fruits and vegetables
-
చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్‌ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు. -
గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!
కూరగాయల వ్యర్థాలను మురగ బెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. భూసార వర్థినిగా, పురుగుల మందుగా ఉపయోగపడుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్ పాన్వాంగ్ ఈ ఎంజైమ్‌ను తొలుత తయారు చేశారు. కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా.. మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా పలాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ (బ్రౌన్) పంచదార 1పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి.మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గేర్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు. (ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ)పలు ప్రయోజనాలుగార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ భూసార వర్థినిగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్‌ను నీటిలో తగినపాళ్లలో కలిపి వాడుకోవాలి. ఎరువుగా.. 1:1000 పాళ్లలో(అంటే.. 1 మిల్లీలీటరు ఎంజైమ్‌కు 100 మిల్లీలీటర్ల నీరు) కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు. పురుగులు/ తెగుళ్ల నాశినిగా.. 1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి. -
ఇది మీకు తెలుసా? (ఫోటోలు)
-
వంటింటి చిట్కాలు: కిచెన్‌లో నూనె ఒలికిపోతే ఇలా చేయండి
కిచెన్ టిప్స్ కూర అడుగంటినప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్స్‌ను వేసి కరిగేంత వరకు తిప్పాలి. ఇలా చేస్తే పాత్రకు అంటుకున్నది విడిపోయి కూర అడుగంటకుండా ఉంటుంది. కిచెన్‌లో నూనె వొలికిపోతే వెంటనే వొలికిన నూనె మీద గోధుమ పిండి చల్లాలి. ఐదు నిమిషాల తరువాత పేపర్‌తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డులేకుండా శుభ్రం పడుతుంది. వర్షాకాలంలో వాతావరణంలోని తేమను పీల్చుకుని... డోర్లు వేసినప్పుడు, తీసినప్పుడు కిర్రుమని శబ్దాలు చేస్తుంటాయి. డోర్లను పట్టి ఉంచే బోల్టుల వద్ద కొద్దిగా టాల్కం పౌడర్ చల్లడం వల్ల లేదా కొవ్వొత్తిని రుద్దడం వల్ల ఆ శబ్దాలు రాకుండా ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఇలా కడగడం వల్ల పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కలపాలి. ఈ నీటిలో పండ్లు, కూరగాయలను పదిహేను నిమిషాలు ఉంచి, తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. -
మీకు తెలుసా? ఈ పండ్లు, కూరగాయలు తింటే షుగర్ రాదు
డయాబెటిస్ ఇప్పుడు అందరి నోటా అదే మాట. ఇది రక్తంలో చక్కెరను అనూహ్యంగా పెంచే జీవక్రియ వ్యాధి. ఒక వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉన్నపుడు షుగర్ వ్యాధి అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది డయాబెటిస్ కు గురయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అందరూ పరీక్షలు చేయించుకుంటే ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. షుగర్ వచ్చిందని తేలితే.. ఎక్కడ లేని ఆంక్షలు మొదలవుతాయి. ఏది తినాలన్నా.. షుగర్ పెరుగుతుందంటారు. పండు ముట్టనివ్వరు, భోజనం సరిగా చేయనివ్వరు. ఈ పరిస్థితి అత్యంత ఇబ్బందికరం. షుగర్ వచ్చిన వాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? షుగర్ ఉన్న వాళ్లు పళ్లు తినకూడదంటారు కానీ, చిన్నప్పటినుంచి పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తింటే షుగర్ సమస్య రాదు. షుగర్ ఉన్నవారు కూడా ఒక పద్ధతిలో పిండిపదార్థాలను బాగా తగ్గించి పొద్దున, సాయంత్రం ఖాళీ కడుపున పండ్లు తీసుకోవడం మంచిది. అయితే బాగా తియ్యగా వుండే మామిడి, ద్రాక్ష లాంటివి కాకుండా దోర జామ, కివి, బొప్పాయి లాంటివి మంచిది. ఆకు కూరల్లో ఏముంది? తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు ఏం చేయాలి? షుగర్ వున్న వారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి టైమ్ ప్రకారం భోజనం చేయాలి, అన్నం తగ్గించి జొన్న, సజ్జ, గోధుమ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి టీ, కాఫీ తగ్గించాలి, వాటి కంటే లెమన్ టీ, అల్లం టీ మంచిది. నూనెలో బాగా వేయించిన వడియాలు, అప్పడాలు అసలే వద్దు అలాగే వడలు, పూరీలు, బజ్జీలు, మైదాతో చేసినవి తగ్గించాలి, లేదా ఆపేయాలి 6 important medical items to have at home: 1. First aid box: for home accidents 2. Thermometer: for body temperature 3. Routine meds: e.g. if diabetic 4. BP device: if you're hypertensive 5. Glucometer: if you're diabetic 6. Inhaler & portable nebulizer: if asthmatic Take note. — First Doctor (@FirstDoctor) July 10, 2023 షుగర్ పెరగకుండా ఏం చేయాలి? తిన్నది ఏదైనా అరిగించుకునేలా.. అంటే క్యాలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి నడకతో పాటు వ్యాయామం మంచిది, ఓపిక, శక్తిని బట్టి ఈత, సైక్లింగ్ చేస్తే బెటర్ రాత్రి పూట కనీసం 8 గంటల పాటు కంటి నిండా నిద్ర పోవడం తప్పనిసరి ఒత్తిడికి దూరంగా ఉండండి, కుటుంబంతో సరదాగా గడపండి షుగర్ ఉన్నవాళ్లు తినకూడనివి స్వీట్లు, ఐస్‌క్రీమ్స్, చక్కెర పదార్థాలు అరటి పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. డయాబెటస్ పేషెంట్స్ తినకపోవడమే మంచిది బొప్పాయి పండులో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్లు చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి పండ్లతో పోలిస్తే జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి అవి తీసుకోకపోవడమే మంచిది ప్రాసెడ్ ఫుడ్స్‌కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు వైద్యులు -
పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..
కిచెన్ టిప్స్.. ♦ కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే... పలుచటి వస్త్రంలో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ♦ ఉల్లిపాయలు తరగడానికి పది నిమిషాల ముందు నీటిలో వేసి ఉంచితే తరిగేటప్పుడు కళ్లు మండడం, నీరు కారడం ఉండదు. ♦ పండ్లు, కూరగాయలను న్యూస్పేపర్లో చుట్టి ఫ్రిజ్పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ♦ యాపిల్ తరిగిన తర్వాత ప్లేట్లో పెట్టి సర్వ్‌చేసే లోపే ముక్కలు రంగుమారుతుంటాయి. తరిగిన వెంటనే నిమ్మరసం రాస్తే రంగుమారవు. చాకుకు నిమ్మరసం రాసి తరగడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ♦ పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టే ముందు తొడిమలు తీసేయాలి. -
ఒక్కసారి ఈ పంట వేస్తే... 25 ఏళ్ళ పాటు ఆదాయం
-
పండ్ల కోసం ప్రయోగశాల ... రైతుల కోసం ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ
-
ఇకపై రేషన్ షాపుల్లో పండ్లు, కూరగాయలు
సాక్షి, ముంబై: నిన్నమొన్నటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు తదితర వస్తువులు లభించిన రేషన్ షాపుల్లో ఇక నుంచి కూరగాయలు, పండ్లు కూడా లభించనున్నాయి. రేషన్ షాపుకు వచ్చిన కార్డుదారులు పండ్లు, కూరగాయలు కూడా చౌక ధరలతో కొనుగోలు చేయవచ్చు. గతంలో పుణేలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయగా, ప్రస్తుతం ముంబై, థాణేలోనూ దీన్ని అమలు చేస్తున్నారు. ఆ తరువాత కొనుగోలుదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా నగరాల్లోకి ఈ పథకాన్ని విస్తరించనున్నారు. ఆహార, పౌర సరఫరాల శాఖ రేషన్ షాపుల్లో చౌక ధరకే పండ్లు, కూరగాయలు విక్రయించడానికి ఆరు నెలలపాటు రైతులు, ఉత్పత్తి కంపెనీలకు కొన్ని షరతులతో అనుమతినిచ్చింది. రేషన్ షాపుల్లో కార్డుదారులకు పప్పు దినుసులు, బియ్యం, గోధుమలు, చక్కెర ఇతర సరుకులతోపాటు పండ్లు, కూరగాయలు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కిందట నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసింది. చదవండి: (రైలు ప్రయాణంలో ఎక్కువ లగేజీ తీసుకురావొద్దు!) -
20న పండ్లు, కూరగాయలపై ఎఫ్.ఎ.ఓ. వెబినార్
అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ఈ నెల 20న వెబినార్‌ను నిర్వహించనుంది. చిన్న, సన్నకారు రైతుల చిన్న కమతాల్లో, పెరటి తోటల సాగులో సవాళ్లు, అవకాశాలపై చర్చిస్తారు. ఈ అంశంపై ఎఫ్.ఎ.ఓ. ప్రచురించిన సావనీర్‌ను విడుదల చేస్తారు. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆంగ్ల వెబినార్‌లో ఉచితంగా పాల్గొనదలచిన వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు.. https://fao.zoom.us/webinar/register/WN_xZvk3yfwQLWgUtdjnemJHw 19న కొర్నెపాడులో మిరప సాగుపై శిక్షణ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో సెప్టెంబర్ 19 (ఆదివారం)న ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప సాగుపై రైతునేస్తం శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇస్తారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మహిళా రైతు లావణ్యారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666 -
ఏపీ: చకచకా పర్మిట్లు
సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఎగుమతులకు మార్గం సుగమమైంది. రాష్ట్రం నుంచి ఏయే ప్రాంతాలకు పండ్లు, కూరగాయలు రవాణా అవుతాయో గుర్తించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సీఎం సంప్రదింపులు జరపడంతో మంగళవారం నుంచి పెద్దఎత్తున పండ్లు, కూరగాయల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా.. ► నిల్వ ఉంచితే పాడైపోయే పచ్చి సరుకును గుర్తించి ఉద్యాన శాఖాధికారులు రైతులకు వెంటవెంటనే పర్మిట్లు ఇప్పిస్తున్నారు. ► అలాగే, మార్కెటింగ్, రెవెన్యూ శాఖాధికారుల సహకారంతో త్వరితగతిన వాహనాలను ఏర్పాటుచేస్తున్నారు. ► ఫలితంగా ఉద్యాన పంటలు పొలం నుంచి వినియోగదారుల దరికి చేరుతున్నాయి. ► రాయలసీమ జిల్లాల నుంచి అరటి, బత్తాయి, పుచ్చ, టమాటా, ద్రాక్ష.. కోస్తా జిల్లాల నుంచి మామిడి, నిమ్మ, బొప్పాయితో పాటు ఇతర జిల్లాల నుంచి కూరగాయలు వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు ఉద్యాన శాఖ తెలిపింది. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇదిలా ఉంటే.. దళారీ వ్యవస్థను రూపుమాపే క్రమంలో ప్రభుత్వం పండ్లు, కూరగాయల వంటి వాటి రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నామని ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ చెప్పారు. అంతేకాక.. ► అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి డీఆర్డీఏ సహకారంతో పెద్దఎత్తున అరటిని ఎగుమతి చేశామన్నారు. ► నూజివీడు నుంచి మామిడిని, మదనపల్లె నుంచి టమాటాను, నెల్లూరు నుంచి పుచ్చ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి అరటి తదితర పంటలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలించారు. ► ఇందుకు వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు మార్కెటింగ్, రెవెన్యూ శాఖ కూడా ఎంతో తోడ్పడుతోందని హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.హనుమంతరావు వివరించారు. ► పర్మిట్లు ఇప్పించడంలో, వాహనాలను సమకూర్చడంలో, సరుకును ఏయే ప్రాంతాలకు పంపవచ్చో విశ్లేషించడంలో ఉద్యాన శాఖ గ్రామ సహాయకులు, ఏడీఓలు, జేడీలు, డీడీ స్థాయి అధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు. ► కమిషనర్ చిరంజీవి చౌధురి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రైతుల ఇక్కట్లను తొలగించేలా సూచనలు ఇస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ మిర్చి కొనుగోళ్లు కరోనా కేసులు వెలుగులోకి రావడం, రెడ్‌జోన్‌లో ఉన్న నేపథ్యంలో మిర్చి విక్రయాలను గుంటూరు యార్డుకు బదులుగా ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజుకు సగటున లక్ష టిక్కీల వరకు విక్రయాలు జరిగే గుంటూరు మార్కెట్ యార్డుకు రైతులు, వ్యాపారులు, హమాలీలు 10వేల మంది వస్తారు. భౌతిక దూరం పాటించే అవకాశాలు ఇక్కడ లేనందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ► రైతులకు ఇబ్బంది లేకుండా కోల్డు స్టోరేజి ప్లాంట్లు, జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డులు, గ్రామాల్లో మిర్చి విక్రయాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న వ్యాపారులు, ఎగుమతిదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ► రాష్ట్రంలో 410 కోల్డు స్టోరేజి ప్లాంట్లు ఉండగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 220 వరకు ఉన్నాయి. వీటితోపాటు జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డుల్లో మిర్చి అమ్మకాలు చేపట్టనున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు అక్కడే కొనుగోళ్లు చేపడతారు. ► ప్రస్తుతం దాదాపు 80 వేల టిక్కీలు రైతుల వద్దనే ఉన్నాయి. ► గత నెల మూడో వారం నుంచి మిర్చి అమ్మకాలు జరగకపోయినా ధరలో మార్పు లేకపోవటం రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. -
ఇవి తీసుకుంటే ఉద్యోగం వచ్చినట్టే..
లండన్ : రోజూ తీసుకునే ఆహారానికి అదనంగా పండ్లు, కూరగాయలను జోడిస్తే మానసికంగా ఉల్లాసంగా ఉండటంతో పాటు నిరుద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి అడుగుపెట్టిన తీరున ఉత్సాహంతో ఉరకలు వేయవచ్చని తాజా అథ్యయనంలో తేలింది.తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటే గుండెకు మంచిదని వైద్యులు సూచిస్తుంటే వీటిని ఆహారంలో అధికంగా తీసుకుంటే మానసికంగానూ ధృడంగా ఉంటారని ఈ అథ్యయనం వెల్లడించింది. యాపిల్స్, క్యారెట్, అరటిపండ్లు మానసిక ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తాయని ఈ అథ్యయనం పేర్కొంది. రోజూ తీసుకునే ఆహారంలో మీరు తాజా పండ్లు, కూరగాయలను తొలగిస్తే మీ మానసిక స్థితి జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి పరిస్థితిలా తయారవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొనడం గమనార్హం. పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకునే వారి మానసిక ఆరోగ్యం స్వల్పకాలంలోనే ఉత్సాహంగా మారుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ రీసెర్చి ఫెలో నీల్ ఓషన్ చెప్పుకొచ్చారు. దాదాపు 50,000 మందిపై తాము జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయని నీల్ తెలిపారు. -
వీటితో ఆస్త్మాకు చెక్
లండన్ : పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకునేవారిలో ఆస్త్మా వ్యాధి దరిచేరదని, ఇప్పటికే ఆ వ్యాధి ఉన్నవారికి నియంత్రణలో ఉంటుందని తాజా అథ్యయనం పేర్కొంది. ఆరోగ్యకర ఆహారం తీసుకునే వారిలో ఊపిరితిత్తుల సమస్యలు అరుదుగా కనిపిస్తాయని వెల్లడించారు. పండ్లు, కూరగాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, వాపును తగ్గించే పదార్ధాలు ఉండటంతో సాధారణ శ్వాస సమస్యల నుంచి మనల్ని కాపాడతాయని అథ్యయనం తెలిపింది. మాంసాహారం, తీపిపదార్ధాలు, సాల్ట్ అధికంగా ఉండే పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే ఆస్త్మాను అదుపులో ఉంచడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల లోపల వాపు ద్వారా వచ్చే ఆస్త్మాను పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాల్లో ఉండే వాపును తగ్గించే పదార్ధాలు అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యకర ఆహారం తీసుకునే పురుషుల్లో ఆస్త్మా లక్షణాలు 30 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. అథ్యయన వివరాలు యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఇవి తింటే మెదడుకు మేలు..
లండన్ : ఆరోగ్యకరమైన ఆహారం మనిషిని చురుకుగా ఉంచుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. కాయగూరలు, పండ్లు, చేపలు అధికంగా తీసుకునేవారి మెదడు పరిమాణం శీతల పానీయాలు, తీపిపదార్ధాలు తినే వారితో పోలిస్తే 2 ఎంఎల్ అధికంగా ఉంటుందని తేలింది. మెదడు పరిమాణం 3.6 ఎంఎల్ మేర తగ్గితే ఒక ఏడాది వయసు మీరిన దానితో సమానం. మెదడు వైశాల్యం అధికంగా ఉన్న వారి మెరుగైన మానసిక సామర్థ్యం కలిగిఉంటారని గతంలో పలు అథ్యయనాల్లోమ వెల్లడైందని అథ్యయన రచయిత ఎరాస్మస్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మైక్ వెర్నూజీ పేర్కొన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి మొత్తంమీద ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ముఖ్యమని చెప్పారు. 66 సంవత్సరాల సగటు వయసు కలిగిన 4213 మందిపై పరిశోధకులు ఈ అథ్యయనం నిర్వహించారు. వీరు తీసుకునే ఆహారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఆహార నాణ్యతను పెంచుకోవడం ద్వారా మెదడును ఉత్తేజభరితంగా మార్చుకోవచ్చని వెర్నూజీ చెప్పుకొచ్చారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. -
రైతు జేబు చల్లగా...
పండిన పంట అమ్ముకుందామంటే... తగిన ధరలు ఉండవు. ధరలొచ్చేదాకా ఆగితే... పంటలు పాడవుతాయి. గిడ్డంగులు, అక్కరకొచ్చే శీతలీకరణ వ్యవస్థలూ అంతంతమాత్రమే. ఇదీ 21వ శతాబ్దంలోనూ రైతు ‘భారతం’! కానీ... కొన్ని సంస్థల పరిశోధనల పుణ్యమా అని... ఈ చీకట్లోనూ చిన్న చిన్న కాంతిరేఖలు కనిపిస్తున్నాయి! ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు. పాలు, పండ్లు, కూరగాయలు, తిండిగింజలు మార్కెట్‌కు చేరకముందే నష్టపోతున్న మొత్తమిది. ఉన్న అరకొర గిడ్డంగుల్లో తిండిగింజలు పందికొక్కులకు ఆహారమైపోతూంటే... శీతలీకరణ వ్యవస్థలు అందుబాటులో లేక 30 శాతం వరకూ కాయగూరలు, పండ్లు కుళ్లిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఈ నష్టం ఏడాదికి రూ.5600 కోట్ల వరకూ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితం... రైతు పంట అయినకాడికి అమ్ముకోవాలి. దళారీలు, మధ్యవర్తుల లాభాల పంట పండాలి! ఇలా కాకుండా.. గ్రామస్థాయిలోనే అతితక్కువ ఖర్చుతో పాలు, పండ్లు, కాయగూరలు నిల్వ చేసుకునే సౌకర్యం ఉంటే ? అద్భుతంగా ఉంటుంది. కొందరు విదేశీ శాస్త్రవేత్తలు, దేశంలోని ఓ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా చేసిన పరిశోధనల ఫలితంగా ఇప్పుడీ అద్భుతం సాధ్యమయ్యే అవకాశముంది! సూర్యుడే అండ..దండ! గ్రామస్థాయిలో పండ్లు, కాయ గూరలు నిల్వ చేసుకునేందుకు నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఎకోజెన్ సొల్యూషన్స్’ అనే సంస్థ ఓ వినూత్న శీతలీకరణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు ముగ్గురు స్థాపించిన ఈ కంపెనీ అయిదేళ్లుగా రైతులకు ఉపయోగకరంగా ఉండే టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. సౌరశక్తితో పనిచేసే పంప్సెట్లు, విద్యుత్తును ఆదా చేసే పరికరాలతోపాటు రైతుల కోసం శీతలీకరణ వ్యవస్థలను తయారు చేస్తోంది. గ్రామాల్లోని విద్యుత్ కోతలను దృష్టిలో ఉంచుకుని దీన్ని సౌరశక్తి ఆధారంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. కానీ సౌరశక్తిని నిల్వ చేసుకునేందుకు బ్యాటరీల అవసరం మాత్రం ఉండదు. ఎకోఫ్రాస్ట్ టెక్నాలజీస్ పేరుతో అభివృద్ధి చేసిన శీతలీకరణవ్యవస్థ పన్నెండు అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు, ఎత్తుతో చిన్న కంటెయినర్ మాదిరిగా ఉంటుంది. ఒక్కోదాంట్లో దాదాపు 5 టన్నుల పండ్లు, కాయగూరలను నిల్వ చేసుకోవచ్చు. పండ్లు, కాయగూరలని వేర్వేరు ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి... అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తమ్మీద కంటెయినర్ లోపలి ఉష్ణోగ్రతలు 0-20 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉండేలా చేయవచ్చు. ప్రస్తుతం ఒక్కో ఎకోఫ్రాస్ట్ వ్యవస్థ ఖరీదు రూ. 6 లక్షల వరకూ ఉందని కంపెనీ వ్యవస్థాపకుడు దేవేందర్‌గుప్తా ‘శాస్త్ర’కు తెలిపారు. శీతలీకరణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు, అదేసమయంలో ఖరీదును తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కొత్త బ్యాటరీతో పాలకు రక్ష... పితికిన పాలు కొన్ని గంటల వ్యవధిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. నాలుగు గంటలు గడిచిందంటే చాలు.. అందులో హానికారక బ్యాక్టీరియా పెరిగిపోయి, పోషకవిలువలు తగ్గిపోతాయి. ఈ ఇబ్బందిని తొలగించేందుకే ఇళ్లల్లో మనం పాలు కాచేస్తూంటాం. మన సంగతి సరే, పాడి రైతు ఏం చేయాలి? పితికిన వెంటనే అమ్ముకోవాలి. లేదంటే పాలు పాడై పోతాయి. రైతు నష్టపోతాడు. మరి ఈ సమస్యకు పరిష్కారం? ప్రొమేథియన్ పవర్ సిస్టమ్స్ తయారు చేసిన ర్యాపిడ్ మిల్క్ ఛిల్లర్! విద్యుత్ సాయంతో చల్లగా మారిన ప్రత్యేక ద్రవ పదార్థం... మూడు డిగ్రీ సెల్సియస్ స్థాయికి పాలను వేగంగా చల్లబరచడం ఈ రిఫ్రిజరేటర్ ప్రత్యేకత గ్రామాల్లో అప్పుడప్పుడూ మాత్రమే ఉండే విద్యుత్తుతోనూ దాదాపు 12 గంటల పాటు పాలను చల్లగా ఉంచగలుగుతుంది. సాధారణ బ్యాటరీ స్థానంలో విద్యుత్ శక్తిని ఉష్ణం రూపంలో నిల్వ ఉంచుకునే థర్మల్ బ్యాటరీ మహత్యమిది. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్త సామ్వైట్ ఈ రకమైన టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బెంగళూరు సమీపంలోని ఓ గ్రామంలో ముందుగా సోలార్ టెక్నాలజీతో పనిచేసే ఓ శీతలీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశారు కూడా. అయితే దాదాపు 300 చదరపు అడుగుల మేరకు ఉండే ఈ రిఫ్రిజరేటర్ 2000 లీటర్ల థర్మల్ బ్యాటరీని ఉపయోగించుకుని కేవలం 500 లీటర్ల పాలను నిల్వ చేసేది. ఇదంత ఉపయోగకరం కాదని సామ్ గుర్తించారు. స్థానికంగా ఉన్న కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా ఈ టెక్నాలజీపై ఆసక్తి చూపడంతో సామ్ తన డిజైన్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఫలితంగా కేవలం 500 లీటర్ల థర్మల్ బ్యాటరీతో దాదాపు వెయ్యి లీటర్ల పాలను నిల్వ చేసే శీతలీకరణ వ్యవస్థ సిద్ధమైంది. దాదాపు రూ.5 లక్షలు ఖరీదు చేసే ఈ వ్యవస్థను ఇప్పటికే కొన్ని ప్రవేట్ కంపెనీలు గ్రామస్థాయిలో ఏర్పాటు చేశాయి. ఫలితంగా రైతులకు శ్రమ తగ్గడమే కాదు... కొంత సొమ్ము ఆదా చేసుకోగలుగుతున్నారు కూడా.