
ప్రతీకాత్మక చిత్రం
లండన్ : ఆరోగ్యకరమైన ఆహారం మనిషిని చురుకుగా ఉంచుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. కాయగూరలు, పండ్లు, చేపలు అధికంగా తీసుకునేవారి మెదడు పరిమాణం శీతల పానీయాలు, తీపిపదార్ధాలు తినే వారితో పోలిస్తే 2 ఎంఎల్ అధికంగా ఉంటుందని తేలింది. మెదడు పరిమాణం 3.6 ఎంఎల్ మేర తగ్గితే ఒక ఏడాది వయసు మీరిన దానితో సమానం. మెదడు వైశాల్యం అధికంగా ఉన్న వారి మెరుగైన మానసిక సామర్థ్యం కలిగిఉంటారని గతంలో పలు అథ్యయనాల్లోమ వెల్లడైందని అథ్యయన రచయిత ఎరాస్మస్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మైక్ వెర్నూజీ పేర్కొన్నారు.
మానసిక, శారీరక ఆరోగ్యానికి మొత్తంమీద ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ముఖ్యమని చెప్పారు. 66 సంవత్సరాల సగటు వయసు కలిగిన 4213 మందిపై పరిశోధకులు ఈ అథ్యయనం నిర్వహించారు. వీరు తీసుకునే ఆహారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఆహార నాణ్యతను పెంచుకోవడం ద్వారా మెదడును ఉత్తేజభరితంగా మార్చుకోవచ్చని వెర్నూజీ చెప్పుకొచ్చారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment