
బ్యూటీ టిప్స్
♦రెండు టేబుల్ స్పూన్ల బియ్యంలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే రోజ్‌వాటర్‌తో పాటు బియ్యాన్ని మెత్తగా రుబ్బాలి.
♦ ఇందులో కుంకుమ పువ్వు రేకులు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, కాసింత కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ వేసి మిశ్రమం క్రీమ్‌లా మారేంత వరకు కలుపుకుని గాజు సీసాలో వేసి నిల్వచేసుకోవాలి.
♦ రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. క్రమం తప్పకుండా వారం రోజుల పాటు ఈ క్రీమ్ రాసుకోవడం వల్ల నల్లమచ్చలు, ట్యాన్ తగ్గి, ముఖ చర్మం కాంతిమంతంగా మారుతుంది.