
Sobhita dhulipala- Beauty Tips: మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సొంతం చేసుకున్న తెలుగందం శోభితా ధూళిపాళ. 2013 నాటి పోటీల్లో అందాల రాణి కిరీటం కైవసం చేసుకున్న ఆమె.. సినిమాల్లో నటిగా తనను నిరూపించుకుంటున్నారు. అంతేకాదు యూనిక్ స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసులు దోచుకుంటున్నారు.
నా బ్యూటీ సీక్రెట్ అదే
ఇక అందంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్న శోభితా.. తన చర్మ సౌందర్యానికి గల కారణాలు వెల్లడించారు. అమ్మ చెప్పిన చిట్కాలే తన ముఖం కాంతులీనడానికి కారణం అంటున్నారు. ‘అప్పుడప్పుడు శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. రెగ్యులర్‌గా ఫ్రూట్ పల్ప్‌తో మసాజ్ చేసుకుంటాను.
అలాగే పచ్చిపాలను క్లెన్సింగ్‌కి ఉపయోగిస్తాను. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పెదవులకు రాసుకుంటాను. ఆముదం నూనెనేమో కనుబొమలకు బ్రష్ చేస్తాను.. ఇవండీ నా బ్యూటీ సీక్రెట్స్!’ అంటూ అభిమానులతో షేర్ చేసుకున్నారు.
హాలీవుడ్ దాకా..
తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు కొల్లగొడుతున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ. తెలుగులో ‘గూఢచారి’, మలయాళంలో ‘కురూప్’, హిందీ ‘ఘోస్ట్ స్టోరీస్’తో నటిగా నిరూపించుకున్న ఆమె.. ‘మంకీమేన్’తో హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. ప్రస్తుతం ది నైట్ మేనేజర్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు.
చదవండి: Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ
శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్ ప్రత్యేకత అదే!
Comments
Please login to add a commentAdd a comment