వంటింటి చిట్కాలు
- కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా అన్నం వేసి నానిన బియ్యాన్ని గ్రైండ్ చేస్తే అప్పం మరింత మృదువుగా వస్తుంది.
- ఎంతో తియ్యగా ఉండే అరటిపండ్లపై ఫ్రూట్‌ఫ్లైస్ వాలుతూ చిరాకు పెడుతుంటాయి. అయితే మార్కెట్ నుంచి అరటిపండ్లు తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకుంటే ఫ్రూట్‌ఫ్లై ఒకటీ వాలదు.
- అరకప్పు వంటసోడాలో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని అవెన్‌లో లోపలి భాగంలో రాయాలి. హీటింగ్ కాయిల్స్, ఫ్యాన్ బ్లేడ్స్, లైట్స్ మీద రాయకూడదు. కింద, సైడు గోడలకు రాసి రాత్రంతా ఉంచేయాలి. ఉదయాన్నే కాటన్ వస్త్రంతో వంటసోడాని తుడిచేయాలి. సోడా పూర్తిగా పోయిన తరువాత నీటిలో కలిపిన వెనిగర్‌తో మరోసారి తుడవాలి. ఇలా చేస్తే అవెన్‌లో పేరుకుపోయిన మురికి, అవెన్ గోడలకు పడ్డ మచ్చలూ పోయి కొత్త దానిలా మెరుస్తుంది.
- అంగుళం దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, నాలుగు కర్పూరం బిళ్లలను మెత్తగా దంచి పొడిచేయాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు, కొద్దిగా నూనె వేసి ద్రవంలా మర్చాలి. ఈ ద్రవాన్ని ఖాళీ అయిన దోమల రిపెలర్స్, ఆల్ అవుట్ లాంటి డబ్బాల్లో వేసి ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే రూమ్ అంతా సువాసన వస్తుంది. ఇది సహజసిద్ధమైన రూమ్ ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment