంపెనీ నియమాలను ఉల్లంగిస్తే టెర్మినేట్ చేస్తారు. అయితే ఏ కారణం లేకుండా టెర్మినేట్ చేసే అవకాశం ఉండదు. కావున కంపెనీ నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఇవన్నీ మీరు తప్పకుండా పాటిస్తే మీ ఉద్యోగానికి ఏ డోకా లేదు. అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ప్రతిరోజూ భోజనంలో అవి ఉండాల్సిందే.. నా బ్యూటీ సీక్రెట్ అదే: హీరోయిన్
‘కిట్టీ పార్టీ’ అనే సిరీస్‌తో బుల్లి తెరపై అడుగుపెట్టిన ముంబై భామ నుస్రత్ భరూచా. జై సంతోషీ మా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా ఛత్రపతి(హిందీ) సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జోడీ కట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నుస్రత్ తన అందమైన చర్మానికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటూ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. ‘‘మా అమ్మ.. పార్లర్లో మెరుగులు దిద్దే అందాలను ఇష్టపడదు.మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ప్రతిరోజూ భోజనంలో తాజా ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే చర్మం నిత్యం నిగనిగలాడుతూ ఉంటుందంటుంది. అలా మా అమ్మ చెప్పిన చిట్కాల్లో నేను తప్పకుండా పాటించేది.. మంచి నీళ్లు ఎక్కువగా తాగడం, వారంలో వీలైనన్ని సార్లు మొహానికి పెరుగు లేదా మీగడతో సున్నితంగా మసాజ్ చేసుకోవడం. ఇవే నా చర్మ సౌందర్యానికి కారణం’’ అని 37 ఏళ్ల నుస్రత్ చెప్పుకొచ్చింది. చదవండి: తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్’ అనే రసాయనం -
వాట్సాప్‌లో ఇలాంటి ఫీచర్ ఒకటుందని తెలుసా? తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఆధునిక ప్రపంచములో స్మార్ట్‌ఫోన్ వాడకం సర్వ సాధారణం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ వాడే వినియోగదారులలో చాలామంది సోషల్ మీడియాలో కాలం గడిపేస్తూ ఉంటారు. అయితే దీనికోసం మొబైల్ డేటా అవసరం. మొబైల్ డేటా లేకుండా సోషల్ మీడియా ఉపయోగించడం అసాధ్యమని అందరూ అనుకుంటారు, కానీ మొబైల్ డేటా లేకపోయినా వాట్సాప్ ఉపయోగించదానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులో ఉందన్న విషయమే మర్చిపోయి ఉంటారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. మొబైల్ డేటా లేకుండా వాట్సాప్ ఉపయోగించలేమనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఈ అద్భుతమైన ఫీచర్‌ను 'ప్రాక్సీ సపోర్ట్ ఫర్ వాట్సాప్' అంటారు. సంస్థ ఈ ఫీచర్‌ను బ్లాగ్‌లో ప్రకటించింది. దీనిని వినియోగదారులు ఎటువంటి పరిమితులు లేకుండానే వినియోగించుకోవచ్చు, కానీ భద్రతలను దృష్టిలో ఉంచుకుని మెసేజిలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసే అవకాశం ఉంది. 2023లో ఇంటర్నెట్ అంతరాయాలు కలిగే అవకాశం లేదు, కానీ కొన్ని దేశాల్లో అప్పుడప్పుడు ఈ సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారుల సేవలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూడటానికి సంస్థ కృషి చేస్తోంది. అయితే ఈ ఫీచర్ అనవసరంగా ఉపయోగించుకోకూడదు. ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ ఉపయోగించడం ఎలా? ప్రాక్సీ సపోర్ట్ ఫర్ వాట్సాప్ ఫీచర్ ఉపయోగించడానికి మొదట వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. స్టోరేజ్ అండ్ డేటా మీద ట్యాప్ చేసి ప్రాక్సీ ఉపయోగించుకోవచ్చు. ప్రాక్సీ అడ్రస్ ఎంటర్ చేసిన తరువాత సేవ్ చేసుకోవాలి. మీ కనెక్షన్ విజయవంతమైతే చెక్ మార్క్ కనిపిస్తుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా మీరు ప్రాక్సీ ఉపయోగించి వాట్సాప్ సందేశాలు పంపించడం లేదా రిసీవ్ చేసుకోవడం వంటివి కాకుండా పోతే ప్రాక్సీ బ్లాక్ చేసి ఉండవచ్చు. అప్పుడు మరో ప్రాక్సీ చిరునామాతో మళ్ళీ ప్రయత్నించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) మీ వాట్సాప్ ప్రాక్సీకి కనెక్ట్ చేసే ఆప్షన్ అనేది ఆండ్రాయిడ్ & ఐఓఎస్ రెండింటిలోనూ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. ఒక వేళా మీకు ఆ ఆప్షన్ కనిపించకపోతే మీ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో అందుబటులో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా...
పిల్లలు కొన్నిసార్లు ఎంత రుచిగా చేసి పెట్టినా సరే, ఆకలి కావడం లేదంటారు. తరచూ విరేచనాలు చేసుకుంటారు. బరువు తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా అవుతోందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. నిజానికి ఇవి ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలేమీ కాదు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం... తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాల మీదికి కూడా వస్తుంది. కడుపులో నులి పురుగులు పోవడానికి... ►వేప నూనె పది చుక్కలు చక్కెరలోవేసి లోపలకు తీసుకుంటే క్రిములు నశిస్తాయి. ►గుప్పెడు లేత వేప చిగురు, అర చెంచా ఉప్పు, అర చెంచా పసుపు కలిపి మాత్రల్లా చేసుకొని రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ►పచ్చి బొప్పాయి కాయకు గాట్లు పెట్టగా వచ్చిన పాలు చెంచా, ఆముదం చెంచా కలిపి తాగితే.. పురుగులు పడి పోతాయి. ►ఎండించిన వేప పువ్వు 50 గ్రాములు. మిరియాల పొడి చెంచా, ఉప్పు చెంచా కలిపి ప్రతిరోజు భోజనంలో మొదటి ముద్దగా కలుపుకుని తినాలి, లేదా గ్లాసు నీటిలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయం లాగా తాగినా కూడా నులిపురుగులు నశిస్తాయి. ►వీటన్నింటినీ చేయడం కష్టం అనుకుంటే ఆల్బెండిజాల్ ట్యాబ్లెట్‌ను పదిహేను రోజులకొకసారి చొప్పున నెలరోజులు వాడాలి. ఒక నెల గ్యాప్ ఇచ్చి అదే రిపీట్ చేయాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: మేడం.. నాకు 25 ఏళ్లు... మూడుసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాను... పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? -
స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..
ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ఫోన్లు పేలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేరళలోని త్రిసూల్ ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్ పేలి ఎనిమిదేళ్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ స్మార్ట్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? దానికి గల కారణాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం. బ్యాటరీ వాపు లేదా ఉబ్బడం: మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లు అప్పుడప్పుడు కిందపడిపోవడం వల్ల బ్యాటరీలోని కొన్ని ముఖ్యమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇందులోని బ్యాటరీలు ఉబ్బుతాయి. ఇలాంటి ఉబ్బిన బ్యాటరీలు కలిగిన మొబైల్స్ చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి ఏ సమయంలో అయినా పేలిపోయే ప్రమాదం ఉంది. (ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?) బ్యాటరీలో ఏర్పడిన లోపం: స్మార్ట్ఫోన్లను తయారు చేసే కంపెనీలు కట్టుదిట్టమైన భద్రతలతో తయారు చేస్తాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సాంకేతి సమస్యల వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్య రావొచ్చు. ఎంచుకుంటే స్మార్ట్‌ఫోన్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని వల్ల ఏర్పడే కెమికల్ బ్యాలెన్ కారణంగా వేడి పెరిగి పేలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) బ్యాటరీలు వేడెక్కడం: బ్యాటరీలు వేడెక్కడం అనేది మనం నిజ జీవితంలో గమనించే ఉంటాము. ఇది మొబైల్ పేలిపోవడానికి మరో ప్రధానమైన కారణం కావచ్చు. నిజానికి కొంత మంది తమ మొబైల్ ఫోన్స్ లేదా స్మార్ట్ఫోన్లను రాత్రి పూట ఛార్జింగ్ లో ఉంచి అలాగే వదిలేస్తారు. ఇది ప్రమాదానికి ప్రధాన హేతువు అవుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్స్ ఛార్జింగ్ వేయకూడదు. ఛార్జింగ్ వేసిన సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఇతర ఉపయోగాలకోసం వినియోగించడం రెండూ చేయకూడదు. ఇది చాలా ప్రమాదం అని తప్పకుండా గుర్తుంచుకోండి. -
ఎక్కువగా నడిస్తే మోకాళ్లు అరిగిపోతాయా? ఇలా చేస్తే..
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము మరింత ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్లు ఇంకా అరిగిపోతాయేమోనని, దాంతో తమ నొప్పులు మరింతగా ఎక్కువవుతాయేమోనని అపోహపడుతుంటారు. నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగంలో అంతగా రక్తప్రసరణ జరిగి కీళ్లకు మంచి పోషణ అందుతుంది. దాంతో మోకాలి ఎముకలతో పాటు, మన ఇతర కండరాలూ, దేహంలోని ఎముకలూ బలపడతాయి. మోకాలి నొప్పులను నివారించాలంటే... ►మోకాళ్ల నొప్పులున్నవారు ఈ కింద పేర్కొన్న పనులేవీ చేయకూడదు... ►ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం ఎగుడుదిగుడుగా ఉండే నేలపై నడక (వాకింగ్‌లోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవాలి). ►నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం / లేవడం (స్కాటింగ్) ►నేల మీది వస్తువుల్ని, బరువుల్ని నడుము వంచి గభాల్న లేవడం. ►అలా లేపాలనుకున్నప్పుడు కూర్చుని నింపాదిగా లేపాలి. ►ఈ జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ మోకాళ్లు నొప్పిగా ఉంటే ఒకసారి ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి. నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే అందించిన కథనం. -
వంట గ్యాస్ ఆదా చేసుకోండిలా! ఈ చిట్కాలు పాటిస్తే ఎక్కువకాలం పాటు
ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు వంటకు గ్యాసే వాడుతున్నారు. దాంతో వంట గ్యాస్ ధర రోజురోజుకీ పెరిగి మంట గ్యాస్‌గా మారిపోతోంది. అందుకే దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఎక్కువకాలం పాటు గ్యాస్ వచ్చే విధంగా చూసుకోవచ్చు. గ్యాస్ ఆదాకు చిట్కాలు తెలుసుకుందాం... వంట చేసేటప్పుడు రోజులో ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూర వండుకోవడం మంచిది. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి... ఇలా వండడం వల్ల గ్యాస్ ఎక్కువ మొత్తంలో పోతుంది. అదే మధ్యాహ్న భోజనం చేయడానికి ఒక గంట ముందు వండుకుంటే, అదే కూర మధ్యాన్నానికి, రాత్రికి కూడా వస్తుంది. దీనివల్ల రెండు మూడుసార్లు గ్యాస్‌ను వాడాల్సిన అవసరం రాదు. ప్రెషర్ కుకర్ బెస్ట్ ►ప్రెషర్ కుకర్ అధిక పీడనం కింద ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుకర్‌లో పెట్టవచ్చు కాబట్టి తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. చిన్న బర్నర్‌తో ►చిన్నగిన్నెలో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్ వాడకూడదు. అలా వాడటం వల్ల మంట చాలా మటుకు బయటికి పోతుంది. దాంతో ఆ మేరకు గ్యాస్ వృథా అయినట్లే కదా.. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది. ఇలా చేస్తే మరింత ఆదా ►బర్నర్లను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది త్వరగా వేడెక్కి వంట త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది. వంట పూర్తవడానికి కొంచెం ముందే స్టవ్ ఆపి వేయండి. గిన్నె మీద మూత మాత్రం తీయవద్దు. లోపల ఉన్న వేడి ఆ మిగతా వంటను పూర్తి చేస్తుంది. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ►వంట చేస్తున్నప్పుడు గిన్నె మీద మూత పెట్టే ఉంచండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల లోపల ఉన్న వేడి బయటికి పోదు. ఆ వేడి మీదే త్వరగా ఉడుకుతుంది. అదేవిధంగా స్నానానికి వేడినీళ్లను గ్యాస్ మీద పెట్టవద్దు. నీళ్లు వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఎక్కువ గ్యాస్ వాడాల్సి వస్తుంది. ►పగటిపూట వంట చేస్తున్నప్పుడు వంటగదిలోని లైట్లను ఆన్ చేయవద్దు. దీనివల్ల శక్తి ఆదా అవుతుంది. అలాగే మీకు తెలియకుండానే గ్యాస్ వినియోగం కూడా తగ్గుతుంది. ►ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల గ్యాస్ సిలెండర్ దాదాపు పది రోజులు అదనంగా వచ్చే అవకాశం ఉంది. -
మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇంకా..
Summer Health Tips: అసలే ఎండాకాలం.. దాహం వేస్తుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడంటే కావలసినప్పుడల్లా నీళ్లు తాగుతుంటాం. మరి బయటికి వెళ్లేటప్పుడు? అందులో ఆలోచించేదేముంది... ఒక వాటర్ బాటిల్ తీసుకెళతాం.. అంతేకదా అని సింపుల్‌గా చెప్పేస్తాం. అయితే ఆ బాటిల్ దేనితో తయారు చేసింది... అంటే నూటికి తొంభై పాళ్లు ‘ప్లాస్టిక్ బాటిల్’ అనే సమాధానం వస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎంత ఉపయోగమో, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అంత ప్రమాదం. అది ఎండాకాలం అయితే కనక ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఏమిటా నష్టాలు అంటారా? అదే చూద్దాం.. ప్లాస్టిక్ వాడకం ఎందుకంటే! ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు అని పదే పదే చెబుతున్నా కూడా ప్లాస్టిక్ ఇంకా వాడకంలోనే ఉండటానికి కారణం ఏమిటంటే, దానిని క్యారీ చేయడం చాలా సులువు. నిర్వహించడం ఇంకా సులువు. ఒకవేళ ఎక్కడైనా పెట్టి మరచిపోయినా పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి దిగులు పడనక్కరలేదు. అందువల్ల పర్యావరణ ప్రేమికులు ఎంతగా నెత్తీ నోరు బాదుకుంటున్నా, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే విషయంలో వెనకబడవలసి వస్తోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా, భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీటిని అసలు తాగకూడదు. పరిశోధన ప్రకారం.. ►ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఎండ పడితే.. అవి మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ నీటిని తాగితే.. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే.. ఎండోక్రైన్ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయాన్ని కూడా పాడు చేస్తుంది. ►ఎండలో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ లాంటి టాక్సిన్ నీటిలోకి విడుదల అవుతుంది. ఈ డయాక్సిన్ నీటిని తాగితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగితే.. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. ►బాటిల్ వాటర్‌లో మైక్రో ప్లాస్టిక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ►మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవేరియన్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చు. ►ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు ఎండ తగిలితే.. అస్సలే తాగొద్దు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను కొంతమంది అలానే ఉపయోగిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. ఇది ఇంకా అపాయకరమైనది. ఇలా అస్సలు చేయొద్దు ఎప్పుడూ. ఏం చేయాలి మరి? ►ప్లాస్టిక్ బాటిల్స్ అంతగా వాడుకలోకి రాని రోజుల్లో పెద్దవాళ్లు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు స్టీలు లేదా ఇత్తడి మరచెంబులు తీసుకు వెళ్లేవారు. ఇప్పుడు కూడా అదే మంచిది. అందుకు తగ్గట్టు ఇప్పుడు మార్కెట్లో రకరకాల సైజుల్లో, ఆకారాలలో రాగి, స్టీలు, ఇత్తడి బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాస్తంత ఖరీదు ఎక్కువైనా, ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో పోల్చుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. ►ప్లాంట్ బేస్డ్ బాటిల్స్, గాజుసీసాలు, అల్యూమినియం వాటర్ క్యాన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడకం మొదలు పెడితే ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. చదవండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా.. -
ఇరవై మందార పూలు.. మెంతులు.. పచ్చకర్పూరం! ఇలా చేస్తే ఒత్తైన కురులు
జుట్టు రాలడం తగ్గి కురులు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మందార తైలం తయారు చేసుకుని తలకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ►ఇరవై మందార పువ్వులను తీసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. ►పువ్వులు బాగా ఆరిన తరువాత మిక్సీజార్‌లో వేసుకుని రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెపెట్టి దానిలో అరలీటరు నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె పోయాలి. మెంతులు కూడా వేసి ►అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మందార పువ్వుల పేస్టు, స్పూను మెంతులు వేసి మరగనివ్వాలి. ►మరిగిన తరువాత దించేముందు కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం లేదంటే.. ►తర్వాత ఆయిల్‌ను చల్లారనిచ్చి వడకట్టి సీసాలో భద్రపరుచుకోవాలి. ►ఈ మందార తైలాన్ని వారానికి రెండుసార్లు తలకు పట్టించి మర్దనా చేస్తే.. కుదుళ్లకు పోషణ అందుతుంది. ►ఫలితంగా రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ►పచ్చకర్పూరం లేదా ముద్దకర్పూరం వేయడం వల్ల పేలు రాకుండా ఉండటమే కాక మాడుకు చల్లగా హాయిగా అనిపిస్తుంది. -
Beauty: ఇలా చేశారంటే ముఖం కాంతులీనడం ఖాయం!
చర్మం నిగనిగలాడుతూ ఉండటం కోసం, ముఖం మెరుపులీనడం కోసం రకరకాల క్రీములు, మందులు వాడుతుంటారు చాలామంది. అయితే వాటితోపాటు ఒత్తిడి కూడా లేకుండా చూసుకోవడం అవసరం. ఎందుకంటే ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు శారీరక ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయి. ఫలితంగా ముఖం పీక్కుపోయినట్లు ఉండటం, జిడ్డు కారుతూ ఉండటం, చెమట ఎక్కువగా పట్టడం, చర్మంపై చిన్న చిన్న దద్దులు, పొక్కులు వంటివి రావడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి. ఈ పరిస్థితిలో యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, మానసిక సమస్యలను అదుపులో ఉంచేందుకు కంటినిండా నిద్రపోవడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంటి చిట్కాలతో చర్మం మెరుస్తూ ఉండాలంటే చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రెగ్యులర్ ఫేషియల్స్, క్లీనప్‌లు చేయాలి. శనగ పిండి, పసుపు, పెరుగు, తేనె వంటి ఇంటి చిట్కాలు చర్మాన్ని తళతళ మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. పోషకాల ఆహారం ఆహారంలో అన్ని రకాల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. శరీరానికి అన్ని ముఖ్యమైన పోషకాలు, విటమిన్లను పుష్కలంగా అందించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబించాలి. ఆహారంలో కూరగాయలు, పండ్లను సమృద్ధిగా ఉండేలా చూసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చదవండి: బొప్పాయి గింజలు పొడి చేసుకుని తిన్నారంటే! ఇందులోని కార్పైన్, పాలీఫెనాల్స్ వల్ల -
బొప్పాయి గింజలు పొడి చేసుకుని తిన్నారంటే! ఇందులోని కార్పైన్, పాలీఫెనాల్స్ వల్ల
Health Tips In Telugu- Papaya Seeds: బొప్పాయి పండు తరగగానే ముందు అందులో ఉండే గింజలు తీసి అవతల పారేస్తాం. బొప్పాయి గింజలపై జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇవి కొద్దిగా కారంగా, చేదుగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి.. మిక్సీలో పొడిలా చేసి తినవచ్చు. బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ ఉంటాయి. ఇంకా జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ గింజల్లో ఒలీక్ యాసిడ్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంచుతాయి. కార్పైన్ వల్ల బొప్పాయి గింజలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ స్థాయికి తగ్గుతుంది. వీటిలో ఉండే కార్పైన్ అనే పదార్థం పేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ విత్తనాలలోని అధిక ఫైబర్.. పేగులు బాగా కదిలేలా చేస్తుంది. బరువు తగ్గుతారు ఫలితంగా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి.. శరీర వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరంలో అనవసర కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. ఫలితంగా త్వరగా బరువు తగ్గిపోతారు. పీరియడ్స్ నొప్పిని తగ్గించి బొప్పాయిలో ఉండే కెరోటిన్.... ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. బొప్పాయి గింజలు ఋతుక్రమం సరైన క్రమంలో ఉండేలా చేస్తాయి. పీరియడ్స్ నొప్పిని కొంతవరకూ తగ్గిస్తాయి. బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంట, నొప్పిని తగ్గిస్తాయి. ఇందులోని పాలీఫెనాల్స్ కారణంగా బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్... అనేక రకాల క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. రోజూ 5 నుంచి 6 బొప్పాయి గింజలను తీసుకుని.. వాటిని చూర్ణంలా చేసి తినండి. లేదా పొడిలా చేసి నీటిలో కలిపి తాగేయండి. బొప్పాయి గింజల సారాన్ని తాగడం వల్ల... కడుపులో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాలు చనిపోతాయి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశ ఉంటుంది. చదవండి: బీరకాయ కూర తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల -
తన పోస్ట్‌కు విపరీతంగా లైక్స్.. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్! కానీ అసలు సంగతి తెలిస్తే..
How To Get More Social Media Followers: సౌజన్య (పేరుమార్చడమైనది) సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటుంది. రాత్రి తను చేసిన పోస్ట్‌కు ఉదయం విపరీతంగా లైక్స్ రావడం, ఫాలోవర్స్ పెరగడం చూసి తెగ సంతోషించింది. ఒకట్రెండు రోజులు సజావుగా సాగినా ఆ తర్వాత నుంచి ప్రచార వస్తువుల గురించి ప్రకటనలు పెరిగాయి. తన చేసిన పోస్ట్‌లకు చెడుగా కామెంట్స్ పెడుతున్నారు. దీని వల్ల తన పేరు దెబ్బతింటుందనే ఆందోళన ఆమెను విపరీతమైన టెన్షన్‌కు గురిచేసింది. సోషల్ మీడియా సొసైటీలో ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్‌ను బట్టి విలువకట్టే రోజులు ఇవి. సినిమా స్టార్స్‌తోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తమ సేవల గురించే కాదు, వస్తువుల బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టు కుంటుంటారు. అయితే, బ్రాండ్ ఎండార్స్మెంట్లను నిర్వహించే వ్యాపారాల దృష్టిని ఆకర్షించడానికి స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఫాలోవర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఇది ఒక పోటీలా మారుతుంటుంది. దీనిని గుర్తించిన నకిలీ ఫాలోవర్స్ అధికసంఖ్యలో పుట్టుకొస్తుంటారు. తమ మోసాలకు కొత్త తెర తీస్తుంటారు. దీనివల్ల ఆదాయ మార్గాలకు గండికొట్టడం, పేరు ప్రతి ష్టలు దెబ్బతీయడం వంటివి జరుగుతుంటాయి. నిజమైన ఫాలోవర్స్‌ను ఎలా పొందాలంటే.. ►ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టించాలి. మీ కంటెంట్ ప్రేక్షకులకు సమాచారంగా, వినోదాత్మకంగా, చూడటానికి ఆకర్షణీయంగా ఉండాలి. క్వాలిటీ ఫొటోలు, వీడియోలు వాడాలి. ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలి. ∙ ►క్రమం తప్పకుండా పోస్ట్ చేయడం వల్ల మీ ప్రేక్షకులు మీ కంటెంట్‌పై ఆసక్తిని కలిగి ఉంటారు. ►వ్యాఖ్యలు, సందేశాలకు ప్రతిస్పందించడం, అభిప్రాయాలను అడగడం, సంభాషణలను ప్రారంభించడం ద్వారా వీక్షకులతో సన్నిహితంగా ఉండాలి. ఇది ఫాలోవర్స్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ►పోటీలు, బహుమానాలను ప్రకటించడం వల్ల కొత్త ఫాలోవర్లు పెరుగుతారు. మీ ఫాలోవర్లకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించవచ్చు. ►మీ వెబ్సైట్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్‌ను ప్రచారం చేసేలా ఉండాలి. దీనివల్ల చూసేవారి సంఖ్య పెరగడంతోపాటు కొత్త ఫాలోవర్లను ఆకర్షించడానికి సహాయపడుతుంది. నకిలీ ఫాలోవర్లు ఏం చేస్తారంటే.. ►కృత్రిమంగా ఫాలోవర్లను పెంచే ప్రయత్నంలో సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవడానికి అటోమేటెడ్ అకౌంట్స్‌ను రూపొందిస్తారు. ►ఫాలోవర్ కౌంట్, లైక్స్, కామెంట్స్ మళ్లించేందుకు వాస్తవంగా కంటే ఎక్కువ జనాదరణ లేదా ప్రభావవంతమైనదిగా కనిపించేలా చేయడానికి అకౌంట్లు సృష్టించబడతాయి. వీటిని థర్డ్‌పార్టీ ప్రొవైడర్ల నుంచి కొనుగోలు చేయచ్చు. ►లేదా నకిలీ ఖాతాలను సృష్టించే ప్రక్రియను ఆటోమేట్ చేసే సాఫ్ట్వేర్ సాధనాలను ఉపయోగించి సృష్టించవచ్చు. ∙ ►నకిలీ ఫాలోవర్లు అనైతికంగా ప్రవర్తిస్తారు. ►భవిష్యత్తులో మీ బ్రాండ్‌నేమ్‌ని దెబ్బతీస్తారు. ►వినియోగదారులు నిజమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండేలా ఫేక్ అకౌంట్స్‌ను క్రమం తప్పకుండా తొలగించాలి. నకిలీ అకౌంట్స్‌ను గుర్తింవచ్చు.. ►సోషల్ మీడియా పాలోవర్లను గుర్తించడం సవాల్‌గా ఉంటుంది. అయితే, నిజమైన వినియోగదారుల నుండి వీరిని వేరు చేయడంలో సహాయపడే కొన్ని సూచికలు... ►నకిలీ ఖాతాలో ప్రొఫైల్ సమాచారం ఉండదు. ప్రొఫైల్ ఫొటో సరైనది ఉండదు. బయో, లొకేషన్ వంటి అసంపూర్ణమైన లేదా ఖాళీ ప్రొఫైల్ ఉంటుంది. ►వీరి ఖాతాలో అతి సాధారణ కంటెంట్ ఉంటుంది. పోస్ట్‌కు ప్రతిస్పందనగా ఎమోజీలు ఉంటాయి. లేదా సంబంధం లేని వెబ్సైట్ లింక్‌లతో స్పామ్ కామెంట్స్ వదిలేయవచ్చు. ►వీరి ఖాతాలకు చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. కానీ, వీరు పెద్ద సంఖ్యలో ఇతర ఖాతాలను ఫాలో చేస్తుంటారు. ►ఇతరులతో ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. కంటెంట్‌ను షేర్ చేయడం లేదా ఇతర యూజర్స్‌కి మెసేజ్‌లు, పోస్ట్‌లు.. అప్లోడ్ చేయడం నకిలీ అకౌంట్స్ వారు చేయరు. ►ఫాలోవర్ కౌంట్‌లో ఆకస్మిక పెరుగుదల ఉంటే అనుమానించాలి. నకిలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు... ►ఇతరులను కించపరిచేలా ప్రతికూల కథనాలను, సమీక్షలు రాస్తారు. ►వారి వ్యూవర్షిప్ను పెంచడానికి మోసపూరిత ఫొటోలను పోస్ట్ చేస్తారు. ►నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేస్తూ, అవి తమకు తాముగా ప్రయోజనం పొందేలా చూస్తారు. నకిలీ ఖాతాల గురించి రిపోర్ట్ చేయడానికి... ►మీ డేటాను యాక్సెస్ చేయకుండా అకౌంట్‌ను బ్లాక్ చేయవచ్చు. ►లేదంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నివేదించవచ్చు. https://www.facebook.com/help/306643639690823 https://help.twitter.com/en/rules-and-policies/platform-manipulation https://www.linkedin.com/help/linkedin/answer/a1338436/report-fake-profiles?lang=en https://help.instagram.com/446663175382270 - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పదో తరగతి పరీక్షలు.. ఇన్విజిలేటర్లు ఎలా మెలగాలి?
ఏప్రిల్ 3 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు. పిల్లలు ఒత్తిడిలో ఉంటారు. పెద్దలు ఒత్తిడి పెడుతుంటారు. వీటికి తోడు పరీక్షా హాలులో ఇన్విజిలేటర్లు కూడా ఒత్తిడి పెడితే విద్యార్థుల పరిస్థితి సంకటంలో పడుతుంది. ‘ఇన్విజిలేటర్ల పని పిల్లలు ప్రశాంతంగా రాసేలా చూడటం. వారితో మృదువుగా ఉంటూనే పరీక్షల నియమ నిబంధనలు పాటించవచ్చు’ అంటారు పియాలి బెనర్జీ. ‘పిల్లలు ఎప్పుడూ కనిపించేలా అల్లరిగా కాకుండా గంభీరంగా మారిపోయే సమయం అది’ అంటుంది పియాలి బెనర్జీ పరీక్షల సమయం గురించి. ఆమె ముంబైలో సుదీర్ఘ కాలం హైస్కూల్లో ఇంగ్లిష్ బోధించింది. చాలాసార్లు ఇన్విజిలేటర్‌గా పని చేసింది. ‘ఇన్విజిలేటర్‌కు పిల్లలను పరీక్షలు రాయడానికి ఉత్సాహపరిచే స్వభావం ఉండాలి. అది లేనప్పుడు కనీసం ఊరికే ఉంటే చాలు. ఏవో ఒక మాటలు చెప్పి, గద్దించి వారిని నిరుత్సాహపరిచే హక్కు మాత్రం లేదు’ అంటుందామె. తాను ఇన్విజిలేటర్‌గా ఉన్నప్పుడు గమనించిన అంశాలు పియాలి చెప్పింది. ‘ఒకసారి ఒక పిల్లాడు తల ఒంచుకుని కూచుని ఉన్నాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అనుకున్నాను. రెండు నిమిషాలైనా కదల్లేదు. దగ్గరికెళ్లి చూశాను. నిద్రలో జారుకున్నాడు. పాపం రాత్రి ఎంతసేపు చదివాడో. మెల్లగా తట్టి లేపాను. ఉలిక్కిపడి లేచాడు. వాస్తవంలోకి వచ్చి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నానని గ్రహించి పూర్తిగా కంగారుపడిపోయాను. మెల్లగా చెప్పాను– ఐదు నిమిషాలే పడుకున్నావు. ఏం కొంపలు మునగలేదు. రాయి అని. స్థిమితపడి రాయడంలో పడ్డాడు. పరీక్ష అయ్యాక మొహమాటంగా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు. తల్లిదండ్రులు పరీక్ష ముందురోజు రాత్రి తొమ్మిదిన్నరకంతా పిల్లలను నిద్రపోయేలా చూడాలి. పిల్లల్ని అలా చదువు ప్లాన్ చేసుకోమని చెప్పాలి. ఇంకోసారి ఇంకో పిల్లాడు మాటిమాటికి టైమ్ వైపు చూసుకుంటూ కంగారుగా రాస్తున్నాడు. టైమ్ సరిపోదేమోనని భయం. దగ్గరగా ఒంగి చెప్పాను– హైరానా పడకు. మూడు గంటల్లో పూర్తయ్యేలాగే నీ ప్రశ్నలు ఉంటాయి. వాచీ చూడకు. రాసుకుంటూ వెళ్లు. నేను టైమ్ అలెర్ట్ చెప్తానుగా అన్నాను. పిల్లలను టైమ్ చాలదని భయపెట్టకూడదు’ అంటుంది పియాలి బెనర్జీ. కొంతమంది పిల్లలు హడావిడిలో పెన్ను పెన్సిల్ కూడా తీసుకురారు. ఇంక్ అయిపోయిందని పెన్ కోసం అడుగుతారు. అప్పుడు వారిని సూటిపోటిగా ఏదో ఒక మాట అంటే తర్వాత ఏం రాస్తారు? చిర్నవ్వుతో ఒక పెన్ అందిస్తే ఏం పోతుంది?’ అంటుందామె. ఎగ్జామినేషన్ హాల్లో పెద్దగా అరవడం సరిౖయెన పద్ధతి కాదు అంటుందామె. ఎవరైనా కాపీ చేస్తూనో మరో కోతి పని చేస్తూనో దొరికిపోయినా హాలంతా అదిరిపోయేలా అరిచి అందరు పిల్లలనూ బెంబేలెత్తించకూడదు. చాలా నిశ్శబ్దంగానే ఆ కాపీ చేస్తున్న పిల్లలను హాలు బయటకు తీసుకెళ్లి వ్యవహారం తేల్చాలి అంటుందామె. ‘పిల్లలు ఏవైనా అనవసరమైనవి పెట్టుకున్నారా తమ దగ్గర అని ఒకసారి చెక్ చేస్తే చాలు. పరీక్ష మధ్యలో మాటి మాటికి వారిని శల్యపరీక్షకు గురి చేసి ఏకాగ్రతను భంగం కలిగించకూడదు’ అని చెబుతుంది. ‘పిల్లలు సరిగ్గా తమ నంబర్ వేశారో లేదో చెక్ చేయడం ఇన్విజిలేటర్ ప్రధానమైన పని. అది మాత్రం ప్రతి విద్యార్థి దగ్గరకు వెళ్లి చెక్ చేసి వారికి ఓకే చెప్పాలి. లేదంటే పరీక్ష రాసి ఇంటికెళ్లినా నంబర్ సరిగ్గా వేశానా లేదా అని కంగారు పడతారు’’ అంటుంది పియాలి. పదో తరగతి పరీక్షలంటే పిల్లలు జీవితంలో మొదట ఎదుర్కొనే పరీక్షలు. ఆ సమయంలో ఇన్విజిలేటర్లు వారి దృష్టితో ఆలోచించి వీలైనంత కంఫర్ట్‌గా పరీక్ష రాసేలా చూడాలి. వారు రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్లు శ్రద్ధగా, విసుగు లేకుండా ఉండటం అన్నింటి కంటే ముఖ్యం అని సూచిస్తున్నదామె. -
బీరకాయ కూర తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల
సాధారణంగా జ్వరం వచ్చి తగ్గినప్పుడు పథ్యం కూరలా బీరకాయ వండుతుంటారు. బీరకాయలో కొవ్వులు తక్కువగా, నీరు, పీచుపదార్థం ఎక్కువగా ఉండి, పోషకాలు అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణం కావడమే అందుకు కారణం. నిజానికి బీరకాయను పథ్యం కూరలా కాదు, ఆహారంలో తరచు భాగం చేసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే, బీరపాదు మొత్తం ఔషధపూరితం అని వైద్యులు అంటున్నారు. ఆరోగ్య లాభాలు ►సాధారణ, నేతి బీరకాయ– రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్ –సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్ , మెగ్నీషియం, థైమీన్ ... వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ►సెల్యులోజ్ ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్నీ మొలలవ్యాధినీ నివారిస్తుంది. ►బీరకాయల్లోని పెప్టెడ్‌లు, ఆల్కలాయిడ్లు రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. షుగర్ ఉన్నవాళ్లు ►మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది. ►రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. ►దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. కంటికండరాల బలహీనత తగ్గించి ►కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది. ►అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుంది. ►బీరకాయలోని విటమిన్ –ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని జాతీయ అంధత్వ నివారణ సంస్థ పేర్కొంటోంది. రక్త హీనతతో బాధపడుతున్న వారికి ►ఇందులోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట. ►బీరకాయల్లోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలదనీ తేలింది. ►ఇన్ని ప్రయోజనాలున్న బీరకాయను పథ్యంలా కాకుండా తరచు తీసుకోవడమే మంచిది కదా మరి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Unwanted Hair Removal: అందుకే అవాంఛిత రోమాలు! ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండేవి తింటే.. Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే.. -
Beauty: అందుకే అవాంఛిత రోమాలు! ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండేవి తింటే..
ప్రస్తుతకాలంలో అవాంఛిత రోమాలతో చాలామంది బాధపడుతున్నారు. అది అందమైన ముఖాన్ని అంద విహీనంగా చేస్తుంది. వాటిని చూసుకున్నప్పుడల్లా స్త్రీలు ఎంతో బాధని అనుభవిస్తుంటారు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. ఏది ఏమైనా అవాంఛిత రోమాలు అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి వాక్సింగ్, షేవింగ్, ఇతర చికిత్సలు చేయించటం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమి లేదు, కానీ కొన్ని సహజ నివారణలు ఉన్నాయి. అవేంటో చూద్దాం... పసుపు ►ఇది మనం ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ►దీన్ని ఆయుర్వేదంలో ఒక ఔషధంలా ఉపయోగిస్తారు. ►పసుపుని శెనగపిండితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ►పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇవి కూడా! ►వీటితోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ రోమాలు వదిలించుకోవటంలో సహాయపడుతుంది. ►సరియైన ఆహారం తీసుకోకపోవడం వలన ఇది అధికమయ్యే ప్రమాదముంది. ►ముఖంపై అవాంఛిత రోమాల బెడద తగ్గాలంటే ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ►ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా అవిసెగింజలు, సోంపు, అల్ఫాల్ఫాలో ఉంటాయి. చదవండి: Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
పిల్లల్లో విరోచనం కాకపోతే ఏం చేయాలి? సునాముఖి ఆకుతో ఇలా చేస్తే..
చిన్నపిల్లలున్న ఇల్లు! అసలే వీపరీతమైన పని, ఒత్తిడి. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు! ఏం తినాలో, ఏం తినకూడదో వారికి తెలియదు, తల్లితండ్రులకు వారిని అర్థం చేసుకునే సమయం తక్కువ! 24 గంటలూ పిల్లలనే కనిపెట్టుకుని వుండాలంటే కొద్దిగా కష్టమే! అయినా కళ్ళల్లో వత్తు లేసుకుని కాపలా కాస్తూనే వున్నప్పటికీ పిల్లలు ఏదో తినేస్తుంటారు. ఇబ్బంది పడతారు. మరి అప్పుడేం చెయ్యాలి? ఆందోళన చెందకుండా ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారాలు సూచిస్తోంది? 1. పిల్లలు తెలియకుండా ఏదో ఒకటి నోట్లో పెట్టుకుని తర్వాత కడుపు నొప్పి అంటూ విలవిలలాడితే? కొద్దిగా జీలకర్ర తీసుకుని బాగా శుభ్రపరిచి, దోరగా వేయించాలి. ఆ వేగిన జీలకర్రను మెత్తటి వుండగా చేసుకుని ఓ సీసాలో భద్రపరచు కోవాలి. మాదీఫల రసాయనం సీసాను తెచ్చుకుని ఓ చెంచా జీలకర్ర పొడిలో మాదీఫల రసాయనం కలపాలి. దాన్ని చెంచాలో తీసుకుని పిల్లలకు పట్టాలి. దీని వల్ల వాంతులే కాదు వామ్టింగ్ సెన్సేషన్ కూడా వుండమన్నా వుండదు. పత్యం చెయ్యాల్సిన అవసరం లేదు. 2. హఠాత్తుగా విరేచనాలు మొదలయితే ఏం చేయాలి? జిగట, మామూలు, నెత్తురు, చీము వంటి విరేచనాల లక్షణాలు కనిపిస్తున్నప్పుడు, ఆ విరేచనాల ప్రాథమిక దశలోనే జాగ్రత్త తీసుకుంటే వాటి బారి నుంచి రక్షణ పొందవచ్చు. ఎలాగంటే ఓ రెండు చింతగింజల్నీ, ఓ చెంచా గసగసాలనూ తీసుకుని ఈ రెంటినీ కలిపి కొద్దిగా నీటిని జోడించి మెత్తగా నూరాలి. అప్పుడు వచ్చే రసాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చొప్పున ఓ నాలుగైదు రోజుల పాటు ఇవ్వాలి. అవసరాన్ని బట్టి వ్యాధి తగ్గేంత వరకూ మందు ఇవ్వాలి. విరేచనాలు పూర్తిగా తగ్గిపోయేంత వరకూ మజ్జిగ అన్నం పెడితే మంచిది. 3. దీర్ఘకాలిక జ్వరాలకు ఏం చేయాలి? ఎప్పుడు చూసినా లో-ఫీవర్ వుంటుంటే దీర్ఘజ్వరం వున్నట్లుగా భావిస్తాం. దీర్ఘజ్వరం వున్నవాళ్లు చల్ల మిరియం విధానం వినియోగిస్తే సత్వర ఫలితం వుంటుంది. రోజుకో మిరియం చొప్పున మింగిస్తూ, మిరియపు గింజను మజ్జిగలో నానబెట్టి, మెత్తగా నూరి కడుపులోకి తీసుకుని కొద్దిగా మజ్జిగ తాగుతుంటే దీర్ఘజ్వరాలు తగ్గిపోతాయి. ఈ విధంగా 41 రోజులపాటు చల్లమిరియం వాడవల్సి వుంటుంది. 4. విరోచనం కాకపోతే ఏం చేయాలి? విరేచనం బిగపట్టి ఇబ్బందిగా వుంటే చిన్న చిట్కాతో ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. కొద్దిపాటి సునాముఖి ఆకును తీసుకుని దీనిని గుండుగా చేసి భద్రపరచాలి. అనంతరం పంచదార పాకం పట్టి అందులో సునాముఖి ఆకు గుండను వేసి ఆరబెట్టి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇది సుమారు రెండు మూడు నెలలపాటు నిల్వ వుంటుంది. అన్ని వయసులవారు నిరభ్యంతరంగా వాడదగిన ఈ మందు విరోచనం ఫ్రీగా అవడానికి సహకరిస్తుంది. 5. పిల్లలు తరచుగా దగ్గు, రొంపకు గురయితే ఏం చేయాలి? దగ్గు, రొంప విపరీతంగా వున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలను ప్రయోగిస్తే ఫలితం సంతృప్తికరంగా వుంటుంది. తులసి ఆకుల రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు రెండు, మూడు చుక్కలు ఇస్తే పిల్లలకు దగ్గు, రొంప అసలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ నాలుగైదు తమలపాకులు ముందుగా వెచ్చ చేసి, ఆపై నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ వుంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఒక గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ముందు ముందు రాకుండా ఉంటుంది. 6. తరచుగా ఇంజక్షన్లు చేయిస్తున్నారా? ఇవి పరిశీలనలోకి తీసుకోండి. సూది మందు వీటికి వద్దు. ►చిన్న చిన్న జబ్బులకు ►సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుకు ►విటమిన్ టాబ్లెట్లు ►కాల్షియం మందు ►రక్తహీనతకు వాడే బి12, లివర్ ఎక్స్ట్రాక్ట్, ఇన్‌ఫెర్రాన్ లాంటివి. విటమిన్ టాబ్లెట్లు నోటి ద్వారా తీసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే విటమిన్లు, మందుల రూపంలోకన్నా ఆహారం ద్వారా వీటిని తీసుకోవడం అన్ని విధాలా క్షేమదాయకం. రక్తహీనతకు ఇంజెక్షన్ల కంటే కూడా నోటి ద్వారా తీసుకునే ఫెర్రస్ సల్ఫేట్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు మంచివి. పైగా అపరిశుభ్రమైన సూదుల ద్వారా అవసరం లేని ఇబ్బందులు, అప్పుడప్పుడు నరాలకు, రక్తనాళాలకు గాయాలు కావచ్చు. -నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
బయట ఫ్రైడ్ రైస్, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే..
ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 100 నగరాల్లో 46 మనదేశంలో ఉన్నాయి. వాయు కాలుష్యానికి గుండెపోటుకి సంబంధం ఉన్నట్టు చాలా అధ్యయనాల్లో నిరూపితమైనది. దీనికి తోడు వెంటిలేషన్ లేని స్థలాల్లో ఉండటం, బిర్యానీ, మాంసం ఇతర నూనె ఎక్కువ ఉన్న పదార్థాలు లాంటి చెత్త తినడం, రాత్రిపూట మేలుకోవడం, ఒత్తిడి, తిన్న కాసేపటికి వ్యాయామం చేయడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏం చేయాలంటే! 1. బయట బండి మీద దొరికే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తినటం ఆపి వేస్తే సగం జబ్బులు పోతాయి. 2. ఎత్తుకు తగ్గ బరువు ఉంటే ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడవచ్చు. 3. ఉదయాన్నే చద్ది అన్నం ఉల్లిపాయ నంజుకుని ప్రతి రోజు తింటే గుండె జబ్బులు 100% రావని చెప్పవచ్చు. 4. ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురి అవ్వడం కూడా హార్ట్ ఎటాక్‌లకు కారణం. 5. శరీరంలో అనవసరమైన, అధిక కొవ్వు నిల్వలు ఉండిపోయి రక్తనాళాలు మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రక్తప్రసరణ కష్టమవుతుంది. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో అవధులు దాటి డిపాజిట్ అవడం వలన గుండెకి రక్తం పంపింగ్ కష్టం అయిపోతుంది. 6. అధిక బరువు వలన గుండె పనితీరులో ఆటంకాలు ఏర్పడి పోటు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఒబెసిటీ ఉన్నవారు ప్రతిరోజు, రోజుకి ఆరుగంటలు కష్టపడి శరీరం అలిసేటట్లు పనిచేయాలి. అరగంట నుండి గంట వరకూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. గుండెనొప్పి, గ్యాస్ నొప్పి - వీటిలో ఏదని ఎలా గుర్తించాలి? గుండెనొప్పి వస్తే గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. విపరీతమైన చమట పడుతుంది. ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ వుంటుంది. కొంతమంది లో మోషన్ కూడా అవుతుంది. వాంతులు అవుతాయి. పైన చెప్పిన లక్షణాలు కనపడగానే రోగిని సాధ్య మైనంత తొందరగా హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకు వెడితే అంత మంచిది. ఈ లోగా ఆస్ప్రిన్ గాని దిస్ప్రిన్ కానీ నీటిలో కలిపి తాగిస్తే మంచిది. నాలుక కింద సర్బిట్రేట్ మాత్ర ఉంచాలి. ఇది రోగిని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళే లోగా పరిస్థితి మరింత దిగజారకుండా ఉపయోగ పడుతుంది. గ్యాస్ నొప్పి వచ్చినపుడు.. గుండెలో మంట, తెనుపులు, కడుపు వుబ్బరం, తెనుపు వచ్చినప్పుడు గొంతులో మంటగా ఉంటుంది. గుండె నొప్పికి గాస్ నొప్పికికి తేడా కనుక్కోలేక పోయినట్టు అయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నొప్పి అనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Stress Relief: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
Health: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల
Health Tips In Telugu: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల పోషకాలను తప్పకుండా తీసుకోవాలి. దానికి పిల్లలు, పెద్దలు అనేం లేదు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలలో మానసికంగా చురుగ్గా ఉంచే కొన్ని కారకాలు ఉన్నట్లు పోషకాహార నిపుణులు గుర్తించారు. వాటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉండగలం. అవేమిటో చూద్దాం. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్.. పేరు ఏదైనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే రాకుండా చూసుకోవడం చాలా మేలు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలు తీసుకోండి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండండి. పొద్దుతిరుగుడు గింజలు... వీటిలో విటమిన్ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. వెల్లుల్లి... వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణ ఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది. గుడ్లు... గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సంతృప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థం గా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. నువ్వులు... నువ్వులతో తయారుచేసే పదార్థాలలో ఎల్–ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. 25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల ఉండలను తినిపించి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయులు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. నువ్వులతో రకరకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా పదార్థాన్ని రుచిగా ఉండేలా తయారు చేసుకోవడం వల్ల వాటిని తినే విధంగా మెదడు కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
ఇంటర్నెట్ లేకుండా 'ఆఫ్‌లైన్ ట్రాన్సక్షన్'.. మీకు తెలుసా?
ప్రస్తుతం ఫోనేపే.. గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత చేతిలో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య దాదాపు తగ్గిపోయింది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా మొత్తం ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. అయితే ఈ ఆన్లైన్ ట్రాన్షాక్షన్స్ జరగటానికి తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి, ఇందులో కొన్ని సార్లు నెట్వర్క్ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆన్లైన్ కష్టాలు, నెట్వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్‌లైన్ విధానం కూడా అమలులో ఉంది. ఇది ప్రస్తుతం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా సులభంగా ట్రాన్షాక్షన్స్ పూర్తి చేసుకోవచ్చు. భారతదేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు UPI సేవలను ప్రాసెస్ చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సర్వీస్' ప్రారంభించింది. ఇందులో వినియోగదారుడు చేయవలసిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడం. వినియోగదారుడు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేసిన తరువాత మొబైల్ స్క్రీన్‌పై ఇంటరాక్టివ్ మెనూ కనిపిస్తుంది. దీని ద్వారా సులభంగా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఇందులో బ్యాలెన్స్ విచారణ వంటి సర్వీసులతోపాటు యుపిఐ పిన్ సెట్ చేయడం / మార్చడం కూడా చేసుకోవచ్చు. *99# USSD కోడ్ ద్వారా యుపిఐ లావాదేవీ ప్రారంభించడం ఎలా? మొదట మీ బ్యాంకు అకౌంట్‌కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. తరువాత మీకు కింద కనిపిస్తున్న మెనూ పాప్ వస్తుంది. సెండ్ మనీ రిక్వెస్ట్ మనీ చెక్ బ్యాలన్స్ మై ప్రొఫైల్ పెండింగ్ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్ యుపిఐ పిన్ ఇందులో మీరు డబ్బు పంపించడానికి సెండ్ మనీ సెలక్ట్ చేసుకుని సెండ్ చేయాలి. తరువాత మీరు ఏ అకౌంట్ నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని మళ్ళీ సెండ్ చేయాలి. మొబైల్ నంబర్ ద్వారా ట్రాన్సాక్షన్ ఎంచుకుంటే రిసీవర్ యుపిఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను టైప్ చేసి సెండ్ చేయండి. మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేసి, సెండ్ ఆప్సన్ మీద క్లిక్ చేయండి. చెల్లింపు కోసం రిమార్క్‌ని ఎంటర్ చేయండి. మొత్తం ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి యుపిఐ పిన్ని ఎంటర్ చేయండి. ఇవన్నీ మీరు సక్రమంగా పూర్తి చేస్తే మీ ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. అంతే కాకుండా.. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి *99# ఉపయోగించి, సరైన సూచనలను అనుసరించడం ద్వారా UPI సేవలను ఆఫ్‌లైన్‌లోనే నిలిపివేయవచ్చు. ఇవన్నీ చేసేటప్పుడు తప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
Beauty: పెసలను రాత్రంతా నానబెట్టి.. గ్రైండ్ చేసి.. ఇలా మర్ధనా చేస్తే!
పెసలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని పొందవచ్చు. ఇంట్లోనే ఈ సులువైన చిట్కాలు పాటించి నునుపైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ►టేబుల్ స్పూన్ పెసలను రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా గ్రైండ్ చేసి అందులో అర టీ స్పూన్ నెయ్యి లేదా పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసి పది నిమిషాల సేపు మిశ్రమాన్ని ముఖం మీద ఉంచాలి. ►ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం ఆరోగ్యంగా, నునుపుగా మారుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్లయితే పెసర పేస్ట్‌లో కొద్దిగా మజ్జిగ లేదా పన్నీరు కలుపుకోవాలి. ►ఎండకు కమిలిపోయిన చర్మం తిరిగి మామూలు కావాలంటే... పైన చెప్పుకొన్న పెసల పేస్టులో చల్లటి పెరుగు లేదా కలబంద పేస్టు కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. హెయిర్ ఫాల్ తగ్గాలంటే... రాత్రంతా నానబెట్టిన పెసలను గ్రైండ్ చేసి అందులో కోడిగుడ్డు సొన, టేబుల్ స్పూన్ నిమ్మరసం, కప్పు పెరుగు కలిపి చిక్కటి పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి 15నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ మూంగ్‌దాల్ ప్యాక్‌ను నూనె రాసిన జుట్టుకు పట్టించకూడదు. షాంపూతో తలస్నానం చేసి ఆరిన తర్వాత మాత్రమే వేయాలి. చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. Nora Fatehi: భోజనంలో అవి ఉండాల్సిందే! రోజూ ఆయిల్ మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే! -
కనీసం 3 నెలల పాటు ప్రతిరోజు దానిమ్మ తింటే! ఇక తొక్కలు పొడి చేసి
ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు అంటే ఎక్కువ మంది యాపిల్ గురించి మాట్లాడతారు. కానీ దానితో సమానంగా దానిమ్మ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. దీనివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాట్, స్వీట్ డిష్, ఐస్ క్రీమ్, స్మూతీస్ ఇలా ఏది చేసినా దాని మీద తప్పనిసరిగా గార్నిషింగ్ కోసం దానిమ్మ గింజలను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఏదోవిధంగా దానిమ్మను తీసుకోవడం వల్ల ధమనుల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటే తప్పకుండా దానిమ్మ పండ్లు తినడం అలవాటు చేసుకోండి. దానిమ్మ వల్ల ప్రయోజనాలు ►దానిమ్మ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పోషకాలతో నిండి ఉంటుంది. తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ►యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వ్యాధులను నిరోధించేందుకు సహాయపడతాయి. ►వృద్ధాప్యానికి దారితీసే ఫ్రీ రాడికల్స్ నుంచి మనలని రక్షిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. శరీరం నుంచి అదనపు కొవ్వుని తొలగించడంలో సహాయపడుతుంది. ►రక్తాన్ని పలుచన చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరిచి రక్తప్రసరణకి ఎటువంటి హాని కలగకుండా చూస్తుంది. ►జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే మలబద్ధకం సమస్య దరిచేరదు. కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు తింటే.. ►దానిమ్మలోని గుణాలు ధమనుల్లో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తాయి. దానిమ్మ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ►గుండె పోటు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. ►అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు మూడు దానిమ్మ పండ్లు తింటే చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కార్డియో వాస్కులర్ డిసీజ్ బారిన పడకుండా కాపాడుతుంది. ►రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు మందులు వాడే ముందు రోజూ దానిమ్మను తిని చూడటం ఉత్తమం. ఎందుకంటే దానిమ్మ ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. తొక్కల్లో కూడా.. ►దానిమ్మ పండులోనే కాదు తొక్కల్లో కూడా విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 పోషకాలు ఉన్నాయి. ►అందుకే దానిమ్మ గింజలు తిన్నతర్వాత తొక్కలు పడేయకుండా వాటిని ఎండబెట్టి పొడి చేసుకుని పెట్టుకోండి. ►కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు దానిమ్మ తొక్కలు ఎండబెట్టుకుని చేసుకున్న పొడిని నీళ్ళలో వేసి మరిగించి తాగితే మంచిది. ►దానిమ్మ తొక్కల పొడిని వేడి నీళ్ళలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యను అధిగమించవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Summer Healthy Juices: టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే! Beauty Tips: ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్‌తో.. మచ్చలకు చెక్! ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది! -
భోజనంలో అవి ఉండాల్సిందే! రోజూ ఆయిల్ మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే!
‘‘నీళ్లు బాగా తాగుతాను. రోజూ నా భోజనంలో తాజా ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా చూసుకుంటాను. తాజా పండ్లు సరేసరి! వారానికి ఒకసారి ఫేస్‌కి గ్రీన్ టీ ప్యాక్ వేసుకుంటా. గ్రీన్ టీ ఆకులను తేనెలో కలిపి దాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటా. ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటా. ఇవన్నీకాక.. మొహం నిత్యం మెరుస్తూండడానికి నా చర్మానికి సరిపడే ఫేషియల్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటాను. గ్రీన్ టీ ప్యాక్, ఫేషియల్ ఆయిల్ మసాజ్‌లు మా అమ్మ చెప్పిన చిట్కాలే!’’ అంటోంది బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ. కాగా మొరాకో మూలాలున్న నోరా కెనడాలో జన్మించింది. మోడల్, డాన్సర్, సింగర్, నటిగా రాణిస్తోంది. 31 ఏళ్ల ఈ బ్యూటీక్వీన్ డాన్స్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. రోర్ మూవీతో తెరంగేట్రం చేసిన నోరా ఫతేహి.. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పొలిటికల్ సైన్స్ అభ్యసించిన నోరా.. పేరుకు కెనడియన్‌ని అయినా ఆత్మీయత పంచడంలో భారతీయులకు ఏమాత్రం తీసిపోనంటూ పలు సందర్భాల్లో ఇండియాపై అభిమానం చాటుకుంది. ఇక దిల్ బర్ పాటలో నోరా స్టెప్పులకు ఫిదా కాని సినీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులను అంతలా మాయ చేసింది ఈ సోగకళ్ల బ్యూటీ! -
NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్!
ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికి తెలుసు. దేశంలో ఉన్న ప్రజలందరూ దాదాపు ఆధార్ కార్డు, ఆదాయ పన్ను చెల్లించేవారు పాన్ కార్డు కలిగి ఉంటారు. అయితే కేవలం భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రవాస భారతీయులు (NRI) కూడా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) అనేది నెంబర్స్, ఇంగ్లీష్ అక్షరాలతో కలిసి ఉంటుంది. మనదేశంలోని ఆదాయ పన్ను శాఖ ఈ పాన్ నెంబర్‌తో కూడిన కార్డును జారీ చేస్తుంది. ఇండియాలో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉండాలి. పాన్ కార్డు కోసం ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ తెలుసుకోవచ్చు.. ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి భారతదేశంలో ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వారు. భారతదేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనునుకునే వారు. మ్యుచ్చువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి చూపే వారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం UTIITSL లేదా Proteanలో అప్లై ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ టైప్ కింద ఫామ్ 49ఏ ఫర్ ఎన్ఆర్ఐ సెలెక్ట్ చేసుకోవాలి. విదేశీ పౌరసత్వం ఉన్నవారైతే ఫామ్ 49ఏఏ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అన్ని వివరాలను నింపిన తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసిన అవసరమైన డాక్యుమెంట్స్, డిజిటల్ సిగ్నేచర్ వంటివి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. తరువాత ఓపెన్ అయ్యే పేమెంట్ పేజీలో అమౌంట్ పే చేసిన తరువాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవడం ఆన్లైన్ విధానం గురించి అవగాహన లేనివారు, ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలనుకునేవారు సమీపంలో ఉన్న ఐటి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిఐఎన్ ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శించాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, ఫీజు చెల్లించి అక్కడే సబ్మిట్ చేయాలి. డీడీ ద్వారా కూడా చెల్లించాల్సిన ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తరువాత వారు ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌ని పాన్ కార్డ్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. -
శ్రీగంధం, టేకు చెట్ల కొమ్మలు కత్తిరిస్తున్నారా? అంతే సంగతులు.. నష్టాలు తప్పవు!
Sri Gandham Cultivation- Disadvantages Of Pruning: శ్రీగంధం (చందనం), టేకు వంటి అధిక విలువైన కలప తోటల సాగుకు దక్షిణాది రాష్ట్రాలు పెట్టింది పేరు. ప్రైవేటు భూముల్లో సాగుకు ప్రభుత్వం అనుమతించడంతో ముఖ్యంగా శ్రీగంధం తోటల సాగు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గత 20 ఏళ్లలో బాగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ మధ్యనే సాగు విస్తరిస్తోంది. శ్రీగంధం,టేకు సాగు రైతులకు అధికాదాయాన్నిచ్చే కలప తోటలు. శ్రీగంధం చెట్లను 15 ఏళ్లు శ్రద్ధగా పెంచితే ఒక్కో చెట్టుపై రూ. లక్ష వరకూ కూడా ఆదాయం రావటానికి అవకాశం ఉందని బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐ.డబ్లు్య.ఎస్.టి.) శాస్త్రవేత్త చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ సహా 5 దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీగంధం, టేకు తోటల సాగుపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఐ.డబ్లు్య.ఎస్.టి. శాస్త్రవేత్త డా. ఆర్.సుందరరాజ్ శ్రీగంధం, టేకు తోటల సాగులో సాధారణంగా రైతులు చేసే తప్పుల గురించి ‘సాక్షి సాగుబడి’ తో పంచుకున్నారు. ప్రూనింగ్‌తో నష్టాలు మామిడి, దానిమ్మ, మునగ, మల్బరీ వంటి తోటల్లో పంటకోతలు పూర్తయ్యాక కొమ్మ కత్తిరింపులు చేస్తుంటారు. ఈ తోటల్లో ప్రూనింగ్ వల్ల అనేక రకాలుగా వెసులుబాటు కలుగుతుంది. దిగుబడి పెరగడంతో΄ాటు చెట్ల కొమ్మలు మరీ ఎత్తుగా పెరగనీయకుండా ఉండటం వల్ల పంటకోత సులువు అవుతుంది. ఈ అలవాటుకొద్దీ శ్రీగంధం, టేకు చెట్లకు కూడా ప్రూనింగ్ చేస్తున్నారు. ఇది పెద్ద తప్పు. మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతోందని డా. సుందర్రాజ్ అంటున్నారు. శ్రీగంధం, టేకు చెట్ల కాండం లోపలి కలపను, మధ్యలోని చేవను చీడపీడల నుంచి రక్షించేంది కాండం పైన ఉండే బెరడే. కొమ్మలు కత్తిరించినప్పుడు బెరడు దెబ్బతిని, ఎండిపోతుంది. కొమ్మను నరికిన చోట కాండం లోపలి పొరలు బయటపడతాయి. ఆ విధంగా కలపను కుళ్లింపజేసే శిలీంధ్రాలు, నష్టం చేసే కాండం తొలిచే పురుగులు ప్రూనింగ్ జరిగిన చోటు నుంచి చెట్టు లోపలికి ప్రవేశిస్తాయి. తద్వారా చెట్టు బలహీనపడుతుంది. ఆకుల పెరుగుదల మందగిస్తుంది. కాయలు రాలిపోతాయి. ప్రూనింగ్ గాయాలు కొమ్మల సహజ పెరుగుదలను దెబ్బతీస్తాయి. చెట్టు సమతుల్యత దెబ్బతిని గాలుల వల్ల నష్టం కలుగుతుంది. చాలా సందర్భాల్లో చెట్లు ప్రూనింగ్ జరిగిన కొద్దికాలంలోనే చని΄ోతాయి కూడా అంటున్నారు డా. సుందర్రాజ్. కలప మన్నికకు గొడ్డలిపెట్టు టేకు కలప పదికాలాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. టేకు కలప జీవక్షీణతకు గురిచేసే సూక్ష్మజీవరాశిని అరికట్టే రక్షక పదార్థాలు (మెటబాలిటీస్ లేదా ఎక్స్ట్రాక్టివ్స్) చెట్టు కాండం లోపలి పొరల్లో ఉండబట్టే టేకు కలపకు ఈ గట్టితనం వచ్చింది. ప్రూనింగ్ చేసిన టేకు చెట్లలో ఈ పదార్థాలు లోపించటం వల్ల ఆ కలప మన్నిక కాలం తగ్గిపోతుంది. ఐ.డబ్ల్యూ.ఎస్.టి. నిపుణుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ బయోడిటీరియోరేషన్ అండ్ బయోడిగ్రేడేషన్ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో ఈ విషయాలు పొందుపరిచారు. శ్రీగంధం చెట్లకు ప్రూనింగ్ చేస్తే ఎత్తు పెరగొచ్చు గానీ కాండం చుట్టుకొలత పెరగదు. ప్రూనింగ్ గాయాల దగ్గర సుడులు ఏర్పడటం వల్ల చెక్క అందం పాడవుతుంది. ప్రూనింగ్ చేయటం వల్ల శ్రీగంధం, టేకు చెట్లకు నష్టం జరగటమే కాదు దాని చుట్టూ ఉండే పర్యావరణ వ్యవస్థకు తెలియకుండానే పెద్ద నష్టం జరుగుతుందట. ప్రూనింగ్ చేసిన చెట్లకు గాయాలపై బోర్డాక్స్ పేస్ట్ వంటి శిలీంధ్రనాశనులను పూస్తుంటారు. అయితే, ఇది పూర్తి రక్షణ ఇస్తుందని చెప్పలేమని డా. సుందరరాజ్ తెలిపారు. రసాయనాల ప్రతికూల ప్రభావాలు శ్రీగంధం చెట్లపై చాలా ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలు విని శ్రీగంధం, టేకు చెట్లకు ప్రూనింగ్ చేయొద్దని, చెట్లను సహజంగా పెరగనిస్తూ ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరించాలని డా. సుందరరాజ్ సూచిస్తున్నారు. 15 ఏళ్ల చెట్టుకు 10 కిలోల చేవ ఒక రైతు ఇంటి దగ్గర పెరుగుతున్న ఈ మూడు శ్రీగంధం చెట్ల వయస్సు 15 సంవత్సరాలు. ఈ మూడిటికీ కొమ్మలు కత్తిరించారు. తక్కువ ప్రూనింగ్ వల్ల రెండు చెట్లు కోలుకున్నాయి. కానీ మూడో చెట్టుకు అతిగా ప్రూనింగ్ చేయటం వల్ల కోలుకోలేకపోయింది. మేం ఈ చెట్లకు చేవ (హార్ట్‌వుడ్) ఎంత ఉందో పరీక్షించాం. మొదటి రెండు చెట్ల కాండంలో మాత్రమే హార్ట్‌వుడ్ కనిపించింది. బలహీనంగా ఉన్న మూడో చెట్టులో అసల్లేదు. చెట్టు మీ కోసమో, నా కోసమో చేవదేలదు. తన బలం కొద్దీ చేవదేలుతుంది. కాబట్టి ఏ చెట్టు నాణ్యతైనా, చేవ పరిమాణమైనా అది ఎంత ఆరోగ్యకరంగా పెరుగుతున్నదన్నదానిపై ఆధారపడి ఉంటుంది. నా అనుభవం ప్రకారం, 15 సంవత్సరాలు ఆరోగ్యంగా పెరిగిన చందనపు చెట్టుకు కనీసం 10 కిలోల చేవ ఉంటుంది. దాన్ని బట్టి రైతుకు ఆదాయం వస్తుంది. – డా. ఆర్.సుందరరాజ్ (97404 33959), శాస్త్రవేత్త, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరు – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ చదవండి: ఎటాక్.. స్ట్రోక్ వేర్వేరు... -
Summer Care: టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే!
వేసవి వచ్చేసింది. చలికాలంలో లాగే వేసవిలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే, వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల చర్మకాంతి పెరిగి యౌవనంగా కనిపిస్తారు. ఆరెంజ్ జ్యూస్ చర్మకాంతిని పెంచే విటిమిన్ సి సమృద్ధిగా ఉండేవాటిలో నారింజ లేదా కమలా పండ్లు ముందుంటాయి. నారింజ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. టొమాటో జ్యూస్ టొమాటోలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకత శక్తిని కలిగిస్తాయి. రోజూ టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతిమంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుత ఔషధం బీట్రూట్ జ్యూస్. ప్రతిరోజూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండేది దానిమ్మలోనే. అందువల్ల రోజూ దానిమ్మ జ్యూస్ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా దానిమ్మ జ్యూస్ తీసుకోవచ్చు. అయితే అందులో రుచికి పంచదార కలుపుకోకూడదు. గ్రీన్ టీ కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. చదవండి: ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..? -
వినీత్, తన సహచరుడిని ప్రేమించాడు! ఇక ట్రాన్స్‌జెండర్ మాయ.. వీళ్ల గురించి అసలు ఎందుకిలా?
వినీత్ (పేరు మార్చడమైనది) సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. అతను తన సహచరుడు ప్రేమించుకున్నారు. వారిద్దరూ కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా చివరకు వారి నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కానీ, ‘మగవాళ్లు ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారట..’ అనే వ్యంగ్యపు మాటలు వారిని బాధిస్తున్నాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వార్తలు, వ్యతిరేక కామెంట్లు, లైంగికపరమైన చర్చలు జరుపుతుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ‘మేం, మాలాంటి వారంతా గౌరవంగా బతకాలనుకుంటున్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మా ఎదుగుదలకు సంబంధించి కాకుండా, లైంగికపరంగా మమ్మల్ని దిగజార్చే మాటలే ఎందుకు పదే పదే వస్తున్నాయి. ఈ బాధించే మాటలు, వీడియోల నుంచి మాకు విముక్తి ఎప్పుడు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ∙∙ మాయ ట్రాన్స్‌జెండర్. ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. సమాజంలో తమ వర్గాన్ని తక్కువగా చూస్తారన్న భయం ఆమెలో లేకపోలేదు. దానికి తోడు యూ ట్యూబ్ చూస్తున్నప్పుడల్లా ఆమెను వేల ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. వీడియోలు వైరల్ అవడం కోసం తమ వర్గానికి చెందిన వారిని లైంగికపరమైన విషయాలమీదనే ఫోకస్ చేస్తున్నారనేది ఆమె బాధ. దీనివల్ల సహచర ఉద్యోగుల్లోనూ, చుట్టుపక్కల కుటంబాల్లోనూ తనను కూడా అదే విధంగా చూస్తారని, నాలాగ బాధపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారంటోంది మాయ. ∙∙ ఇది నేటి సమాజంలో అణచివేతకు గురికాబడుతున్న మరో వర్గంగా స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లను ప్రధానంగా చూస్తుంటాం. ఎల్జిబిటిక్యూఐఎ అనే పేరుతో వీరు హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో తమ సమస్యలను విన్నవించుకుంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఈ జుగుప్సాకరమైన కంటెంట్ కలిగించే ఆందోళనను ఓ సున్నితమైన అంశంగా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. తమ వర్గం వారిలోనూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతోద్యోగాలు చేసుకుంటున్నవారు ఉన్నారని, తమ విజయగాధలను తెలియజేయమని ఈ సందర్భంగా వారు వేడుకున్నారు. వైరల్ ప్రధానమా? సోషల్ మీడియా ద్వారా డబ్బు రావాలంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక సాధనం అని మనకు తెలిసిందే. ఎంత వైరల్ అయ్యే అంశాలు ఉంటే ఆ వీడియో ద్వారా అంత డబ్బు, దానితో పాటు పేరు వస్తుందని చాలా మందికి తెలుసు. అందుకే, ఆసక్తిని రేకెత్తించే అంశం ఏమిటో దానినే వీడియో అప్లోడ్ చేసేవారు ఎంచుకుంటారు. దీనితో పాటు వెబ్‌సైట్స్ ఇతర సామాజిక మాధ్యమాలు కూడా వార్త వైరల్ అయ్యేందుకు ఈ అంశాలను ఎంచుకుంటాయి. సైబర్ వేధింపులు సామాజిక మాధ్యమాల్లో మహిళలే అధిక వేధింపులకు లోనవుతుంటారు. అయితే, ఇటీవల పెరుగుతున్న పరిణామాల్లో ఎల్‌జిబిటిక్యూఐ+ కూడా చేరుతోంది. ఆఫ్‌లైన్‌లో జాతి, మత, వర్గంలో ఉండే విభేధాలు ఆన్‌లైన్‌లోనూ చూస్తుంటాం. డిజిటల్ యుగంలో తమ ఉనికిని చాటుకునే రోజుల్లో ఉన్నాం కాబట్టి ఎంచుకునే అంశాలు మరింత సున్నితంగా, తోటి వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సహాయం కోసం వీరిని సంప్రదించవచ్చు రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా, సమాజంలో తమ గౌరవం దెబ్బతింటుందని, ఇతరులు తమను వేధింపులకు లోను చేస్తున్నారని అవి సమస్యగా తమ జీవనానికి అడ్డంకిగా ఉందనుకుంటే... 1. చట్టపరమైన రక్షణ కోసం 100కి కాల్ చేసి, పోలీసుల సాయం పొందవచ్చు. 2. జాతీయ/రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) అనేది జాతీయస్థాయి ప్రభుత్వ సంస్థ. మానవ హక్కుల ఉల్లంఘనలను ఈ సంస్థ ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. ఎల్జిబిటిక్యూ+ వ్యక్తులైన వారు తమకు తగిన సహాయం కావాలంటే వీరిని సంప్రదించవచ్చు. 3. మహిళల కోసం జాతీయ /రాష్ట్ర కమిషన్: నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) అనేది లైంగిక నేరాలు, గృహహింస, వేధింపులు .. మొదలైన వాటి నుంచి మహిళల రక్షణలో పనిచేసే జాతీయస్థాయి ప్రభుత్వ సంస్థ. ఈ ఎన్సీడబ్ల్యూ కూడా తగిన సహాయం చేస్తుంది. 4. ఆన్లైన్ క్రైమ్ రిపోర్టింగ్ (ఆన్లైన్లో చేసిన వేధింపుల కింద) https://www.cybercrime.gov.in లోనూ రిపోర్ట్ చేయవచ్చు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎవరికి రిపోర్ట్ చేయాలి? సామాజిక మాధ్యమాల ద్వారా తమ గౌరవానికి భంగం కలిగించే అంశాలు ఉంటే రిపోర్ట్ చేయాల్సింది.. ఫేస్బుక్ .. https://www.facebook.com/help/ 116326365118751 ట్విటర్ ... https://help.twitter.com/en/safety-and-security/report-abusive-behavior ఇన్స్టాగ్రామ్–యూట్యూబ్ https://help.instagram.com/547601325292351 https://support.google.com/youtube/answer/2801939#protected_group లింక్డ్ఇన్: https://www.linkedin.com/help/linkedin/answer/a1336329/report-harassment-or-a-safety-concern?lang=en పైన ఇచ్చిన సోషల్‌మీడియా లింక్స్ ద్వారా ఆయా విభాగాలకు రిపోర్ట్ చేయవచ్చు. దానిపైన ఆ మాధ్యమాలు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్. చదవండి: Beaumont Children Missing Case: ఆస్ట్రేలియా చరిత్రలో అపఖ్యాతి.. ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు? -
ఉల్లిపాయ రసంతో.. మచ్చలకు చెక్! ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది!
ఉల్లిపాయలు ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా! ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది. ►ఉల్లిపాయలోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మ సమస్యలకు చెక్ పెడతాయి. మచ్చలను తొలగిస్తాయి. ►టేబుల్ స్పూన్ ఉల్లి రసంలో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ఫేస్‌ప్యాక్ లా వేయాలి. ►ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. మీ ముఖంలో నిగారింపు మీకే తెలుస్తుంది. చర్మం మెరిసిపోతుంది! ►టీ స్పూన్ పసుపులో సరిపడా ఉల్లిపాయ రసాన్ని కలిపి పేస్ట్‌లా చేయాలి. ►దీనిని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ఇన్‌స్టంట్‌గా చర్మం మెరిసిపోతుంది. ►శనగపిండి, ఉల్లిరసం, పాలు .. మూడూ సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా ముఖానికి రాసుకుని.. కాసేపటి తర్వాత కడిగితే మొహం చంద్రబింబమే. ►అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని ఉల్లి తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాల వల్ల కలిగే హానిని అడ్డుకుంటాయి. చివరగా ఒక మాట.., ఉల్లిపాయను తరిగేటప్పుడు కళ్లు మంటపుట్టి, నీళ్లు కారతాయి. అయితే అది కూడా మంచిదే. అలా నీరు కారడం వల్ల కళ్లలోని మలినాలు తొలగిపోతాయి, అంతేకాదు, కంటి సమస్యలను నివారించడంలో ఉల్లికి సాటి మరేదీ లేదు. నేత్ర సమస్యలకు చెక్ పెట్టాలంటే మీ డైట్లో ఉల్లి ఉండేలా చూసుకోవాల్సిందే. చదవండి: పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసుకుని తాగితే పేగులకు బలం.. ఇంకా! Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్.. పిగ్మెంటేషన్‌కు చెక్! ముఖం మెరిసేలా.. -
పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసుకుని తాగారంటే!
మజ్జిగను బటర్ మిల్క్ అంటాం కదా.. వేసవి వచ్చేసరికి ఇది కాస్తా బెటర్ మిల్క్‌గా మారుతుంది. అదెలాగంటే... మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ ఆయుర్వేద నిపుణులు, పెద్దలు చెబుతారు. ఆరోగ్య ప్రయోజనాలివే! ►మజ్జిగ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక దాహం తీరుతుంది. అంతేకాదు, వడ దెబ్బ తగలకుండా ఉంటుంది. ►జీలకర్ర, ధనియాలు, అవిసెగింజలు, సైంధవ లవణం మెత్తగా పొడి చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగితే మంచిది. ►ఇలా తయారు చేసుకున్న మజ్జిగని లంచ్‌తో లేదా మధ్యాహ్నం 3–4 గంటల సమయంలో తాగడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసి.. ►ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ►ఎండలో తప్పనిసరి అయి బయటకు వెళ్లేటప్పుడు... ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ►ఇందులో పంచదార, ఉప్పు బదులుగా పైన చెప్పుకున్న మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, ►సాధ్యమైనంత వరకు మజ్జిగని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఇందులో ఉండే మేలు చేసే బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అదేవిధంగా ప్యాక్ చేసిన మజ్జిగ బదులు అప్పటికప్పుడు తయారు చేసుకున్న తాజా మజ్జిగ తాగడం ప్రయోజనకరం. బయటకు వెళ్లినప్పుడు శీతల పానీయాల బదులు కనీసం ప్యాక్ చేసిన మజ్జిగ తాగినా ఫరవాలేదు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కొరకు మాత్రమే! చదవండి: Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్.. పిగ్మెంటేషన్‌కు చెక్! ముఖం మెరిసేలా.. -
కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్.. పిగ్మెంటేషన్‌కు చెక్!
ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతోపాటు నలుపు మచ్చలు, ముఖం మీద పేరుకున్న మట్టి తొలగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించే ఈ ఐస్ క్యూబ్స్ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం. తులసి, అలొవెరా జెల్ ఒక బౌల్లో నీళ్లు తీసుకుని అందులో గుప్పెడు తులసి ఆకుల్ని నలిపి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి. ఆ నీటిని ఐస్‌క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని రుద్దితే ముఖ చర్మం తాజాగా మెరవడంతోపాటు వేడివల్ల వచ్చిన మచ్చలు తొలగి పోతాయి. స్పిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఐస్‌క్యూబ్స్ ట్రేలో ఒక కప్పు రోజ్‌వాటర్‌తో పాటు కప్పు మంచి నీళ్లు కలపాలి. దీనిని ఫ్రీజర్‌లో ఉంచాలి. ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గిపోతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరి చేరవు. దీంతోపాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. దోసకాయ ముక్కలతో ఒక బౌల్లో మెత్తగా దంచిన దోసకాయ ముక్కలను వేయాలి. దీనికి ఐదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో ఐస్‌క్యూబ్స్ వేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. తీసిన తర్వాత వీటితో ముఖంపై రబ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి. కమిలినట్లుగా ఉన్న ముఖం తాజాగా మారుతుంది. కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో చర్మ సౌందర్యానికి కుంకుమ పువ్వుకి సాటి లేదు. కుంకుమ పువ్వును కొంచెం రోజ్ వాటర్‌లో కలపాలి. ఈ రెండిటినీ బాగా కలిపాక.. ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి క్యూబ్స్ తయారు చేసుకోవాలి. వాటితో ముఖం మీద సున్నితంగా మర్దన చేస్తే పిగ్మెంటేషన్ , నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్కిన్‌టోన్ మారిపోతుంది. చదవండి: Beauty: కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే.. -
కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే..
చర్మ యవ్వనంగా కనిపించాలని.. మేని మెరిసిపోవాలని కోరుకునే వారు ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి. కొబ్బరి పాలతో.. ►కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ►కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ►ఇలా యాంటీ ఏజింగ్ ప్యాక్స్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. మేనికాంతికి ఉసిరి.. నిమ్మ... నారింజ తేమను తరచూ మన ముఖానికి రాసుకుంటూ ఉంటే, ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి. తేనెతో పెదవులకు మసాజ్ చేస్తే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపించడంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని అది దొరికినంతకాలం విరివిగా తీసుకోవాలి. నిమ్మకాయ, నారింజలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరి దొరకనప్పుడు వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా అందంగా మారవచ్చు. అలాగే, వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం, తరచు ముఖాన్ని కడుక్కోవడం, ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు లేకుండా మేని చర్మం మెరుపులీనుతూ ఉంటుంది. చదవండి: Beauty: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్! ధర ఎంతంటే! -
సీఎన్జీ కార్ వినియోగిస్తున్నారా..? డబ్బు ఇలా ఆదా చేయండి
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సిఎన్జి, ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నారు. సీఎన్జీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మైలేజ్ పొందవచ్చు. సీఎన్జీ కార్ వినియోగదారుడు ఖర్చుని తగ్గించి డబ్బుని ఆదా చేయడానికి ఈ కింది చిట్కాలను పాటించాలి. నీడలో పార్క్ చేయడం: ఎండలు రోజురోజుకి అధికమవుతున్నాయి, ఇలాంటి సమయంలో మీ కారుని తప్పకుండా నీడలో పార్క్ చేయాలి. సీఎన్జీ కారుని ఎండలో పార్క్ చేసినప్పుడు వేడి తీవ్రతకు కొంత సీఎన్జీ గ్యాస్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. సీఎన్జీ ఆదా చేయడానికి తప్పకుండా ఈ నియమం పాటించాలి. ఓవర్‌ఫిల్ చేయడం మానుకోవాలి: కేవలం పెట్రోల్ కార్లలో మాత్రమే కాకుండా సిఎన్జి కార్లలో కూడా ఓవర్‌ఫిల్ చేయడం మంచిది కాదు. సీఎన్జీ కారుని ఉపయోగించేటప్పుడు ట్యాంక్‌లో అదనపు సీఎన్జీ విడుదలవుతుంది. ఆ సమయంలో ఓవర్‌ఫిల్ కారణంగా కొంత నష్టం జరుగుతుంది. ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవాలి: కారులో ఎయిర్ ఫిల్టర్ ప్రాధాన్యత ఎలా ఉంటుందో వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్స్ తనిఖీ చేస్తూ క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. ఇది ఇంజిన్ జీవిత కాలాన్ని పెంచుతుంది. (ఇదీ చదవండి: Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?) టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండండి: కారులో టైర్ ప్రెజర్ ఉండవల్సిన దాని కంటే తక్కువ వుంటే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. కనీసం వారంలో ఒక సారైనా తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. సరైన టైర్ ప్రెజర్ ఇంధనం ఆదా చేయడమే కాదు, టైర్ జీవిత కాలాన్ని కూడా పెంచుతుంది. సీఎన్జీ లీకేజీ లేకుండా చూసుకోవాలి: కారులో సీఎన్జీ లీకేజి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సీఎన్జీ కారు ధరలు భారీగా ఉండటం వల్ల వినియోగదారుడు లీకేజీల గురించి తప్పకుండా తనిఖీ చేయాలి. అలాంటి సీఎన్జీ లీకేజి ఉన్నప్పుడు సమీపంలో ఉన్న మెకానిక్‌లకు వద్ద కాకుండా.. ప్రొఫెషనల్స్ ద్వారా టెస్ట్ చేసుకోవాలి. -
పచ్చిపాలు, శనగపిండి.. ఇంకా ఆముదం నూనె.. ఇదే నా బ్యూటీ సీక్రెట్!
Sobhita dhulipala- Beauty Tips: మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సొంతం చేసుకున్న తెలుగందం శోభితా ధూళిపాళ. 2013 నాటి పోటీల్లో అందాల రాణి కిరీటం కైవసం చేసుకున్న ఆమె.. సినిమాల్లో నటిగా తనను నిరూపించుకుంటున్నారు. అంతేకాదు యూనిక్ స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసులు దోచుకుంటున్నారు. నా బ్యూటీ సీక్రెట్ అదే ఇక అందంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్న శోభితా.. తన చర్మ సౌందర్యానికి గల కారణాలు వెల్లడించారు. అమ్మ చెప్పిన చిట్కాలే తన ముఖం కాంతులీనడానికి కారణం అంటున్నారు. ‘అప్పుడప్పుడు శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. రెగ్యులర్‌గా ఫ్రూట్ పల్ప్‌తో మసాజ్ చేసుకుంటాను. అలాగే పచ్చిపాలను క్లెన్సింగ్కి ఉపయోగిస్తాను. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పెదవులకు రాసుకుంటాను. ఆముదం నూనెనేమో కనుబొమలకు బ్రష్ చేస్తాను.. ఇవండీ నా బ్యూటీ సీక్రెట్స్!’ అంటూ అభిమానులతో షేర్ చేసుకున్నారు. హాలీవుడ్ దాకా.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు కొల్లగొడుతున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ. తెలుగులో ‘గూఢచారి’, మలయాళంలో ‘కురూప్’, హిందీ ‘ఘోస్ట్ స్టోరీస్’తో నటిగా నిరూపించుకున్న ఆమె.. ‘మంకీమేన్’తో హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. ప్రస్తుతం ది నైట్ మేనేజర్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. చదవండి: Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్ ప్రత్యేకత అదే!