
వంటలు మరింత రుచిగా రావడం కోసం పోపు పెట్టడం తెలుగువారికి అలవాటు. ఈ పోపులో ఎక్కువగా వినియోగించే వాటిల్లో ఆవాలు ఒకటి. ఆవాలు ఆహార పదార్థాలకు రుచిని ఇవ్వడమే శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం చాలామందికి వీటిని తినడమే తప్ప వీటివల్ల కలిగే లాభాలు ఏంటో తెలియదు. ఆవాలను తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పోపులో వేసే దినుసులలో ఎవరైనా సరే ముందుగా చెప్పేది ఆవాలనే. ఈ ఆవాల వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంది. వాటిలో గాయాలు తొందరగా మానడం ముందుగా చెప్పుకోవచ్చు. ఈ గాయాలు తగిలిన చోట ప్రతిరోజు ఆవాల పొడిని అప్లై చేయడం వల్ల తొందర్లోనే మంచి ఫలితాలు పొందుతారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో దంతాల సమస్యలు వస్తున్నాయి. తరచు దంతాల నొప్పితో బాధపడేవారు ఆవాలను నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా దంతాల నొప్పి నుంచి సులభంగా లభిస్తుంది.
ఆవాలు శ్వాస కోసం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఆవాల పొడిలో, ఒక టీ స్పూన్ ఆవాలను కలుపుకొని తీసుకోవడం వల్ల సులభంగా శ్వాస కోసం వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవాలు కీళ్ల నొప్పుల నుంచి కూడా ప్రభావంతంగా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
కీళ్ల నొప్పుల కారణంగా నడవలేకపోతున్నవారు ఒక టీ స్పూన్ ఆవాలు నూనె ఓ చిన్న గిన్నెలో తీసుకొని అందులోనే ఒక టీ స్పూన్ ఆవాల పొడి, కర్పూరం వేసి పేస్టులా తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆవపిండితో తయారు చేసిన ఆహారాన్ని రోజూ తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment