కిచెన్ టిప్స్..
♦ కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే... పలుచటి వస్త్రంలో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.
♦ ఉల్లిపాయలు తరగడానికి పది నిమిషాల ముందు నీటిలో వేసి ఉంచితే తరిగేటప్పుడు కళ్లు మండడం, నీరు కారడం ఉండదు.
♦ పండ్లు, కూరగాయలను న్యూస్‌పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
♦ యాపిల్ తరిగిన తర్వాత ప్లేట్‌లో పెట్టి సర్వ్‌చేసే లోపే ముక్కలు రంగుమారుతుంటాయి. తరిగిన వెంటనే నిమ్మరసం రాస్తే రంగుమారవు. చాకుకు నిమ్మరసం రాసి తరగడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది.
♦ పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టే ముందు తొడిమలు తీసేయాలి.
Comments
Please login to add a commentAdd a comment