వంటింటి చిట్కాలు:
►ఇడ్లీ, దోశ పిండి త్వరగా పాడు కాకుండా ఉండాలంటే... ఇడ్లీ, దోశ పిండికోసం నానబెట్టే పప్పు, బియ్యం, రవ్వలను కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పువేసి కడగాలి. ఇలా కడిగి రుబ్బిన పిండి నాలుగైదు రోజుల పాటు పులవకుండా ఉంటుంది.
► కోడిగుడ్లు ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గుడ్లను చన్నీళ్లలో వేసినా పెంకు సులభంగా వస్తుంది.
► కిచెన్ షెల్ఫులు,తలుపులు రోజూ శుభ్రం చేస్తున్నా కూడా జిడ్డు పడుతుంటాయి. నెలకొకసారి లీటరు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా, రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకుని జిడ్డుగా ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేసి తడి పీల్చుకునే పొడి వస్త్రంతో తుడవాలి.
► మామూలుగా దోసెలు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే, అందుబాటులో వంకాయలు ఉంటే, ముందుగా పెనంపై వంకాయ ముక్కతో రుద్దండి.
► బొంబాయి రవ్వ హల్వా మరింత రుచిగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండిని కలుపుకుకోవాలి.
► కూరల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం లేదా రెండు టీస్పూన్ల నెయ్యి కలిపితే కారం తగ్గుతుంది.
► కలిపిన చపాతీ పిండి మిగిలిపోతే ఆ ముద్దపైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. అప్పుడు సాఫ్ట్‌గా ఉంటాయి.
► పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే.. పెరుగులో కొబ్బరి ముక్కను వేసి చూడండి.
Comments
Please login to add a commentAdd a comment