బంగారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. యుర్వేద మందుల్లో బంగారంను నేరుగా ఉపయోగించకుండా.. బంగారంను భస్మంగా మార్చి స్వర్ణ భస్మంలా వాడుతుంటారు. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
స్వర్ణ భస్మంలో 98శాంతం బంగారు రేణువులను కలిగి ఉన్నందున ఇది ఆయుర్వేదంలో అత్యంత ఖరీదైన ఔషధాలలో ఒకటిగా పేర్కొంటారు. నెయ్యి, తేనె లేదా పాలతో కలిపి స్వర్ణభస్మం పౌడర్‌ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
► స్వర్ణ భస్మం రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంతో పాటు గుండె కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
► కడుపులోని ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడానికి స్వర్ణభస్మం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇది అజీర్ణాన్ని పోగొడుతుంది.
► స్వర్ణభస్మంలో యాంటీ పైరేటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జ్వరాలు, ఇతర ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. శతాబ్దాలుగా జ్వరాలకు ఆయుర్వేద చికిత్సలలో దీన్ని ఉపయోగిస్తున్నారు.
► రక్తాన్ని శుద్దిచేసి బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేసే సామర్థ్యం స్వర్ణభస్మంలో ఉంటుంది.
► లైంగిక ఆరోగ్యాన్ని స్వర్ణభస్మం మెరుగుపరుస్తుంది.
► యాంటీ-స్ట్రెస్, యాంటీ-డిప్రెషన్ వంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమిని తగ్గిస్తుంది.
► స్వర్ణ భాస్మాలో యాంటీ టాక్సిన్, యాంటీమైక్రోబయల్ యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ప్రారంభ దశలో టిబి కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోగలవు.
► రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
► కణితులు లేదా క్యాన్సర్ల పెరుగుదలను ఎదుర్కోవడానికి కూడా పనిచేసే రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను స్వర్ణ భస్మం కలిగి ఉంది.
- డాక్టర్ నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment