కిచెన్ టిప్స్
- కూర అడుగంటినప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్స్‌ను వేసి కరిగేంత వరకు తిప్పాలి. ఇలా చేస్తే పాత్రకు అంటుకున్నది విడిపోయి కూర అడుగంటకుండా ఉంటుంది.
- కిచెన్‌లో నూనె వొలికిపోతే వెంటనే వొలికిన నూనె మీద గోధుమ పిండి చల్లాలి. ఐదు నిమిషాల తరువాత పేపర్‌తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డులేకుండా శుభ్రం పడుతుంది.
- వర్షాకాలంలో వాతావరణంలోని తేమను పీల్చుకుని... డోర్లు వేసినప్పుడు, తీసినప్పుడు కిర్రుమని శబ్దాలు చేస్తుంటాయి. డోర్లను పట్టి ఉంచే బోల్టుల వద్ద కొద్దిగా టాల్కం పౌడర్ చల్లడం వల్ల లేదా కొవ్వొత్తిని రుద్దడం వల్ల ఆ శబ్దాలు రాకుండా ఉంటాయి.
- ఈ వర్షాకాలంలో ఇలా కడగడం వల్ల పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కలపాలి. ఈ నీటిలో పండ్లు, కూరగాయలను పదిహేను నిమిషాలు ఉంచి, తరువాత సాధారణ నీటితో కడిగేయాలి.
Comments
Please login to add a commentAdd a comment